అనుచుఁ గర్ణాట దేశాగతానేక
ఘన వీరభటులు చెంగటఁ జేరికొలువ
ఆయిత్తమాఘ వందలిమున్నిబన్ని
ఆయుధం గొండు నియంగెవా యనుచు
వివిధ వాక్యములచే వేర్వేఱఁ బిలిచి
ద్రవిడ సద్భటులు చెంతలఁ జేరికొలువ
ఆసొ ఆడె ఆగె హరి జగన్నాధ
దాసు హేబలు ఖండదారురే యటంచు
నంతంతదాఁటి సాహసము చూపుచును
వింతగాఁ గాళింగ వీరులే తేర (5010)
వెండియు దేశాధివిభులు శ్రీవిభుని
దండిమైనిట్టు నుద్దండతఁ గొలువ
ఘనమదోత్కట కుంభి కట భూరిదాన
వనములు బహుళ జీవనములుగాఁగఁ
గ్రమ్మెడి తళుకుల కైదువుల్మార్గ
ణమ్ములు వివిధమీనమ్ములుగాఁగఁ
దమ్మి మార్తుని మార్పఁదగు శిరోవేష్ట
నమ్ములు చారు ఫేనమ్ములుగాఁగఁ
శైలోపమాన కుంజరపుంజ వాహ
జాలముల్నకాద్రి జాలముల్గాగ (5020)
రోష సాహస బలారూఢ వీరాళి
ఘోషంబుతరఁ గలఘోషంబుగాఁగ
సకల సన్నాహ భాస్వర శతాంగముల
నికరముల్విపులినా నికరముల్గాఁగ
గడుఁ బొడవగు తురంగములమై సుడులు
సుడులుగా బహువిధ స్ఫురణ చూపుచును
వాహినీపతివలె వాహినీ సమితి
వాహిని దశదిశల్ వడఁకనేతేర
వాహినీవిభుఁడు భూవరయొప్పు మిగిలి
యాతత చైద్య శౌర్యచ్చేదహేతు (5030)
కేతువుగతి తాక్ష్యన్ కేతులింపొంద
మాగధోత్పాత భూమహిత గర్జనము
బాగున రధ సముద్భట నాదమడర
హరి రుక్మితేజంబు నణఁగించుననెడు
సరవిబెన్థూళి కంజారాప్తుఁ బొదువఁ
బ్రతిలేని కడకమై బలములుఁ దాను
నతి ప్రమదముతోడ నరుగు నత్తఱిని
దమ్మునిమై కూర్మిఁ దమ్ము నిచ్చలును
గ్రమ్మి పోరఁగఁ జూచు కపట శాత్రవుల
రాకయుఁ దలపోసి రాకానిశాక (5040)
రాకార శోభితుండగు సీరపాణి
తాల హాలాంకితోత్తాల ధ్వజాంశు
జాల సంవృత దిశా సంఘమైనట్టి
తేరెక్కి సైన్య సందీప్తుఁడై వేగ
సారసాక్షుని గూడఁ జనుదెంచెనంత
కరమవేఁడుక భీష్మక రమావరుండు
పరిణయోత్సవ లీలఁ బడవాళ్లబనిచి
పురము సంకలితగోపురము శృంగార
కరమును శోభనాకరమునై యొప్పఁ
జేయించి పుత్రి విశేష దానములు (5050)
సేయించి భూసురాశీర్వాదమంద
దమఘోష సుతుఁడు దుర్దమఘోష వాద్య
సమధిక బలబంధు సహితిఁడై యపుడు
విక్రమాద్భుత మహావీరుండు దంత
వక్త్రుండు మగధభూవరుఁడు సాల్వుండు
మొదలైన రాజులిమ్ములగొల్వఁ జల్వ
మదటుమీఱఁగ వచ్చెనంత రుక్మియును
నెనసిన వేడ్కతో నెదురేగి కౌఁగి
టనుగ్రుచ్చి మిగుల వేడ్కల హెచ్చి చైద్యు
వివిధార్చనముల గావించి యాభూమి (5060)
ధవునిఁ జైద్యుని విడిదలలందునునిచె
యంతనే కాంత కాంతాకిర్ణమగుచుఁ
జింతమై హరిరాకఁ జింతించి నొగులు
ఘనమైన వైదర్భి గర్భీకరించి
కొని తాపమెసఁగఁ జెక్కునఁ జేయి చేర్చి
యేమొకోరాఁడయ్యె నిందిరావిభుఁడు
భూమి ...................
