రమ్మురమ్మనుచుఁ గీరమ్ము చందమునఁ
గ్రమ్మిపిల్చుట విని కమలలోచనుఁడు
తఱివేఁచిపట్టి సుందరి గుబ్బలలమఁ
దఱలక నిలచి యాతఱలాక్షి పలికె
నరయఁ బట్టెడితావెయగునైన నీవు
తఱిచూడు కంససోదరి పుత్రయనిన
వేఁడక నవ్వి ధమున జలము
లాడుచు సరసంబులాడుచునుండ
లలనలపాంగ జాలకములచేత
సలిలంబులో బేడసలఁగుందఁ జేసి (2910)
యొసపరి కురులతో నొఱయుచుఁదనదు
బుసకొట్టులకుఁ బాఱి పొవుతుమ్మెదలు
కవగుబ్బచన్నులు గనిరేసిడాసి
దరళ హాసములకుఁ దరలుజక్కవలు
పలుచని యధరబింబములకై నుడిసి
యొలయుఁనై తావులకుఱుకు గీరములఁ
దమ్ములఁ గుముద కందమ్మునుత్ప
లమ్ముల ఘనశైలవమ్ములఁ రువ్వి
వనజముల్చరణముల్వడిఁదడంబడఁగ
ఘన భాగ్యరేఖలు గనిపట్టుకొనుచు (2920)
భ్రమరముల్నెఱుల నేర్పడకున్న హేమ
సుమవాసముల పసచూచి పట్టుచును
బిసములు హస్తముల్భేదింప లేక
పసని సొమ్ములు గాంచి పాఱిపట్టుచును
బులినముల్బిరుఁదులు పోలింపరాక
యెలమిఁ గాంచులు గాంచి యెలమిఁ బట్టుచును
గమలముల్పూదేనెఁగ్రక్కు చందమునఁ
గమలముల్గరయంత్ర కములఁజిమ్ముచును
గమలభృంగముల వేగముల రాగముల
గమకింప వడిఁదోలికదియుచు సోలి (2930)
కమలాంత్తరపు సూన కమలముళస్త
కమలమునందుఁ జొక్కమలర్పఁ బూని
సరములఁబూని సారసములఁ దేలి
బిసములద్రుంచి తుంపనలాడి పాణి
బకములమరుని యంబకములనొప్ప
శుకముల దరులయా శుగములఁ గప్పి
యుదటుమీఱఁగఁ దమ్మినొక్కెతెపమ్మి
యొదులుఁ గృష్ణునిఁ గ్రమ్మియెద సోఁకజింమ్మి
నిలువ గోవిందుఁడూనిన ప్రేమఁ జలువ
వలచు చెంగలువచేవైచె నా చెలువ (2940)
కరమెత్తి చేగుత్తికవలచే హత్తి
హరినొత్తి వైచిరాయతివలుయెత్తి
మతులు సంమతులుగా మహనీయబాహం
లతల గొల్లతల ఫాలతలములుంచి
వెనువెంటఁ గళలంట విడియుంటవింట
ననజంటవైచె మానముగెంటె శౌరి
విలసించు నలయించు విలుమించుబొమలు
పొలయించి సొలయించి పొలఁతులవ్వేళఁ
గొంచపట్టుటకునై కొంచనియంచ
నంచబో నీకు వేయలి వేణి వేణి (2950)
పట్టినఁ గడునెగ్గు పట్టిన నిచట
నెట్టువేఁగించెద మిఁకనైన నీవు
గవకవనగకు జక్కవకబెదరు
నవలివారల్లన నందిపట్టెదరు
వికవికలేలె వివ్వెరలకు ముకులు
కకపికలాయెఁ దక్కక పికవాణి
మరలనితెరలఁ బల్మాఱును గొక్కరలఁ
గెరలి చేయకుఁడు చక్కెరబొమ్మలార
తుటుములు వెట్టుచుఁ దుటుము గట్టుచును
నటనిటరారె మిరనుచుఁ నొండొరుల (2960)
నాడుచు సరసంబు లాడుచునీఁదు
లాడుచువడిఁ జల్లులాడుచుఁ జెలఁగి
యమున తత్కుచకుంకు నాకులయగుచు
నమరెరేసంజ కెంపారుమిన్ననఁగ
సారసభవుఁడు వాసవుఁడు మాధవుఁడు
చారణ దేవతాసతులు నవ్వేళ
హరిగాంచి మోహించి హర్షంబు పెంచి
కరఁగి నీరైచొక్కి కామించిరంత
వనకేళిందేలి యవ్వనమాలిగొల్ల
ననబోండ్లతోడఁ గ్రన్నననేఱు వెడలి (2970)
నీలిమేఘంబు వెన్నెల సోఁగచుట్టు
వీలగోణంబు గీలించి యామీఁద
సరులు ధరించి శ్రీచందనంబలఁది
విరులిఉ గీలించి పచ్చవిణాముగట్టి
నీలంపు సరులలో నిగ్గులు వెడలు
పోలికఁ గుంతలముల నీఱుజార
నుడురాజు బింబాస్య లొండొరుయొఱులు
సడలించుమర ఖడ్గశాఖలఁబోలి
పట్టుమీపట్టు చూపట్టు నీపట్టు
కట్టు చీఱెలతల కట్టుచేకట్టు (2980)
తెముముత్యమ్ము పుత్తెమ్ము పొతెమ్ము
కమ్మపూఁ బొదరిల్లు కలికి నీసొమ్ము
కొమ్ముగంధము పూసి కొమ్మునీవంది
కొమ్ముపువులు జాతికొమ్మునామమ్ము
చీరి కస్తూరికై చేరిపోవకుము
రారమ్ము గంధసారమ్ము నిమ్మనుచు
తొడవులు తొడివి కస్తురిపూసి విరులు
ముడిచివన్నియపుట్టములఁ గట్టిరంత
వసుదేవతనయుండు వలపుల మరియు
కిసలయాధరులఁ జొక్కించి చొక్కించి (2990)
తెలతెలవాఱనే తేరఁబల్లియకు
మలయుచువారితో మగిడియేతెంచె
వరులంత నభిమానవతుల నాసతుల
హరిమాయనేమియు ననరైరి యిట్టి
ధవళాక్షు మహిత వర్తనము కీర్తనము
భువి విన్నవారల భూరిసంపదలు
