Monday, February 29, 2016

అష్టమహిషీ కల్యాణము - 9

గచ్చిమాటలుమాని కడచి పల్కినను
గుబ్బచన్నులఁగూల ద్రుమ్ముదుమిపుడు
సరసడాసిసనేల చనియెదుఁవాడి
మరుతమ్మిమిట్టలే మాకుచాగ్రములు
పదరిపల్కెదవు చేపట్టినంతటనె
మదనపాశంబులె మాబాహులతలు
అరిది పల్కినఁ దూరనాడినమారు
తురగహేషలె మామధురభాషణములు
అకటచూచిన యంతనలుగ నేమిటికి
మకరాంకుచిలుకులె మాకటాక్షములు                 (2410)
అనినదైన్యంబు నొయ్యారిచందంబు
గనుపట్ట సరసవాక్యములకు మెచ్చి
హరినవ్వికౌఁగిటనలమి కాళింది
దరుల నాగోపసుందరులఁ జొక్కించి
అలినాద సామ గానాళితో బింబ
ఫలరస వరసోమపానంబు సేయు
శుక పిక ఘన ఋత్విజుల ఘోషములను
సుకుమార సుమలతా స్ఫురిత యూపములఁ
బ్రచురమరంద ధారావారమిళిత
రుచిరపరాగ పురోడాశతతుల                     (2420)
దర్పిత పారావత ప్రాంశునాద
దర్పక వేదమంత్రముల సంఫుల్ల
మంజరీ బహుపుంజ మంజు నికుంజ
రంజిత శాలల రత్నవహ్నులను
అరవింద హోమకుండాలు కల్గి
యరవిందనారామ యజ్ఞవాటంబు
కరణిఁగాళిందిలోఁ గాంచనద్యుతులఁ
గరమొప్పునొక్క సైకతము నేకతము
గఱగ నీక్షించి యక్కడకేగుదెంచి
పిలిచిపైకొనెడి యోపికాల గోపికలు             (2430)
ఫణిభోగభోగికై ఫణిరాజువేయి
ఫణములు పఱచిన బాలిచెన్నొందు
నెలచెల్వరాల వెన్నెల సొగడాలు
చిలుకొట్టి సేవంతి సెజ్జలమీఁద
నూరుకేళీలోల మతులగావింపఁ
జేరివారలఁ జేరి చెలకుచు శౌరి
కేలనందముల సాలగించుచువలచు
వలపులగాలిచేవన్ ల సేదదీర్చ
లలిత కరాగ్రపల్లవ పంఙ్తిచేతఁ
దొలుతఁ గళావనుల్ తోరణకట్ది                (2440)
రతిమనోహర మహారాజ్య వైభవము
లతిమనోహరలీల ననుభవించుచును
సతులయాగములుఁ దత్సమ్య వస్తువులుఁ
చ్రితివోల్పరాక మార్పిడియుండ జూచి
జిగిమోవులని చెంతచిగురులనాని
మొగరైనఁగావని మోలంచు సేసి
చనుగుబ్బలనుచు మంజరులజేపట్టి
ఘనమార్దవములైనఁ గావని విడిచి
యరిదిముంగురుల నియలులకు నొడిసి
మొరసినఁగావని మొగినవ్వునగుచు              (2450)
చాలలనలకాప్త ఫాలలఁ జతుర
లీలచేత మేలిమిఁ జొక్కఁ జేసి
శ్యామల మరకత శ్యామలమరుని
సీమల మిగుల మచ్చికలఁ దేలించె
పొరుఢల రతికళా ప్రౌఢులహావఁ
రూఢలవింతకూర్మలను మెప్పించి
తనునొత్తి సేయునేఁ తకుమాఱు సేయు
ననువునఁ గొనగోళ్ళ నలగుబ్బలొత్తి
బట్టిడనొకలేమ నొడికినెన్నడుము
పట్టిచిక్కఁడిటంచుఁ బలుకుటఁ జూచి          (2460)
దంద భ్రూవిజిత కోదండయొకర్తు
నిండునట్టాలయింప నీలవర్ణుండు
కొలగేలఁ గొండగైకొనకెత్తువాఁడు
తనిసి యెత్తఁగఁ జూచెఁ దత్కుచద్వయము
రమణీయ సతులతో రతులనీగతుల
సముఖుఁడై హరిగూడి చొక్కివెండియును
అమలమైతార పద్మాకారమగుచుఁ
గమలాస్త్రుతొలిమాఁపు గతిశౌరి చూపు
మల్లికా ఝల్లరీ మహితధమిల్ల
వల్లరిహృదయజే వనజాముల్గరఁప          (2470)
నొకతెఱంగునను వేఱొకతెఱంగునను
జికురభరంబులోఁ జెప్పఁ జూపట్టు
నిండుతావులపిండు నెలుపెడు పొగడ
దండ కృష్ణునిమెడ దండఁ గీలించి
యురుహార పద్మరాగోపలంబెత్తి
నిరతియైఁ బండువెల్నెల యండనాని
మసలకకై కొన్న మాయానధనము
లొసంగె దోనిరపుగానుండెదోయయినిన
సరస భావముల నాసకియకుంగృష్ణుఁ
డరువిరాధరంబు భోగ్యంబుగానిచ్చె           (2480)
జాంబూనద ప్రభ స్తనకుంభఘర్మ
జాంబపురంబుల నభిషిక్తుఁ జేసి
చెలువమొక్కతె మధ్యసింహాసనమున
బలసోదరుని రాజ్యపట్టంబు గట్టె
రోమాళినొక ముగ్ధరుచిరాంగి కపుడు
పామని భ్రమియించి పట్టుచు శౌరి
యలక లలాట నేత్రధర గండ
గళదండ కుచపక్ష గంభీర నాభి
కటిచక్ర జాను జంఘూ పదాంగుష్ఠ
చటులదేశముఁ జంచద్విలాసములఁ            (2490)
బట్టిచుణున నఖ బాహుకృత్యముల
నిట్టిచేపెట్టెడి కృత్యచాతురులు
గలుగనంగాగ సంగతుల నీగతుల
లనిఁ జూపి సకలకళాప్రవీణతల
సకల గోపికల కాంక్షలు దీఱమఱియు
నొకపరివేయి బాహుల గౌఁగిలించి
తెరలక వేయివాతెరల చేనొకటఁ
దరుణుల యధరముల్తనివాఱఁ గ్రోలి
చదురున నఖసహస్త్రముల నొక్కడను
నుదుటు గుబ్బెతలమై నొత్తులొత్తుచును           (2500)
నొక మోహనాంగిపైనొరగి లాలించి
యొకబిత్తరికివీడిమొసఁగి మెప్పించి
యొకవన్నెలాడితో నొఱపులు నెఱపి
యొకనేరు పరితోడనొనఁ గూడి చెలఁగి
యొకవిలాసినిఁ జూచి యొయ్యనఁ దెగడి
యొకచిలు కులకొల్కి నొరపి రమ్మనుచు
మకురాంకుకేళి నిమ్మాడ్కిఁ జొక్కించి
హరి గోపికా మోహనాకృతుల్జూచి
వరుసతోవేర్వేఱ వర్ణింపఁదొడఁగె
కండచక్కెఱొపుల కండంపుతునుకొ                     (2510)
దొండపండొనవాతోదీనిమోవి
.....................
సతతంబుఁ జెడని కంజము గల్గెనేని
సతిమోమునకుఁ గింతసరియన వచ్చు
వెలమఁగుత్తుకబంటి విషములోనుండీ
కలువలుతప మెంతగాలించెనేని
సరవి నానాఁటికి జడియుటేకాక
తరుణికన్నులతీరు తమకేలకలుగు
నతివనెమ్మొగము సోయగమెన్నఁ గుముద
పతిబింబ మదిపూర్వపక్ష మేతలఁప              (2520)
నలవిమీఱిన ముత్తియంబులనొక్క
కొలికికిఁదెచ్చు నీకొమ్మ పల్వరుస
వన్నెలాడుటగాక పనితమై బాయ
యున్నదే పగిఁడికి నొఱసి చూచినను
గచ్చులాడుటెకాక కలికి పొలిండ్లు
బచ్చనసకినిల పరిపాటులన్న
వడిచూసుకొని యంతవచ్చిన శిరము
పడఁతిమైడాలుకు బ్రతిమేల వచ్చుఁ
చొరపొచ్చెములుగాక పొలఁతియూరులక్కు
సరసరంభలనెల్ల సాటివెట్టుటలు             (2530)
యరసియుఁ బొదివిచ్చ నాడుటకాదే
తరుణిజంఘలకు చిత్తళిగలీడనుచు
ననుచు నీక్రియల మోహనరత్రిక్రియలు
దనిపియోలార్చునత్తఱిఁ జేలరేఁగి
దర్పకగురుతోడి దర్పకకేళి
దర్పించియో గోప దర్పణముఖులు
దక్కెఁబోఁ మకరకుండల భూషణుండు
చిక్కెఁబో నాకు రంజిత భాషణుండు
వలచెఁబో నాకు జీవనసన్నిభుండు
కలసెబో నన్ను శ్రీకామినీవిభుఁడు            (2540)
యిచ్చెనే మడిగినవెల్ల భూధవుఁడు
వచ్చెఁనెమున్న క్రేవలకు మాధవుఁడు
అని నిజరూప రేఖాదిసంపదల
నన విల్తుసతినవ్వనినబోండ్లఁ జూచి
కలసి మేనులఁ దమకము పుట్టఁజేసి
కలయుట రతికళా కౌశలంబనుచు
మలయుచు విటశిఖామణి శౌరివారి
నెలయించియటఁ దిరోహితుఁడయ్యఁ జెంతఁ
చైకొన్న తదనులాపములఁ నన్యోన్య
లోకనాకృతులఁ నాలోకింపుచుండె                (2550)
కాంతాకరాధీశ కరసుధాసిక్త
కాంతారమున గోప కాంతలా శౌరిఁ
గానకచెగడి మేఘముఁ చాసిదెసల
నూనిన మెఱపుల యొఱపు గైకొనుచు
విరహ తపాంబుధి వెలువడుజాడ
లరసి యాతనునామ మనుతెప్పఁ జేరి
పన్నీటిచెమ్మచేఁ బదనైనయొక్క
తిన్నని కస్తూరి తిన్నె నెన్నడుము
కమలాకుచాగ్ర సంగతి పాదకమల
కమలచిహ్నంబుల గలిగి యేర్పడిన           (2560)
యడుగులఁ గాంచి కృష్ణాయంచునతని
నుడువుచుఁ గదిసి కన్నుల నొత్తికొనుచు
చీఁకటివరవాయు శిశిరాంశుకళల
నాఁకటితమిగ్రోలియల చకోరాళి
సడలించెననఁగఁ గజ్జల జలధార
లుడుగక కన్నుల నురులనందంద
మొగములువాడ క్రొమ్ముళ్ళెంతవీఁడ
పగడంపువాతెఱల్పలుమాఱునెండఁ
జరణముల్దొట్రిల్ల జఘనంబులదర