అక్రూరుఁడట నాలుగైదు బాణముల
వక్త్రవర్తను దంతవక్త్రు గుఱ్ఱములఁ
దఱిగి కేతనము గోదంద సారథులు (5070)
నఱికి రథంబెల్ల నజ్జు గావింప
నప్పుడు వాఁడొక్క యరదంబు కడకుఁ
గుప్పించి మఱియు మార్కొని పోరఁ దొడఁగె
ప్రతిలేకచనుదెంచు పౌండ్రకనామ
కృతవర్మవరుఁడైన కృతవర్మకినిసి
తరణి కాంటులు ధగద్ధగితంబులైన
శరములు నిగిడింప జడియకారాజు
నిప్పులు గ్రక్కిడి నిశితాంబకములు
కప్పినఁ గృతవర్మ కడఁకతోవాని
ఫాలభాగమున నంబకములు మూడు (5080)
కీలించి లయకాల కీలియై వాని
శరముల ముంచి తచ్చరములఁ ద్రుంచి
తురగాళి నొంచి సూతుని విదారించి
విలుద్రుంచియంత నిర్విణ్ణుఁ గావించె
చలము ముప్పిరిగొన సాల్వుఁ డవ్వేళ
ననల సన్నిభుని సాత్యకిఁ దార్చి యార్చి
కనక పుంఖోజ్వల కాండముల్బఱపఁ
దోడనే యతఁ డొక్క తోఁపునవాని
జోడును ధనువును చూర్ణంబు జేసి
మూఁడు తూఁపులు ఫాలమునఁ గీలుకొలుపఁ (5090)
వేడి యాతనికంటె వీరుచందమున
వీరరసావేశ వివశుఁడై వాఁడు
క్రూరత నాలుకల్గోయు బాణంబు
తమ్మి పొక్కిలివాణి తమ్ముపైఁజొనుప
నమహాశరమునా గారిబాణమునఁ
దెగటార్చి యార్చి సందీప్త బాణంబు
తెగనిండవింట సంధించి యాపగతు
చను మ్రోలనాటింప జడిసి యారాజు
చనియె నాహవ రసాస్థలినుండి వెఱచి
అపుఁడు జరాసంధుఁ డంగభూవిభుఁడు (5100)
కుపితుఁడై సేనడీకొలుప బలుండు
తడయకుత్తుంగ మాతంగంబు నెక్కి
వడిఁ బోరు కాళింగ వసుధాతలెసు
గణుతికెక్కిన హలాగ్రంబు చేనవుడు
రణముతో గూల్చె వారణముతోఁ గూఁడ
నాని విదూరధుఁ డాదంతవక్త్రు .....
నేను తూఁపుల బలహీనుఁ గావించె
రణచిత్రకుండు చిత్రకుఁడు సత్యకుఁడు
మణిపుంఖ శరదంబకముల చేగ్రుచ్చి
వంగాధిపతి రథ వాహినీతతుల (5110)
బంగంబు నొందింప బలుఁడేగుదెంచి
బలువిలు గొని వంగపతి కేలి పసిఁడి
విలు ద్రుంచి విరధుఁ గావించి తద్బలము
చెండాడి పసిఁడి పింజయ తూఁపుఁ దొడిఁగి
చెండాడినట్లు తచ్చిరముత్తరించి
కౌశలంబేర్పడఁ గాహలాగ్రమునఁ
గాశికాధిపులఁ బెక్కెండ్రనుక్కడఁచి
ధీరోషశీలులుఁ దెగియరవదఱ
గారువర్ణాదుల ఖండించి వైచి
వరవంకపక్ష సంవళితంబులైన (5120)
శరముల సింహక శతముఁ గీటణఁచి
కల్పాంత భైరవాకారుఁడై పేర్చి
యల్పమానసు మగధాధీశుఁ బొదువ
నలిగి యమ్మగధుండు హలపాణిఁ గదిసి
బలముఁ జూపుచు మూఁడు భల్లముల్జొనుప
బలదేవుఁడామూఁడు బాణముల్దునిమి
యలఘ చిత్రముగ బాణాష్టాకం జేసి
యలిగి సూతుని విల్లు నరదంబు సిడము
తిల సమానములుగాఁ దెగటార్చి యార్చి
యెదగదగొని వ్రేయనిల వ్రాలితేలి (5130)
వదజెందినవా డాహవక్షోణి వీర
వీరంబు విరదంబు విబుఁడు నచ్చిభుఁడు
...........................
