(భగవన్మహిమానువర్ణన)
ఘనశంఖచక్రసంకలితమౌదాని
దివియనికొనియాడ ద్విజరాజహంస
జవసంచరణముల సమకూరుదాని
నకలంకమగు కుబేరవాసమనఁగ
మకరకచ్ఛపవరమహితమౌదాని
గడలి మీఁగడల నల్గడలను బాల
కడలితాకుల వెన్న గరికట్టుదాణి
చెలువుమై యేటినెచ్చెలువలనవ్వు
పొలపున డిండీరములనొప్పుదాని
గ్రమమునఁజూచిడగ్గఱి సతోషాస్య (270)
కమలజులై నట్టి కమలజముఖులు
సకలయోగీంద్ర హృత్సత్త్వగుణంబు
లోకరూపమై యిటనొప్పెనోయనఁగ
నమృతంబై గట్టినట్టిమీఁ<గడయొ
కొమరారువెన్నెలకుప్పయోయనఁగ
మున్నీరు తరుమగమొగియైనవెన్న
తిన్నెయోయన నొప్పుతెలిదీవినడుమ
వనజోదరుని కీర్తివల్లివేవగల
ననలొత్తెనననొప్పు నాగేంద్రుమీఁదఁ
బటికపుఁ బెట్టెలోపలి నీలమనఁగఁ (280)
బటుఫణాధరసీమ భాసిల్లువాని
వరనికషాంతరోజ్జ్వలహేమరేఖ
సరవినిందిరయురః స్థలినొప్పువాని
దెలినీటిపుట్టువు తేటయైకరుణ
లొలుకుచుండెడు నేత్రయుగళంబువాని
గమలాప్తవిధుమధ్యగగనమోయనఁగ
గమనీయధరచక్ర ఘనమూర్తివాని
ఏటిజోటికిఁ బుట్టినిండ్లెరాతిఁ
బోటిఁజేసిన పదములనొప్పువాని
శ్రుతిలక్ష్మియూఁగు భాసురపుటుయ్యాల (290)
గతిఁగుండములచే గరమొప్పువాని
గందువాసిన చంద్రగళలనొప్పు
నిందిరసవతులయెడనొప్పువాని
నహిరాజగరుడసేనాధిపముఖ్య
బహునిత్యముక్తులఁ బాలించువాని
గనిపుటీకృతకరకమలముల్ ఫాల
వనజారిరేఖల వసియింపఁజేసి
జితదైత్యరాజయాశ్రితకల్పభూజ
క్షితిరమాధారరక్షితమౌనివార
ప్రోవులుగాజపంబులు దపంబులును (300)
గావించి నినుమునుల్గాంచుటయరుదు
అట్టే నీదర్శనం బబ్బెమాపట్టు
పట్టులన్నియునుశోభనమయ్యెనయ్య
దాతవై మాతవై తాతవై మమ్ముఁ
బ్రోతువు నీవయెప్పుడు జగన్నాధ
అని వినుతించి సాష్టాంగంబు లెరఁగి
దనుజారి దనుజాంశ ధరులు భూవరులు
బసలులై జన్నము ల్సన్నముల్ సేయ
విభుదులకుడుపులు విడుపులై పోయె
నేవెరవునైన నిఁకదేవదేవ (310)
నీవ ద్ఫేవతల మన్నించి యీ వేల
నీజగతీభారమెడలించి కావు
మీజగతిని నిర్జరేంద్రులఁ బ్రోవు
మనుడుఁ బ్రసన్నాత్ముఁడై చెంతనున్న
వంధిమేఖలఁ జూచి వనధితల్పకుఁడు
వలవంతవలదు నీవంత యావంత
నిలువకుండఁగ ఫణినేతతో నేను
(కృష్ణావతార ప్రసంగ)
నసమానబలకృష్ణులనిఁబ్రభవించి
దుష్టశిక్షణమున దుష్టరక్షణము (320)
దేష్తసంపదయు నదృష్టసంపదయు
నొనరించి సంతోషమొనరింతు నీకు