వనజాక్షుఁ డంబికావనము బావనము
నొనరింప నచ్చట కొక్కనాఁదరిగి
యుదుటున నందుని నొడసి గోపకుల
గదుము నాగంబు భోగంబు వేగంబు (3000)
చించి యాతండ్రి రక్షించి తద్భోగి
నంచితగతి నంచియట నొక్కనాఁడు
అన్నతోమరుఁగన్న యన్న వేఁడుకల
నున్నతోన్నతకాననోపకంఠమున
వల్లకీరాజిత వల్లవీ హస్త
పల్లవరాగ శోభన మూర్తియగుచు
ప్రోడనందు గూరుని దూతశంఖ
చూడుండుకొని పోవఁజూడు మటంచు
వడిఁబాఱి పోయెడివాని ప్రాణముల
విడిపించి జనకుని విడిఁబించియంత (3010)
నతని శిరోరత్న మన్నకునిచ్చి
యతివలతో నుండె నతివైభవములఁ
దనమంచితనము మంచితనము గోపికల
ఘనతనెన్నుచుఁదను గలయుచునుండె
సోమరి కంసు నిష్టుండరిష్టుండు
భీమవృషాకృతిఁ బెఱిగి బిట్టలిగి
వాడికొమ్ములు ములువాడివీనులును
గాడిమోవని యఱ్ఱుకదలు మూపురము
వాలువాలము నేలబడి వాలు గంగ
డోలునుగల్గి కాటుకకొండ వోలె (3020)
గోడలువడనూఁకి కొములునేల
గోడాడితోఁ కెత్తుకొని పంచవిలుచు
గడిఁది చిందరకొట్టి కడిమి క్రేళ్ళురికి
వడిరంకెలిడుచుఁ గ్రేవలనాకి కొనుచు
మల్లరంబై గోప మండలంబెల్లఁ
దల్లడిల్లగవచ్చు తఱి దైత్యమర్ది
సురలెల్ల నరుదంది చూడనయ్యసురఁ
బరిమార్చి తమవారి భయమెల్లఁ దీర్చె
బెగడెఁ గంసుఁడు గోపబృందంబు కృష్ణుఁ
బొగడెనభమ్మునఁ బూవాననెగడె (3030)
నలరులతోఁదేటి యలరుచందమునఁ
జెలఁగె గోపికలతో శ్రీకృష్ణుఁడంత
ప్రబలభా విజిత పారదుఁడు నారదుఁడు
సబలుఁడై కంసుని సభకేగుదెంచి
యమల నేత్రాంత దరహాస చంద్రికల
కొమరొప్పు మ్ర్ఱుఁగు చెక్కులమీఁదఁ బొలయ
వెడమతి నీమతి వివరింపనిపుడు
వెడతనున్నదోబేలు జెందితివో
యిరుగింటిలో పని యెఱుఁగ వేమియును
బొరుగింటి పనిఁ దీర్పఁ బోయెదు కంస (3040)
వసుదేవుఁడిట్టు దేవరరేయిగన్న
పసిబిడ్డ పాపని పనిబూని
యతివేగమున మందకరిగి యానందు
సతియొద్దఁ బెట్టియా సతిగన్నపట్టిఁ
గొనివచ్చి నిన్నుదిక్కులఁ బెట్టికొనుచుఁ
దనుగానివాని చందమున నున్నాఁడు
కనలుచుమును నీవు ఖండించినట్టి
తనయాలిఁ గన్నట్టి తనయాలిఁతోడఁ
దొడబడఁడాఁచి యందులనేయయున్న
పడఁతి దోర్బలభద్రు బలభద్రుఁ గాంచె (3050)
వారలే నినుజంపు వారలువారి
వారింపఁ గూదద వార్యులెవ్వరికిఁ
గన్నట్టి పనిదాఁపఁగా నేల నీకు
నున్నది యున్నట్టు లొనరఁ జెప్పితిని
నావుడు వహ్నిచందమున డెందమునఁ
గావరంబెసఁగఁ డిగ్గన గద్దెడిగ్గె
కైవాలుఁగొని శౌరి ఖండింపఁబోద
దేవ మౌనీంద్రుఁడే తెంచి వారించి
తగునె నీకిదిలెస్స తగవు జేసితివి
పగగొని నినుజంపఁ బగతురుందఁగను (3060)
సేయువాఁ డుండ నమ్మేమిగావించు
వేయేల హరియుండ వీఁడేమి సేయు
వారెవో దయ్యాల వలెమందలోన
శౌరి సీరియు నిన్ను జంపనున్నారు
అనుచు గంసుని కీర్తి యెగయుచందమున
జనియె నారదుఁడు భోజప్రభుండపుడు
ఖలబుద్ధినపుడు శృంఖలబద్ధుఁ జేసి
చెలియలితోఁ గూడఁ జెఱసాలవైచి
యతరేసి వడిగేసియను దైత్యనాధుఁ
గుటిలతనందుని కొమరుఁపైబనిచె (3070)
మంత్ర కూటమున దుర్మంత్రజ్ఞులైన
మంత్రులు భటులు భూమండలేశ్వరులు
గొలువ మీసలు దిద్దికొనుచు నేత్రముల
జలజలనిప్పుల జడియుప్పతిలఁగ
స్వారాజు గిరిరాజు సడ్డగావింప
నీరసాస్థతిమార్త్యుఁడే నాకు నెదురు
శూలిఁగేలిననవ్వఁ జూచునాతోడ
నాలంబులో వీరలా పోరువారు
గరుడ దంధర్వ రాక్షసులకేనోడ
నరునకేనోడుదు నాపోరిఁ బోరి (3080)
చటులమాద్రోణ భీష్మక శల్య బలము
నటుచూపిగెల్చె దననిఁబోవ నీను
వావిరితనదైవ వంశమేనెఱుఁగ
నేవట్టి జర్కరనెఱప నేమిటికి
నెత్తిమాసారని నెత్తురుకందు
తిత్తఱిననునాజి నీల్గింతమనుచు
అనికొందఱటవారి నటపోయియిటకుఁ
బనిఁ బూనిరప్పంచి భంపవలయుఁ
దవిలిహస్తినిబుర ద్వారమేమరక
కువలయపీడమెక్కువలావుమెఱయ (3090)
వడినెక్కియాచక్కి వచ్చువారలనుఁ