హరిహరియరదంబు నరదంబు చలము
విడువకపోరద్రీ విక్రమాగ్రజుఁడు
కడురెసి వైరిచక్రంబు పై నుఱికి
పటుతర కరిఘటాభట నిటులములు
చటులాశుగములచేఁ జక్కుసేయుచును
రంగదుత్తుంగ తరంగ సంఘముల
న్రుంగుడు సేయుచు భూపాలవరుల (5140)
శిరములు వక్షముల్చెక్కులుఁ దొడలు
కరవాల శరచక్ర గదలఁ జిత్రముగఁ
దరిగి నాటించి విదారించికాఁటి
యఱి ముఱి దశదిశలందు నింపుచును
స్ఫుట హలంబును బలంబును జలంబలరఁ
జటుల మౌసలపుఁ గౌశలము చూపుచును
బ్రథన సంభృత విజృంభణ భీషణాంక
రథుల రథాళి సారథులఁ జెండుచును
భట కదంబము కదంబములు కంబువులు
తొటతొట ధరరాలం దునియ నేయుచును (5150)
రణభూతసమితి పారణలు సేయించి
గణుతింపరాని విక్రమ శక్తి మెఱసి
మార్గణములు మూఁత మాగధుండారు
నిర్గణముల నణఁగించి పెల్లార్చి
పాశంబు చేఁబట్టి పౌండ్రకనాముఁ
గీశంబు కైవడిఁ గిచకొట్ట జేసి
గ్రావంబు గతివచ్చు ఘనునంగనాధు
గ్రీవంబు ద్రెంచి తక్కిన రాజవరుల
వేమరునహి రెండువేల నాలుకల
పాము గీమునకేఁగఁ బటఘూట సేయుఁ (5160)
దిరిగె శాలుఁడు యోగఁ దిరిగెను మగధు
డరిగెఁ గోసలుఁడు పౌండ్రాధీశుఁ డేగె
విఱిగె సంవీరుండు వీగెఁ ద్రిగర్త
జఱిగె గ్రాధుండునుజని యెగుహుండు
నగధరాగ్రజుని బాణములకు జడిసి
పగతురీతి నేర్పడ లజ్జదించి
యచ్చుగామును మున్నె యాకుండినంబు
జొచ్చినవాఁడెపో శూరుఁ డటంచు
పురుడుల తముపారి పోవు చందమున
బరువిడి కుండిన ప్రాంతంబు చేరి (5170)
చెదరవైచినయొడి నెలవాటులకును
బెదరి వచ్చినయట్టి పెడచలకరణిఁ
గుత్తుకల్దడుపుచు గుములుగాఁ గూడి
రాకయా శాశపురంబులోఁ జింతఁ
జీకాకు పడియున్న శిశుపాలుఁ జేరి
మేలు నీవును రాక మేలు చేసితివి
పాలు గల్గిన బలభద్రుండు కొంత
చాయవాటుగఁ జేయఁ జరిగి వచ్చితిమి
పోయిన చేకావె భువిని భ్రాణములు (5180)
ఆలేమ పట్టు దయ్యమెఱుంగుఁ గాని
చాలు మాదెస జన్మజన్మంబులకును
జెలఁగి యేనుఁగుచేతి చెఱకుఁ గైకొనఁగ
నలవియే యెవ్వరికైన నాకరణి
నాదానవారికి నగపడినట్టి
వైదర్భిఁ గైకొన వశమె యివ్వేళ
యుద్ధంబని నెడుమాట యుడిఁగి మామంచి
బుద్ధి చేకొని నీదు పురమునకరుగు
దీమ సంభేది చింత్తింపంగఁ దలఁప
నేమి సేయంగ వచ్చునిది దైవకృతము (5190)
పోయెదమనిచెప్పి భూపాలురెల్లఁ
బోయిరి తమ పురంబులకు నవ్వేళ
యాదవాధీశు సాహసమెల్లఁ దెలిసి
చేఁదీసి కొనిపోయెఁ జేదీశుఁ డంత
కనలి రుక్మియు దురాగ్రహ వృత్తిఁబొదలి
కనుఁగవ విస్ఫులింగము లుత్పతిలఁ గఁ
బసులకాఁ పరినని పరికింపకెట్లు
కుసుమ కోమలినెట్టుకొని పోయె వీఁడు
చుట్టంబుగతి వచ్చి సూడుబంటయ్యె
................................ (5200)
దొరతనం బెఱుఁగక తుదిఁ బాఱి పోయె
దొరకూళాయైన చేతులఁ బట్టరాదు
తనమాయఁ గడుఁబిన్న తనమయ్యెననఁగ
ననిలోన గెల్చి సాహస వృత్తిమగుడ
వైదర్భిఁ దెచ్చిన వత్తునిచ్చటికిఁ
గాదేని నాపెకు గ్రతఁ బ్రాణమిత్తు
నని తండ్రితోఁ బల్కి యాహవోదగ్ర
ఘన రథారూఢుఁడై క్రథకైశికాది
జననాధులును సర్వసైన్యంబు గొలువ