ననుమానపడవలదణుమాన మధ్య
యని యానతిచ్చిన నవనియు నవని
తనమెల్లనుడిగి యెంతయు వేడ్కనరిగె
వేల్పుఁ బెద్దయు వేల్పు వేల్పున కెఱఁగి
వేల్పులతోఁ దొంటి వీడునకరిగె
రాజేంద్రయటభోజరాజేంద్రుఁడమర
రాజతుల్యుఁడు మధురాజనాధిపుఁడు
విగ్రహజితకామ విగ్రహుఁడనఘుఁ (330)
డుగ్రసేనుఁడు శాత్రవోగ్రసేనుండు
శూరపుత్రునకరి శూరుచైత్రునకును
ధీరవర్తికి వసుదేవభూపతికి
సావధానంబున నాత్మజ సకల
దేవకీర్తియైన దేవకీ కన్యఁ
(దేవకీపరిణయ కథ)
కరిహరులరణంబుగానిచ్చి పనుప
నారామతోఁ బుట్టువగు కంసుఁడింద్రు
తేరు సొంపులఁదేరు తేరుమీఁదటను
నావధూవరులతో నారూఢుఁడగుచు (340)
దేవతల్ సకల భూదేవ తల్పొగడఁ
బటహభేరితూర్య పటుతరనాద
పటలమెంతయు దిశాపటలంబు నిండ
నరుగుచో నశరీరినాకంసుఁ జేరి
యరుదైన నొక మాటయనియె నీనాతి
యెనిమిదవపట్టి యిలనిన్నుఁబట్టి
తునిమెడి ననబిట్టితోఁబుట్టుగిట్టి
యఱిముఱిపూఁదీవె యఱునవ్రాలు
కఱకునూరంచులకై దువవోలె
బెడిదంపుటడిదంబుఁ బిడికిటి బలిని (350)
మెడవ్రేయఁబూన యమ్మేదినీ విభుఁడు
భోజేంద్ర నీచేతఁ బొలియునీయబల
రాజేంద్ర సమశత్రు రాజేంద్రగణమె
బయలుమాటలు పాటిపాటించుటెల్ల
నయమౌనె కాకుండినను దీనివిడువు
మీతన్విబిడ్డలు నెల్ల నీచేతి
హేతిఘాతికినిత్తు నిటమీఁదననుచు
నొప్పంగజెప్పియా యొప్పులకుప్ప
దెప్పరంబుడిపి వాడినమోముతోడఁ
బులివాఁతబడి తప్పిపోవు చందమున (360)
బెలనాఁగతోఁదొంటియింటికేతెంచె
(కంసోపద్రవప్రస్తావ)
మంతుదౌ నొక సుకుమారుఁ గుమారుఁ
గనినం శౌరి యాగసుగందు నెత్తి
కొని కొని కంసుకువలయేంద్రునకు
నొసఁగ సత్యమునకునుబ్బి సంరుద్ద
వసుదేవుఁడంత నావసుదేవుఁ జూచి
యెనిమిదియవ పట్టియేకాక వీనిఁ
బనిలేనిపనిచంపఁ బనియేమి యనుచుఁ
గొమరునితో వీడుగొలిపిన మూర్తి (370)
రమణతోవిజితపారదుఁడు నారదుఁడు
చనుదెంచి హితవు పిసాళించి నవ్వి
తనవావి తనముచిందగఁ జెవిఁజేరి
సరసిజాక్షుఁడు నిన్నుఁ జంపని లింప
వరుతోయాదవాన్వయమునఁ బుట్టె
మంత్రంబుగాఁగ నిమంతంబు నమ్మి
మంత్రులు నీవుఁ నేమరకుండుఁడనుచు
నరిగెనమ్మౌని భోజావనీవిభుఁడు
పరవీరభీకరాంబకుని నబ్బకుని
విరధీకృతానేకవికటునాశకటు (380)
నురుకాంతిఁ నిర్జితాహారుఁ జాణూరు
వారిత గంధర్వవరమూరుఁ గూడి
పోరియాదవులతోఁ బోరి జయింపఁ