కరములు చెమరింప గౌనులల్లాడ               (2570)
పొలయుమక్కువమెల్ల పూచిన రీతిఁ
బులకలు సర్వాంగముల జాజుకొనఁగ
ననురాగవల్లి కలనఁగ నొప్పుచును
బెనగొన్న గురిగింజ పేరులల్లాడఁ
బరమయోగీంద్రుల భాతి గోవింద
పరచింత సేయుచుఁ బరచింతలుడిగి
సకలశరీరి యీశ్వరునూహ చేసి
సకలవస్తువులందుఁ జైతన్యబుద్ధి .....
కానవేహరి జగత్కల్యాణమూర్తి
........................
ప్రకట సత్ఫల రసభావంబులరయ            (2580)
శుకకానవే మేఘశోభనగాత్రు
ఆరామవిభవంబు లరయుచుండుదువు
శౌరిఁగన్గొవె యిచ్చట భరద్వాజ
ఘనతర హరిభక్తిగలుగంగఁ జేయు
మునులార కానరే మునిలోకవంద్యు
ఆశలవాసించినట్టి పోఁడుముల
కౌశికకానవే కాంచనాంబరుని
సకలద్విజాత్మ పోషక చారుశాఖ
సకలేసుఁ గానవే శాండిల్య నీవు
సుమనో మనోహర స్ఫురిత ప్రభావ          (2590)
కమలాక్షుఁ గానవే గాలవయిచట
మకురకపోలాగ్రములదువాడించు
మకరకుండల కాంతిమండలివాని
అలకలజూడ నొయ్యారంపు సిరుల
బెళుకఁ జుట్టిననెమ్మి పింఛంబువానిఁ
గొదమనవ్వులచాదు కొనివీను సిరులఁ
గదిసిననిడువాలు గన్నులవాని
పగడంపు వాతెరపైఁ బిసాళించు
నిగనిగ నవ్వువెన్నెల సోగవాని
గావికెమ్మోవిచెంగటఁ బిల్లగ్రోవి             (2600)
ఠీవిమైచొక్కఁ బాడెడు పాటవాని
నెడ జాఱితఱిమొల్ల విరులతోఁ దేటి
కడునొప్పు నెఱిఁగప్పుగల కొప్పువాని
బొదవిన వరహారముల మీఁద రుచుల
పొదవిన సోయగంబు గళంబువాని
నిగుడుసన్నపు వంకనెల వంకఁ జూచి
నగుచుండునొయ్యారి నామంబువాని
వాసించు బంగారు వెన్నెలదట్టి
గాసించిఉవాని బ్రకాశించువాని
కానరే పక్షిసంఘములార మమ్ముఁ           (2610)
గానరేయలయించు కమలాక్షుననుచు
నడుగుచుమున్నుదా నడుగుచు శౌరి
కడలేని తమినొక్క కడనొప్పు చెలువ
రాధననంగ మర్మకళా ప్రభోద
బోధించియటగొని పోయియెక్కెడను
గేరుచు రతులఁ బొక్కించి తక్కించి
కారించి తమ్మునే కనుమూసి యరుగఁ
నాచెల్వమగుత్రోవ నరుగుచు చేరువమీ
నాచెల్వఁ బొడగాంచి యందఱు గూడి
యమున సౌరభ నికాయమునఁ జూపట్టు         (2620)
కమనీయమైన సైకతభూమి జేరి
వెడలుపై వనములో వెడలుపైమంట
నుడిగించి మదనాగ్ని నుడికించఁ దగునె
గాలిచే భయమెల్లఁ గడపి యీనాలి
గాలిచేమమునింతగలఁ గించనేల
తలపులలో సేదదరలనీ పాణి
తలము నాత్మీయ కుంతలమునఁ జేర్చి
పదిరినగాలిమే పరిమదం బణఁచు
పదము గుబ్బలమోప ప్రాణముల్నిలుచు
చలువ తావులవల్చు చెక్కెరమోవి                 (2630)
తలిరు తేనియల మాతాపంబు దీర్చు
కరమునుత్కరము కాకరము నయ్యోగి
వరమునీంద్రులకు శ్రీవరమునై యొప్పు
తావక చరితామృతము నమచ్ఛ్రవణ
దేవాళిఁ బండువఁ దేలించి యప్పు
డతిమనోరంజని యగునీదు భవ్య
కృతియు నాకృతియు చమత్కృతి నలంకృతియు
దలపోయుమమ్మ వంతలఁడించి పోవఁ
దలఁ పెట్టుపుట్టె మాతలఁ పెఱింగియును
జందనాంకిత కుచస్థలి సోఁకినంతఁ           (2640)
గందునోయని యాత్మఁగందుచుండుదుము
అట్టినీ మెత్తని యడుగుదామరల
నెట్టుమెట్టెదవు నీవీచట్టనేల
అలపెల్లఁ దెలఁగించు నట్టినీ ముద్దుఁ
జిలుకు జూపులు తమ్మిఁ జెనకునెమ్మోము
కలికి హేమాజ్జంబు కరణి గోధూళి
తళుకొత్తు కుటిల కుంతల తలంబులును
కలికి మాటలు మోవి గదియుచు సిరులు
గులుకు బంగరుపిల్ల గ్రోవి నాదంబు
భావించు త~ఋఇఱెప్పపాటు గల్పించు              (2650)
దేవాగ్రజుని దూఱి తిట్టుదుమయ్య
యొఱపులు నంతమాకు దుటులుంగఱఁపి
మఱియునెంచుటయెల్ల మగపాడియగునె
తల్లివి తండ్రివి దైవంబు పతివి
యెల్ల సంపదలు నీవే యనియుండి
నిను బాసి పొక్కెదునెలఁ తలలెక్కి
గొనమేమి యనవాఁడు గొలనీకు మేలె
యిరాని నమ్మిక లిచ్చిపైఁబట్టి
పోరాములొకకొన్ని పొసఁగించి తేర్చి
యడవిలో నడురేయి యడ్లలఁ జేసితివి            (2660)
కడపట దొరలకెక్కడి బాసలయ్య
నిలిచిరమ్మని నంతనే రొమ్ముఁద్రొక్కి
తలమీఁద నెక్కుకోఁ దలఁచువారైతే
నెపమున నీపుమున్నీటిలోనున్న
నెపుడు నిన్నెలపోవ నిత్తురేనిన్నుఁ చూచి
మముగాఁగఁ దగులున్న మగువలఁగాఁగ
భ్రమలు పెట్టెదుగాక పద్మాక్షియనుచు
వగలఁ గ్రుమ్మరచు దేవగల నీరీతిఁ
దగులఁ దూఱినవారి దయ జూచి శౌరి
తుఱుము గ్రొవ్విరులఱదోఁపఁ గప్పారు            (2670)
తుఱుము దాపలిఁ చెంతఁ దుదబిత్తరింప
మిసిమి గొణపుచెంగు మెణకువగొన్న
పసిఁడికాయనొస పరిబాగు చూపు
జిగిమీఱు కుండల శ్రీలుచిన్నారి
నగుమోముదమ్మి చెంతలదు వాడింప
యెండతుమ్మెదలతో మేలంబులాడు
దండయఱ్ఱుననివా తాళింపు చుండ
వలలఁ జిక్కిన చెలువలసేదదీర్ప
మలయుచువచ్చె మన్మథ మన్మథుండు
ఆగోపసతులు గృష్ణలోకరతులు                     (2680)
నాగోపవరు గాంచి రపుడు మోదమునఁ
బొదివి పాలిండ్లువీఁ పునవెడలంగ
నదిమె కృష్ణుని మోవి నానె నొకర్తు
మోవిపైఁ బలుమొల్ల మొగ్గలూఁ దుచును
ఠీవిమై మొమలు గొట్టించె నొకర్తు
చేరిమే నొకవిలసిని గోరఁ జీరి
కెరుచుఁ దిట్టి చెక్కిలియునుం గఱచి
మోము తామరతావి మూర్కొని చొక్కి
కామించి యరగంటఁ గాంచె నొకర్తు
నిగుడి నిట్టూర్పుచే నెఱిగొప్ప సొగయఁ          (2690)
దిగిచిపై నొరగి సందిటఁ గ్రుచ్చెనొకతె
గొబ్బితయొకతెమై గులుకులేఁ జెమట
గుబ్బలపై చెఱంగు నమస్తరించె
కుసుమాంగి యొకతెయక్కున నక్కుడాయఁ
గొసరుచు గొణఁగిచెక్కునఁ జెక్కుఁ జేర్చె
గళముపైఁ జైవైఁచి కరఁగించి తెచ్చె
లలమయొక్కతె తమ్ములము గ్రుమ్మరించె
జలజాక్షు పదసారసము తారసముగఁ
గలకంఠియోర్తుచంగవనొత్తికొనియె
హరియు వారలసేద హరియించి మిగులఁ            (2700)
గరుణించె విమల సైకత భూమినపుడు
తెరవలపయ్యెదల్దివ్య పీఠముగఁ
బరచి కృష్ణుని నొడంఒఱచి యామీఁద
నునిచి యాత్మల నిలికొత్తుమక్కువల
ననిచి తత్పద నలినముల హస్తముల
సొగయనొత్తుచును వాసులు సిగ్గుదమియు
నెగడఁ గృష్ణుని జూచి నేఁడుమమ్మిట్లు
చేసేత నీవు సేసిన చేతకేమి
చేసిన మతులనెం జెరివాయనోటు
వరుల సోదరుల బావలసరివారి                 (2710)
గురుల మీఱుచునిను గోరియేఁ తెంచి
దైవంబునననేల తమకించ నేల
నీవేమి సేతుమానేరంబె యనినఁ
దోయజాక్షుఁడు కనుదుదఁ బాఱనవ్వి
యాయలే యందురే మాయెలెమ్మనినఁ
బలుగప్పులరఁగాను బడబొమల్గుదిచి
యెలుఁగెతి యేమంటి వేమంటివనుచుఁ
గనుఱ్వ్ప్పలల్లార్చి కన్నీరునించి
మునుమోములొందొంటి మోవఁ గ్రక్కుచును
గోరబంగారు రంగు తొంగుచెరంగు                 (2720)
గీరుచుఁబలుమాఱు కిసలయాధరలు
కోమలుల్జిక్కఁ జొక్కుదురు నాయఁకులు
కామింపకుండినఁ గామింతురొకటి
చిక్కిననైనను జిక్కకయున్నఁ
జిక్కిన పతుల వచింపరు సతుల
ధరరారొపోరొకాలతలఁ గాంతలిట్లు
బెరసినీవలెవెత బెట్టరుగాక
యనవిని యవలోకనామృత రసము
చినుకుచు నీరదాసితవర్ణుఁడనియె
వాఁడిమాటలు వల్కవలదునేనట్టి                (2730)
వాఁడనేయెపుడు మీవాడనేయనుచుఁ
గనుగొనుఁ దొకరీతిఁగను గొనవలవ
దనయంబు మీకునే నాత్మబంధుఁడను
