మలయజ కర్పూర మహిత నీహార
జలజ పంకజ లిప్త విశాల దీపికల
లాలిత రత్నజాలకకుట్టిమాంత
రాలిని బారావతార వంబులును
మణుల దీపముల సాంబ్రాణి ధూపములఁ
బ్రణుతు ముక్తాఫల రంగవల్లికలఁ
జిత్యకుడ్యముల విచిత్ర సూత్రములఁ
జిత్రమై యొప్పు నచ్చెలువ యింటికిని
నేతేరఁ దనరాక నెదురగంగొనియు
నాతలోదరి హరియరుదెంచు టెఱిఁగి (4110)
గద్దియడిగి చెల్మికత్తెలుఁదాసు
నిద్దంపుతావుల నెఱయు పన్నీట
హరి పదాబ్జములు నీరార్చి యర్చించి
సరసనుద్ధవుని బూజలు సేసియంత
గల కలహంసికా కలకల ధ్వనుల
కొలకొన గోళ్లును కొలకెలంబులును
జల్లుల ముత్తెంపు జల్లుల పుష్ప
జల్లరీతతులఁ గాంచన వితానముల
నలవడు చంద్రశాలాంతర స్థలికి
జలజాక్షుఁదోఁ కొని జలజాస్య యరిగి (4120)
కలపంబుచిప్ప బాగాలు కుందనపు
టెలతట్టకుడి నీరునించు బిచ్చెలును
ఉదయ భాస్కరముపై నుండల సంకు
మదమును సురటికమ్మదనంపు విరులు
చుట్టును విలసిల్లు సొగసుకన్పట్టు
పట్ట నిర్మించిన పరపునింపార
జలువలుదేరు పచ్చడ మప్పళించి
తలకడ మృదువైన తలగడనునిచి
పుటపుటగా జాజి పూవులు దాల్చి
బటువులు గలమించు బటువులింపొందఁ (4130)
దఱుణులు సవరింపఁ దనరి మంజిష్ఠ
తెరచాయగల దోమతెర సెజ్జమీఁద
హరినుంచి సకలభూషాన్వితయగుచు
మరునియాఱవతూఁపు మహిఁగల్గెననఁగఁ
గొసరు చూపులమును కూటంబుగాన
ముసిముసి నగవుకెమ్మోవిపై నెఱయ
నునుసిగ్గునెఱపు కన్నుల కల్కి కేలు
తనకేలఁ గీలించి తనకేల వెఱపు
అని శౌరి సెజ్జపై కాలేమఁ దిగిచి
కొని వీడియంబుగై కొని బుజ్జగించి (4140)
చూపులఁ గొనగోరి సోఁకుల రతుల
నైపుణిఁగళలంటు నలనచెంతలను
బరిరంభణములఁ జుంబన విలాసముల
మరుకేళి నిట్లువేఁఱుఁ దేల్చి తేల్చి
వనిత గాంక్షించిన వరమిచ్చి మెచ్చి
ననవిల్తు జనకుండు నగరికేతెంచి
యన్నతోఁ గమలాక్షుఁ దక్రూరుఁడున్న
యన్నగరికినేగి యతఁడు గావించు
పూజగైకొని నెమ్మి పొలయంగ ధవళ
రాజీవ రాజీవ రాజవీక్షణము (4150)
లతనిపైనించి యక్రూరుని బాండు
సుతుల త్రిలోకవిస్రుతుల సేమంబు
నరసి రమ్మని పంచి యతనిచేవారి
పరిణామమెఱిఁగి యప్పంకజోదరుఁడు
తనరుచు సకలయాదవులు భూధవులుఁ
దనుగొల్వ మధురనెంతయువేడ్క నుండె
అంతఁ గంసుని కాంత లంతరంగమున
సంతత శోక మంనంతమై పొరలఁ
దముఁగన్న రాజసత్తము జరాసంధుఁ
గ్రమునఁ జేరి గద్గదకంఠులగుచుఁ (4160)
దమజేటు పాటు నెంతయుఁ జెప్పఁ గ్రూర
తమదృష్టి నజ్జరాతనయుండు గినిసి
యక్షీణ బలకరి హరిరాజరాజ
దక్షోహిణులు పదినైదు నెన్విదియు
కూడి కొల్వఁగ వచ్చి కుటిలుఁడై మధుర
వేడింప విని క్రొవ్వి వేడింపకున్నఁ
గాదని బలుఁడు సంగత రమాబలుఁడు
నాదటఁ దలఁపఁజయ్యన మింతనుండి
శర శరాసన చక్ర శస్త్ర సీరాది
భరితమై వచ్చి చొప్పడు దేరుజోడు (4170)
నెక్కి మాగధుబలంబెల్లఁ బెల్లవియఁ
జెక్కు చేసిన జరాసంధుఁ డావేది
లోనైనవాని బలుండు మర్దింపఁ
బూన దానవమర్ధిపో విడిపింప
భజనదక్కగజరపట్టి సైనికుల
వ్రజము బాయుచు గిరివ్రజమునకేఁగె
బలకృష్ణులరి బలబల జిష్ణులగుచుఁ
జలంగి యప్పురిఁ బ్రవేశించి యున్నంత
బాణాది పటుశాస్త్ర భయదంబులైన (4180)
వెండియు మధురపై వెడలి కాళింది
దండనమ్మగధుఁ డుద్దందత విడియ
నిచ్చలుదనపోటు నెఱివాసిలోని
యచ్చాళియెఱిగిన యచ్చాళితోన
నాలోన వధియించి హరివాని సేన
కోలకారుండఁ గగ్గోలుగాఁబడిన