నెనలేని కినుకమై నేతేరబలము (5210)
దుర్మద రంహౌఘ దూరమౌనింద్ర
నర్మదయైనట్టి నర్మదచెంత
మునుమున్న యరిగెడి మురదైత్యమర్దిఁ
గను@ గొనిపోకు మెక్కడ పోయదనుచు
గణములుగాఁగ మార్గణములు పఱుప
ఫణివైరి కేతుండు బలువిడి విఱిఁగి
కోపించి శార్ఙ్గఁబుగొని పారపాటు
తూపులనాని దుత్తుమురులుగాఁ చేసి
మును శిరంబులును రంబులు కరంబులును
పెనునరంబులు విజృంభించి మోదుచును (5220)
దొనల సూతులను గేతులను రౌతులను
ఘనహేతులను బిండిగాఁ గఁజదుపుచును
మొగిఁ జర్మములు వర్మములు మర్మములు
దెగి ధర్మములతోడఁ ద్రెళ్లఁ గొట్టుచును
సురలెల్లఁ బొగడన సురలెల్ల బెగడ
ధరణీశ శౌరి యుద్ధము సేయునపుడు
వ్రాలు గాత్రములు పత్రములు ఛత్రములుఁ
గూలునక్కులును ముక్కులును జెక్కులును
గ్రుంగు నూరులును శూరులును నారులును
న్రుంగు మూఁపులును గోపులును దూపులును (5230)
నయ్యుండు శౌరి నాహవ చిత్రకేళి
నయ్యెడ్శఁ జరుపుచో నరిగి యారుక్మి
వెన్నతోఁ బెట్టెనో వివరింపననుచు
...........................
విలినారిదీడివే వేగంబోవాఁడి
బలునార సంబులఁ బద్మాక్షుఁ బొదవ
నరుణ పత్రోజ్జ్వలాయత మార్గణముల
మురవైరి వాని నిర్మూలంబు సేసి
విలుద్రుంచి రెండవ విలుద్రుంచి మరియు
విలుగొని నిలువ గోవిందుండు వాని (5240)
సూతుని ధనువు కంచుకము గుఱ్ఱములఁ
గేతువున రథంబు గెడప నారుక్మి
హరిమీఁద నడిదంబు హరిగేయపూని
సరభస గతి వచ్చు సమయంబునందు
పలుకయుడాలు నంబకముల మూఁట
.......................
శైలోపమాన కుంజరపుంజ వాహ
జాలంబు నక్రాది జలములుల్గాఁగ
నలినలి గావించినలు దైత్యమఱియు
యాశార్ఙ న్ వెనకకేల నమరించి కేలఁ (5250)
బాశంబు గతినొప్పు పాశంబు పూని
.........................
మల్లరి పెద్దు ద్రిమ్మరి తనముడుగ
వల్లెవైచిన క్రియవడి వాని బట్టి
తగఁ దొట్టి యురమెల్లఁ దటదటనదర
మొగము మీఁదకి నెత్తి మూల్గుచునలయఁ
బుడమిపై మకుటంబు బుడిబుడి దొర్ల
విడిముడి వెన్నుపై సికవిడిజాఱఁ
దదబాటుతోడ దంతములిలకఱవఁ
బెడమలరఁగఁ బట్టి బిగియించి కట్టి ...... (5260)
ధళధళమనుడాలు ధరియించి వాని
తలవ్రేయఁ బూన వైదర్భియత్తఱిని
నన్నచందముఁ గృష్ణుఁ డడిదంబుకేలఁ
గొన్నచందముఁ గనుఁగొని యాత్మలోనఁ
గనికరింపుచుఁ గరకమలముల్మోడ్చి
పెనగొన్న సిగ్గును బ్రియము రెట్టింపఁ
ముంగురు లల్లాడ మోమింతయెత్తి
తొంగలి ఱెప్పల తుదఁబాఱఁ జూచి
చనుదోయిడాయు వాసననించు కదిమి (5270)
నునుపు కస్తురి పూఁత నూఁగుగారాలఁ
గుచ్ఛులు మెఱయంగఁ గొనకొన్న సరులు
తచ్చరలాడ బిత్తరముట్టి పడఁగ
బాలేందు రేఖకుఁ బ్రతివచ్చునట్టి
ఫాలేందురేఖ శ్రీపాదంబు నొఱయ
జొట జొట తేనియ ల్సొనగాఁగ గుఱియఁ
గుటిల కుంతలవల్కె గోవిందుతోద
ప్రాణేశ నామాట పాటించి వీని
ప్రాణముల్గొనకింకఁ బాలింపుమనిన
గదమున నాబాల కరమర్థిఁ గ్రుచ్చి (5280)
యురమున నునుగుబ్బ లొఱయంగఁ జేర్చి
యగపడిజిగి హళాహళిగాఁగ బిగిసి
తగడు గొన్నట్టి రత్నపుఠేవనలరి