విలసిల్లు మీభక్తి వెలసింప వలసి
కలసిడాఁగితినింతె కపటంబు గాదుఁ
అనిననేఁ జేయునీ యపరాధమిపుడు
మానినీ మణులార మన్నింపుఁడనుఁడుఁ
గలసి పైకొను నిజాంగంబు సంగంబు
వలన గోపికలమైవడమెల్లఁ దీర్చి
యాపంచశరుమించు నలపుమై విశ్వ                (2740)
రూపియపుడు పెక్కు రూపముల్దాల్చి
కాంత చామీకర క్రమ పాత్రముల
యంతరాంతరమున ననలున్నకరణి
గారుత్మతములలో గాంగేయుమణుల
చేరికల్ గాఁ గూర్చి చేర్చిన పగిది
మెఱపుల యెడకెడ మేఘముల్దొలుచు
తెఱగున శౌరి వ్రేఁతలయెడనెడను
దనమూర్తి యలరనా తరళలోచనలు
తనదుమూర్తులకుఁ జెంతలఁ జెన్నుమీఱ
భాసిల్లు నుల్లాస భరిత విలాస                   (2750)
రాసమండల మహారంగ మధమునఁ
బలుమాఱుఁ జెలఁగి శ్రీభంగిగా మెలఁగి
నిలిచి వయ్యారివన్నియ వేణువంది
లీల నాలోలాంగుళీ పల్లవముల
మేలముల్జేసి సమేళంబుగాఁగ
నతినీల ఘనముపై హరిచాపమొప్పు
గది వైజయంతి వక్షంబునఁ జెలఁగ
జంబూనదము నీనశైలంబు జుట్టి
పంబెనోయన హేమపటము శోభిలఁగ
మెఱుఁగులయనఁటుల మించెల్ల నిలిమి             (2760)
యొఱపులైతళుకొత్తు నూరుకాండములు
సపరనై యఱచేయి జాదనేదరుల
బవరసంబులకు నెన్నడుమైన నడుము
చతుర శృంగారరస ప్రవాహంబు
గతినొప్పుచునుకాఱు క్రొమ్ముడియారు
సిరిమేలు పట్టంపు సీమయపోలెఁ
గరమొప్పు శ్రీవత్స కలిత వక్షంబు
యమునాతరంగంబు లనమించి నిగడి
యమలంబులైన బాహదండములును
గుంకుమపంక సంకులములై సిరుల                  (2770)
బొంకించు నాల్గుమూఁపుల సోయగంబు
చకచకల్గల పాంచజన్యంబుదాను
నొకకుత్తుకై యుండ నుంకించు గళము
సకలకళా పూర్ణచంద్ర బింబంబు
వికవిక నగుచుండు విమలాననంబు
మలయు సంపఁగిఱేకు మణఁగించి సొంపు
గిలుజాడి తిలకంబు క్రియఁబొల్చునాస
నీలమేఘంబుపై నీలమేఘంబు
వ్రాలియొప్పెడిగతి వలనొప్పుకొప్పు
కొఱలుచందురులోనఁ గొమరొప్పుకప్పు               (2780)
తెఱఁగునఁ గస్తూరి తిలకంబు బెడఁగు
గలిగి యయ్యెడనిరు గడనింపు సొంపు
బెళుకు మోహన మంత్ర బీజముల్పోలె
నిరుపమ లావణ్య నిధియోయటంచు
ధరఁబోల్పఁదగు వసుంధరపేరి సతియు
శౌరి నిచ్చలు విలాసప్రసూనముల
నారాధనము సేయు నారాధగదిసి
యంచిత గతిఁబట్టినట్టి విపంచి
పంచివైచినరీతిఁ బలికించితోడ
జోడుగానముగా సొగసుగాఁ గూడి                     (2790)
పాడనాబాల గోపాళ బాలకుఁడు
చంద్రికల్ పొలసిన జాతిగామొదల
మంద్ర మధ్యస్వర మార్గముల్చూపి
వరుసలేర్పడ నిజావళి భజావళియు
నరసిసాళగము ఠాయములేర్పరించి
మార్గడేశిక తాళమాన ముల్వింత
మార్గములై యొప్ప మధురతల్గుప్పి
వేళలు జాతులు వేర్వేఱ దెలిసి
డాలుగా గాణతొడరుమల్లుఁడిట్లు
వేణునాదంబు గావించె నవ్వేళ                      (2800)
వాణీభవుండు శార్వాణీధవుండు
.....................
సురలు నప్సరలు నాసురులు గిన్నరలు
ఉడురాజి యుడురాజు నుడువీధినిల్చి
జడిగొనఁ బుస్పవర్షములు వర్షించి
ఘుమఘుమ దుందుభుల్ ఘూర్ణిల్లఁ జేయు
కామినిల్పురుషులు గనిచొక్కిగోప
కామినీ కాముకుఁ గామించిరపుడు
నవరసపూర్ణ తానముల గానముల
నవిరళగతి నారదాదులు బాడ                  (2810)
ధరణీశయా గోపదంపతుల్పతులు
పురుడింపదాని సొంపులఁ దేలిదేలి
నలువొందసంఛన్న నలినమైనట్టి
పులినంబుపైఁ బదంంబుల సంగడించి
కరములఁ గరమొప్పఁ గరవీరజాతి
వరసూనముల చేతవడిఁ జల్లులాడి
వరణ మాలికలకై వడినొప్పు మృదుల
కరములనొండారు కంఠముల్జుట్టి
చారునాదముల సంచార భేదముల
నీరీతి నటియించి రెంతయువేడ్క                  (2820)
సరసిజాక్షుఁడు విలాసమున రాసమున
సరసనాట్యముఁ జూపఁ జరఁగెవెండియును
తులితాంగ సంగబంధుర రాసబంధ
ములఁబ్రవర్తిలి తానముల నిల్పి నిల్పి
వరమణి భూషణావలి వలియుఖము
నెరసిరేవగలుగా నిర్మింప భౌమ
మండలంబును దేవమండలంబులును
నొండొంటి విరచించి యొనరఁ< జూపుచును
అరవిందగేహ గేహంబైన యురము
సరసమొప్పారు భూషలునటియింప                  (2830)
కమలాప్తు గుడిచుట్జు గతినంబరముల
భ్రమరింప విభ్రమద్ధ్రమలఁ జూపుచును
బ్రణవ సంపుట మంత్రరాజబీజముల
గుణుతి గోపీమధ్యగత మూర్తులలరఁ
గరణంబులును సుధాకర కరచారు
తరదర హాసముల్ సొంపెరయ
ముకుళాది నామకములుగల్గు పద్మ
ముకుళాది సౌందర్యములఁ జూపులలరఁ
బలుమాఱు మోదితాభ్ర భ్రమద్భ్రమర
కులములగతి నొప్పు కొప్పులల్లాడ                (2840)
భావముల్గరఁగ శుంభ ..... ల్లీవస్తు
భావముల్నెఱపుచుఁ బరిపరిగతుల
నంగహారంబు లుయ్యెల లూఁగుచుండ
నంగహారంబులనలవు చూపుచును
సారసాక్షుఁడు వికాసమున రాసమున
నీరీతి నటియించె నెంతయుఁబ్రీతి
అరయనగ్గలమయ్యె నారాత్రి రాత్రి
వరుఁడు వేడుకరమావరుఁ జూచి నిలువ
వనజాక్షు నెదుట జీవనజాక్షియొకతె
యనువుగానప్పుడు మోహనముగా నిలిచి                 (2850)
మధ్యమాదిగ్రామ మండితంబుగాను
మధ్యమేళము సింహ మధ్యమేళముగ
గీలించియొసఁగెడు గిన్నెరనరుని
వాలుచేతులనేట వాలుగాఁ బూని
గురుమంజరులతేఁటి గుంపుపైకొనిన
సరవిఁగిన్నెరకాయ చనుదోయిరాయ
మేలిమియగుతంత్రి మీటిచొక్కముగ
నాళవియొనరించి యవగడంబుగను
బెళుకుతాళములతోఁ బెఱయ సొంపరయ
బలసోదరునిమీఁది పదము జక్కిణియు              (2860)
వ్న్నెగా వరుసగా వలువగామిగులఁ
దిన్నగా నున్నగా తేటగామించ
మిన్నఁగాఁజల్లఁగా మీటుగాసొలసి
వెన్నుని హృదయంబు వికసింపఁ బాడ
నలరుచుభళిభళీయనుచునానాతి
బులకింపనొసఁగెఁగప్పురపు వీడియము
రతిపతిగురుడిట్లు రాసంబు సలిపి
సతులతో జలకేళి సవరింపఁ దలఁచి
గరుడ సేనేశ నాగప్రభుల్చేరి
పరిచారములు పరిపరిగతి జేయు                 (2870)
గలకల నాదకోకముల లోకములఁ
గలికాగ్రకాంత భృంగముల భంగముల
సమధిక హేమ కంజముల పుంజముల
రమణీయ పుష్పనీరముల పూరముల
లలిత మరాళ సారసముల జాలముల
గలిత సౌరభ పరాగముల పూగముల
కలికి శ్రీఖృష్ణు శృంగార రసాబ్ధి
వలెనొప్పునయమున వరపుత్రిగాంచి
మంచుతేనెడయు పద్మంబులు బోలె
మించి నీవులమీద మెఱయునాభులును              (2880)
గుముదాస్త్రు శస్త్రహింగుళరుచుల్ వోలెఁ
గమలనేత్రాంత రాగముల సొంపులును
కోయిలముక్కులాగుల పల్లవములు
చాయకెంపులు మించుసన్న మోవులును
విరిజొంపముల విఱ్ఱవీఁగెడిలతల
సరవిమప్పిరిగొన్న సరులచేనొప్పు
నరవిందముఖులతో హరియుఁ గుంజరుల
గరిమతోవచ్చు సంగతిఁ జేరవచ్చి
శరదమోఘాశక్తి శంపలువోలె
వరదశూలములచే వనితలింపొంద                    (2890)
ఘనహాస్యరసము శృంగారమధ్యమునఁ
గొనకొన్నగతిఁ దాళి గోణందు గట్టి
వారితోనొనగూడి వారిలోఁజొచ్చి
వారికేళిమొనర్చి వారనివేడ్క
తరఁగలఁగనియొక్క తరాళాక్షి శౌరి
కరములోయని పట్టి కరమునవ్వినను
హరి కురులనియొక్కయతివ శైవలము
సరఁగునఁబట్టి వేసరి కేరితిట్టి
కేలొత్తియొకతె శ్రీకృష్ణుని యోగి
లోలవాలో యీలోలావు మెఱసి                         (2900)