దెడలించికెడుపు మందునుమీఱిరేని
సమమల్ల హృద్భుల్ల చాణూరమల్ల
విలుపండువనివీట విననెల్లచోటఁ
బలుదెఱంగులఁ జాటఁ బనుముఁడువేగ
రంగంబు క్షీరతరంగంబు చాయ
రంగు జల్లులరాజి రాజిల్లఁ జేసి
విమలముల్గావీధి వీధిలనెల్లఁ
దమఁగముల్పన్నుఁడు తమకముల్మాని
యని యాత్మఁదల పోసి యక్రూరుఁ బిలిచి (3100)
తనకేల లీలనా తనికేలు పూని
యున్నదమ్ముఁడవైన నాప్తుండవైనఁ
గన్నవారలు నీవు గడియును నీవ
తమమేలుకీళ్ళడుల కుందగులైనవాఁవ
వని నిన్ను నమ్మితి నంతరంగమున
ననిమిషాధిప ముఖ్యు లాలంబులోనఁ
దనువేఁడికోడి శ్రీధరు వేఁడికొనిన
శౌరియాతడె సీరి శౌరియుననఁగ
నారయ జన్మించిరని వింటినట్టి
బలకేశవులునందు పాళెంబునందుఁ (3110)
జలపట్టి తనుఁబట్టి చంపెదమనుచి
నెన్నుదురటు వారినిటు తెమ్మువింటి
జన్నంబటంచు ధర్మము తొంటినాఁడు
మల్లనాగములచే మహియెల్లఁ దల్ల
డిల్లఁదద్బల మెల్లడించి సంపదలఁ
జాలి కోసల సాల్వ సహితంబుగాఁగ
నెలెదమోలోక మేకచక్రముగ
ననివేడు కలహెచ్చి యంబరంబిచ్చి
యెనయఁ గౌంగిటగ్రుచ్చి యెత్తుననతఁడు
ఇదియేమి నన్ను నీవింతజేసెదవు (3120)
తుదినీదుపంపుజాతులు ప్రసాదంబు
ఇందు మించిన భాగ్య మెయ్యది వేయి
చందంబులనుమదిఁ జర్చింపననుచు
ఘన మనోరథము సంగతినొప్పురథము
నెనలేని వేడ్కతో యెక్కియందరిగె
వేగ కంసుడు మృత్యువక్త్రంబు దూరు
పగిగొల్సెడవించి భవనంబుజొచ్చె
అంతనంద వ్రజంబటు కేశిడాసి
యంతకోగ్రతమించు హయమూర్తిఁదాల్చి
తుంగ ఖరోద్ధూత ధూళి దిక్పాళి (3130)
నింగిగప్పుచు దేవనికరంబు బెటల
నాననంబెత్తంగ నాకేశిడాసి
పోనీక తత్పదంబులు పట్టి శౌరి
యతితీవ్ర గతినొప్ప నగలంగఁ ద్రిప్పి
శతచాపదూరంబు చనవైచియార్చె
చిమ్మి మోకాళ్ళ మోచేతులం గ్రమ్మి
యమ్మహాసురవైరి యవనిపైఁ గెడపి
వ్రేలువ్రేతల వేవేలు చందముల
నాలీలనెన్నంగ నరిగెఁబల్లియకు
రమణీయ మౌక్తిక రదుఁడు నారదుఁడు (3140)
కమలాక్ష బల పాదకంజాతములకు
వినతుఁడై నుతుల గావించి భావించి
వనజాక్షుఁడటు చేయవలయు కార్యములు
పలుకుచు సకలసందలును బొదల
జలజాక్షుఁ గనికనిచనియె భూనాధ
యటని లాయనకేళి పరివేడ్క గోప
పటలితోఁ బర్వత ప్రాంతంబునందు
గోలలౌపడుచులు గొఱియలై యుండ
బాలకుల్గొందఱు పాలకుల్గాఁగ
గడుసులనెల్ల దొంగలు గొనమర్చి (3150)
వడిమీఱిపంక్తికై వడినాడుచుండ
మాయాఱి వ్యోమనాయక నిర్జరారి
యాయెడ నెడకొల్లయై వచ్చిచొచ్చి
యేపురార్వురు చిక్కనందఱ బిలము
లోవైచిరాతపెల్లుగ రాయి ద్రోసి
యేతెంచి యిరుజేయి యెఱుఁగకయుండ
నాతఱితలనాఁడు నసుర నీక్షించి
నీయాటమేలురా నీచ నిశాట
కాయలునింక నెక్కడికే గెదనుచు
నలికమై గోవిందుఁడా మందుఁ జంపి (3160)
బీలమువాకిటి రాయిపెడకేలఁ ద్రొచ్చి
లాలించి పిలిచి బాలకుల వేడుకలఁ
దేలించి మందకేతెంచె నత్తఱిని
ననవరతాక్రూరుఁ డక్రూరుఁడబఘఁ
దనుపమ హరిభక్తుఁ డరుగుదెంచుచును
నేదానఫలమొనాకీదానవారి
పాదారవిందముల్ భజియింపఁ గలిగె
నజశంకరామరేశాది కిరీట
రజమెవ్వనికిఁ బాదరజమై చెలంగు
నామాధవుని గాంచునట్టినా పుణ్య (3170)
మేమని వర్ణింతు నిందిరాకాంతు
నరిబుద్ధినైనఁ దెమ్మని పంచెఁనాకుఁ
బరుఁడె కంసుఁడు ప్రాణబంధుండుగాక
నావటి పామరనకుఁ గల్గె దేవ
దేవుఁ జూడ గనాదియపోతపంబు
ఈయెడ కంసహితుఁడని యోర
సేయునోననుభక్తి సేయునో యేల
నాయెడ సర్వాత్ముఁడగుటఁ గృతార్థుఁ
జేయునేనను దయసేయు నేయనుచుఁ
గళుకులై బెళుకు నుంగరపు ముంగురుల (3180)
కళుకులై వెలిదమ్మిగసరు నేత్రముల
నిలసంపగుల హసియించు నాసయును
జిలుకు వెన్నెలతేట జిలుకులేనగవు
మొనరముల్గల శౌరి మోహనాననముఁ
గనుగొందునేఁడెనిక్కముగఁ జొక్కముగ
వనమృగావలినాదు వలిచాయకలిగెఁ
జల్లప్రోద్దుననేను జలజాక్షుఁ గాంచి
యుల్లసమారంగ ............