తోయజేక్షణ మాట తోయజాక్షుండు
త్రోయఁ జాలక రుక్మి దుష్టమానసుని
తల నాల్గు దెసలకుఁ దనప్రతాపంబు
వెలయంగఁ జూచిన విధము దీపింపఁ
బలుచని నిడువాలు పదను తూపునను
గొలచిన రీతి డొంగులువాఱ గొఱిఁగి
పాలుమాలిచి లజ్జబండని జేసి (5290)
గేలిఁ బెట్టుచుఁ గేరిగేరి నవ్వుచును
బలభద్రుఁడప్పుడు పగర నిర్జించి
దళములుఁ దానును దనుజారిఁ జేరి
వనజాక్ష విడువిడు వలదిది రుక్మి
మన సరియనుఁ గాడు మనసరిగాఁడు
అనుచుఁ గిత్లూడ్చి పొమ్మనికన్నుఁ గీట
తనవారి మొగమెట్లు తాఁజాతుననుచు
సిగ్గుతో నరిగె వచ్చిన త్రోవఁ బట్టి
యగ్గలంబగువేడ్క హరియుఁ గృష్ణుండు
బేలమై పడియున్న వీర నృపాల (5300)
జాలంబు మహనీయ సాలంబు మిగుల
దట్టంబులైన నభోంతరమున నాఁడు
నట్టలతెట్టుప లట్టూల కలముల
నరదముల్మేడల నరదముల్పఱచు
........................
తేరులు వీరులుఁ దెగిరాలియున్న
......................
రత్నముల్విపణి మార్గముల నమ్ము
రత్నముల్ రత్నాకరములు దీర్ఘికలు
శాకినీ ఢాకినీ చయములుదార (5310)
లోకంబుగాఁగ నాలోకించి చూడ
వర వీరలక్ష్మీ నివాస పట్టనము
సరవినొప్పెడు రణస్థలి వేగవెడలి
బృందారకులు పుష్పబృందముల్గుఱియ
వందిమాగధులు కైవారముల్సేయ
నానంద సుతరాము లానందమంది......
భూనాధు లిరుమేలఁ బొగడుచుఁ గొలువ
ద్వారకకేతెంచి తత్సమీపమున
భోరన విజయకంబువులు పూరింప
ధరనాదమప్పుడందఱు నాలకించి (5320)
పురజనుల్యదువృష్టి భోజవంశజులు
కెదురేగి కానుకలిచ్చి మ్రొక్కినను
బొదలి తాలాంకుఁ దంభోజసంభవుఁడు
పురము చొత్తెంచి తత్పురవీధినరుగఁ
బురసతుల్ రుక్మిణి భువనైకమాతఁ
గనుఁ గొని యంతరంగముల నంగముల
ఘనమదంబును బులకలునాఱుకొనఁగ
మగవారి వలపించు మగువలు కలరు
మగువల వలపించు మగువలుఁ గలరె
గగనమో భృంగసంగమో కలాపంబొ (5330)
మొగమొ యీ లలితాంగిమురులైన తురుము
కులగిరులో దీని గుబ్బపాలిండ్లొ .........
హరిమధ్యమొ సందియమొ బట్తబయలొ
పరమాణివొ దీని పసనిగ్గు నడుము ......
అనఁటులో యుగములో హస్తిహస్తములో
ఘనశరభములో యీకాంత యూరువులు
తలిరులో తమ్ములో ..........
................ మొఱయకయుండు
పడఁతుక బొమదోయి భావంబు జూడఁ
బొడిఁ బడకెట్లుండుఁ బూవుల విళ్లు (5340)
కలకంఠి నిడుసోగ కన్నుల చూచి
తలవంప కెట్లుండు ధవళాంబుజములు
............. వఱపులు చూచు
వనరక యెట్లుండూ వరకీర సమితి
యల్లలనామణి యధరంబు చూచి
కుల్లుకో కెట్లుండు గురుబింబఫలము
జలజాక్షి నెమ్మోము సైకంబు జూచి
వెలవెలబోకెట్లుఁ విధుబింబముండు
ముద్దియ చన్నులు మురిపెంబు చూచి
గ్రుద్దుకో కెట్లుండుఁ గోడెజక్కవలు (5350)
దిట్త గుబ్బెతయారు త్ర్ఱుఁగెల్లఁ జూచి
నిట్టుర్పు విడకెట్లు నిలుచుఁ గాలాహి
కన్నియనడుముఁదాఁ గన్నారఁ జూచి
చిన్నపో కెట్లుండు సింగంబు నడుము
మగువ యూరులమీఁది మహిములు చూచి
గిగఁగాఱ కెట్లుండు ధృతిఁ గదళికలు
తలిరాకుబోఁడి పాదంబులఁ జూచి
..............................