(ఇంకాఉంది)

Friday, February 19, 2016

అష్టమహిషీ కల్యాణము - 8

వరశీలయుతల సువ్రతల నాసతుల
సిరివరుఁడీవన సీమలో మీదు
కరము భక్తమునకై కరము వేడుకను
నున్నాఁడుతడవుగా నున్నాఁడువేఁడు
చున్నాడు మిమ్ము రమ్మన్నాఁడటన్న
ననలు తీరలనిండ ననిచినగరిమఁ
దనువునఁ బులకలు దట్టమైనిగుడ
లోలాక్షులామాటలో వెలిగాఁగ
మేలైన యన్నమర్మిలిఁ బొందుపఱచి
కొనివచ్చుచోఁ దేరకొని వారిపతులు              (1930)
కనలియడ్డము సెప్పఁగానీయ కొనక
హరిపరాఙ్ముఖమైన యజ్ఞాన పటలి
హరిభక్తిమీఱిన యట్ల నీరుచును
బతులమాటలకు లోపడక యావిమల
వతుల చయ్యనవచ్చి మాధవుఁగనిన
వనజాక్షుఁడా విప్రవనజలోచనల
గనుఁగొని యంతరంగముననుప్పొంగి
యన్నులు గొనివచ్చునయ్యుత్తమాన్న
మన్నయు సఖులుఁ దారట నారగించి
సేమంబులరసి వచ్చిన సతీమణుల             (1940)
నామోద జలనిధినోదార్చి మీపతుల
రారందురేమొ బోరననరుగుడనుడు
వారనిప్రేమమై వారనిరంత
వారిమాటలనెల్ల వారించి వచ్చు
వారిఁగైకొందురే వారువెండియును
బతిలైన నీదయా పదలేనియట్టి
గతిలైన నీవయో కమలాక్షయనిన
నిహపరంబులు మీరలిచ్చినఁగల్గు
మహినెవ్వతికినైన మానినులార
మామక పదభక్తి మతులైనమిమ్ము              (1950)
నేమియుననరు ప్రాణేశులు సుతులు
నని వీడుకొలుపఁ బాయని సంతసమున
జనిసతుల్ పతులకీ సరణిఁదెల్పినను
ముందెరుగని విప్రముఖ్యులవ్వేళ
నందనందను రమానాదుఁగా దెలిసి
పొక్కుచుఁదమడెందములలోన వేడ్క
మ్రొక్కుచు ఘనజపంబులఁ దపంబులను
గనియునుగానమీ కాంతలు సురలు
గనలేని తేజంబుఁగనిరెంతవారొ
యనుచు నీరీతుల ననుతాపమొందు               (1960)
చును గంసభయమెన్నుచునునుండిరంత
వ్రజములో వల్లవవ్రజముతో నపుడు
వ్రజపతిమనము దేవప్రభుఁ గూరి
యాగంబు గావింతమని సర్వపస్తు
యోగంబు కొఱకునుద్యుక్తుఁడైయున్న
దేవకీతనయుండే తెంచియానందు
భావంబు తనయాత్మభావించి పలికె
కాలాత్మకుడు హరిగానఁదదాజ్ఞఁ
గాలకాలమునఁ దత్కర్మధర్మములు
చేకూరు నింద్రుఁ చూజించినమీదఁ             (1970)
గాకతాళన్యాయ గరిమ వర్తించు
సురపతిఁ బతియంచుఁ జూతురుగాని
హరి జగత్పతి యనియరయరెవ్వరును
బరమాత్మ విలసన భవనంబులైన
సురభుల గిరుల భూసురులనర్చించు
యాగంబుమేలొ యాకాశాధినాధు
యాగంబుమేలొమీర రసికన్గొనుఁడు
ఇలవేల్పులింటిలో నెదురు చూడంగఁ
బలువేలుపులఁ గొల్వఁబాఱినఱీతి
నడవులఁదరుల మహాశైలవరులఁ             (1980)
గడుపులోపలి చల్లగ దలకయుండఁ
వ్రాపులైదాపులై పగలునురేయి
కాపులైయుండు గోగణములుండఁగను
సురరాజుఁ గొలుతురే జోకగావీని
నురుపుణ్యఁ పూజింప యోజింపఁదగును
నీయెడమీతోడనేఁ బల్కుతెఱఁగు
న్యామమో కాకయన్యాయమో యనుఁడు
తలలూఁచిరపుడు చెంతలనున్న గోప
కలవేద్ధులా దివ్యగుణవృద్ధుఁ జూచి
నందుండు మదినుబ్బనందను మాట                 (1990)
చందంబుగనియట్ల చాటంగఁ బనిచె
మగువలువ్రేలు నేమములు హోమములు
జగతీసురులచేత సరవి జేయించి
ముందఱ వృద్ధులా ముందటఁబసులు
సందడిదగిగట్టి చాలుగానడువ
జడలమువ్వలసన్న సంకులనిడుద
యొడిబాగుతో నొప్పుచుండు బాలకులు
కలువదండల చంద్రికలు చుట్టు పగిదిఁ
బొలుచు సంకులునురంబులు తేటపడఁగఁ
బ్రతిలేని గిరుల శంపలునటియించు              (2000)
గతిబొట్లపేర్లుచన్గ వలపై బెళుకు
అలికాంతరముల చాయలఁబిండిబొట్లు
కలితాబ్జములఁ గర్ణికలనవ్వుచుండ
వ్రేఁకంబులగుకంచువెడఁదమట్టియలు
తాఁకులకెడనెడఁ ద్రాఁకి మ్రోయంగ
నిలువేలు పులకుమున్నెక్కించు చాఱ
జిలుఁగుఁ బుట్టంబుతోఁ జెఱఁగులువడఁగఁ
గట్టి బాలకులఁ జంకలఁబెట్టి చిట్టి
గట్టి చుట్టలమీఁదఁ గంపలువెట్టి
వ్రేతలు నడువంగ వ్రేలువేవేలు                     (2010)
రీతుల తమజాతి రీతుల మెఱియ
వెడవెడగానేయి వెడలనికురులఁ
బెడతండ్లుసికలునూనఁగఁ దీర్చియున్న
యోసవరినామంబు లొకవింతచూపఁ
బట్టుక్రొంబసలఁ జూపట్టు పర్ణములఁ
బట్టిముంగలవేల్పు పసిఱొప్పుకొనుచు
వరపరమాన్నముల్వడలు మీఁగడలు
వెరుఁగు లాజ్యంబులు పిండికూరలును
గుడుములు పాలు నౌగులు పంచదార
కడియంపుటట్టులుఁ గమ్మబూరియలు                    (2020)
లనఁటిపండులును శాల్యన్నముల్ తేనె
లును జున్నులు వెన్నలును బాదిగాఁగ
గములుగా శకట సంఘములనమర్చి
గుములుగావాలి చక్కుల నడిపింప
తొలఁగద్రోయఁగరాక త్రోవగ్రిక్కిఱిసి
వెలిమీఱి శ్రీరామవెల్లముపోలె
సలలిత వాద్యఘోషమున ఘోషమునఁ
గలవారలెల్ల నొక్కటనేగుచుండ
రామ గోవిందుల గ్రమునఁబిఱుందఁ
గామునిల్ తనరెండు గడలబాంధవులు                (2030)
నొప్ప నందుఁడు నొక్కయొప్పులకుప్ప
గొప్పైన తేరెక్కి కొనియేగుదెంచి
గోవర్ధనముఁగనుఁ గొంచునావిప్ర
గోవర్ధనునితోడ గుంపుగావిడిని
వల్లవీ వల్లవవరులతోఁ గూడ
నుల్లంబులోఁ గడునుల్లసిల్లుచును
అగ్గిరిధేను విప్రాళిఁ బూజించి
కర్తభోక్తయుదానకానయా దైత్య
హర్త యింద్రుఁడు గుందనజఁడరుదంది           (2040)
యచలాచలాత్మకుండగుటఁ దత్పూజ
నచలంబులోనుండి యవధరించుచును
జోద్యమందుచుజనుల్ చూడమై నిలిచి
హృద్య నైవేద్యంబు లెల్లనొక్కటకు
గేలుసాఁపుచు నారగించె మోదించి
లాలించిపలికె వల్లపువెల్లవినఁగ
నగమూర్తినైన పన్నగమూర్తినేను
మిగుల నిష్టములఁగాముంపుఁడేనిత్తు
ననఁగనచ్చెరువంది యతిముదంబంది
ఘనశైలవర్తి మేఘశ్యామమూర్తి              (2050)
దామోదరుని మూర్తిఁదలఁచి యామూర్తి
యామూర్తియని గోపికాళిఁ గీర్తించి
దయ జూచికాచియిందఱదరి జేర్చి
పయిరులెస్సగఁ జేసి బ్రతికించి సామి
యనుడు శైలముమీఁది యావేల్పు వేల్పు
జనులార కోరునిష్టములెల్ల మీకుఁ
దలకూడుననుచు నంతర్ధానమయ్యె
నల గోపకులు సంభ్రమాకులులగుచుఁ
వసులతోనచటి తాపసులతోగూడఁ
వసుధేశ యగ్గిరి వలచుట్టివచ్చి              (2060)
భుజియించి తద్యాగ భాగశేషములు
భుజియించి మిగుల సొంపులఁ దేలితేలి
యొంటొంటి యాకుతోనొనగూడుచుండ
గొంటిపక్కలుచౌరు గొట్టుచునమలి
కసిగలసిగల సంగళ్ళఁ బూదండ
లొనపరిబాగులై మొనరంగఁ జుట్టి
పండారు గలపిన పసిమిక్రొమ్మసిమి
పిండిగంధములు ముప్పిరిగొనఁ బూసి
యోలోలయని పల్కి యొకగొల్ల చీరఁ
గోలమూఁపుననిడి కొని కేలుసాఁచి             (2070)

(ఈజాతివేలపదము)