నెమకెడుకేలమై నివురుగాయనుచుఁ
గందమాకందము కుందారవింద (3190)
చందన స్యందన తాల తక్కోల
బృందయై యొప్పారు బృంద సొత్తెంచి
పొదరి ......
పొదరిండ్లలోపలఁ బొదలు గొల్లెతల
తరిలేచిలేగలందల పోసి పాలు
కురియఁజేసిన పోదుగులనేల జీర
మఱల కిందులకుసంభార వంబులును
బఱువ ...............
పచ్చగందనియచ్చ పచ్చికల్మేసి
మచ్చరంబెచ్చ మర్మలయుచుఁబొదలి (3200)
బహు గుహాంతరములఁ బ్రతిరవం బెసఁగి
మహిఱంకెలిడుచు
రిక్కలువెట్టి హుండ్రిక్కుడటంచు
దిక్కొల్పి వికవికఁ దెగడు వల్లియలు
చేకొని వారింపఁ జేరు గోపికల
సొరిది గరాళింపుచును మందపట్ల
కరమె
చనిచని నోటికి చలియైన పూరిఁ
దినివెన్ను చఱచి పూఁదేనె తియ్యముల
నీరాని నెమ్మదినెమరు వెట్టుచును (3210)
జేరువ గుమురుగాఁ జేరి ధేనువులు
కొదమలేఁ గలతేఁటి కొదమల సూటి
కుడుచునప్పుడు పొదుగు లుపయోదములు
వడువున క్షీరముల్వర్షింపుచుండ
నడరఁ విష్ణుఁడె కృష్ణుఁడైన నాపాల
కడలియుఁ గడక నిక్కడనిల్చెననఁగ
నురువులు గట్టి మిన్నుల గబ్బమనుచు
నీఁతలైమ్రోతలై యేఱులై తరణి
కూతురిఁ గలసిపైకొని పారుచుండ
యమున గంగయుఁగోడె ననిసరల్మునులు (3220)
భ్రమసిరి సిరిఱేనిప
గనుకొని యాకడలింగడచియే తెంచి
కమ్మపూఁ దేనెలఁ గలయుపుప్పొళ్ల
నుమ్మఱి రధముడాయుచు దోరగిలఁగ
వడిమీఱుమావుల వడిమీఱఁదో
బలరామ గోవింద పాదారవింద
హలజలజాత రేఖాంకములైన
యడుగుల పొడగాంచి యరదంబుఁ డిగ్గి
కడుబొంగి వేడుకఁ కన్నీరుగాఱ (3230)
హరిభక్త
శరదాగమోత్ఫుల్ల జలజ నేత్రులను
హరిణాద్రిజలజ మోహన సుగాత్రులను
గురుతరోజ్వల నక్రకుండల రశ్మి
సురనదీ యమునోర్వి శోభితభుజులఁ
హరిణాంక ముకుర సమానంబు జులఁ
గమనీయవనమాలికా విభూషణిల
సమధికా మృతరస
జిరతర వైభవ శ్రీనికేతనుల
వితతకీర్తులనాది విష్ణుమూర్తులను
బుష్పిత హృదయుఁడై పొంగి యానంద (3240)
బాష్పంబువుల నర్ఘ్య పాద్యంబు
యక్రూర లెమ్ము లెమ్మని యెత్తికొనుచు
బలునకు నీరీతిఁ బ్రణతులొనర్ప
బలుఁడు శోభిత భుజాబలుఁడు నాభక్తుఁ
గ్రుచ్చి మోదమున నక్కున నక్కుఁ జేర్చి
హరిదాసునింటికి నతని దోడ్కొనుచు
నరిగి గద్దియనుంచి యర్చించి మంచి
పసిఁడి బిందియనీటఁ బాద్ముల్గడిగి
మసలక తోడ్తోడ
సకలరసాన్నముల్జనని వడ్డింప (3250)
జనకుండుదారు భోజనము గావింప
ఘనసార ఘనసార గంధముల్పూసి
ముఖవాస తాంబూల ముఖములైనట్టి
యఖిలోపచారంబు లలవడఁ జేయు
నరిది నందుడు సేమమరసె నాపజ్జ
నరవిరి సెజ్జపై నక్రూరు శౌరి
తనువొయ్యనివిరి పాదము మీఁదవైచి
పినత్రండ్రి తానల్లి బల్లియైయుండి
కుశలమే నీకు నీకూర్చు వారలకు
జయమే శుభంబే భూజనులకునెల్ల (3260)
నయయుక్తమే జననాధు వర్తనము
భూమి పాలింపుచు భోజేంద్రుఁడైన
మామకు లగ్గెనేమమె బంధువులకు
నని నీవు వచ్చుటేమనిని నాఘనుఁడు
తనవచ్చు రాకకెంతయును నెంతయును
వివరింపగా విన్నవింప మాధవుఁడు
చివురుకెమ్మోవిమైఁ జిగురొత్త నవ్వి
వలయు రీతులఁ జేయు వలయుఁ గార్యములు
బిలిచి నందునకుఁ జెప్పిన నతండపుడు
అరియప్పనంబు పుల్లరి నేయిపాలు (3270)
పెరుగులు దెప్పించి పిల్చి గోపకుల
మనల బాణాసన ముఖము చూడంగఁ
జనుదేర విమలనచారు నక్రూరు
ననిచె భోజుండు నేఁదని చెప్పివయన
మునకుఁ దానాయుత్తములు సేయుచుండె
ననియోగిజనపాలుఁ డాజనపాలుఁ
డనుమోదమంది నిట్లని యానతిచ్చె
నని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రు మాతకు వనధి జాతనకును
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని (3280)
గనక గాత్రికిని బ్రకామ ధాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుబాహకును
సారలావణ్యకు సకల గణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుపాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును
హైమసంవ్యానకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్ర సేవితకుఁ (3290)