అని రాజవరులెల్ల నచ్చెరువంది
కొనియాడ రుక్మిణీ కువలయనేత్రి (5360)
ఫాలబాలేందుని పైఁ జిత్తరించు
రోలంబ గురుదాళి రుచిరాలకములు
..........................
సమకొని కెంగేలఁ జక్క నెత్తుచును
జిఱుతేఁటి ఱెక్కలే జిగిదువాడించు
మెఱుఁ గారునూనూఁగు మీసలవాని
గ్రమ్మి వీనులతోడఁ గదియచువాని
పంచాస్త్రుకోటికిఁ బంచాస్త్రుఁ డగుచుఁ
బంచాయుధములఁ జొప్పడియున్నవాని
బొగడొందు నుల్లాసమునఁ దేఱు పసిఁడి (5370)
తగడుచాయ .............
............ ళగించు దర్పణాననము
గలవాని దనపాలి గలవాని గాంచి
తొలుకాఱు వెఱుపుతోఁ దులదూగు చూపు
జలదవర్ణునిమీఁదఁ జక్కగా నిలిపె
సరసిజాక్షుండు నాసఖిని వీక్షించి
............ రనటకుఁబోనిచ్చి
సురలెల్ల నరుదంద సురుచిర గతుల
గరుడుండుమును సుధాకలశము గొనిన
కరణి రాజులు చూడఁగాఁ బ్రతాపించి (5380)
కరమర్థి రుక్మిణి కావ్యలలామ
........... రథము
వైలీలనిడుకొని బలసహోదరుఁడు
పిలువక వచ్చిన పేరంతమునకుఁ ....
బొలయక చెప్పక పోవుటేలెస్స
ననుచందములనేగ నపుడు డెందముల
......................
తప్పెఁగార్యంబు వైదర్భిఁ గైకొనియె
నిప్పుడే హరిఁ బోవ నీనెట్లు వచ్చు
రాజుల వరవీర రాజుల దార్చి (5390)
భోజసంభవఁ గొనిపోయె నివ్వేళ
నెవ్విధముననైన నీపశుపాల
........................
తమ సాహసంబులుఁ దమ బాహుబలము
తమ విక్రమములు నిత్తఱిమంటనిడక
తెచ్చుట వైదర్భిందెగి శౌరిచేతఁ
జచ్చుటగాక ..................
.........ముల్ సైన్యములతోఁ గూడ
గనలుచులయ కాలుకాలుఁడై కడఁకఁ
గనుపట్టి సాల్వ మాగధ ముఖ్యులెల్ల (5400)
వనజాక్షు వెనువెంట వడినంతఁ బాఱి
..........................
బలువుడీ శరపరంపరలపైఁ బఱుప
దవిలి నీరతృణతతిమీఁద నిగుడూ
దవము చందమున యాదవసేన విఱిగి
ధనువులు నిక్కించి దఱిగొన్న వేడ్క
............... తతులఁ జొక్కించి
కయ్యంబు గావింపఁ గంససంహారి ...
నెయ్యంబుతో రుక్మిణీదేవిఁ జూచి
పగర నీక్షణములో పలఁగూల్చి దివ్య (5410)
నగర నాయకులన .............
.....ప్రలాంబాంతకు నక్రూరముఖుల
నని సేయ సమకట్టి యటు చూచుచుండె
బలభద్రుఁ డప్పుడు బలభద్ర చైద్య
బలభద్రుఁడై యదుప్రవరులతోడఁగు
గురు .............. మున
నురగాళిఁ గన్న తాక్ష్యని విధంబునను
నభ్రాళిఁ దోలు జంఝూనిలు పగిది
నభంబు దిక్కులునవియఁ బెల్లార్చి
చలము రెట్టింప నిచ్చలమును హలము (5420)
బలమున ముసలము .....
అనుపమ సకలాయుధాన్వితంబైన
కనక శతాంగంబు గడువేగఁ బఱప
బలిమి మాగధు నెదుర్పడి పోకవానిఁ
బలుఁ దూపులఱువదిఁ బఱపి స్రుక్కించె
.......................