దండనేమముగాదు దయబొల్లి మేర
కొండవేలుపుకదే కోడెవో రాజ
గోలయైయలకంచి కొండపై మేయు
పాలమున్నీటిలోపలనీఁదులాడు
లావునఁ జొరఁబాఱి లంకదూరాడి
దీవులనెల్లను దిరుగినో రాజ
కల్లలవడదోయు గబ్బినాకోడె
కల్లరిమన్నీలఁ గడకాలనూఁకు
కలరాజునెన్నరిపుల నెంతయు గెల్చె రాజ       (2080)
సిరిగలనాకోడె సిరులిచ్చుననుచు
బిరుదులుపచరించి పెక్కులాగులను
కంచుకొమ్ములతాళ గతలకునూఁదఁ
జంచులచెలరేఁగి చప్పట్లుచఱువ
కోదండలిడివిర కొలచ్చళిన
నాదింపవైచెఁ జెంతల నొక్కఁడొకని
గేలుకేలునబిగ్గఁ గీలించి పట్టి
సోలికి మిలుచుండి సోలియాడుచును
ముంజ్జుగబ్బుల తుట్టముదుకవెండ్రుకలు
జుంజురింపఁగ విదుర్చుచుఁ జుఱ్ఱుమనుచుఁ       (2090)
జిందఱ కొట్టిమైఁ జమటలుం దొట్టి
కందామరిదిగంగారఁ గ్రేళ్ళుఱికి
యొకకాలుగుంచి వేఱొకకాలు భూమి
వకవకలె వేలవడి యెట్టి మెట్టి
చెలఁగివేలుపుఁ బెద్దసివ మాడువాౠ
పలుమాఱుఁ బొంగి వ్రేపతినాఁటివారు
వరద గోపికులవర్ధన దేవ
బిరుద యాదవరాజుఁ బేర్కొందమనుచు
నుడుకుచు సోదికినున్న పాయసము
తొడికిజుఱ్ఱుచుఁ గంపఁ దొడుపులెక్కుచును         (2100)
మ్రొగ్గకయరకాలములుఁ గాఁడకుండ
నెక్కియావేల్పుఁ బొడిమినెన్నువారు
కుతుకంబుతోఁ దోడి గొల్లలు వేల్పు
కతసెప్పవిని శిరఃకంపంబు సేసి
చెలగివీనులఁగేలు సేర్చి గొబ్బిళ్ళఁ
బలుతెఱంగులఁ గూడి పాడెడువారు
మొనవ్రేళ్ళు శ్రుతులు గ్రమ్ముచు వెన్నలార
యనుచుఁ బాడెడువారు నగుచునుండఁగను
బొంగెడు పొంగళ్ళ పొంగుచునుండ
సంగడి బసులు నిచ్చల మేయుచుండఁ         (2110)
గడుపు దప్పినయట్టి కోపంబుతోన
నుడికింప మేఘవాహుండు బిట్టుగెరలి
ప్రళయ ధారాధరపంఙ్తి నీక్షించి
పలికెఁ జూచితిరే భూభాగంబునందుఁ
గుల గోత్రపత్ర సంకులరక్తసిక్త
కులిశంబు ననిశంబుఁ గొనగేలఁ దాల్చు
ననుడించి నందనందనుకు వాదములు
విని పల్లవులు పనివిని యొంటిగట్టుఁ
గని పూజ నేసి యక్కడనన్నుఁ బేరు
కొనకగైకొనక పొంగుచునున్నవారు           (2120)
నెల మూఁడువానలునేఁ గురియింపఁ
బొలమునంబసులమేఁపుచుదలల్ గ్రొవ్వి
పోసరించినయట్టి పులివోతుగొల్ల
లీసడించిరితుదినిఁక నెద్ది మేలు
భూరి కర్షోపలా పూరిత వజ్ర
దారునతర వర్షధారలచేతఁ
బొదివిగొల్లలమూఁక పొదివిచ్చఁజేయుఁ
డిదెవత్తు మీవెంతనె నింతనంత
నని నిగళములూడ్చి యుంచినఁ బోయి
యనిఁ జూచికెరలు వీరాగ్రణులనఁగఁ           (2130)
బెంపుతెంపు నటింపఁ బెరిఁగి మేఘములు
గుంపులై నీరాళ గొందికై మొనసి
యొఱలూడ్చిచిమ్ము మహోగ్ర ఖడ్గములు
తెఱగున శంపలు దివినుప్పతిలఁగ
ఘనసింహరవముల కరణిఁద్రిలోక
జనముఁ భీతిలఁగ గర్జనము చేసి
శర్వకంఠముపట్టు చాలకనింగిఁ
బర్విన విషముల పటలియోయనఁగ
కారుక్రమ్ముచు సీరిగ్రక్కుచుఁబొదలి
ఘోరమ్ములగు పిడుగులతోడఁ గలిసి             (2140)
భయదమై వర్షంబు పట్టెఁ బట్టుటయు
బెడిదంపువానఁ గోపికలు గోపకులుఁ
దడియంగ గోవులెంతయు జడియంగఁ
గని భక్తలోక రక్షణ దక్షుఁడైన
దనుజారికెమ్మోవి దరహామొసఁగ
వ్రజమునకఖిల గోవ్రజమునచటి
ప్రజలకు నేకాతపత్రంబుగాఁగ
నల కొండనెత్తి బాహాదండమమరెఁ
నిలఁదలమోచు ఫణీంద్రుఁడోయనఁగ
లలితాచల శ్రీవిలాస హర్మ్యమున               (2150)
నలఘనీల స్తంభమనఁగ నవ్వేళ
శస్త దేవాగమ్య చరణనీరేజ
హస్తయోగము గల్గెనని పొంగి యద్రి
హరికిఁ బుష్పాంజలు లర్పించెననఁగఁ
దరులు గంపింప  నందలి విరుల్రాల
వడగండ్లుగిడిఁదాఁకి వ్రక్కలైమగిడి
యుడువీథి నడురేయి యుడుపంఙ్తి దెగడు
అంబరవర్ణు చేయంటుటవలన
సంబరచరభావ మందెనోయనఁగ
జడివట్టునాయల జడికోర్వలేక                  (2160)
వడఁకుచు వనమృగావలి మింటికుఱక
శరద నాదముల కిచ్చలఁబొంగిమాఱు
సరిలేనట్టి కేసరులు గర్జింపఁ
గడిది నాగముల వేగముల మేఘములఁ
దొడరు చందంబునఁ దొండముల్ సాఁచి
పనిమినెదుర్చు శంపలఁ బట్టెననఁగఁ
బసిడితీవెలఁ జుట్టి ప్రాపుగాఁ బట్టి
గురువ్రజహరులచేఁ గురువిందఖనులు
నెరయంగనంగార నికరంబులనుచు
నాతలనున్న విద్యాధరుల్ జడిసి                (2170)
శీతాపహరణ వాంఛితమతిఁ గదియ
నేడుగాడ్పులతోడ నేకమైవాస
యేడు రాత్రులఁ బగిళ్లీతీతిఁ గురియఁ
జలఁగియొక్కపఁ బొడిచెనో ప్రొద్దతనుచు
నెలకొని గిరిక్రింద నెమ్మదినుండు
గోగోప గోపికాకులముల బలము
జాగుమై గురియు నాజలదాళి బలముఁ
బటుతర హరి దివ్యబాహుబలంబుఁ
జటులాభ్రచారులౌ చారులచేత
విని వజ్రి యామేఘవితతి మర్ల్చి              (2180)
తన మనోవీధిఁ జింతన సేయుచుండెఁ
గమలాక్షుఁడపుడు చెంగటనున్నయట్టి
తమవారిఁగని దుష్ట తమవారియడఁగెఁ
గావిరి విరిసె దిక్తటులు రాజిల్లె
మీ వైభవంబుల మీరుండుఁడనుచు
నవిరళశైలంబు నాతొంటిచోట
ధ్రువ పదంబును బోలె ధ్రువముగానిల్చె
జిష్ణుండు తలపోతసేసి కృష్ణుండు
విష్ణుందయనుచు భావించి దిక్పతులు
సురధేను గూడి భాసురభానుకోటి                 (2190)
నిరసించు కాంతినిఁ బూనిన శౌరిఁ జేరి
గురుతర మణికోటి కోటీర రుచుల
హరిపదాంబుజముల కారతుల్ గాఁగ
మ్రొక్కి కరాబ్జముల్ మోడ్చిమదంబు
దక్కి యానందాశ్రుతతి గ్రుక్కొకొనుచు
దుర్మానినపరాధి ద్రోహి నిజడుఁద
గర్మబద్ధుండ జగన్నాధ నిన్నుఁ
బశుపాలుఁడనుచును బశుపాలబుద్ధి
వశుఁడనైతినిగావ వలయునన్ననినఁ
జిఱునవ్వుమోవిపైఁ జిలుకంగఁ గరుణ          (2200)
నెఱయ నింద్రునిఁ జూచి నీరజోదరుఁడు
నిన్నుఁగానని నీమనంబునఁబొదలు
కన్నుఁగానని రాజ్యగర్వంబుఁ దునుము
నింతసేసితినింతే యింకనావంకఁ
జింతమానక నిజస్థితి నుండుమనుచు
నాదరించినవేల్పుటావు శ్రీదేవు
పాదపద్మములకు బ్రణమిల్లె పలికె
సరలకు నఖిలభూసురులకు నిఖిల
సురభులకును నీవసుమ్ముదైమవవు
విందవు నీవు గోవింద పట్టంబు                  (2210)
నొందిన సౌక్యంబు నొందునాశ్రితులు
అని చెప్పియజుఁడు నన్నంచెనో దేవ
యని పయోదభరంబులలరంగఁ గురియు
క్షేరంబు స్వర్నదీక్షీరంబు జలధి
నీరమ్ములును నవనిధులుఁ బూరించి
భారతీపతి నిశాపతి దిశాపతులు
ధారుణి గౌరిదిగ్దంతులు మునులు
దివి నుతింపఁగఁదాను దేవమాతయును
నవిరళ శ్రీయుక్తు నభిషక్తుఁ జేయఁ
దోషించె మునిగణస్తోమంబు మింత                (2220)
ఘోషించె దుందుభుల్ ఘుమఘుమయనుచు
సురభర్త యప్పుడాసుర హర్త కెరఁగి
యరిగె నావేలుపు టావుతోనంత
కలగోపి కలకోరి కలరాకరాక
వెలయుఁ గాముక మృగవితతి సాధింప
వెడవిల్తుఁడను గంటవేఁటరిగూట
నిడిన దివియపోలెనినుఁ డస్తమించె
ఘన గోపికానురాగము శౌరిగప్పు
ననువునఁగెం జాయలడరె నభ్రమున
బిసరుహాక్షుని కీర్తి బీజసంతతుల          (2230)
నసులొత్తెననఁగ నక్షత్రంబులెసఁగె
నడపకమరుఁడు సౌమేఘవుల్పఱప
గుడివడు శితఖడ్గ కోదండమనఁగ
నలరువిల్తుని మామయగు చందమామ
కళలతోఁ బూర్వనగంబుమై నిలిచె
వెన్నెలచవి చూచి వెన్నెలపులుఁగు
లన్నులకొసఁగ వారదిమెచ్చి మెసఁగ
నుడురాజుఁ గాంచి పయోధిమిన్నంట
వడిఁబొంగెనోయని వఱపెఁ జంద్రికలు
పొదలఁ బూబొదల నింపుదలిర్పఁ జెలగి        (2240)
మొదలు తుమ్మెదలెల్ల మెఱసి నాదించెఁ
దమ్ములఁగలువ మొత్తమ్ముల షట్ప
దమ్ములవర మరందమ్ములందరుల
నమ్ముల వివిధ ఫేనమ్ములనొప్పు
యమునకూలమునఁ దియ్యమునఁ గోవిందుఁ
డమిత జగన్మోహనాకారుఁడగుచు
మోదించి కల్పకమూలేదుకాంత
వేదియైనత్కళా వేదియై నిలిచె
కనకంబునగుచాయ గనుపట్టుపట్టు
గొనబురంగుల చెఱంగులు మించఁగట్టి              (2250)
లలితసౌరభ రసాలంబ రోలంబ
తిలకమై వైజయంతీధామమమర
వెడవిల్తువింటి క్రొవ్విరికల్వ తూపు
దొడగినఠేవఁ గస్తూరి నామమలరఁ
దారపంఙ్తుల వియత్తల మొప్పు కరణి
హారజాలముల బాహామధ్యమమర
సిరిపదాబ్జములకై చేరు భృంగంబు
వరుస వత్సంబు శ్రీవత్సంబుచెలగ
గగణకోణాంగణ కంజాతమిత్రు
పగిదివక్షము కౌస్తుభముతేటపడాఁగ            (2260)
వరసోమమణిలో సువర్ణ ఖండంబు
కరమొప్పుగతియెదఁగల పద్మమెఱయఁ
గనకాద్రికూట సంకాశ కిరీట
ఘనకాంతి దశదిశాంగణములు వొదువఁ
దళుకొత్తునిక్షు కోదండంబు దండంబు
జలజకాండ బుకాండిమునంకుశమ్ముఁ పాశమ్ముఁ
దరచక్రందివ్యసుందర గదాసూన
శరములు బాహుపాశములఁ గీల్కొలిపి
చరణంబుపైనొక్క చరణంబు నిలిపి
మరునినల్వడు భంగిమలఁగిఁ త్రిభంగి          (2270)
నంగీకరించి మోహన భావమొదవు
గాంగేయమురళిఁ జిక్కగమోవిఁ జేర్చి
వివరంబుగా వేణువివరంబులందు
సవరగావర కరశాఖలల్లార్చి
ఘన రత్న కంకణాంగణ కాంతి వదన
వనజాతమునకునివాళియై పరఁగఁ
దళుకుఁగల్వలదండదండ సంవ్యాంస
తలములఁ గుండలాంతముఁ గొంతరాయ
శీతాంశుమైతేట చిలుకుచునుండ
వాతెఱవంచి భ్రూవల్లి నిక్కించి                  (2280)