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకుఁ బన్నగసుతావృతకు
మృగమదాంగకు నలమేలుమంగకును
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజాకర తాళ్లపాకాన్నమార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుండలయుగ్మ మండితకర్ణ
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ (3300)
విదిత మానస తిరువేంగళనాథ
విరచితంబగు ప్రతిద్విపదసంశ్రవణ
తరళిత కవిమస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్టమహిషీ వివాహ
మనుకావ్యమున ద్వితీయాశ్వాసమయ్యె
(తరువాయి భాగం "తృతీయాశ్వాసము")
గ్రమ్మిపిల్చుట విని కమలలోచనుఁడు
తఱివేఁచిపట్టి సుందరి గుబ్బలలమఁ
దఱలక నిలచి యాతఱలాక్షి పలికె
నరయఁ బట్టెడితావెయగునైన నీవు
తఱిచూడు కంససోదరి పుత్రయనిన
వేఁడక నవ్వి ధమున జలము
లాడుచు సరసంబులాడుచునుండ
లలనలపాంగ జాలకములచేత
సలిలంబులో బేడసలఁగుందఁ జేసి (2910)
యొసపరి కురులతో నొఱయుచుఁదనదు
బుసకొట్టులకుఁ బాఱి పొవుతుమ్మెదలు
కవగుబ్బచన్నులు గనిరేసిడాసి
దరళ హాసములకుఁ దరలుజక్కవలు
పలుచని యధరబింబములకై నుడిసి
యొలయుఁనై తావులకుఱుకు గీరములఁ
దమ్ములఁ గుముద కందమ్మునుత్ప
లమ్ముల ఘనశైలవమ్ములఁ రువ్వి
వనజముల్చరణముల్వడిఁదడంబడఁగ
ఘన భాగ్యరేఖలు గనిపట్టుకొనుచు (2920)
భ్రమరముల్నెఱుల నేర్పడకున్న హేమ
సుమవాసముల పసచూచి పట్టుచును
బిసములు హస్తముల్భేదింప లేక
పసని సొమ్ములు గాంచి పాఱిపట్టుచును
బులినముల్బిరుఁదులు పోలింపరాక
యెలమిఁ గాంచులు గాంచి యెలమిఁ బట్టుచును
గమలముల్పూదేనెఁగ్రక్కు చందమునఁ
గమలముల్గరయంత్ర కములఁజిమ్ముచును
గమలభృంగముల వేగముల రాగముల
గమకింప వడిఁదోలికదియుచు సోలి (2930)
కమలాంత్తరపు సూన కమలముళస్త
కమలమునందుఁ జొక్కమలర్పఁ బూని
సరములఁబూని సారసములఁ దేలి
బిసములద్రుంచి తుంపనలాడి పాణి
బకములమరుని యంబకములనొప్ప
శుకముల దరులయా శుగములఁ గప్పి
యుదటుమీఱఁగఁ దమ్మినొక్కెతెపమ్మి
యొదులుఁ గృష్ణునిఁ గ్రమ్మియెద సోఁకజింమ్మి
నిలువ గోవిందుఁడూనిన ప్రేమఁ జలువ
వలచు చెంగలువచేవైచె నా చెలువ (2940)
కరమెత్తి చేగుత్తికవలచే హత్తి
హరినొత్తి వైచిరాయతివలుయెత్తి
మతులు సంమతులుగా మహనీయబాహం
లతల గొల్లతల ఫాలతలములుంచి
వెనువెంటఁ గళలంట విడియుంటవింట
ననజంటవైచె మానముగెంటె శౌరి
విలసించు నలయించు విలుమించుబొమలు
పొలయించి సొలయించి పొలఁతులవ్వేళఁ
గొంచపట్టుటకునై కొంచనియంచ
నంచబో నీకు వేయలి వేణి వేణి (2950)
పట్టినఁ గడునెగ్గు పట్టిన నిచట
నెట్టువేఁగించెద మిఁకనైన నీవు
గవకవనగకు జక్కవకబెదరు
నవలివారల్లన నందిపట్టెదరు
వికవికలేలె వివ్వెరలకు ముకులు
కకపికలాయెఁ దక్కక పికవాణి
మరలనితెరలఁ బల్మాఱును గొక్కరలఁ
గెరలి చేయకుఁడు చక్కెరబొమ్మలార
తుటుములు వెట్టుచుఁ దుటుము గట్టుచును
నటనిటరారె మిరనుచుఁ నొండొరుల (2960)
నాడుచు సరసంబు లాడుచునీఁదు
లాడుచువడిఁ జల్లులాడుచుఁ జెలఁగి
యమున తత్కుచకుంకు నాకులయగుచు
నమరెరేసంజ కెంపారుమిన్ననఁగ
సారసభవుఁడు వాసవుఁడు మాధవుఁడు
చారణ దేవతాసతులు నవ్వేళ
హరిగాంచి మోహించి హర్షంబు పెంచి
కరఁగి నీరైచొక్కి కామించిరంత
వనకేళిందేలి యవ్వనమాలిగొల్ల
ననబోండ్లతోడఁ గ్రన్నననేఱు వెడలి (2970)
నీలిమేఘంబు వెన్నెల సోఁగచుట్టు
వీలగోణంబు గీలించి యామీఁద
సరులు ధరించి శ్రీచందనంబలఁది
విరులిఉ గీలించి పచ్చవిణాముగట్టి
నీలంపు సరులలో నిగ్గులు వెడలు
పోలికఁ గుంతలముల నీఱుజార
నుడురాజు బింబాస్య లొండొరుయొఱులు
సడలించుమర ఖడ్గశాఖలఁబోలి
పట్టుమీపట్టు చూపట్టు నీపట్టు
కట్టు చీఱెలతల కట్టుచేకట్టు (2980)
తెముముత్యమ్ము పుత్తెమ్ము పొతెమ్ము
కమ్మపూఁ బొదరిల్లు కలికి నీసొమ్ము
కొమ్ముగంధము పూసి కొమ్మునీవంది
కొమ్ముపువులు జాతికొమ్మునామమ్ము
చీరి కస్తూరికై చేరిపోవకుము
రారమ్ము గంధసారమ్ము నిమ్మనుచు