కృష్ణుండు పెండ్లి పందిటి క్రిందనిలువఁ
బసు పుటంబులు వలిపెము గట్టిమిగులఁ
బసగల గిరుతు గుబ్బలనానవైచి
చిఱుఁగురలొసపరి చెలువుగా దువ్వి (5430)
నెఱిఁగప్పు గలగొప్ప నెఱిగొప్పు దురిమి
కుఱువేరు విరిదండ కూడంగఁ బెనఁచి
తుఱుమున కొకయమ్మె దొరయ గీలించి
కన్నులంచులఁ దేటగాఁజెన్ను మిగుల
సన్నంబుగాఁగఁ గజ్జలరేఖఁ దీర్చి
నెలవంకకొకవంక నెఱసులు వెదకు
చెలువంపు నొసల బాసికము గీలించి
త్రిబువన తిలకినీ తిలకమైనట్టి
యిభయాన రుక్మిణి హేమాంగిఁ జెలులు
కడువేడ్కతోఁ దేరఁగా సంభ్రమమునఁ (5440)
దడయక రేవతీధవుఁడు నుద్ధవుఁడు
తెరవట్టి రంత శ్రీదేవుండుతలఁప
సురనదీముఖ నదీశోభితుఁడగుచు
నెలమి రత్నాకరుండేతెంచి రత్న
కలశోదకము ధారగాఱంగ నొసఁగ
జలజాక్షు పాదమజ్జనము గావించి
బలు తమ్మునకు మధుపర్క మర్పించి
జిగితమ్మికవవ్రాలు సితపక్ష యుగము
పగిది బంగారు మెట్టు బాలపుష్టికల
జకదవర్ణుండు నాజలదవేణియును (5450)
నిలిచి శోభిల్లి పూనిన వేడ్కనంత
వాణి యింద్రాణి శర్వాణి శీతాంశు
రాణియు సకలగీర్వాణ కన్యకలు
గవగూడి సంగీత గరిమ దీపింప
ధవలాక్షుమీదటి ధవళంబు పాడఁ
జతురతమై మహాసంకల్ప మతఁడు
హితవృత్తి నిజపురోహితుఁడు నర్చింపఁ
దలకొని మునులు మంత్రములుచ్చరింపఁ
గలశాబ్ది కలశాబ్ది కన్యకా మూర్తి
రమణయై దానధారా పూర్వకముగఁ (5460)
కమలాక్షునకు నిచ్చె గర్గ్యుఁ డవ్వేళ
నాయితంబుగ గడియారంబు జూచి
యాయత్త మనగురుఁ డామయత్తమనిన
బహువేదవిధుల శ్రీపతి రమాదేవి
మహియని గుర్వంతు మంగళంబనుచు
ఖంగునవైచేఁ జేగంట నాదంట
నంగజ గురుఁడును నఖిలైమమాత
యిరువులొండొరు మోము లీక్షింపఁ జూపు
లరవిందముల వ్రాలునలులెన నమర
మొలఁతుక తబచేయి మీదుగాకనొసఁగె (5470)
జలజాక్షుఁ దంతట సగుడజీరకము
సీమంతినీమణి సీమంత సీమ
దామోదరుఁడు శుభద్రవ్యంబునించె
గురుతర సమవృష్టి కుఱిస్వ్ నవ్వేళ
సరసాత్మలై వియచ్చరలు నచ్చరలు
పాడిరాడిరి నభోభాగంబునందుఁ
దోడనే పొడమె దుందుభి నినాదంబు
నగవు వెన్నెలలు చిందఁగఁ బట్టినట్లు
జిగి ముత్తియములు మచ్చికదోయిలించి
భాసిల్లఁ గృష్ణుండు పద్మాయతాక్షి (5480)
సేన కొప్పున నొప్ప సేనఁ బ్రాలిడిన
తెలిమించు చుక్కల తెలిఁగాని పించి
చెలువున గొప్పమై సేసఁబ్రాలమరఁ
గౌనసి యాడఁ జన్గవముద్దు గునియ
నానఱెప్పలవాన నలినాయతాక్షి
ఘనకల్పలతల చొక్కపు విరుల్దాల్చి
యనువునఁ దలఁబ్రాలు హరిమీఁద నుంచె
బలరాము తమ్ముఁడా పరమకల్యాణి
గళమునఁ జేర్చె మంగళసూత్ర మపుడు
వైదర్భి కృష్ణ సౌవర్ణ కల్యాణ (5490)
వేదిపై వేదాంతవేది గర్గ్యుండు
భాసిల్ల మణిమయ భద్రపీఠమున
నాసీనులుగఁ జేసి నాగమోక్తమున
మేలిమి మును లెల్ల మెచ్చఁ దాలిమిని
వ్రేలిమి మొదలైన విధులఁ గర్మములు
సేయించి బహువిధాశీర్వాద మెలమిఁ
జేయించి మణిదీప చిత్రపాత్రికల
నీరాజనము లవనీరాజకాంత
లారాజవదనకు నంబుజాక్షునకు
నొసఁగ నక్షతముల నుర్వీసురేంద్రు (5500)