నారూఢ గతులన య్యాకృష్ణయనుచు
పెరులువారి గంభీర విక్రమములు
పటహ భేరీ తూర్య పణవశంఖాట
పటలంబు మొఱయ దిక్పటలంబు బెరయ (4190)
ఖోవని నాల్గు దిక్కులు జుట్టి పెటులు
కొవులు జబురు జంగులు పిరంగులును
బుసకోవులునుగ సాబులుతు పాకులును
వసుఇధ లీలగనొక్కవడిఁ గాల్చి రిపుల
దలముల కులికి కత్తరములఁ ద్రెంచి
తలలుత్తరించి డెందమ్ముల వ్రచ్చి
కరములఁదెగటార్చి గళములఁ దునిమి
చరణముల్స్మయించి జానువుల్డఱిగి
హరులఁ జెండాడి రధాళి నుగ్గాడి
కరుల భంజించి యక్కళములఁ ద్రోచి (4200)
డంబుల చెదర గుడారము ల్చించి
పంబులు దెగఁగోసి పడగలఁ గాల్చి
ధనువులు విరిచి శస్త్రంబుల నలచి
కనలి చూఱలు వట్టి కలగుండు పఱుప
నపుడు వకావకలై పాళెమెల్లఁ
గపురుమూయుచు హల్ల కల్లోలమైనఁ
గూటి సొక్కున మేలు కొనలేక మూఁక
గాటంపు నడల భూగతులైనవారు
బలువాచతమహితోఁ బౌరులమనుచుఁ
బొలు పేది జన్నిదంబుల చూపువారు (4210)
కళవలించుచుఁ ద్రోవగానక యమున
జలములఁ బడిమింత జరిగెడువారు
చెలువలతో నిద్రచెందుచు బెగడి
తలమొల వీడ మర్దెసఁ బాఱువారు
పొగరేది రణభీతిఁ బొందెడువారు
నగుచుఁ జిందరవందరై లజ్జ దక్కి
నుగ్గు నూఁచంబులై నుఱుములై జడీచి
సగ్గులౌ ముగ్గులై కకపికలగుచు
నీ విధంబున మగధేంద్ర సైన్యంబు
లావెల్లఁ బొలసి చెల్లాచెదరైన (4220)
బెగడొంది మగధుండు పెడకంత వెడలి
జడిదప్పి మిగుల నొచ్చి సగంబు జచ్చి
నమ్మిన సకల బాంధవుల రాజులను
సొమ్ములన్ని యునుగృష్ణునిపాలు చేసి
పోయె గిరివ్రజంబునకు గంసారి
నాయెడ మధురకు నరుదెంచెనంత
మగతనంబెన్నక మగధుండు మగడు
జగతీశ్వరులఁ దొంటి సరవిమై గూడి
పసుబుద్ధి వచ్చి శ్రీపతిచేత సప్త
దశవారములు నిట్లు దశఁబొంది యలిఁగి (4230)
బలసి క్రమ్మర భూజాబలముతోనంత
బలముతో దనుజారిపై దండు వెడలి
సురమౌని చాతగౌ సురవైరిడాఁక
నరసి యుగ్రతఁ గాలయవనుఁదవ్వేళఁ
గలితులక్రాయ కాలోగ్రే తదండ
తులితాంగ జగదరాతులఁగి రాతులను
మూఁడు కోట్లను గూడి మూఁడు నేత్రముల
వాఁడునుబోలెఁ దీవ్రతవచ్చి మధుర
వలగొన్న నన్నతో వనజాక్షుఁడనియె
వెలి మీఱి మనమింక వీనితోఁ బోర (4240)
నెల్లి జరాసంధుఁడేతెంచి నగర
మెల్లఁ గొల్లఁగఁ బటునెడము లేకుండ
నరులకభేద్య మంతంతనవ్హేద్య
శరధి మధ్యమునఁ గుశస్థలీనాఁగ
నున్నది దిక్కులేకున్న దీపురము
మున్నయీ పురజనంబుల నందునునిచి
వచ్చి యిచ్చటనున్న వైరుల నిచ్చ
వచ్చిన గతిఁ జెండి వైచదమనుచు
మధురవెల్వడి పశ్చిమంపు మున్నీరు
మధువైరి చేరి తన్మధ్య దేశమున (4250)
ఘటదీప మునుబోలి కడలిలో ముణిఁగి
పటుశాంతి నలరు నప్పట్టణం బరసి
జలధి పండ్రెండు యోజనముల మేర
తొలగించి మిగుల సంతోషించి యపుడు
అలఘు విస్మయకర్ముఁడగు విశ్వకర్మ
దలఁపనేతెంచి పాదంబుల కెరఁగి
పని యేమి యననటఁ బట్టనంబొకటి
యొనరింపు మింపు సొంపొదవ నెందనుఁడుఁ
దననేర్పుమెఱసి సంతత చిత్ర మహిమ
పసుపడ వనధియై పరిఘయై తనర (4260)
జలజాప్తు శతకోటి శతకోటిఁ దెగడు
ధళధళ రుచుల కుందనపు కోటలును
నాపూర్ణ వర్ణ రత్నాకరంబు లగుచు
గోపురంబుల డాయు గోపురంబులును
హైమ విద్రుమ దీప్తులడర ద్వారకల
సీమకు ముట్టళ్లు సేయు నట్టిళ్లు
లలితేంద్రనీల జాలముల జాలములు
గలకాంత యామినీ కాంత సౌధముల
నవిరళ వజ్రమయంబులై భవన
భువనేశ్వరములైన భువనేశ్వరములు (4270)
సాంద్ర చందన పారిజాత నీహార