తొడవులు తొడివి కస్తురిపూసి విరులు
ముడిచివన్నియపుట్టములఁ గట్టిరంత
వసుదేవతనయుండు వలపుల మరియు
కిసలయాధరులఁ జొక్కించి చొక్కించి (2990)
తెలతెలవాఱనే తేరఁబల్లియకు
మలయుచువారితో మగిడియేతెంచె
వరులంత నభిమానవతుల నాసతుల
హరిమాయనేమియు ననరైరి యిట్టి
ధవళాక్షు మహిత వర్తనము కీర్తనము
భువి విన్నవారల భూరిసంపదలు
వనజాక్షుఁ డంబికావనము బావనము
నొనరింప నచ్చట కొక్కనాఁదరిగి
యుదుటున నందుని నొడసి గోపకుల
గదుము నాగంబు భోగంబు వేగంబు (3000)
చించి యాతండ్రి రక్షించి తద్భోగి
నంచితగతి నంచియట నొక్కనాఁడు
అన్నతోమరుఁగన్న యన్న వేఁడుకల
నున్నతోన్నతకాననోపకంఠమున
వల్లకీరాజిత వల్లవీ హస్త
పల్లవరాగ శోభన మూర్తియగుచు
ప్రోడనందు గూరుని దూతశంఖ
చూడుండుకొని పోవఁజూడు మటంచు
వడిఁబాఱి పోయెడివాని ప్రాణముల
విడిపించి జనకుని విడిఁబించియంత (3010)
నతని శిరోరత్న మన్నకునిచ్చి
యతివలతో నుండె నతివైభవములఁ
దనమంచితనము మంచితనము గోపికల
ఘనతనెన్నుచుఁదను గలయుచునుండె
సోమరి కంసు నిష్టుండరిష్టుండు
భీమవృషాకృతిఁ బెఱిగి బిట్టలిగి
వాడికొమ్ములు ములువాడివీనులును
గాడిమోవని యఱ్ఱుకదలు మూపురము
వాలువాలము నేలబడి వాలు గంగ
డోలునుగల్గి కాటుకకొండ వోలె (3020)
గోడలువడనూఁకి కొములునేల
గోడాడితోఁ కెత్తుకొని పంచవిలుచు
గడిఁది చిందరకొట్టి కడిమి క్రేళ్ళురికి
వడిరంకెలిడుచుఁ గ్రేవలనాకి కొనుచు
మల్లరంబై గోప మండలంబెల్లఁ
దల్లడిల్లగవచ్చు తఱి దైత్యమర్ది
సురలెల్ల నరుదంది చూడనయ్యసురఁ
బరిమార్చి తమవారి భయమెల్లఁ దీర్చె
బెగడెఁ గంసుఁడు గోపబృందంబు కృష్ణుఁ
బొగడెనభమ్మునఁ బూవాననెగడె (3030)
నలరులతోఁదేటి యలరుచందమునఁ
జెలఁగె గోపికలతో శ్రీకృష్ణుఁడంత
ప్రబలభా విజిత పారదుఁడు నారదుఁడు
సబలుఁడై కంసుని సభకేగుదెంచి
యమల నేత్రాంత దరహాస చంద్రికల
కొమరొప్పు మ్ర్ఱుఁగు చెక్కులమీఁదఁ బొలయ
వెడమతి నీమతి వివరింపనిపుడు
వెడతనున్నదోబేలు జెందితివో
యిరుగింటిలో పని యెఱుఁగ వేమియును
బొరుగింటి పనిఁ దీర్పఁ బోయెదు కంస (3040)
వసుదేవుఁడిట్టు దేవరరేయిగన్న
పసిబిడ్డ పాపని పనిబూని
యతివేగమున మందకరిగి యానందు
సతియొద్దఁ బెట్టియా సతిగన్నపట్టిఁ
గొనివచ్చి నిన్నుదిక్కులఁ బెట్టికొనుచుఁ
దనుగానివాని చందమున నున్నాఁడు
కనలుచుమును నీవు ఖండించినట్టి
తనయాలిఁ గన్నట్టి తనయాలిఁతోడఁ
దొడబడఁడాఁచి యందులనేయయున్న
పడఁతి దోర్బలభద్రు బలభద్రుఁ గాంచె (3050)
వారలే నినుజంపు వారలువారి
వారింపఁ గూదద వార్యులెవ్వరికిఁ
గన్నట్టి పనిదాఁపఁగా నేల నీకు
నున్నది యున్నట్టు లొనరఁ జెప్పితిని
నావుడు వహ్నిచందమున డెందమునఁ
గావరంబెసఁగఁ డిగ్గన గద్దెడిగ్గె
కైవాలుఁగొని శౌరి ఖండింపఁబోద
దేవ మౌనీంద్రుఁడే తెంచి వారించి
తగునె నీకిదిలెస్స తగవు జేసితివి
పగగొని నినుజంపఁ బగతురుందఁగను (3060)
సేయువాఁ డుండ నమ్మేమిగావించు
వేయేల హరియుండ వీఁడేమి సేయు
వారెవో దయ్యాల వలెమందలోన
శౌరి సీరియు నిన్ను జంపనున్నారు
అనుచు గంసుని కీర్తి యెగయుచందమున
జనియె నారదుఁడు భోజప్రభుండపుడు
ఖలబుద్ధినపుడు శృంఖలబద్ధుఁ జేసి
చెలియలితోఁ గూడఁ జెఱసాలవైచి
యతరేసి వడిగేసియను దైత్యనాధుఁ
గుటిలతనందుని కొమరుఁపైబనిచె (3070)
మంత్ర కూటమున దుర్మంత్రజ్ఞులైన
మంత్రులు భటులు భూమండలేశ్వరులు
గొలువ మీసలు దిద్దికొనుచు నేత్రముల
జలజలనిప్పుల జడియుప్పతిలఁగ
స్వారాజు గిరిరాజు సడ్డగావింప
నీరసాస్థతిమార్త్యుఁడే నాకు నెదురు
శూలిఁగేలిననవ్వఁ జూచునాతోడ
నాలంబులో వీరలా పోరువారు
గరుడ దంధర్వ రాక్షసులకేనోడ
నరునకేనోడుదు నాపోరిఁ బోరి (3080)
చటులమాద్రోణ భీష్మక శల్య బలము
నటుచూపిగెల్చె దననిఁబోవ నీను
వావిరితనదైవ వంశమేనెఱుఁగ
నేవట్టి జర్కరనెఱప నేమిటికి
నెత్తిమాసారని నెత్తురుకందు
తిత్తఱిననునాజి నీల్గింతమనుచు
