తృతీయాశ్వాసము
(శ్రీదేవి మహిమవర్ణన)
ద్విపద
శ్రీకరవర్ణ యంచిత హేమవర్ణ
యాకీర్ణభుజజాల యనుపమ శీల
మునిలోకనుతలీల ముకురకపోల
యనఘామృతాపాంగ యలమేలుమంగ
యవధరింపుము దేవి యమ్మహామౌని (3310)
కువలయేశుఁడువల్కెఁ గువలయేశ్వరుని
నావార్తవిని వల్లవాంగనామణులు
భావశుగములు భావముల్ దూర
గణువింపరాని యంగజతాప మొదవ
గణములై గిరివనాంగణముల నిల్చి
హరివిలాసములు నొయ్యారిబాగులును
బరిరంభణములు చుంబన రసక్రియలు
సొలుపు చూపులు తలచుట్టు గన్నులును
గలికి పల్కులు ముద్దుగారెడి మోము
డాలుచెక్కులును బిడారువన్నియలు (3320)
నాలీలలును విన్నాణంపు నడలు
తలపోసి తలపోసి తలయూచి ప్రేమ
కులుకంగ లోలోన గుబ్బతిల్లుచును
కలువతూఁపులు కడుగా జాఱుజాలు
జలములోయన సకజ్జల భాష్పతతులు
యిఱిగుబ్బ పాలిండ్లనెదలఁ బయ్యెదల
నెఱయఁ గ్రొమ్ముళ్లూడ నిట్టూర్పులిడుచుఁ
చెక్కుటద్దములగైఁ జిగురాకుతెరలు
నెక్కొనఁజేర్చి యూనిన తమకమునఁ
గటకట బ్రహ్మకెక్కడి పాటి పాటి (3330)
ఘటియించెనేని యిక్కడ మమ్మునిట్టు
వాసుదేవునికేల వలవంగఁ జేసెఁ
జేసెఁ బోయెడబాయఁ జేయనేమిటికి
ఆయెఁబో శౌరి దానైననేమయ్యె
నాయెడఁదుగులైరి నమ్మినారనక
కనికరింపగ యిట్టి కట్టడిమరుని
కనలుతూఁపులకు నగ్గము సేతుననక
వొరినెకోడెను వారి వారలను
వారినిగూడ నెవ్వారి దూరుదము
అక్రూరుఁ డక్రూరుఁడని యదరంద (3340)
నక్రూరునేతి బీరనెడి చందమునఁ
జుట్టంబువలెనె కృష్ణునినే జయింపఁ
గట్టడి నరకిఁ డెక్కడినుంచె వచ్చె
హరిరే్పె హేమహర్మ్యముల భోజేంద్రు
పురము కామినులు కప్పురపు క్రొవ్విరులు
కనకలాజలు చల్లఁగా నుల్లసిల్లఁ
గనివారిగోరియిక్కడ నేలతలఁచు
మధువైరి యిదిగాక మధురలోఁ దరుణ
మధురాధరాధర మధురముల్గ్రోలి
మఱియున్నవేటికి మఱుగునేఱుపులఁ (3350)
గుఱువాడిననుకొన గోరుతాకులను
నయగారి మాటలనటన చూపులను
బ్రియముల నయముల బెల్లించి పొంచి
కాంతా నిశాకాంత కాంతసౌధములఁ
గాంతలేలాంతముల్గలుగంగఁ జూచి
లాలించి సకలకలలను మెప్పించి
తేలించి తక్కించి తిరుగఁ చొక్కించి
తనువింతరతుల చిత్తరమైన రతుల
నెనయవ్రేఁతల పొందులేలచింతించు
నాపొందుమఱువని యాపురికాంత (3360)
లాపద్మ నేత్రుఁబాయఁగ నోఁపరెపుడు
నటు కృష్ణుఁ గొనిపోకుమని ప్రణమిల్లి
కుటిల విచారున క్రూరువేఁడుదమొ
లోలోనవిరుల చాలుపుల వేలుపులఁ
జాలపూజింతమో శౌరి నిల్చుటకు
మన మందరము మన మందరోద్ధరుని
జననీక చరణకంజముల వ్రాలుదమొ
యనికామభీమ సౌమాంబకా హతులుఁ
దనువులు జర్ఝరింతంబులై జడియ
హరి పరాయత్త చిత్తాధీనలగుచుఁ (3370)
బరమ మౌనులు బోలె బాహ్యముల్మఱచి
జారుకొప్పులవెడఁ జాఱుపయ్యెదలఁ