చంద్ర చంద్రోజ్వల చంద్రశాలలును
మరకత ంకణి కుట్టిమముల హేమముల
దొనసిన విప్రవేదవిదుల వేదులును
రజతశాలల మహారజతాంగణముల
నిజ విడూరోపల నిచయ పద్మములఁ
గలిత షట్పదపుంజ కలితంబులగుచుఁ
గమలాకరములైన కమలాకరముల
జారు భావముల వాసవ యక్షపతుల
యారామముల నవ్వు నారామతతుల (4280)
హిమశైల నిభముల నిభముల వేగ
రమణతా మిళిత ఖర్వముల నర్వముల
వర్ణితాలంకార వాస సంకీర్ణ
పూర్ణార్క విధు పథంబుల రథంబులను
దేవాగ్ర భూతేశ దేవేంద్ర ముఖ్య
దేవసన్నుత దేవ దేవాలయముల
లోలుఁడై యాలి నాలుగనోళ్లఁ బొగడు
బేలవీఁడటె వేల్బు పెద్దలు యనుచు
బ్రహ్మఁ గైకొనక యపారంబులైన
బ్రహ్మవిద్యలు గల్గు బ్రాహ్మణోత్తములు (4290)
వరుస వాసవునిమై వ్రణములై తలఁచు
స్ఫురిత ప్రతాపాంక భుజులు భూభుజులు
ధనదుని ధనమెల్లఁ దమవట్టిపైడి
కెనరాదటని హసియించు నూరుజులు
నింటఁదలేరు నొక్కిద్దు గల్గియును
బంటగానక నేలఁ బట్టి కీలించె
ఫాలాక్షు బ్రతుకును బ్రతుకేయటంచుఁ
జాలనవ్వెడి హరిచరణసంభవులు
చిదిమిపెట్టిన లావుచే వసింగంపుఁ
గొదమల గతినజ్జు కుప్పలఁ బోలి (4300)
పటుభుజాస్ఫాలన భంజిత వైరి
భట పటాలోగ్రతార్భటులైన భటులు
సాన దీర్చినమారు శరముల పోల్కి
వీనులఁ గదిసిన వెడఁద కన్నులును
ముసి ముసి నగవు లిమ్ములధువాళింప
మిసమిస వెన్నెల మెఱఁగు చూపులును
పసిఁడి సంకులురాలు బాహుమూలములఁ
గిసలయంబుల పసగెల్చు హస్తముల
ధళధళఁ బొల్లు నిద్దములఁ యద్దముల
పొలుపు నటించు కపోల పాళికల (4310)
కఱికెక్కిమెఱుఁగులు గ్రమ్మినల్గడల
మిఱుమిట్ల గొల్పు ధమిల్లభారముల
మీఱియుప్పొంగు క్రొమ్మిసిమి కన్నులును
జీఱుకుల్వారు గిజ్జిఁగిచన్ను గవలు
బాలాబ్జములైపై పైతేట నిగ్గు
డాలు వాటించు మిటారి నవ్వులును
క్రొవ్వు చన్గవల వేగువ నివ్వటిలుచు
జవ్వాడి నొయ్యారి చన్నుకోనులును
పొడవులై బటువులై పులినంబుమీఁది
వెడగులఁ బచరించు పెనుబిఱుందులును (4320)
మెఱుఁగు పుట్టంబులమీఁద గ్రేళ్లుఱుకు
నొఱపైన మించుల నొదవు నూరువులును
పసిఁడికాళెల మాఱువాడి యోటకరుల
యొసపరిబాగులై యున్నలేఁ దొడలు
నచ్చఁ దామరల మేలంతయునూర్చి
పుచ్చుకొన్నట్టి యొప్పుల పదంబులును
జెలువొంద మారుఁడేర్చిన తూఁపులనఁగ
విలసిల్లు ధవళారవింద లోచనల
చనుగవల్విమల మంజరుల మార్పడిన
జినుగు పయ్యెదలె యాచింతలఁ దీర్పఁ (4330)
దమ్ములు నేత్రముల్దారు మాఱైనఁ
గమ్ముకాటుకలెయాకలఁక లేర్పఱుప
నిల సంపఁగులు నాసలెఱుఁగ రాకున్నఁ
జలువ యూరుపులెయా సందేహముడుప
దంతముల్వింతలుఁ దడమెడ మెఱుంగు
వింతకావియుయద్ది వెఱగు జనింపఁ
దలిరులు హస్తముల్డబ్బిబ్బులైన
నలసొమ్ములా సంశయంబులఁ దీర్పఁ
బొన్నలు నాభులుఁ భోల్ప రాకున్న
సన్నంపుటారులా శంకలుమాన్ప (4340)
నొప్పుచ నటనల నొఱపు చిత్తరవు
గుప్పుచు ముద్దుగులుకు నొయ్యారి
చివురు విల్తుని కేలిసెల గోలలనఁగ
భువనమోహినులైన పుష్పలావికలఁ
దావుల దశదిశల్దడ కట్టిమెట్ల
బావులు నావేల్పు బయ్యగేలించు
నావుల మిగుల మోహనములైనట్టి
ఠీవులఁబురము వాటిలఁగ నిర్మించి
తదనంతరమునఁ దత్తరమునఁ గమల
............................. (4350)
తమ్ములో యని పట్టి దంబులు బ్రమయఁ
దమ్మి చెక్కడపు రత్నంపు బోదియల
నలిన నాళంబులు నమలు హంసికలు
మలయు క్రొంబటి కంపు మదిరచేతులును
గళుకుల పికమాలి కలవింతవగల