అనికొందఱటవారి నటపోయియిటకుఁ
బనిఁ బూనిరప్పంచి భంపవలయుఁ
దవిలిహస్తినిబుర ద్వారమేమరక
కువలయపీడమెక్కువలావుమెఱయ (3090)
వడినెక్కియాచక్కి వచ్చువారలనుఁ
దెడలించికెడుపు మందునుమీఱిరేని
సమమల్ల హృద్భుల్ల చాణూరమల్ల
విలుపండువనివీట విననెల్లచోటఁ
బలుదెఱంగులఁ జాటఁ బనుముఁడువేగ
రంగంబు క్షీరతరంగంబు చాయ
రంగు జల్లులరాజి రాజిల్లఁ జేసి
విమలముల్గావీధి వీధిలనెల్లఁ
దమఁగముల్పన్నుఁడు తమకముల్మాని
యని యాత్మఁదల పోసి యక్రూరుఁ బిలిచి (3100)
తనకేల లీలనా తనికేలు పూని
యున్నదమ్ముఁడవైన నాప్తుండవైనఁ
గన్నవారలు నీవు గడియును నీవ
తమమేలుకీళ్ళడుల కుందగులైనవాఁవ
వని నిన్ను నమ్మితి నంతరంగమున
ననిమిషాధిప ముఖ్యు లాలంబులోనఁ
దనువేఁడికోడి శ్రీధరు వేఁడికొనిన
శౌరియాతడె సీరి శౌరియుననఁగ
నారయ జన్మించిరని వింటినట్టి
బలకేశవులునందు పాళెంబునందుఁ (3110)
జలపట్టి తనుఁబట్టి చంపెదమనుచి
నెన్నుదురటు వారినిటు తెమ్మువింటి
జన్నంబటంచు ధర్మము తొంటినాఁడు
మల్లనాగములచే మహియెల్లఁ దల్ల
డిల్లఁదద్బల మెల్లడించి సంపదలఁ
జాలి కోసల సాల్వ సహితంబుగాఁగ
నెలెదమోలోక మేకచక్రముగ
ననివేడు కలహెచ్చి యంబరంబిచ్చి
యెనయఁ గౌంగిటగ్రుచ్చి యెత్తుననతఁడు
ఇదియేమి నన్ను నీవింతజేసెదవు (3120)
తుదినీదుపంపుజాతులు ప్రసాదంబు
ఇందు మించిన భాగ్య మెయ్యది వేయి
చందంబులనుమదిఁ జర్చింపననుచు
ఘన మనోరథము సంగతినొప్పురథము
నెనలేని వేడ్కతో యెక్కియందరిగె
వేగ కంసుడు మృత్యువక్త్రంబు దూరు
పగిగొల్సెడవించి భవనంబుజొచ్చె
అంతనంద వ్రజంబటు కేశిడాసి
యంతకోగ్రతమించు హయమూర్తిఁదాల్చి
తుంగ ఖరోద్ధూత ధూళి దిక్పాళి (3130)
నింగిగప్పుచు దేవనికరంబు బెటల
నాననంబెత్తంగ నాకేశిడాసి
పోనీక తత్పదంబులు పట్టి శౌరి
యతితీవ్ర గతినొప్ప నగలంగఁ ద్రిప్పి
శతచాపదూరంబు చనవైచియార్చె
చిమ్మి మోకాళ్ళ మోచేతులం గ్రమ్మి
యమ్మహాసురవైరి యవనిపైఁ గెడపి
వ్రేలువ్రేతల వేవేలు చందముల
నాలీలనెన్నంగ నరిగెఁబల్లియకు
రమణీయ మౌక్తిక రదుఁడు నారదుఁడు (3140)
కమలాక్ష బల పాదకంజాతములకు
వినతుఁడై నుతుల గావించి భావించి
వనజాక్షుఁడటు చేయవలయు కార్యములు
పలుకుచు సకలసందలును బొదల
జలజాక్షుఁ గనికనిచనియె భూనాధ
యటని లాయనకేళి పరివేడ్క గోప
పటలితోఁ బర్వత ప్రాంతంబునందు
గోలలౌపడుచులు గొఱియలై యుండ
బాలకుల్గొందఱు పాలకుల్గాఁగ
గడుసులనెల్ల దొంగలు గొనమర్చి (3150)
వడిమీఱిపంక్తికై వడినాడుచుండ
మాయాఱి వ్యోమనాయక నిర్జరారి
యాయెడ నెడకొల్లయై వచ్చిచొచ్చి
యేపురార్వురు చిక్కనందఱ బిలము
లోవైచిరాతపెల్లుగ రాయి ద్రోసి
యేతెంచి యిరుజేయి యెఱుఁగకయుండ
నాతఱితలనాఁడు నసుర నీక్షించి
నీయాటమేలురా నీచ నిశాట
కాయలునింక నెక్కడికే గెదనుచు
నలికమై గోవిందుఁడా మందుఁ జంపి (3160)
బీలమువాకిటి రాయిపెడకేలఁ ద్రొచ్చి
లాలించి పిలిచి బాలకుల వేడుకలఁ
దేలించి మందకేతెంచె నత్తఱిని
ననవరతాక్రూరుఁ డక్రూరుఁడబఘఁ
దనుపమ హరిభక్తుఁ డరుగుదెంచుచును
నేదానఫలమొనాకీదానవారి
పాదారవిందముల్ భజియింపఁ గలిగె
నజశంకరామరేశాది కిరీట
రజమెవ్వనికిఁ బాదరజమై చెలంగు
నామాధవుని గాంచునట్టినా పుణ్య (3170)
మేమని వర్ణింతు నిందిరాకాంతు
నరిబుద్ధినైనఁ దెమ్మని పంచెఁనాకుఁ
బరుఁడె కంసుఁడు ప్రాణబంధుండుగాక
నావటి పామరనకుఁ గల్గె దేవ
దేవుఁ జూడ గనాదియపోతపంబు
ఈయెడ కంసహితుఁడని యోర
సేయునోననుభక్తి సేయునో యేల
నాయెడ సర్వాత్ముఁడగుటఁ గృతార్థుఁ
జేయునేనను దయసేయు నేయనుచుఁ
గళుకులై బెళుకు నుంగరపు ముంగురుల (3180)
కళుకులై వెలిదమ్మిగసరు నేత్రముల
నిలసంపగుల హసియించు నాసయును
జిలుకు వెన్నెలతేట జిలుకులేనగవు
మొనరముల్గల శౌరి మోహనాననముఁ
గనుగొందునేఁడెనిక్కముగఁ జొక్కముగ
వనమృగావలినాదు వలిచాయకలిగెఁ
జల్లప్రోద్దుననేను జలజాక్షుఁ గాంచి
యుల్లసమారంగ ............
నెమకెడుకేలమై నివురుగాయనుచుఁ
గందమాకందము కుందారవింద (3190)
చందన స్యందన తాల తక్కోల
బృందయై యొప్పారు బృంద సొత్తెంచి
పొదరి ......
పొదరిండ్లలోపలఁ బొదలు గొల్లెతల
తరిలేచిలేగలందల పోసి పాలు
కురియఁజేసిన పోదుగులనేల జీర
మఱల కిందులకుసంభార వంబులును
బఱువ ...............
పచ్చగందనియచ్చ పచ్చికల్మేసి
మచ్చరంబెచ్చ మర్మలయుచుఁబొదలి (3200)
బహు గుహాంతరములఁ బ్రతిరవం బెసఁగి
మహిఱంకెలిడుచు
రిక్కలువెట్టి హుండ్రిక్కుడటంచు
దిక్కొల్పి వికవికఁ దెగడు వల్లియలు
చేకొని వారింపఁ జేరు గోపికల
సొరిది గరాళింపుచును మందపట్ల
కరమె
చనిచని నోటికి చలియైన పూరిఁ
దినివెన్ను చఱచి పూఁదేనె తియ్యముల
నీరాని నెమ్మదినెమరు వెట్టుచును (3210)
జేరువ గుమురుగాఁ జేరి ధేనువులు
కొదమలేఁ గలతేఁటి కొదమల సూటి
కుడుచునప్పుడు పొదుగు లుపయోదములు
వడువున క్షీరముల్వర్షింపుచుండ
నడరఁ విష్ణుఁడె కృష్ణుఁడైన నాపాల
కడలియుఁ గడక నిక్కడనిల్చెననఁగ
నురువులు గట్టి మిన్నుల గబ్బమనుచు
నీఁతలైమ్రోతలై యేఱులై తరణి
కూతురిఁ గలసిపైకొని పారుచుండ
యమున గంగయుఁగోడె ననిసరల్మునులు (3220)
భ్రమసిరి సిరిఱేనిప
గనుకొని యాకడలింగడచియే తెంచి
కమ్మపూఁ దేనెలఁ గలయుపుప్పొళ్ల
నుమ్మఱి రధముడాయుచు దోరగిలఁగ
వడిమీఱుమావుల వడిమీఱఁదో
బలరామ గోవింద పాదారవింద
హలజలజాత రేఖాంకములైన
యడుగుల పొడగాంచి యరదంబుఁ డిగ్గి
కడుబొంగి వేడుకఁ కన్నీరుగాఱ (3230)
హరిభక్త
శరదాగమోత్ఫుల్ల జలజ నేత్రులను
హరిణాద్రిజలజ మోహన సుగాత్రులను
గురుతరోజ్వల నక్రకుండల రశ్మి
సురనదీ యమునోర్వి శోభితభుజులఁ
హరిణాంక ముకుర సమానంబు జులఁ
గమనీయవనమాలికా విభూషణిల
సమధికా మృతరస
జిరతర వైభవ శ్రీనికేతనుల
వితతకీర్తులనాది విష్ణుమూర్తులను
బుష్పిత హృదయుఁడై పొంగి యానంద (3240)
బాష్పంబువుల నర్ఘ్య పాద్యంబు
యక్రూర లెమ్ము లెమ్మని యెత్తికొనుచు
బలునకు నీరీతిఁ బ్రణతులొనర్ప
బలుఁడు శోభిత భుజాబలుఁడు నాభక్తుఁ
గ్రుచ్చి మోదమున నక్కున నక్కుఁ జేర్చి
హరిదాసునింటికి నతని దోడ్కొనుచు
నరిగి గద్దియనుంచి యర్చించి మంచి
పసిఁడి బిందియనీటఁ బాద్ముల్గడిగి
మసలక తోడ్తోడ
సకలరసాన్నముల్జనని వడ్డింప (3250)
జనకుండుదారు భోజనము గావింప
ఘనసార ఘనసార గంధముల్పూసి
ముఖవాస తాంబూల ముఖములైనట్టి
యఖిలోపచారంబు లలవడఁ జేయు
నరిది నందుడు సేమమరసె నాపజ్జ
నరవిరి సెజ్జపై నక్రూరు శౌరి
తనువొయ్యనివిరి పాదము మీఁదవైచి
పినత్రండ్రి తానల్లి బల్లియైయుండి
కుశలమే నీకు నీకూర్చు వారలకు
జయమే శుభంబే భూజనులకునెల్ల (3260)
నయయుక్తమే జననాధు వర్తనము
భూమి పాలింపుచు భోజేంద్రుఁడైన
మామకు లగ్గెనేమమె బంధువులకు
నని నీవు వచ్చుటేమనిని నాఘనుఁడు
తనవచ్చు రాకకెంతయును నెంతయును
వివరింపగా విన్నవింప మాధవుఁడు
చివురుకెమ్మోవిమైఁ జిగురొత్త నవ్వి
వలయు రీతులఁ జేయు వలయుఁ గార్యములు
బిలిచి నందునకుఁ జెప్పిన నతండపుడు
అరియప్పనంబు పుల్లరి నేయిపాలు (3270)
పెరుగులు దెప్పించి పిల్చి గోపకుల
మనల బాణాసన ముఖము చూడంగఁ
జనుదేర విమలనచారు నక్రూరు
ననిచె భోజుండు నేఁదని చెప్పివయన
మునకుఁ దానాయుత్తములు సేయుచుండె
ననియోగిజనపాలుఁ డాజనపాలుఁ
డనుమోదమంది నిట్లని యానతిచ్చె
నని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రు మాతకు వనధి జాతనకును
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని (3280)
గనక గాత్రికిని బ్రకామ ధాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుబాహకును
సారలావణ్యకు సకల గణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుపాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును
హైమసంవ్యానకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్ర సేవితకుఁ (3290)
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకుఁ బన్నగసుతావృతకు
మృగమదాంగకు నలమేలుమంగకును
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజాకర తాళ్లపాకాన్నమార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుండలయుగ్మ మండితకర్ణ
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ (3300)
విదిత మానస తిరువేంగళనాథ
విరచితంబగు ప్రతిద్విపదసంశ్రవణ
తరళిత కవిమస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్టమహిషీ వివాహ
మనుకావ్యమున ద్వితీయాశ్వాసమయ్యె
ద్వితీయాశ్వాసము సమాప్తం
(తరువాయి భాగం "తృతీయాశ్వాసము")
No comments:
Post a Comment