లొసఁగ డెందముల నుత్సాహ మెసఁగ
హరుఁడు వాణీమనోహరుఁడు దిగ్భూమి
వరులు కిన్నరులు భూవరులు కట్నములు
సవరింప శౌరియాసరవిఁ గల్యాణ
మవధరించెను జగంబానందమందఁ
గమలజాదులకును గర్గ్య ముఖ్యులకు
నమలలోచనుఁ డుడుగరలఁ బాలించి
పార్థివేశ్వరుల సంభావించి పొగడ
నర్థిబృందముల కిష్టార్థంబు లిచ్చి
ఘనతర బంధువర్గములకు వివిధ (5510)
కనకాంబరాది వర్గముచేఁద నిలిపి
జలరాశి కన్యకా సహితుఁడై యపుడు
జలరాశి మధ్యవాస మొనర్చుకరణి
నీలవర్ణుఁడు రుక్మిణీదేవిఁ గూడి
చాల నొప్పుచు మౌని జాలమెన్నఁగను
జనులను సౌఖ్యముల్సమకూరఁ జెసి
జననాథ యాభీష్మ జననాథ తనయ
నెనసి రమానాథుఁ డిష్టభోగముల
మొనసి యెంతయును బ్రమోదించుచుండె
వనజాస్త్రుఁ డపుడు జీవనజాక్షుఁడైన (5520)
తనుగన్నతండ్రి యాదవ నాధుఁడైన
నతనికిఁ దనుజుండ నగుదునేననుచు
మతినెన్ని శౌరిసమ్మతి సంతసించి
రమణ వైదేహిగర్భము బ్రవేశింపఁ
గ్రమమున రుక్మిణీ కామినీమణికి
నవరసి యపరంజి నలరుమై దీగ
నవచంద్ర రేఖ చందమునఁ జూపట్టె
ధవళాక్షుఁ డధరామృతముఁ గ్రోలుకతనఁ
జవిగొన నలినంబు చౌకమైతోఁచె
నతనుని విలునారి యమలమధ్యమునఁ (5530)
బ్రతిబింబమొనరిన పగిదినారమరెఁ
గంతు యాత్రిక చిప్పకవమీఁద నిలిచి
బంతులోయనఁ గప్పు బలనెఁ జన్మొనలు
వలరాజు మణిమయా వరణంబు ఠేవ
దళుకొత్తునుదర వంధము బిగువయ్యె
నెలలు తొమ్మిదియును నిండెనిండుటయు
సలలిత గ్రహము లుత్తమములందుండ
నారుక్మిణీకాంత యతుల లగ్నమున
మారు నీరజ సుకుమారు కుమారుఁ
గాంచెఁ గాంచుటయును గాంచనాంబరుఁడు (5540)
నించిన వేడ్కతో హేమాదికముల
నుర్వీసురేంద్రుల కొసఁగి విధ్యుక్త
సర్వ శుభక్రియల్సవరించి మించి
కవులును వీరపుంగవులును భూమి
ధవులును సకలయాదవులును గొలువ
ధారణి సజ్జనాధారకయైన
ద్వారకనుండె నంతయువేడ్కతోడ
నని యోగిజనపాలుఁ డాజనపాలుఁ
డను మోదమంద యిట్లని యానతిచ్చె
నని సుధావాణికి నబ్జపాణికిని (5550)
వనజాస్త్రు మాతకు వనధిజాతకును
ననుఁగన్నతల్లి కనమ్రభల్లికిని
గనకగాత్రికిని సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుహాసకును
సారలావణ్యకు సకలగణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును (5560)
హైమసంవ్యావకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకుఁ బన్నగతల్పయుతకు
మృగమదాంగకు నలమేలుమంగకును
నంకింతంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశూంభ
దనుపమ శ్రీవేంకటాధీశ దత్త
మకరకుండలయుగ్మ మండితకర్ణ (5570)
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాధ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధా మస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్ట మహిషీ వివాహ
మనుకావ్యమునఁ జతుర్థశ్వాసమయ్యె
చతుర్థాశ్వాసము సమాప్తం
(తరువాయి భాగం
రెండవ పట్టమహిషి "జాంబవతీ కల్యాణము")
అద్భుతమైన సరస్వతీసేవ నమస్సులండీ
ReplyDelete