గలుగు వైడూర్యంపు కట్టు దూలముల
కాంతిచే వెన్నలఁ గబళించు దెసల
దంతుల జీవ దంతపుబోదియలును
నలఘు రత్నాకృతులై సూత్రగతులఁ
బలుకు పారవముల పసిఁడి చూరులును (4360)
మేలైన ముత్యంపు మించు పట్టియలు
డాలైననును బవడంపు కుడ్యములఁ
జిత్రంబులగు హరిచేఁత లన్నియును
జిత్రింపనలరు విచిత్ర దేశములఁ
గలికి ముక్కుల కీరకలు చిక్కుదివియుఁ
జిలకుదిద్దిన చీర్ణంపు బనులఁ
దిలకించు రతి పల్లె తీరుల సిరులఁ
దళుకొత్తు పచ్చల ద్వారబంధములఁ
గమకపుటపరంజి గంధవట్టియల
సమకొన్న విపుల వజ్రపు కవాటములఁ (4370)
గలితంపు గోమేధికములఁ గెంపులను
ధళధళన్మణి నిబద్ధ ప్రదేశముల
మును సుధారసవర్గముల మాఁగిపదను
మునుపు ముత్తెపు సున్నములఁ ద్రిలోకముల
నీడు జోడును లేని యింద్రనీలముల
నోడ బిల్లలనేత నొప్పు మాళిగల
నవరత్న తతుల విన్నాణంబులైన
నవరంగములను వింతల బవంతులను
పైయ్యేటజలమాడు పడఁతులు వచ్చి
బయ్యకలంచు దిద్భ్రమ ముట్టియరుగ (4380)
నిలనీరు మేడలు నిక్కిమిన్నేటి
జలములఁ దెలఁగించు జలసూత్రములును
నగరంబు వైకుంఠ నగరంబు భాతి
మిగుల నొప్పఁగ నేర్పు మెఱసి నిర్మించి
యావేల్పు గ్రమ్మరి సప్తాంగంబు లిచ్చి
యవురవురమేలు లెస్సాయె నటంచు
వివరంబు ననుగారవించి వీడ్కొలిపి
వారక యిహ పరద్వారక యగుట
ద్వారక యను పేరు తగుదీనికనుచు (4390)
నాపూర్ణమణి భర్మయగు సుధర్మయను
నాపారిజాతంబు హరి సమర్పింపఁ
జెలువులందు నల్లనై చెలువొందు పెక్కు
ధవళాంగముల జవోత్తమ తురంగముల
నింద్రుఁ డొప్పింప నాయడవచ్చి కిన్న
రేంద్రుఁ డెన్మిది నిధులెలమి నర్పింపఁ
బొలుచు కానుకలు వేల్పులు తమకలిమి
కొలఁదిమై నొసఁగఁ గైకొని రమావిభుఁడు
బాగునానెకచిప్ప బంతులొక్కటికి
లాగించు యాంత్రికులాఁగు దీపింపఁ (4400)
దన యోగమాయనత్తఱి బుత్రమిత్ర
ధన వాహనాది సంతతులతోఁ గూడి
వలనొప్పఁ గాద్వారవతికి నమ్మధురఁ
గలవారినెల్ల నాకర్షించియుంచి
చయ్యన మధురకుఁ జని తత్పురంబు
ముయ్యంచులును జుట్టి ముట్టియున్నట్టి
యాకాలయవను గాలాకారవర్ణు
నేకాకిఁగా నెలయించి దాఁగొనుచు
మునుకొని నిద్రించు ముచికుందు గుహకుఁ
జనిత దీక్షణ వహ్నిజముఁ గూర్చి పేర్చి (4410)
యారాజు మెచ్చి చయ్యనవరంబిచ్చి
శౌరి గొబ్బున వచ్చి జడియక మధురఁ
గట్టల్కనల్గడఁ గలయఁబోరుచును
జుట్టున తురక పౌఁజుల మట్టు పెట్టి
వెండియునచ్చోటి వెండియుఁ బసిఁడి
భండారములు గజవ్రతతు లశ్వములు
ఘన వస్తువులు ద్వారకాపురంబునకు
ననిచి పీతాంబరుం డసితాంబరుండు
దానుగామంతంబు దక్కిన గిరులు
గానఁ బోయెడువాని గతిఁ దీవ్రగతిని (4420)
నరుగుచోఁ గాళింది యవల శోభిల్లు
పర వీరకుల భీము భార్గవరాముఁ
గని తదనుజ్ఞచేఁ గరవీరపురము
పని బూనియపుడ హంబ్రహ్మ యటంచుఁ
జాల గర్వించి నిచ్చలుఁ గయ్యమునకుఁ
గాలు ద్రవ్వెడియా సృగాలు ఖండించి
కరివీరపురము భీకర వీరవరుల
హరియించి సంపదల్హరియించెనంత
గరుడుండు గొని వచ్చు ఘనకిరీటంబు
ధరియించి జయలక్ష్మి దరియించి చేర్వ (4430)
ననఘు ప్రావర్షణంబను ధరాధరము
గని వసించిన నదిగని మాగధుండు
చనుదెంచి కానకా శైలంబు కనల
ననలంబు దరికొల్ప హరి కృష్ణులపుడు
వెల్లి మీఱిన గృపావృష్టిఁ దదగ్నిఁ
జల్లార్చి మగధుండు జడియఁ బెల్లార్చి
కనలి జరాసంధు కడిమి బోకార్చి
..............................