(సర్వేశ్వరుఁడు డేణునాదము సేయుట)

కారుక్రమ్మెడు సోఁగకఱివంకబొమల
యోరబిత్తరిచూడ్కి యొరపు మీఱంగ
మాయురేయన మంద్ర మధ్య తారములురూపించీ
నాయుతంబొనరించి యణకువమీఱ
రంగురక్తియు మధురములుట్టిపడఁగఁ
బొంగెడి రసముల పొలుపు దీపింప
వివిధంబులగు నేకవింశతి శ్రుతుల
జవకట్టినట్టియా సప్తస్వరముల
కులమేర్పరించి తద్గోపికాశ్రవణ
ములకలంకృతులుగా మొగినలంకృతులు              (2290)
రూపించి గ్రామగారోహావరోహ
నైపుణ్య వివిధవర్ణములు చూపుచును
సమ శుద్ధ సాళగ సంకీర్ణ గతులు
క్రమముననెడుట రాగములు నర్తింప
నాణెమైమిగుల విన్నాణమై యొప్ప
వేణునాదంబు గావించెనవ్వేళ
గానంబు విమలంబు గానంబు సేయఁ
దానంబు లమృతసంతానంబులొసఁగ
జగతి బర్వినపూరి సగమేని మేసి
మొగి మృగంబులు మొగంబులు మీఁదికెత్తి          (2300)
యరగన్ను లిడిమేఁతలాత్మలో మఱచి
సురభులు మోదించి చూడంగఁదొడఁగె
సురగనాథుఁడు చొక్కుచుండె నీరసపుఁ
దరువులిగిర్చె శిలాతలములు గరఁగె
రాగ మోహన మంత్ర రాజంబు సకల
భోగికన్యల నాగభోగికన్నెకల
నరిదినాకర్షించి హర్షింపఁ జేసి
నరనాథభువన మంతయుఁ జొక్కఁ జేసి
భువనమోహన రసస్ఫూర్తిచే సకల
భువనముల్మఱపును బొందుటే మరుదు                 (2310)
హరియుఁ దన్మయుఁ డయ్యెనయ్యెడ నాధ
గరిమ యేమని చెప్పఁగా వచ్చునంత
నందనందను వేణునాదేందు కాంతి
నందితానంద బృంద మరంద హృదయ
కుముదలై సమదలై గోపికామణులు
రమణుల మించి శ్రీరమణుఁ గామించి
కుచములు గేటాడ గొనబులూటాడఁ
గచములల్లాడ ముంగఱలు మల్లాడ
నడవడి కడఁకనెన్నడుములు వడఁకఁ
గడుప్రేమ మొదవుల వేగనయముల్వదలఁ            (2320)
బయ్యెదల్ జాఱఁ బై పై ముద్దుగాఱ
నెయ్యముల్ బెఱయనెంతే సొంపుమెఱయఁ
జనుదెంచి జలజాస్త్ర జలజాస్త్రుఁడైన
వనజాక్షుఁ గదియ శ్రీవరుఁడువారలకు
సమధిక సుమజల క్షాళిత మదన
సుమబాణములవాఁడి సోఁకనిట్లనియె
తొడిఁ బడనిట్లు వత్తురెవనంబులకు
నడురేయి మీరలెన్నఁడు రేయివగలుఁ
బతులు మాటకుమాఱు పలుకనివారు
సుతుల నాయకుల వస్తులాడించి పొంచి              (2330)
పరునన్నుఁ గామింపఁ బాడియెయనుడుఁ
బరుఁడవేయల పరాత్పరుఁడ వేయనుచుఁ
దరుచుగా గోపికల్ తరువులు వెట్ట
నొఱపుఁ దొంగలిఱెప్ప లొకయింతవంచి
లలిత చంపక ముకుళములోను వాయు
వొలయు చందమున నిట్టూర్పులు నిగుడ
వరకూల్మపోతముల్వసుధ నటించు
సరవిఁబాదముల భూస్తలము వ్రాయుచును
హరినీలముల కాంతులలరుముత్యములు
గరిమఁదజ్జల భాస్పకణములు దొరుఁగ         (2340)
మిసిమి బింబఫలంబు మెసఁగు కీరములు
కసరుచందమున గద్గద నాదమెసఁగఁ
వేఁడివాడిఁయు నొల్కు వెడఁబల్కు మతులఁ
దాఁడి పాఱఁగనాడఁగా నీకుఁ దగునె
తలఁపులో నెపుడు మాధవుఁడు మాధవుఁడ
తలఁపమన్యులమని తలపోయుమమ్మ
చయ్యన మగుడంగఁ జనుమని పల్క
నయ్యయోయెట్లు నోరాడెరా నీకుఁ
బతులను మీఱఁ బాపంబంటి వఖిల
వతి నిన్నుఁ జేరుటే పరమధర్మంబు            (2350)
ముక్కుమో మెఱుఁగకమో మోటపడక
మొక్కవీఁడను చందమున విడనాడఁ
బాడియేలేకొక్క పదముపదంబు
లోడవుమగిడియే మరిగెదమన్న
నధరకోమల పల్లవాలోల శీత
మధురామృతంబుచే మదనార్చినార్చి
ప్రాణేశ దయఁ జూడు పదరితివేని
ప్రాణముల్నీకు నొప్పన సేతుమింక
నజుఁడు గాయజుఁడు రుద్రాదిదేవతల
భజియింపఁ గోరునపాంగ చంద్రికల          (2360)
సిరి తులసీదేవి చేరియెల్లపుడు
శరణొందు నీపదాబ్జములె కొల్చెదము
నెఱయంగఁ గామించెనే నెమ్మినమ్మి
మఱచితి మిదెనేఁడు మాయిండ్ల పనులు
వలపించి పిమ్మట వావిగాదనుట
పొలుచునే నీయట్టి పురుషోత్తమునకుఁ
దొలఁగ ద్రోచినఁ బోము తుదినింకతమడు
తలలకు నీడు పాదములకులంకె
యేలరా కృష్ణ మమ్మేలరాచలము
చాలురా నీకును జాలురా యిదియె                      (2370)
కలిమిపూఁబోణి చన్గవ గోరిమారు
యలుగుల పాలుసే యంగఁ జూచెదవొ
సతత శిలీముఖోజ్జ్వ లితంబులైన
యతను పాశములకు నప్పగించెదవొ
వలరాజు పట్టంపు వాజులనొప్పు
డెలయించు కెమ్మోవి నిచ్చెదొవేగ
చలమున నీరీవి సారెకుమమ్ము
నెలయించి మరుబారికిచ్చెదో చెపుమ
అకట నిన్నననేల హరియేము వచ్చు
సకిన పంతమున నిచ్చకు రాముగాక               (2380)
యెట్టైన నీకింత యెచ్చైన పనికి
మిట్టిమీనంబవై మెఱయుదువచట
వలసియెల్లమి గాక వలసియిండినను
దలకొని కొండైనఁ దలకెత్తుకొందు
పొరబొచ్చములుగాక పొసగునందులకు
దరమిడి పాతాళ దరియైనఁజొత్తు
ఇతవుగా మిదిగాక హితకృత్యములకు
నతులిత లోహంబునన భేదింతు
కపటంబుగాకిటఁ గాకుండెనేని
యిపుడ ఈ లోకంబులెల్లఁ జేకొందు                 (2390)
చిట్తకంబులుగాక చింతనించినను
బట్టబద్ధులనైనఁ బారవట్టెదవు
వేసాలుగాక నీవేనేయనున్న
నాసముద్రములైన నడ్డకట్టెదవు
తలఁగాకిట్టె తలఁచితివేని
గలయంగనేటి వంకలు దిద్దఁగలవు
బ్రమయించెదవుగాక పాటించితేని
కమలజాండములు ప్రక్కనెయడంచెదవు
వినరోరి వీనుల విందుగాఁ బెక్కు
లననేల యింక నీవగుటమేమగుట                 (2400)

(ఇంకా ఉంది ......)

Tuesday, February 9, 2016

అష్టమహిషీకల్యాణము -7


ద్వితీయాశ్వాసము
(శ్రీదేవి మహిమవర్ణన)