దోరంపు తుదులందుఁ దోరఁగుకన్నీట
మాధవ ధవళాక్ష మధువైరి శౌరి
భూధవ శివవంద్య పుండరీకాక్ష
పరమేశ మునివేద్య భవరోగవైద్య
హరికృష్ణ మామొఱ లాలింపు మనుచు
నంతరంగార్తిచే నడగు గీతముల
నింతులెలుగెత్తి నెంతయు నేడ్చి
తలఁపులొందించు మాధవమూర్తి పూర్తి (3380)
తల పోసి యొకకొంత తాళిరంతటను
గరఁగుబంగరుగుండు గతిభానుఁ డుదయ
గిరినిల్వ నుచిత సత్క్రియలెల్లఁ దీర్చి
జననులువెట్టు బ్రసాదంబు బంధు
జనములు దాను భోజనము గావించి
లలిత భూషణాలంకృతుల్రామ
నీలవర్ణులు రోహిణీ యశోదలకు
మ్రొక్కినమస్త ముల్మూర్కొనియక్కు
నక్కుడాయించిముద్దాడి దీలించి
కడుమోహముల కజ్జముల్చెట్టి (3390)
తడుపులుగట్టి యిద్దఱియొడిఁబెట్టి
క్షేమంబుతోఁ బోయి క్షేమంబుతోడ
రామ కేశవ వేగ ...........
బదనంబుసిరికుంకి పట్టగుఁగావఁ
బుమున నీబంటు మంటిల్లు మెట్టి
తుదిలేని దయ బవిత్రుని జేయుమిపుడు
నను గృతార్థుని జేసి నావిన్నపంబు
మనవి చేకొనినన్ను మన్నింపుమనుచుఁ (3400)
బదములఁ బడిపాలుపడి వేఁడుకొనిన
మదనగురుండు సంభ్రమముననెత్తి
వింతయే నీవింత వేఁడనేమిటికిఁ
జింతింప నేలవచ్చిన పనిఁ దీర్చి
వచ్చెదనీవేమి వసుదేవుఁ డేమి
యిచ్చలోఁ దలపోయ కేఁగునీవనినఁ
బనివిని యెదనంచుఁ బ్రణతుఁడై యరిగి
కనికంసుతోఁ దదాగమనంబుఁ జెప్పి
సుజనులు వొగడ దుష్టులు కడుబెగడ
నిజవసతికిఁ గాందినీసుతుఁడరిగె (3410)
బల కేశవుల శత్రుబల హర విపుల
బలపరాక్రముల గోపకుల్గొలువ
నిరుపమోన్నత మణినికర సాలములఁ
దరణిసంగత మహోత్తాల సాలములఁ
నహిలోకమొరయు మహాపరిఘములను
బహు చంద్రకాంత శంభద్గోపురములఁ
జందకరాభ కాంచన కవాటముల .......
రమణ జలాముఖ రంధ్రకుట్టిమము
లమరఁజేకొని జంతలై దంతలగుచు
నుత్పలబాణ మంత్రోపదేశంబు (3420)
నుత్పలాక్షులకు నత్యున్నతి నొసఁగు
గతులకుఁ బరిపరి గతుల కాముకుల
మతులనీరుగఁ జేయు మదితనాదముల
ధళుకొత్తు పారావతముల మొత్తముల
సలలిత బహుకేళి శైలజాలముల
నవల మాణిక్య సౌధాంగనావికచ
కవభరంబులుగని ఘనలోయనుచు
నాకాలకంఠ చూడాగ్రముల్నిగుడఁ
గేకాధ్వనుల్జేయు కేకిబృందములఁ
గిసలియ మాలికాకీర్ణంబులగుచుఁ (3430)
బసిఁడి కుండలను దర్పణగణ స్ఫురణ
నుదుటపూఁబోణుల యూరుకాండములఁ
గదలికల్ పచరించు కదళికల్పొదలి
సంతత చిత్తస్రజముల సౌవృంత
కాంత పూఁగములఁ బూగముల పూగముల
పులుఁగు జవ్వాది గప్పురము గస్తూరి
కలయంబు వులుచల్ల కలయంబు పసలఁ
గమనీయ సూత్ర సంగతుల నారతులఁ
దముదాయె యిచ్చు రత్నంబు బొమ్మలును
సలలిత హేమ తేజముల లాజముల (3440)
విలసిల్లుచుండెడి విపణిమార్గముల
నజపురందరుల యక్షాధీశుఁ దెగడు