సురలు డెందమ్మునఁ జొక్కన మౌని
వరులు మెచ్చఁగ ద్వారవతికేగుదెంచి (4440)
హితమంత్రి బల పురోహిత సేవ్యులగుచు
నతుల వైభవయుక్తులై యుండిరంత
నని యోగిజనపాలుఁ డజనపాలుఁ
డనుమోదమంద నిట్లని యానతిచ్చె
అని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రు మాతకు వనధిజాతకును
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని
కనకగాత్రికిని బ్రకామదాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని (4450)
సారసగేహకుఁ జారుబాహకును
సారలావణ్యకు సకల గణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును
హైమసంవ్యానకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకు బన్నగ తల్పయుతకు
మృగమదాంగకు నలమేలుమంగకును (4460)
నంకితంబుగ శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్లపాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుందల యుగ్మ మండితకర్ణ
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాధ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధ మస్త ప్రణీతోరు (4470)
మనసిజ జనకాష్ట మహిషీ వివాహ
మను కావ్యమునఁ దృతీయాశ్వాసమయ్యె
జలజ పంకజ లిప్త విశాల దీపికల
లాలిత రత్నజాలకకుట్టిమాంత
రాలిని బారావతార వంబులును
మణుల దీపముల సాంబ్రాణి ధూపములఁ
బ్రణుతు ముక్తాఫల రంగవల్లికలఁ
జిత్యకుడ్యముల విచిత్ర సూత్రములఁ
జిత్రమై యొప్పు నచ్చెలువ యింటికిని
నేతేరఁ దనరాక నెదురగంగొనియు
నాతలోదరి హరియరుదెంచు టెఱిఁగి (4110)
గద్దియడిగి చెల్మికత్తెలుఁదాసు
నిద్దంపుతావుల నెఱయు పన్నీట
హరి పదాబ్జములు నీరార్చి యర్చించి
సరసనుద్ధవుని బూజలు సేసియంత
గల కలహంసికా కలకల ధ్వనుల
కొలకొన గోళ్లును కొలకెలంబులును
జల్లుల ముత్తెంపు జల్లుల పుష్ప
జల్లరీతతులఁ గాంచన వితానముల
నలవడు చంద్రశాలాంతర స్థలికి
జలజాక్షుఁదోఁ కొని జలజాస్య యరిగి (4120)
కలపంబుచిప్ప బాగాలు కుందనపు
టెలతట్టకుడి నీరునించు బిచ్చెలును
ఉదయ భాస్కరముపై నుండల సంకు
మదమును సురటికమ్మదనంపు విరులు
చుట్టును విలసిల్లు సొగసుకన్పట్టు
పట్ట నిర్మించిన పరపునింపార
జలువలుదేరు పచ్చడ మప్పళించి
తలకడ మృదువైన తలగడనునిచి
పుటపుటగా జాజి పూవులు దాల్చి
బటువులు గలమించు బటువులింపొందఁ (4130)
దఱుణులు సవరింపఁ దనరి మంజిష్ఠ
తెరచాయగల దోమతెర సెజ్జమీఁద
హరినుంచి సకలభూషాన్వితయగుచు
మరునియాఱవతూఁపు మహిఁగల్గెననఁగఁ
గొసరు చూపులమును కూటంబుగాన
ముసిముసి నగవుకెమ్మోవిపై నెఱయ
నునుసిగ్గునెఱపు కన్నుల కల్కి కేలు
తనకేలఁ గీలించి తనకేల వెఱపు
అని శౌరి సెజ్జపై కాలేమఁ దిగిచి
కొని వీడియంబుగై కొని బుజ్జగించి (4140)
చూపులఁ గొనగోరి సోఁకుల రతుల
నైపుణిఁగళలంటు నలనచెంతలను
బరిరంభణములఁ జుంబన విలాసముల
మరుకేళి నిట్లువేఁఱుఁ దేల్చి తేల్చి
వనిత గాంక్షించిన వరమిచ్చి మెచ్చి
ననవిల్తు జనకుండు నగరికేతెంచి
యన్నతోఁ గమలాక్షుఁ దక్రూరుఁడున్న
యన్నగరికినేగి యతఁడు గావించు
పూజగైకొని నెమ్మి పొలయంగ ధవళ
రాజీవ రాజీవ రాజవీక్షణము (4150)
లతనిపైనించి యక్రూరుని బాండు
సుతుల త్రిలోకవిస్రుతుల సేమంబు
నరసి రమ్మని పంచి యతనిచేవారి
పరిణామమెఱిఁగి యప్పంకజోదరుఁడు
తనరుచు సకలయాదవులు భూధవులుఁ
దనుగొల్వ మధురనెంతయువేడ్క నుండె
అంతఁ గంసుని కాంత లంతరంగమున
సంతత శోక మంనంతమై పొరలఁ
దముఁగన్న రాజసత్తము జరాసంధుఁ
గ్రమునఁ జేరి గద్గదకంఠులగుచుఁ (4160)
దమజేటు పాటు నెంతయుఁ జెప్పఁ గ్రూర
తమదృష్టి నజ్జరాతనయుండు గినిసి
యక్షీణ బలకరి హరిరాజరాజ
దక్షోహిణులు పదినైదు నెన్విదియు
కూడి కొల్వఁగ వచ్చి కుటిలుఁడై మధుర
వేడింప విని క్రొవ్వి వేడింపకున్నఁ
గాదని బలుఁడు సంగత రమాబలుఁడు
నాదటఁ దలఁపఁజయ్యన మింతనుండి
శర శరాసన చక్ర శస్త్ర సీరాది
భరితమై వచ్చి చొప్పడు దేరుజోడు (4170)