భువనైకమాత యంభోరాశిజాత
కువలయదళనేత్ర కోమలగాత్ర
జలజలోచనురాణి జలజాంకపాణి
యలకనిర్జితభృంగ యలమేలుమంగ
యవధరింపుము దేవి యమ్మహామౌని
కువలయేశుఁడువల్కెఁ గువలయేశ్వరుని
జితకామపాలు నాశ్రితకామపాలు                  (1560)
హతదైత్యభూపాలు నాకామపాలు
నింటిలోనునిచివేయింటిలోనేర్చి
దంటలౌ గోపాల తనయులఁ గూడీ
గోపచిహ్నములఁ గైగొన్నగోపాలు
గోపాలనముసేయుఁ గోరిదైత్యారి
భవనుతపదనీర భవయైన విజిత
భవయైన రవితనూభవఁ జేరియపుడూ
కనుపట్టివెన్ను చెంగటి నీలవేణి
యనఁటికెమ్మొగిమీఁది యలిపంఙ్తిదెగడు
మొగులులోపలిమించు మురువున గళము             (1570)
దగిలినపికిలి పూదండచూపట్టఁ
బాటల తిలక చంపక తరుచ్ఛాయఁ
బాటలనాటలఁ బరుఢలించుచును
భండనగజదైత్య భండనోద్దండ
చండ తాండవ లసచ్ఛండికా ధవుని
దండినభ్రమున మార్తాండ మండలము
మండుచుండెడు నిండుమండువేసవిని
పసియెల్లమిసిమిమై పసగలసవు
మెసవిమూతులుడప్పి మీదికెత్తుచును
జలశాయి జయకేతు చయములఁబోలు         (1580)
గళకంబళంబులా కంపంబునొంద
సురనదీ శీకర స్ఫురదీశజటల
గరిమలకడవగొంగడి దండలమరఁ
గనుపట్టునెఱమంటి కట్టులతోడఁ
గొనకొమ్ముతుదనారకుంచెలల్లాడ
సెలవులనిడిన పచ్చికలు చలింపఁ
బలుమఱునదరివెంబడియున్నపసులఁ
దిరిగి చూచుచుఁ బంచతిలితోఁకలెత్తి
పరువడిఁగెరలి హంబానినాదములఁ
గాళియ భుజగాస్య గహ్వరోదగ్ర           (1590)
హాలాహలాభీలమగునొకమడువుఁ
గనిపోయి యాయుదకముద్రావఁ గోప
జనమునా జనమునావను గ్రోవిక్రొవ్వి
విపులాతలేశయా వ్రేకుఱ్ఱలావు
లపుడు మూర్ఛలనొంది నరసియందంద
హరియు నాత్మీయేక్షణామృతదృష్టిఁ
గురియించి గోగోపకులమూర్ఛఁ దెలిసి
భోగినేననియెమ్మఁ బొరలినతనడు
భోగమంతయిఁ బొట్టుపొరలుగావింతు
దట్టించికినిసినతనతలగొట్టి            (1600)
పుట్టపైఁ బెట్టింతు భువియెల్ల నెఱుఁగఁ
గాలూఁద కుండంగఁ గదియు కాళికిని
నాలుకల్ గ్రోయింతు ననుడాసెనేని
యేబొక్కసొచ్చిన నెందుడాఁగినేని
నాబలస్ఫూర్తినెంతయుగెల్ తుననుచు
హరి నీలనాళాగ్ర హైమ సంఫుల్ల
సరసిజంబున జటాసహితాస్యమమర
దట్టమైకెంగేల దట్టిబిగించి
గట్టిగాఁ గట్టియగ్గలికమీఱంగ
నలవిమీఱుచుఁ జెంతనలరు సత్కుసుమ          (1610)
ఫలకదంబముఁ గదంబముఁ గాంచియెక్కి
వడినార్చి సప్తార్చి వడువునఁజేర్చి
మడువునెన్నడుమ సంభ్రమము దీపింప
నభమునకెగసి పంతముపచారించి
గుభులు గుభుల్లున గుప్పించి దుముకెఁ
గాలాహియల చుధాకలశంబుఁ జుట్టు
లీలనాచక్రిఁ గాళీయచక్రిపొదువ
గొబ్బుననిక్కి మార్కొని భుజద్వయము
నుబ్బించియార్చుచు నుబ్బియాగబ్బి
పటుతమః పటలంబుఁ బాపిన సూర్యు           (1620)
ఘటనఁ దద్భోగిభోగమువిడఁ దన్ని
సరసతర విభవాంజన వేణివేణిఁ
గరమునఁబట్టిన గతివానిఁ బట్టి
ఫణిరాజుపైఁ గూర్మపతినిల్చెననఁగ
ఫణిశాయిపదము పత్ఫణవీధిమెట్టి
వాలంబు బాలశైవాలంబు దిగుచు
లీలఁగెంగేలఁ గీలించి తూలించి
చరణపద్మము పరసాధనంబైన
గరుడోరుపక్షంబు గరిమమైసోఁక
బక శుక చక్రశాబక పికధ్వనుల          (1630)
ప్రకటనర్తక తాళపద్ధతుల్ గాఁగ
సంచదాసంచీర చంచరీకముల
యంచితరవముగా నాళియైపరఁగఁ
పటలిభవత్స్వేదపక్షిపక్షాగ్ర
రటనముల్పటుహ సంగ్రామముల్గాఁగ
విషపావకావృత విపులాంతరిక్ష
కషణఫణాళి రంగస్థలిగాఁగఁ
జందపద్ధతి భోగసత్వంబు చెదరఁ
జండమరీచి చంచత్కుండలములు
మండితనిజ గండమండలీ యుగళిఁ          (1640)
దాండవం బాడంగఁ దాందవం బాడి
యుడిపంఙ్తి దివినుండి యొరఁగిన రీతిఁ
బడగలమణులెల్లఁ బండ్లూడిరాల
డిల్లసొంపరితల్లడిల్ల భోగంబు
గుల్లలతిత్తియై కుల్లబింకంబు
పెంచి గుప్పించి గుప్పించి నొప్పించి
డంచియడంచి వాటముగ గాటముగఁ
బట్టిగిట్టియుఁ జలపట్టిమైపట్టి
కొట్టివాలంబు మార్కొని చుట్టిపట్టి
దట్టించి గట్టించి దర్పంబు బలము         (1650)
వట్టించి రక్తంబువాఁతఁ దొట్టించి
వికవికనవ్వెడు వేళనవ్వేళఁ
బికవాణులరుదంది భీతిచేగుంది
జిగిపయ్యెదలనెడసిన చన్నుఁగవ్వలు
మొగులుమూయని శైలముల పెంపుచూప
సంగపంగి క్రేగాలిఁ జలియించుతేఁటి
గుంపులగతిఁ గప్పక్రొమ్ముళ్ళువీడ
జలములఁదోఁచిన జలజపత్రముల
చెలువున భాష్పముల్ చిలుకు నేత్రముల
గనలెడు రాహువు గళము సొత్తెంచు           (1660)
వనజారి గతినొప్పువాడుమోములను
స్రుక్కుచువచ్చి యశ్రువులులోలోనె
గ్రక్కుచుఁగరములు గూర్చిమ్రొక్కుచును
వసుదేదేవపుత్త్రయో వసుధాకళత్ర
వసురాజమిత్ర సర్వసురాధిపత్ర
పతిభిక్షయోసఁగు శ్రీపతి దుష్టభోగి
పతి నీకుఁ బ్రతియె యప్రతిమానమూర్తి
కరుణాసముద్రనికరమైన గరము
కరముపాములకవకల్పించి తనుచుఁ
బన్నిన దైన్యమేర్పడఁ జేయినట్టి          (1670)
సన్నతుల్మెచ్చునాసన్నుతుల్ సేయ
భోగీంద్రవరభోగ భోగి యానాగ
నాగయానలఁ గరుణాదృష్టిఁ జూచి
దాలినగాళుతుఁ గాళిందిలోని
లోయంబు విషములతో యంబులయ్యె
నీయంబులిట మదీయేక్షణఘటన
నమృతరూపములయ్యెనరుగుమువేగ
రమణ నదీద్వీపవర్యమునకు నీవు
మస్తంబుమీఁద సమస్తంబునెఱుఁగ          (1680)
శస్తంబులైన మచ్చరణచిహ్నంబు
లున్నవి నీవెండునున్న విరోధి
పన్నగాంతకుచేత భయమింతలేదు
అనునఁ గాళియభోగి యాభోగిశయను
వినుతించి వరవస్తు వితతిఁ బూజించి
చనియెనక్కొలను రాక్షసవైరి వెడలి
తనవారి తనమునఁదనవారిఁ జేసి
యానందితాత్ముఁడై యానందముఖ్యు
లానందమునుజెందనా మందకరిగె
మఱునాఁడు హరిబలల్ ల్మఱునాడుదెలుపు         (1690)
నెఱయుసొంపులఁదాపనీనదిఁ జేరి
యుద్దించి గద్దించి యొడఁబడిపడుచు
లుద్దులైరాఁగఁ బెన్నుద్దులైతాము
నొక్కఁడొక్కని గెల్చి యొక్కనిపైనొకని
నెక్కించుకొని చలంచెక్కించికొనఁగ
దామోదరుఁడు హసోద్దాము శ్రీరాముఁ
దామ్రోవరాముఁడత్తఱిఁ దరిద్రొక్కి
బాలుఁడై కపటగోపాలుఁడై యున్న
లాలితోపాయుఁ బ్రలంబదైతేయు
పైపైచలంబెక్కి పైయెక్కికొన్న               (1700)
కోపంబుతోడ నక్కుటిల దానవుఁడు
వనములఁ జటుల దావనములఁదిరిగి
ఘనవాయు వేగంబు గడచి పోవుచును
జండీరమణి జటాసమజ డిండీర
భండీరవట సమీపమునకేతెంచి
మానవరూపంబు మానివే వేగ
దానవరూపంబుఁ దాల్చిన బలుఁడు
తెగువమై దృష్టి సంధించివేవేగఁ
బగతుమస్తములై చెఁ బఱియలై పోవ
హారవంబుననీల్గి యదివ్రాలనమ్మ              (1710)
హారవంబుననద్రులదరె నెంతయును
రాముండు లోకాభిరాముండు హేమ
దాముండు హరియుమందకునేగెనంత
కనలిదిక్పతులు రాక్షసులపై వెడలి
యనిఁజిమ్ముకిరు సులోయననటించుచును
నెఱివైనకలిత వర్ణింపనందెసఁగు
మెఱుపుల చందాన మెఱపులు పొదలె
నీలవర్ణుని మూర్తి నిఖిలంబుగప్పు
పొలికెదట్టమై మొదలె మేఘములు
సరసతల్ కలి మానసంబునజిందు             (1720)
సరవినంచలు మానసంబునఁజిందు
సరవినంచలుమాన సంబునఁజిందు
సరవినంచలుమాన సంబునఁజేరె
బరపశ్చిమాంగన వరుణమైవైచు
వరుణమాలికఁబోలె వజ్రధర్మంబు
ఉడుపంఙ్తి కంసవధోత్పాతంబునకు
వడినట్లువడగండ్లు వడియెనల్గడలఁ
గడలిపైఁ బొరలెడుకరడులోయనఁగ
నుడువీధి బకపంఙ్తులురుగతి నడచెఁ
గలిగిన పక్షిసంఘములతోనెల్లఁ
దలయెత్తిచూచె చాతకనికాయంబు                  (1730)
తిరుపు గట్టెడు సురస్త్రీలకాశియల
మురువున సితికంఠములుపురుల్విచ్చె
నలసస్యగర్భయౌనచలపాలిండ్ల
చెలువున నీలాగ్ర శిఖరులు వెలసెఁ
గాలాభ్ర భూతముల్ కళపెళనార్చు
పోలికె గర్జితంబులుమింటఁ బొదలెఁ
బొలుపునవెల్లువల్ పొదలెనంతటను
ఒలసి కుంభద్రోణ పాతంబుగాఁగఁ
గారుక్రమ్ముచు నేర్లు కాలువల్బెఱయ
ధారాధరోధార ధారలు నిగిడె              (1740)
నిలకునుమింటికి నేకసూత్రములు
గలిగినట్టుండెఁ దద్ఘనధారలపుడు
జలజాస్త్రహత కామిజన మాంసఖండ
కులములోయననింద్రగోపంబులమరె
ధారుణీ కుచహార తతులీఁ యనంగఁ
జారుశైలాగ్ర నిర్ఘురములింపొందెఁ
బచ్చ సూర్యపుటంబు పగిదినల్దెసలఁ
బచ్చికల్మొలచి చూపట్టెనంతటను
గాలతోయములోని కరపుమీలకును
గాలంబుగతి శరత్కాలమేతేరఁ            (1750)
గమలాకరంబులు కడుతేటలయ్యెఁ
గమలాకరశ్రీలు కడువిస్తరించె
రసములవింత సారసపునారనము
పొసగించి విరహులఁ బొంచె మన్మథుఁడు
విరిసె దిక్తటులకావిరివిరివొదలె
సరస వాసనలతోఁ జల్లనైయలరెఁ
గాముల హృత్సంగములరాదిగిచె
వామాక్షి వాగురువ్రాతంబులంత
మురవైరి హరి జగన్మోహనాకారు
సిరికూర్మిమగని వీక్షించి యాదేవు         (1760)
వికసిత నయనారవిందంబులకును
జగచకల్గల చూపుచందమ్ములకును
దిలకంబుమైనెఱితేఁటి మూఁకలకు
మొలక నవ్వులతేనెముసురుజోకలకు
మకరకుండల కాంతి మలయుచెక్కులకు
సుకుమారలోలల సొలయుటక్కులకుఁ
దనరెడుకొప్పుపూదండ చుట్టులకు
గొనబులు పేటాడు కొసరుతిట్టులకు
సంపంగి భంగింపఁ జాలునాసకును
సొంపులుమీఱంగఁ జూపునాసకును                 (1770)
బలుచనియధర బింబఫలంబునకునుఁ
బొలుపైనసోయ గంబుగళంబునకును
జొక్కి గోపికలెల్ల సూనాస్త్రుబారిఁ
జిక్కి కృష్ణుని వలఁజిక్కిమైమఱచి
యేనోమునోమంగనితనిఁ జూచితిమి
మేనోమునోమినామితని కూటమికి
ననుచుదెందంవుల నంతనంతకుఁ బ్రేమ
నినుపులైదైవాఱి నీరధుల్గాఁగఁ
గిరుసువంకలయొప్పు గిరికొన్నకప్పు
నెరుల సోగలజడల్ నిగనిగమెరువ             (1780)
బిగువఁ జన్నులజిగిబిగి శౌరిఁ జూచి
తెగడిపయ్యెదలింత తెల్లగిల్లంగ
బదపడిచాఁచిన బాహుమూలముల
నుదిరి బంగారుపొడియురిదిమైరాలఁ
గుంగుమ మర్జునాంకురములయడవి
సంకుమందంబు పచ్చని యక్షతములు
పట్టిచూపట్టిడాఁ పలికేలమడుఁగు
పుట్టమువ్విన్నాణముగఁ గీలుకొలిపి
సమధూపరాగ కింజల్క గంధాక్ష
తములు మాధవునకీఁ దలపోయుదాని      (1790)
నిండి జక్కలతోడి నింగియుఁబోలెఁ
బుండరీకములచేఁ బొలుపొందువాని
సంగీత పంచమ షడ్జముల్మూర్తు
లంగీకరించెనోయనఁ జెంతఁబల్కు
కలకంఠముల భుజంగగ్రాస నిరత
కలకంటములతోడఁ గడునొప్పుదాని
గమలభూషణపేటి కలలక్షముద్ర
లమరించెననఁ గోరకాళులదాని
గడకాటుకలతోడి ఖచరకన్యకల
బెడఁగుఁగన్నులు ప్రతిబింబించెననఁగ       (1800)
జలములతో వికాసమునొందిమిగుల
వలనొప్పునల్లగల్వల నొప్పుదాని
నురుతర వనరాశి యుప్పనిరోసి
వరతోయ మాననీ వలికేగుదెంచు
కాలాభ్రములఁబోలెఁ గమలమంజరులఁ
గ్రోలెడు భృంగ చక్రంబులదానిఁ
గాషాయ జపమాలికలు దాల్చి విగత
రోషులౌ సంయమీంద్రులు నాఁగనొప్పు
బిసముల నూలితోఁ బెడఁ బాయకుండఁ
గసికాటుకాటుల ఖండించుకొనుచు               (1810)
వికచారుణాజ్జాత వీధులనున్న
ఒకములు హంసశాబకములు గలిగి
యానందనందను నాత్మలోఁదలఁప
నానందభాష్పంబు లలరి నేత్రములఁ
గ్రమ్మెనోయనఁగాలిఁ గదలింపఁదొలఁకు
తమ్ముల వరమరందమ్ములదాని
దమ్మురేయెడనిన తమకంబుతోడ
నమ్మునిపతులకు నమికల్వుట్ట
వనదేవతలు మెచ్చ వనములఁ గ్రుంకి
కనలిమడ్డులు నారికలనెత్తెననఁగఁ        (1820)
దుండాంతరములఁ జెఁదివల బిట్టగల
ఖండించు వరచక్రకాంతులదాని
ఘనమౌనివర్య హృత్కమలంబులందు
ఘననీలవర్ణుండు గనుపట్టుపగిడిఁ
దేనెద్రావిన జొక్కుదేరకతావు
లానెడు కమలభృంగాళులదాని
యమున శ్రీహరిసహాయమున నాభార
కుముదలోచనలు వేకువజాము చేరి
హరిభక్తియుక్తులై యనిశంబునిట్లు
హరిభర్తయగుఁగాక యనుచునోముచున          (1830)
గొలకులనీరాడఁ గోరిపుట్టములు
కొలఁకులనిడి జలక్రీడఁ గావింప
సలలాత్మమానససంచారి శౌరి
యొకనాఁడు తనుఁ గోరియున్నట్టివారి
నతులితభక్తినింతంతని యాత్మ
మితియెన్నరాక కామితఫలప్రదుఁడు
వారిచెంగటనుండువారి పుట్టములు
చేరి జేకొని చేర్వఁ జలఁగు నీపంబు
కొమ్మలపైనెక్కి కొనియాడు గొల్ల
కొమ్మలఁదనువేగఁ గూడరమ్మనిన           (1840)
నాడబోయిన తీర్థమదియెదురైన
జాడఁగృష్ణునిగని సంతసించుచును
గౌనులువంచి యంగములెల్లముంచి
నానవాటించిలే నగవులతోడ
నుడురాజు మరలిన యుదయాస్తగిరుల
నడుమఁ జీకటి పర్వునటన సిగ్గులను
బెడమరలఁగఁ జడల్ బిగిజన్నుఁగవల
నడుమఁ జూపట్ట నంద~ౠనూరకుండ
వారిలోదళు కొత్తువారిలో నొక్క
వారిజగంధియో వారిజనాభ                  (1850)
యోదకమగవారికి విదలుజలము
లాడంగ సరసంబు లాడంగఁ దగునె
మానమేరికి సమానంబు తమదు
మానంబుగాచి మామణుఁ గుఁబుట్టము
సాధింప కింకఁ బ్రసాదింపుమయ్య
కాదన్ననిను మీఱఁ గలమెయేమనిన
చిఱునవ్వుకెంజాయ చిలుకిఁకెమ్మోవి
నెఱయంగఁ గృష్ణుడా నెలతఁ జూచి
మీరలు నామాట మీఱకవచ్చి
చీరలు గొనుఁడు నాచేతివియనుడుఁ            (1860)
జలిక్జొప్పులను గప్పుచన్నులతోడ
మొలబి సములబాగు మురిపెంబుదొలఁక
జలజాస్త్రుడలుగులు జళిపించుకరణి
వలికిమేనులొ కింతవణఁకుచునుండ
స్మరగేహ పల్లవాచత్తోరణముల
కరణి సిగ్గులపట్ల కరములింపొంద
మొగులువాసినమించు మొలకలో జోలు
దిగిచిన సూనాస్త్రుతేజులోయనఁగఁ
గవిసెన వెడలించు కన్నాళ్ళొయనఁగఁ
గవగూడియమున దిగ్గనవెలువడుచు            (1870)
వడిఁదెనెగురియు కల్వలదండలనఁగ
వడియుతోయములతో వలనొప్పు జడలు
చూడఁ జొప్పడఁగవా సులతోఁడఁ గూడ
నాడిరిచీర లిమ్మనుచు నావేళ
నాపాదపముదిగి హరియు గోపికల
యాపాసమస్తంబు లోసి నవ్వుచును
గరము కాంతాంబరాకరము తచ్ఛాఖ
కరమువేడుకఁ బట్టి క్రమ్మఱఁబల్కెఁ
జేలలు సడలించి చిరతరపుణ్య
శీలలు జలకేళి సేయంగఁదగునె              (1880)
ప్రణతులొనర్పుఁడు పద్మకళత్ర
మణికి యాదవశిరోమణికి మీకిట్టి
యనుపమ దోషంబులడఁగుఁదమంబు
నినుఁగాంచి తొలఁగి పోయినమాడ్కిననిన
శైల నిర్ఝరనీర సంగతాఖండ
బాలశైలవలలతా పంక్తులయొప్పు
దొలఁకంగుబ్బలొకింత దొలఁకఁదన్మధ్య
జలసిక్తరోమాళి సరణులేర్పడఁగ
బొటవ్రేళ్ళు నిక్కనొప్పగనొంటికేలు
నిటలంబునందుఁ బూనికఁ జేర్చి మ్రొక్కె       (1890)
గేలికైననునొంటి కేలి యీమ్రొక్కు
లేల నియ్యవిశాస్త్ర హితములేతలఁపఁ
గరయుగంబుల మ్రొక్కఁగా నొప్పునిప్పు
డరవిందలోచనుఁడనిన గోపికలు
మ్రొక్కఁబోయినవేల్పు ముందఱనిల్వఁ
జిక్కినియీవట్టి చింతవేలనుచు
ఫాలభాగంబులఁ బాణిపద్మములు
గీలించితను నాత్మగీలింప శోఉరి
చుఱునగవి గురించి చిగురాకుమోవి
నెఱయఁబుట్టంబులా నెలఁతలకొసఁగి       (1900)
కంటిఁజొప్పడని మీఘసమైన కోర్కి
గంటిఁ జేకొంటి ముంగలి రాత్రియట్లు
భావింతుననుచునప్పుడఁ తులఁబనిచె
బృందారకార్చిత పూజుండు నగుచు
నందనందనుఁడు మందలవారితోడ
యముననయ్యమున నొయ్యనఁ జేర్చియచట
నమలసైకతముల నాటలాడంగఁ
బటుతరాతపమున బడలి గోపికలు
కటకటాకృష్ణ్యాఁ కటనిట నొవ్వఁ
గనుఁగొని మాకొక్క గతిచెప్ప మిప్పు            (1910)
డనవిని శౌరి చయ్యనవారిఁ బిలిచి
కులశీలయుత విప్రకుల జాతలగుచు
మెలఁగు మద్భక్తి గామినులుఁ గామినుల
రాగంబులోనాంగి రసమను నొక్క
యాగంబు ప్రాణేశులాచరింపంగ
నున్నారు బలకృష్ణులున్నారటాన్న
నన్నంబు వెట్టెదరని పంపనరిగి
జన్నంబు గావించు జనుల వీక్షించి
యన్నంబు వేఁడిన నగ్నులైవారు
పరిహరించిన శౌరి పలుకులుదలఁచి         (1920)

(ఇంకాఉంది )