ద్విజుల భూభుజుల సందీపితోరుజుల
సమధి కాలంకృతుల్జడిగొను పుష్ప
కములకైవడి శతాంగముల సంఘముల
హరుల బింకము గెల్చు హరుల దిక్కరుల
గిరులనవ్వెడి మదఘీంకార కరుల
నవికుల బకచక్ర హంసజాలముల
కొలకులమను కెలంకుల కొలంకులను
ఫలిత పుష్పిత రసభరిత సంవలిత (3450)
కలితలైయున్న శృంగారోపవనుల
రవిబింబనిభ పద్మరాగ దీపముల
భువన మోహనములై పొల్చు ధూపముల
నడలక తమకు నీడను బేడనలకు
గొడిమెడి సవరించు గొప్పకన్నులును
బనిపడి తముదాము పవడంపులతల
గనియలుగాఁజేయు కావిమోవులును
నిలదొమ్మిదవ లెక్కయొక్కటి మాకు
నేలెక్కలని హసియించు వీనులును
వడిఁదన్ని తనకొప్పుఁ బట్టివంచినను (3460)
విడదు గుణంబని విలుఁదిట్టుబొమలు
దొరసి వాళ్లకుఁ బొత్తులు దుగించె గొట్టు?
లరయఁ బూగముగనియాడు కంఠములు
గట్టిగాఁ దనుగాంచి కఱచి చూచినను
వెట్టబంగారని విసుగు మేనులును
నొగిలినతము చూచి నోము నానాఁట
దిగఁగాఱఁ జేసిన తేటమోములును
బిరుదులఁ దమతోడఁ బెనఁగునెమళ్ళ
పురివిచ్చఁ జేయు గప్పుగల కొప్పుఱను (3470)
........................
పొదల్రే నారికొప్పున నొప్పువికుల
చదరునమింట నక్షత్రంబు లెసఁగె
దలఁకు భోజునకు వంతలు దుర్నిమిత్త
ములుదోఁచె దుస్స్వప్నములు చూపెనంత
తలుకుఁబోణుల మానధనములఁ దివియు
నలినాస్త్రచోరు కన్నపు కత్తియనఁగ
నామీనసతి దాల్చునట్టి దైవంక
నామమోయనఁ దోఁచె నలినారి యపుడు
లలితమాణిక్య వల్లరుల వల్లరుల
తులనించు చిత్రధాతువులఁ గేతువుల (3480)
లాలిత వివిధ జాలముల జాలముల
జలజాక్షు వీరరసంబు చందమున
జలజాప్తు డుదయించె జనజాథయంత
వగరు చీకట్లు చక్రాంతరంగముల
పొగులెల్లఁదేరుఁ దూర్పునరవిదేఱె
నుడువీధి యనెడు పయోరాశినొప్పు
బడబానలంబనఁ బ్రభలు చూపట్టె
శ్వేతహోర మంచికల మంచికల
ధౌతమయాతపత్రములఁ బత్రముల
తలకొన్న వ్హేతనాదముల నాదముల (3490)
వలగొన్న పౌరభూవరుల భూసురుల
గలిగి చందన పూగ కర్పూర మిళిత
జలముల యంబునఁ జల్లరాజిల్లఁ
గమ్మగస్తురి మట్టిగను పట్టినట్టి
యమ్మహారంగ పరాంగణస్థలిని
భోజేంద్రుఁ డప్పుడొప్పులు మీఱ రత్న
రాజిత భూషణ రాజిఁగై సేసి
దొరలు బాంధవులు మంత్రులు పడవాళ్లు
పరిచారకులు ససంభ్రమమునఁ గొలువఁ
జంచదుత్తుంగ కాంచనమయమంచి (3500)
కాంచిత పీఠిపైనాసీనుఁ డగుచు
బలులైన జగజెట్టి పౌఁజులఠవణి
మలహరి మొఱయింప మరసాహసములఁ
బొంగారు భుజములఁ బూజించి చెలిని
జంగాలిముత్తెంపు జల్లిఁగేలించి
నున్నని యెరమట్టి నూఁగైన పసపు
వన్నియ పుట్టంబు వలెవాటులైచి
కదిసి హీరమ్ముల గదివాడియినుప
చదురుల వలెదాల్చు చేముళ్ళఁ దాల్చి
జగజెట్టి యగునట్టి చాణూరు డపుడు (3510)