నెక్కి మాగధుబలంబెల్లఁ బెల్లవియఁ
జెక్కు చేసిన జరాసంధుఁ డావేది
లోనైనవాని బలుండు మర్దింపఁ
బూన దానవమర్ధిపో విడిపింప
భజనదక్కగజరపట్టి సైనికుల
వ్రజము బాయుచు గిరివ్రజమునకేఁగె
బలకృష్ణులరి బలబల జిష్ణులగుచుఁ
జలంగి యప్పురిఁ బ్రవేశించి యున్నంత
బాణాది పటుశాస్త్ర భయదంబులైన (4180)
వెండియు మధురపై వెడలి కాళింది
దండనమ్మగధుఁ డుద్దందత విడియ
నిచ్చలుదనపోటు నెఱివాసిలోని
యచ్చాళియెఱిగిన యచ్చాళితోన
నాలోన వధియించి హరివాని సేన
కోలకారుండఁ గగ్గోలుగాఁబడిన
నారూఢ గతులన య్యాకృష్ణయనుచు
పెరులువారి గంభీర విక్రమములు
పటహ భేరీ తూర్య పణవశంఖాట
పటలంబు మొఱయ దిక్పటలంబు బెరయ (4190)
ఖోవని నాల్గు దిక్కులు జుట్టి పెటులు
కొవులు జబురు జంగులు పిరంగులును
బుసకోవులునుగ సాబులుతు పాకులును
వసుఇధ లీలగనొక్కవడిఁ గాల్చి రిపుల
దలముల కులికి కత్తరములఁ ద్రెంచి
తలలుత్తరించి డెందమ్ముల వ్రచ్చి
కరములఁదెగటార్చి గళములఁ దునిమి
చరణముల్స్మయించి జానువుల్డఱిగి
హరులఁ జెండాడి రధాళి నుగ్గాడి
కరుల భంజించి యక్కళములఁ ద్రోచి (4200)
డంబుల చెదర గుడారము ల్చించి
పంబులు దెగఁగోసి పడగలఁ గాల్చి
ధనువులు విరిచి శస్త్రంబుల నలచి
కనలి చూఱలు వట్టి కలగుండు పఱుప
నపుడు వకావకలై పాళెమెల్లఁ
గపురుమూయుచు హల్ల కల్లోలమైనఁ
గూటి సొక్కున మేలు కొనలేక మూఁక
గాటంపు నడల భూగతులైనవారు
బలువాచతమహితోఁ బౌరులమనుచుఁ
బొలు పేది జన్నిదంబుల చూపువారు (4210)
కళవలించుచుఁ ద్రోవగానక యమున
జలములఁ బడిమింత జరిగెడువారు
చెలువలతో నిద్రచెందుచు బెగడి
తలమొల వీడ మర్దెసఁ బాఱువారు
పొగరేది రణభీతిఁ బొందెడువారు
నగుచుఁ జిందరవందరై లజ్జ దక్కి
నుగ్గు నూఁచంబులై నుఱుములై జడీచి
సగ్గులౌ ముగ్గులై కకపికలగుచు
నీ విధంబున మగధేంద్ర సైన్యంబు
లావెల్లఁ బొలసి చెల్లాచెదరైన (4220)
బెగడొంది మగధుండు పెడకంత వెడలి
జడిదప్పి మిగుల నొచ్చి సగంబు జచ్చి
నమ్మిన సకల బాంధవుల రాజులను
సొమ్ములన్ని యునుగృష్ణునిపాలు చేసి
పోయె గిరివ్రజంబునకు గంసారి
నాయెడ మధురకు నరుదెంచెనంత
మగతనంబెన్నక మగధుండు మగడు
జగతీశ్వరులఁ దొంటి సరవిమై గూడి
పసుబుద్ధి వచ్చి శ్రీపతిచేత సప్త
దశవారములు నిట్లు దశఁబొంది యలిఁగి (4230)
బలసి క్రమ్మర భూజాబలముతోనంత
బలముతో దనుజారిపై దండు వెడలి
సురమౌని చాతగౌ సురవైరిడాఁక
నరసి యుగ్రతఁ గాలయవనుఁదవ్వేళఁ
గలితులక్రాయ కాలోగ్రే తదండ
తులితాంగ జగదరాతులఁగి రాతులను
మూఁడు కోట్లను గూడి మూఁడు నేత్రముల
వాఁడునుబోలెఁ దీవ్రతవచ్చి మధుర
వలగొన్న నన్నతో వనజాక్షుఁడనియె
వెలి మీఱి మనమింక వీనితోఁ బోర (4240)
నెల్లి జరాసంధుఁడేతెంచి నగర
మెల్లఁ గొల్లఁగఁ బటునెడము లేకుండ
నరులకభేద్య మంతంతనవ్హేద్య
శరధి మధ్యమునఁ గుశస్థలీనాఁగ
నున్నది దిక్కులేకున్న దీపురము
మున్నయీ పురజనంబుల నందునునిచి
వచ్చి యిచ్చటనున్న వైరుల నిచ్చ
వచ్చిన గతిఁ జెండి వైచదమనుచు
మధురవెల్వడి పశ్చిమంపు మున్నీరు
మధువైరి చేరి తన్మధ్య దేశమున (4250)
ఘటదీప మునుబోలి కడలిలో ముణిఁగి
పటుశాంతి నలరు నప్పట్టణం బరసి
జలధి పండ్రెండు యోజనముల మేర
తొలగించి మిగుల సంతోషించి యపుడు
అలఘు విస్మయకర్ముఁడగు విశ్వకర్మ
దలఁపనేతెంచి పాదంబుల కెరఁగి
పని యేమి యననటఁ బట్టనంబొకటి
యొనరింపు మింపు సొంపొదవ నెందనుఁడుఁ
దననేర్పుమెఱసి సంతత చిత్ర మహిమ
పసుపడ వనధియై పరిఘయై తనర (4260)
జలజాప్తు శతకోటి శతకోటిఁ దెగడు
ధళధళ రుచుల కుందనపు కోటలును
నాపూర్ణ వర్ణ రత్నాకరంబు లగుచు
గోపురంబుల డాయు గోపురంబులును
హైమ విద్రుమ దీప్తులడర ద్వారకల
సీమకు ముట్టళ్లు సేయు నట్టిళ్లు
లలితేంద్రనీల జాలముల జాలములు
గలకాంత యామినీ కాంత సౌధముల
నవిరళ వజ్రమయంబులై భవన
భువనేశ్వరములైన భువనేశ్వరములు (4270)
సాంద్ర చందన పారిజాత నీహార
చంద్ర చంద్రోజ్వల చంద్రశాలలును
మరకత ంకణి కుట్టిమముల హేమముల
దొనసిన విప్రవేదవిదుల వేదులును
రజతశాలల మహారజతాంగణముల
నిజ విడూరోపల నిచయ పద్మములఁ
గలిత షట్పదపుంజ కలితంబులగుచుఁ
గమలాకరములైన కమలాకరముల
జారు భావముల వాసవ యక్షపతుల
యారామముల నవ్వు నారామతతుల (4280)
హిమశైల నిభముల నిభముల వేగ
రమణతా మిళిత ఖర్వముల నర్వముల
వర్ణితాలంకార వాస సంకీర్ణ
పూర్ణార్క విధు పథంబుల రథంబులను
దేవాగ్ర భూతేశ దేవేంద్ర ముఖ్య
దేవసన్నుత దేవ దేవాలయముల
లోలుఁడై యాలి నాలుగనోళ్లఁ బొగడు
బేలవీఁడటె వేల్బు పెద్దలు యనుచు
బ్రహ్మఁ గైకొనక యపారంబులైన
బ్రహ్మవిద్యలు గల్గు బ్రాహ్మణోత్తములు (4290)
వరుస వాసవునిమై వ్రణములై తలఁచు
స్ఫురిత ప్రతాపాంక భుజులు భూభుజులు
ధనదుని ధనమెల్లఁ దమవట్టిపైడి
కెనరాదటని హసియించు నూరుజులు
నింటఁదలేరు నొక్కిద్దు గల్గియును
బంటగానక నేలఁ బట్టి కీలించె
ఫాలాక్షు బ్రతుకును బ్రతుకేయటంచుఁ
జాలనవ్వెడి హరిచరణసంభవులు
చిదిమిపెట్టిన లావుచే వసింగంపుఁ
గొదమల గతినజ్జు కుప్పలఁ బోలి (4300)
పటుభుజాస్ఫాలన భంజిత వైరి
భట పటాలోగ్రతార్భటులైన భటులు
సాన దీర్చినమారు శరముల పోల్కి
వీనులఁ గదిసిన వెడఁద కన్నులును
ముసి ముసి నగవు లిమ్ములధువాళింప
మిసమిస వెన్నెల మెఱఁగు చూపులును
పసిఁడి సంకులురాలు బాహుమూలములఁ
గిసలయంబుల పసగెల్చు హస్తముల
ధళధళఁ బొల్లు నిద్దములఁ యద్దముల
పొలుపు నటించు కపోల పాళికల (4310)
కఱికెక్కిమెఱుఁగులు గ్రమ్మినల్గడల
మిఱుమిట్ల గొల్పు ధమిల్లభారముల
మీఱియుప్పొంగు క్రొమ్మిసిమి కన్నులును
జీఱుకుల్వారు గిజ్జిఁగిచన్ను గవలు
బాలాబ్జములైపై పైతేట నిగ్గు
డాలు వాటించు మిటారి నవ్వులును
క్రొవ్వు చన్గవల వేగువ నివ్వటిలుచు
జవ్వాడి నొయ్యారి చన్నుకోనులును
పొడవులై బటువులై పులినంబుమీఁది
వెడగులఁ బచరించు పెనుబిఱుందులును (4320)
మెఱుఁగు పుట్టంబులమీఁద గ్రేళ్లుఱుకు
నొఱపైన మించుల నొదవు నూరువులును
పసిఁడికాళెల మాఱువాడి యోటకరుల
యొసపరిబాగులై యున్నలేఁ దొడలు
నచ్చఁ దామరల మేలంతయునూర్చి
పుచ్చుకొన్నట్టి యొప్పుల పదంబులును
జెలువొంద మారుఁడేర్చిన తూఁపులనఁగ
విలసిల్లు ధవళారవింద లోచనల
చనుగవల్విమల మంజరుల మార్పడిన
జినుగు పయ్యెదలె యాచింతలఁ దీర్పఁ (4330)
దమ్ములు నేత్రముల్దారు మాఱైనఁ
గమ్ముకాటుకలెయాకలఁక లేర్పఱుప
నిల సంపఁగులు నాసలెఱుఁగ రాకున్నఁ
జలువ యూరుపులెయా సందేహముడుప
దంతముల్వింతలుఁ దడమెడ మెఱుంగు
వింతకావియుయద్ది వెఱగు జనింపఁ
దలిరులు హస్తముల్డబ్బిబ్బులైన
నలసొమ్ములా సంశయంబులఁ దీర్పఁ
బొన్నలు నాభులుఁ భోల్ప రాకున్న
సన్నంపుటారులా శంకలుమాన్ప (4340)
నొప్పుచ నటనల నొఱపు చిత్తరవు
గుప్పుచు ముద్దుగులుకు నొయ్యారి
చివురు విల్తుని కేలిసెల గోలలనఁగ
భువనమోహినులైన పుష్పలావికలఁ
దావుల దశదిశల్దడ కట్టిమెట్ల
బావులు నావేల్పు బయ్యగేలించు
నావుల మిగుల మోహనములైనట్టి
ఠీవులఁబురము వాటిలఁగ నిర్మించి
తదనంతరమునఁ దత్తరమునఁ గమల
............................. (4350)
తమ్ములో యని పట్టి దంబులు బ్రమయఁ
దమ్మి చెక్కడపు రత్నంపు బోదియల
నలిన నాళంబులు నమలు హంసికలు
మలయు క్రొంబటి కంపు మదిరచేతులును
గళుకుల పికమాలి కలవింతవగల
గలుగు వైడూర్యంపు కట్టు దూలముల
కాంతిచే వెన్నలఁ గబళించు దెసల
దంతుల జీవ దంతపుబోదియలును
నలఘు రత్నాకృతులై సూత్రగతులఁ
బలుకు పారవముల పసిఁడి చూరులును (4360)
మేలైన ముత్యంపు మించు పట్టియలు
డాలైననును బవడంపు కుడ్యములఁ
జిత్రంబులగు హరిచేఁత లన్నియును
జిత్రింపనలరు విచిత్ర దేశములఁ
గలికి ముక్కుల కీరకలు చిక్కుదివియుఁ
జిలకుదిద్దిన చీర్ణంపు బనులఁ
దిలకించు రతి పల్లె తీరుల సిరులఁ
దళుకొత్తు పచ్చల ద్వారబంధములఁ
గమకపుటపరంజి గంధవట్టియల
సమకొన్న విపుల వజ్రపు కవాటములఁ (4370)
గలితంపు గోమేధికములఁ గెంపులను
ధళధళన్మణి నిబద్ధ ప్రదేశముల