గొందరు కేకయకు కురుదేశములఁ
జిందరవందరై చెందిరంతటను
చెలియలిబావను జెరసాలఁ జాల
నలుకమై నిగళసంగతులఁ జేయించి
హరిమాయలొదువ నాకతని నేర్పఱుపఁ
దరముగాదనుచుఁ దత్తమునఁగినిసి
మోదంబుతోనటమును మున్నకన్న (390)
సోదరీసుతుల సూనోపమాకృతుల
నుర్వీశయార్వుర నుడిపి సుపర్వ
గర్వముల్గుదించు కడకమైనుండఁ
గడలేని నెవ్వగ గడలినీఁదుచును
బొడిబడియదుభోజ పుత్రిగర్భమున
నంత ననంతుననంతతేజాంశ
మెంతయు నానాఁటికెదుగుచునుండ
మాయానటుండైన మరుతండ్రియోగ
మాయనీక్షించి రమ్మని యని పిలిచి
దేవియా దేవకీదేవి యందలరు (400)
పావకాప్తాశనపతియంశమీవు
యందిమిక్కిలి భయమందికాననముఁ
జెందియుండెడి సందుశిఖరంబునందు
నున్నరోహిణియందు యునిచియావందు
నన్నుకన్నియవుగమ్మని వీడుకొలుపఁ
జనిమాయ శేషునియంశముఁ దనమాయ
కనుమాయ సేసి చుక్కల రాజునెడయు
రోహిణిగతిబొల్చు రోహిణియందు
సాహసవృత్తిమై సమకూరఁజేసి
సుదతీకదంబయశోదయశోద (410)
యుదరంబునందుఁ దానుండె నుండుటయు
ఆరీతి బంధువులాయింతి చూలు
కరగెనేయని కర కరఁబొక్కిరంత
ననుపమ లగ్నంబునందు సుతార
గనియె రోహిణీసుధాకరుఁగుమారుఁ
నలినాక్షు గంసపంసకుఁడుగాగల మాధవుండు
కంసానుజాగర్భగతుఁడయ్యె నంత
నవ్వులెంతయు మించెననఁగ
వెలఁదియైయొప్పె నవ్వెలఁదినెమ్మోము
కలువతూఁడులుదాఁకి కందినకోక (420)
ములముక్కులనఁ జన్నుమొనలఁగప్పొదవె
దివిఁ బాదుకొని నిల్చుతేఁటిచాలనఁగ
నవిరళరేఖగానారుచెన్నారుఁ
గమలేశవిముఖుడౌ కంసుని దోసి
యుమిసినరీతిఁ జిట్టుములుబెట్టయ్యె
హరికిఁగా పై చుట్టినట్టినాగేంద్ర
కరణి నొప్పుచునున్నకాంచియుబిగిసె
అంతరీకృత హరిణాంకబింబంబు
వింతయై యుదరంబు వెలసెనంతటను
చక్కనికర్ణభూషణ చకచకలు (430)
చెక్కులఁ జెక్కులఁ జికిలి గావింప
బంగారురెంటెంబుపై మిసమిసలు
నింగిమై మెఱపులనెఱిఁ జూపుచుండఁ
గనుపట్టు వనమాలికారుచుల్ గగన
ఘనచక్రకోదండ ఘనతవహింప
వరవీరరసరేఖ వడువననెదను
సిరియొప్పునాచెంత శ్రీవత్సమలర
నతులితశంఖచక్రాదిదివ్యాస్త్ర
యుత బాహుయుగయుగముతోఁ జెలఁగి
తొలిదెసఁగనుపట్టు తుహినాంశుపగిది (440)
నలరి దేవకియందు నతులలగ్నమున
(శ్రీకృష్ణావతారమాసాదిప్రశంస)
నావిర్భవించె శ్రీహరినడురేయి
ద్విజరాజవిష్ఫూర్తి దివిభువిఁదనర
నిజప్రతిబొరలెనెన్నెరి మౌనివరులు