తగునుక్కుగట్ల సత్వముగల జెట్ల
నొనగూడి భోజేంద్రుఁ డున్న యచ్చటకుఁ
జనుదెంచి కాంచి భుజంబప్పళించి
యుదుటుమీఱగ మ్రొక్కి యొకచక్కి నిలువ
నదనువాటించి నందాదు వేతెంచి
యరయుకానుకలిచ్చి యతని పంపునను
నరసడింభముల మంచములపై నుండ
నంత రామాచ్యుతులంత .. ంతకుల
వింతశృంగారంబు బీరంబుమెఱయఁ
గఱపట్టుదట్టి బంగారు వన్నెకాసె (3520)
నొఱపుగా సవరించి యురగేంద్రులీల
నిడుదలె ఱుగారు నెఱివంకజడలు
వెడలకప్ప్లుతోడ వెన్నలు మెఱయఁ
దీర్చిన కస్తూ తిరుమళిమణులఁ
గూర్చిన కపురంపు కొమరు దీపింప
వడిమల్లబిరుద రావములు మిన్నందఁ
గడిఁది డక్కలు హుడుక్కలును ఘూర్ణులఁగ
విని చూడఁ గోరి యవ్వేళ గోపాల
జనములు సేవింపఁ జనుదెంచి యెదుట
జలజాప్తుఁ డుదయాద్రిచరి నొప్పుకరణిఁ (3530)
దళుకుటద్దము ఫాలతలమున మెఱయ
గగనభాగము సంజగావిఁజెన్నొందు
పగిది మస్తంబుకెంబట్టుపట్టమర
నీలాద్రితట మహానిర్ఝరుల్వోలె
లాలిత కర్ణఝుల్లరులు శోభిలఁగ
మింటబర్వెడు తీఁగ మించులు వోలె
జంటలై బంగారు సరపెణల్బెరయ
నాలోల కర్ణవాతాహతినద్రు
లాలోలగతిఁ జెందనాశలూఁ టాకఁ
గంతటి పటుదానకంటసలబ్ధి (3540)
పటలిభవద్భ్రమ భ్రమరంబు లెగయఁ
బూత్కారముల నూర్ధ్వభువనంబు లెగసి
............................
...........................
వలవదు తివియు మావంత నీవింత
చలముఁ జేసినఁబట్టి చంపుదుమనున
లావునఁ గుంభి పాలకుఁడు బాలకుల
పైవారణంబు కోపమునఁ డీకొలుప
నింతైనఁ దెరువీక యీవంతయంత
నెంతగావించె వీఁ డెంత గొట్టనుచు (3550)
దట్టిబిగ్గఱ జుట్టి దట్టించి పలికె
దిట్టయై నిలిచి దైతేయమర్ధనుఁడు
గదియఁ బాదముల నక్కరినాది కడిమిఁ
గదిమి యంకుశగతిఁ గావింప గజము
కడురేసి నిజతుండ కాండంబు సాఁచి
యొడిసిన హరిదాని యొడుపుఁ దప్పించి
కరమున హస్తి పుష్కరము బీరంబు
బెరయంగఁ జఱచి దర్పించి కొప్పించి
గడగడ దైత్యాళి గడగడవడఁకఁ
బిడుకుకై వడిముష్టి నేర్చిలెల్లార్చి (3560)
వడిఁగుంభ మధ్యంబు వ్రయ్యఁ గాబొడిచి
కడచిలో నిక్కడక్కడఁ జూపిలాచి
పదములలోఁడాగఁ బదపడి కుంభిఁ
యెదుటఁ గానక కోపమే పారఁ బ్రకట
కటముల మదము లుత్కటములై తొఁరగఁ
గుటిలత గొమ్ములకొలఁది భూతలముఁ
గ్రుమ్మికోరాడి నాకుల మూకలగలఁ
జుమ్మి జాడింప రాజీవలోచనుఁడు
బెడిడంపుకడఁకమై బిరుదనేతెంచి
వడిమహోత్తాలమౌ వాలంబు వట్టి (3570)
పంచవింశతి ధన్వ పరిమాణ దూర
మంచితగతి నీడ్చి యలవోకడాఁకఁ
గరబట్టిహవి కరకర బెట్టి కొట్టి
సరగున సవ్యాపసవ్యయముద్ద్రిప్పి
యవలీల గేలమోమగలంగ నడఁచి
భువివ్రాలుగతి జొచ్చి పుటముగా నెగసి
చిరిమి హస్తము వట్టి చిర చిరగనలి
........................
బిరబిర ద్రిప్పి మూర్చిల నేలలైచి
సిరివరు జయలక్ష్మి సేసఁ బ్రాలనఁగ
వరకుంభ మౌక్తిక వ్రాతంబురాల (3580)
విలవిలఁ బ్రాణముల్విడువంగ దరము
నలవజ్రగతి ముష్టి హతినుగ్గుఁ జేసి
దాని దంతంబు పంతంబున నూడ్చి
పూనితానా హస్తిపుని ముక్తి కనిచెఁ
మేలనియటఁ బుత్ర మిత్ర కళత్ర
జాలంబుతోఁ బౌరసంఘంబు వొగడ
సమరంద బిసహస్త సామజ యుగము
క్రమున రక్తాక కరదముల్దాల్చి
బలునితో హరి నిజబల పరాక్రమము
లలరంగ నలరంగమపుడు సొత్తెంచె (3590)
మల్లులకకశమి భూమండలేశ్వరుల
కెల్లరాజంతుల కెల్లనంగజుడు
గోరక్షకులకు సకుండు వైరులకు
వైరిగేఁ గన్నట్టుదారికి శిశువు
అల భోజునకు మృత్య్వగ్నులజాల
ములకు విరాట్టు సన్ముని వరేణ్యులకు
బరతత్వ మచ్చటి బంధు సంతతికిఁ
బరమ దైవతమునై బలునితోనొప్పు
భోజుండపుడు భయమునుబొంది పౌర
రాజి రాజీవాక్షు రాజితమూర్తిఁ (3600)
గని మోదమును జెందికడువెఱగంది
తనువులు గరుపారఁ దమలోనఁ దాము
ఈతను కరినిమో మీతని మోవి .....
చూతయోమదిఁ జవిచూతమోయనుచుఁ
బొందున నితని కపోలంబులలమె
కొందమో ముద్దిడి కొందమోయనుచు
రామకేశవులు నారాయణమూర్తు
లే మర్త్య్లై యవలీల బాల్యమున
బదరు ప్రలం<బుండు బఁకుడు ధేనుకుఁడు
మొదలైన యసురల మోది మోదించి (3610)
యిలభారమనపంగ నీ కంసు జంపఁ
జలములు రెట్టింపఁ జనుదెంచిరనఁగ
గుటిలతలోనుండి కొనసాగి వెలికిఁ
జట మరించిన రీతిఁ బొరిగొన్న సికయు
ననుపమ కాల దండావతారంబొ
యన నొప్పు భయద బాహాదండములును
గలిగి యయ్యెడల యకాలపాశంబు
వలగొన్నగతి మెడవడిజందెమొప్పఁ
గాలవర్ణములతో గాలకూటంబు
జ్వాలలఁ బోలు మీసలు డిడ్డికొనుచు (3620)
జేవురుఁ గోరాడి చెలఁగు నాగంబు
ఠెవమై మెఱయు మట్టియకాలిమించి
పొదలు మూఁపులు శిరంబును దడబడక
ముదియించి త్రిశరుని నూడ్కినుప్పొంగి
చాణూరుఁ డనియె మచ్చరమున సీర
పాణి యాదవ వజ్రపాణి నీక్షించి
మిగుల గోపకులతో మెఱసి పోరాడ
జగజట్టులని మిమ్ము జగము వారెల్లఁ
జెవులు పండువులుగాఁ జెప్పఁ గంసుండు
తివిరి మిమ్మిటకుఁదోఁ దెప్పించినాడు (3630)
మిన్నంట నారాజు మెచ్చఁగానొక్క
నన్నఁ జూతమురమ్ము జలజాక్షయనిన
నంతటివాఁడ వీవెంత మేమెంత
యంతరంబరయ నీడగునె మమ్మొఱయఁ
జెల్లునేయైన నీ క్షితినాధు వేడ్కఁ
జెల్లింపవలయు నేర్చినపాటి మనము
పోరుదమిపుడు నీ పొంతముష్టికునిఁ
జేరి సీరిని బోరఁ జెప్పుమటన్న
మనసు చూడఁగ నొక్కమాటన్నఁ గ్రొవ్వి
యనియెడు నీకునే నలవియే కృష్ణ (3640)
యెనసి యేనుఁగులతోనే లాటమాడఁ
జనఁ జూచెడింత విచారంబులేక
తవివి వారును వీరుఁ దలఁ చూపిఁ జుట్టి
సివమురేవఁగ వచ్చి చెనకెడవేల
కరకులాడెడుమమ్ముఁ గదసి పోరాడఁ
దరనొ యీవట్టి పోతరమేల నీకుఁ
పొలసినఁ డాగినఁ భువి దూరిసటల
మలసి వేఁడినను ముమ్మాటికి నిన్ను
బోనియ్య నియ్యెడ భోజుండు మెచ్చ
నానెదుఁ బాదంబులందు రామ్మనుచు (3650)
మదినుబ్బి చాణూరమల్లుండు చలము
పొదలించి యదరించి భుజమప్పళించి
యెదురుగాఁ దురదురనేతేర శౌరి
గదలక రిపులు గ్రక్కదలఁ బెల్లార్చి
ధరతల్లడిల్లఁ జెంతలనున్న మల్ల
వరులెల్ల భీతిల్ల వడిమల్ల చఱచి
తలపడి రిద్దఱుతగఁ చిత్రగతులఁ
బలువిడి పిడివిళ్ళు పట్టికొట్టుకొనుచును
డాయుచు ముష్టిఘట్టనలు చేయుచును
బాయుచుఁ గదిసి యార్భాటులఁ జేయుచును (3660)
విన్నాణముగఁ బట్టి పెనఁగుచు వింత
విన్నాణములరెసి వ్రేశి గద్దించి
శిరమును శిరమును జేతులుఁ జేతు
లురమునురంబును నూరులూరులును
బెరయ బాహా బాహిఁ బెనఁగు లాడుచును
దొరసి ముష్టాముష్టిఁ దొడరి పోరుచును
నొకకొంత తడవు నీ యుద్ధముద్ధతిని
బ్రకట సత్వంబునఁ బ్రబలికావింప
ఠాణమైయప్పుడడ్డము దూరి శౌరి
చాణూరులైచి శౌలమునకు వచ్చి (3670)
యుల్లాంగమునఁ బట్టి యూరులనొక్క
మల్లుండు మెచ్చి మమ్మారేయుటంచు
నేర్పునం గాలులోనికి జొరనిచ్చి
దర్పించి సొరలించి దనుజారి కెరలి
నటనను దాటంబునకు వచ్చి చొచ్చి
పటుముష్టిచేవెన్ను పగుల ముష్టింపఁ
దరలక జెట్టియత్తఱి జోఱగొన్న
తెఱఁగున బెడఁబాసి తివిరి మార్కొనిన
డీకొని హరివాని దిణికించిలైచి
పైకొని జఠరంబు పట్టిలోఁ గించి (3680)
కనలుచుఁ బొడిచి వేగంబ డొక్కరముఁ
గొనుచు మల్లుని మన్నిగొనుచుండ బలుఁడు
మొనసి ముష్టాముష్టి ముష్టికుని నిట్లు
పెనగుచులైచి యభేద్యుఁడై పోరఁ
గని పౌరకాంతలు కనికరంబింది
యనిరిలోలోనె యోయమ్మ కంసుండు
చెండమ్మి గతినొప్పుచే సోఁకినంత
గండుదురోయన్న కరణినున్నారు
తేఱికన్గొనఁ జెక్కుడెసఁ బాలువెన్న
గాఱెడు యీముద్దు గాఱెడివారిఁ (3690)
గటకట చెలరేఁగి కనలి దానవులు
యిటువంటి నరకలతోడఁ బెనంగు
లాడంగ బడ్డను బెలుచ కైవడిని
గనుగొను బిడ్డలఁ గనడెపో వీఁడు
రాజుగన్గొని చూచు రసవేత్తలైన
యీజగ జట్లకు నీ బాలకులకు
నీడుగాదనియన రెంత యిచ్చకము
లాడుదురా కంసుఁ డాడినయట్లు
అతని కిం పని ధర్మ మాడకయున్న
నతని నంటునపాప మంటదే తమ్ము (3700)
(ఇంకాఉంది)
No comments:
Post a Comment