మును సుధారసవర్గముల మాఁగిపదను
మునుపు ముత్తెపు సున్నములఁ ద్రిలోకముల
నీడు జోడును లేని యింద్రనీలముల
నోడ బిల్లలనేత నొప్పు మాళిగల
నవరత్న తతుల విన్నాణంబులైన
నవరంగములను వింతల బవంతులను
పైయ్యేటజలమాడు పడఁతులు వచ్చి
బయ్యకలంచు దిద్భ్రమ ముట్టియరుగ (4380)
నిలనీరు మేడలు నిక్కిమిన్నేటి
జలములఁ దెలఁగించు జలసూత్రములును
నగరంబు వైకుంఠ నగరంబు భాతి
మిగుల నొప్పఁగ నేర్పు మెఱసి నిర్మించి
యావేల్పు గ్రమ్మరి సప్తాంగంబు లిచ్చి
యవురవురమేలు లెస్సాయె నటంచు
వివరంబు ననుగారవించి వీడ్కొలిపి
వారక యిహ పరద్వారక యగుట
ద్వారక యను పేరు తగుదీనికనుచు (4390)
నాపూర్ణమణి భర్మయగు సుధర్మయను
నాపారిజాతంబు హరి సమర్పింపఁ
జెలువులందు నల్లనై చెలువొందు పెక్కు
ధవళాంగముల జవోత్తమ తురంగముల
నింద్రుఁ డొప్పింప నాయడవచ్చి కిన్న
రేంద్రుఁ డెన్మిది నిధులెలమి నర్పింపఁ
బొలుచు కానుకలు వేల్పులు తమకలిమి
కొలఁదిమై నొసఁగఁ గైకొని రమావిభుఁడు
బాగునానెకచిప్ప బంతులొక్కటికి
లాగించు యాంత్రికులాఁగు దీపింపఁ (4400)
దన యోగమాయనత్తఱి బుత్రమిత్ర
ధన వాహనాది సంతతులతోఁ గూడి
వలనొప్పఁ గాద్వారవతికి నమ్మధురఁ
గలవారినెల్ల నాకర్షించియుంచి
చయ్యన మధురకుఁ జని తత్పురంబు
ముయ్యంచులును జుట్టి ముట్టియున్నట్టి
యాకాలయవను గాలాకారవర్ణు
నేకాకిఁగా నెలయించి దాఁగొనుచు
మునుకొని నిద్రించు ముచికుందు గుహకుఁ
జనిత దీక్షణ వహ్నిజముఁ గూర్చి పేర్చి (4410)
యారాజు మెచ్చి చయ్యనవరంబిచ్చి
శౌరి గొబ్బున వచ్చి జడియక మధురఁ
గట్టల్కనల్గడఁ గలయఁబోరుచును
జుట్టున తురక పౌఁజుల మట్టు పెట్టి
వెండియునచ్చోటి వెండియుఁ బసిఁడి
భండారములు గజవ్రతతు లశ్వములు
ఘన వస్తువులు ద్వారకాపురంబునకు
ననిచి పీతాంబరుం డసితాంబరుండు
దానుగామంతంబు దక్కిన గిరులు
గానఁ బోయెడువాని గతిఁ దీవ్రగతిని (4420)
నరుగుచోఁ గాళింది యవల శోభిల్లు
పర వీరకుల భీము భార్గవరాముఁ
గని తదనుజ్ఞచేఁ గరవీరపురము
పని బూనియపుడ హంబ్రహ్మ యటంచుఁ
జాల గర్వించి నిచ్చలుఁ గయ్యమునకుఁ
గాలు ద్రవ్వెడియా సృగాలు ఖండించి
కరివీరపురము భీకర వీరవరుల
హరియించి సంపదల్హరియించెనంత
గరుడుండు గొని వచ్చు ఘనకిరీటంబు
ధరియించి జయలక్ష్మి దరియించి చేర్వ (4430)
ననఘు ప్రావర్షణంబను ధరాధరము
గని వసించిన నదిగని మాగధుండు
చనుదెంచి కానకా శైలంబు కనల
ననలంబు దరికొల్ప హరి కృష్ణులపుడు
వెల్లి మీఱిన గృపావృష్టిఁ దదగ్నిఁ
జల్లార్చి మగధుండు జడియఁ బెల్లార్చి
కనలి జరాసంధు కడిమి బోకార్చి
..............................
సురలు డెందమ్మునఁ జొక్కన మౌని
వరులు మెచ్చఁగ ద్వారవతికేగుదెంచి (4440)
హితమంత్రి బల పురోహిత సేవ్యులగుచు
నతుల వైభవయుక్తులై యుండిరంత
నని యోగిజనపాలుఁ డజనపాలుఁ
డనుమోదమంద నిట్లని యానతిచ్చె
అని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రు మాతకు వనధిజాతకును
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని
కనకగాత్రికిని బ్రకామదాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని (4450)
సారసగేహకుఁ జారుబాహకును
సారలావణ్యకు సకల గణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును
హైమసంవ్యానకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకు బన్నగ తల్పయుతకు
మృగమదాంగకు నలమేలుమంగకును (4460)
నంకితంబుగ శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్లపాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుందల యుగ్మ మండితకర్ణ
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాధ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధ మస్త ప్రణీతోరు (4470)
మనసిజ జనకాష్ట మహిషీ వివాహ
మను కావ్యమునఁ దృతీయాశ్వాసమయ్యె
(తృతీయాశ్వాసము సమాప్తము)
No comments:
Post a Comment