సురలునుతింప నాసురులుగంపింప
విరులవానలజళ్లు విడువకకురిసె
నానకదుందుభి యాభోజసుతయు
ఘటితహస్తాబ్జసంఘటిత ఫాలేందు
నిటలువై వేడ్కలనిక్కి చొక్కుచును (450)
గమలాకళత్ర నక్తంచరజైత్ర
భ్రమరశోభనగాత్ర భక్తబ్జమిత్ర
ఘనతరదివ్యయాగముల యోగముల
నినుగానఁ గాలేరు నిర్జరులైన
ద్విజరాజు దినరాజు దిక్కోణవరులు
అజునికాయజుని సర్వాత్మజాలంబు
గన్ననీనిజమూర్తి గన్నమాకోర్కి
కన్ననెక్కువయేది కమలాక్షయన్న
మును మీరు వరతపంబుల చేసి చేసి
ననుఁబోలు సుతువేడి ననుమెచ్చియేను (460)
బరుఁడెవ్వఁడును బరాత్పరుఁడనే నాకుఁ
బరుడువేఁ డనియేనుపొడమితి మీకుఁ
బదరకుఁడికఁదుది పదముగాఁ గీర్తి
పదమును వైకుంఠపదము మీకిత్తు
సంతతపౌంశు నృశంసునాకంసు
నంతకుఁగూల్చెద ననుమానముడిగి
(భగవన్మాయావృత్తాంత)
నందుదేవికిఁబుట్టె నన్నుమీరటకుఁ
గొని పోయియునిచి యాకొమరితనెట్టి (470)
కొని వచ్చియిటనెలకొని యుండుఁడనుచు
నరబాలుఁదయ్యెనో నరపాలయంతఁ
గరములనాబాలుగైకొని శౌరి
తుష్టుఁడైనువస్తువుల వోకైక
దిష్టంబుగూర్చి యథేష్టంబుగాఁగ
విబుధులువొగడంగ విబుధులకిచ్చి
యబలనచ్చటనుంచి యటవోవఁదలఁచి
మురవైరిఁగని పాపముల వీడునట్లు
సరగుశృఖలల్ సడలుచువ్రేలఁ
దలవరుల్సంసారతమములో మునిఁగి
తెలియని గతినిద్రఁ దెలియకయుండ (480)
వాటంబులగుచు గవాటంబు వెల్లఁ
జోటిచ్చి తెరువులు చూపంగ వెడలి
హరియభ్రకరుల శంపాంకుశాహతుల
బెరయింప మొఱవిడుపేర్మినురుమగను
అసమమై కంసకృత్యముల భీభత్స
రసము లోకములసాంద్రతఁగప్పెననఁగఁ
గఱటిచేతల కంసు ఖలునకపకీర్తి
నెఱసెనోయననిరుల్ నెరసికార్కమ్మ
ననిమిషానందభాష్పంబు కణంబు
లనఁజిటి పొటి చింకులవనిపైరాల (490)
(వసుదేవభయ నివారణ)
పసురుమావులఱేని పగిది శేషుండు
బెడిదంబులగు శౌరి బిరుదముల్ దాల్చు
పడగలగతిఁ బొల్కుపడగలఁబొదువ
బిసనికాయమున గంభీరతోయమున
నసమానమైన యాయమున మార్గంబు
విడిచినఁ గడతెంచి వేవేఁ గొల్ల
విడిపట్టునడునందు విచుపట్టుసొచ్చి
నిదురించునందు మానిని సెజ్జఁబెట్టి
పదిలుఁడై నట్టి యాపఁడతు తుకపట్టిఁ (500)
జేకొనిహరిమాయజరసాలఁదిరుగఁ
జేకొని తొల్లింటి తెల్లింటిచెలువుననుండ
మాయపు బిడ్ద పల్మారువాపోవ
నాయెడదౌవారికావలిచేత
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment