ద్వితీయాశ్వాసము
(శ్రీదేవి మహిమవర్ణన)
భువనైకమాత యంభోరాశిజాత
కువలయదళనేత్ర కోమలగాత్ర
జలజలోచనురాణి జలజాంకపాణి
యలకనిర్జితభృంగ యలమేలుమంగ
యవధరింపుము దేవి యమ్మహామౌని
కువలయేశుఁడువల్కెఁ గువలయేశ్వరుని
జితకామపాలు నాశ్రితకామపాలు (1560)
హతదైత్యభూపాలు నాకామపాలు
నింటిలోనునిచివేయింటిలోనేర్చి
దంటలౌ గోపాల తనయులఁ గూడీ
గోపచిహ్నములఁ గైగొన్నగోపాలు
గోపాలనముసేయుఁ గోరిదైత్యారి
భవనుతపదనీర భవయైన విజిత
భవయైన రవితనూభవఁ జేరియపుడూ
కనుపట్టివెన్ను చెంగటి నీలవేణి
యనఁటికెమ్మొగిమీఁది యలిపంఙ్తిదెగడు
మొగులులోపలిమించు మురువున గళము (1570)
దగిలినపికిలి పూదండచూపట్టఁ
బాటల తిలక చంపక తరుచ్ఛాయఁ
బాటలనాటలఁ బరుఢలించుచును
భండనగజదైత్య భండనోద్దండ
చండ తాండవ లసచ్ఛండికా ధవుని
దండినభ్రమున మార్తాండ మండలము
మండుచుండెడు నిండుమండువేసవిని
పసియెల్లమిసిమిమై పసగలసవు
మెసవిమూతులుడప్పి మీదికెత్తుచును
జలశాయి జయకేతు చయములఁబోలు (1580)
గళకంబళంబులా కంపంబునొంద
సురనదీ శీకర స్ఫురదీశజటల
గరిమలకడవగొంగడి దండలమరఁ
గనుపట్టునెఱమంటి కట్టులతోడఁ
గొనకొమ్ముతుదనారకుంచెలల్లాడ
సెలవులనిడిన పచ్చికలు చలింపఁ
బలుమఱునదరివెంబడియున్నపసులఁ
దిరిగి చూచుచుఁ బంచతిలితోఁకలెత్తి
పరువడిఁగెరలి హంబానినాదములఁ
గాళియ భుజగాస్య గహ్వరోదగ్ర (1590)
హాలాహలాభీలమగునొకమడువుఁ
గనిపోయి యాయుదకముద్రావఁ గోప
జనమునా జనమునావను గ్రోవిక్రొవ్వి
విపులాతలేశయా వ్రేకుఱ్ఱలావు
లపుడు మూర్ఛలనొంది నరసియందంద
హరియు నాత్మీయేక్షణామృతదృష్టిఁ
గురియించి గోగోపకులమూర్ఛఁ దెలిసి
భోగినేననియెమ్మఁ బొరలినతనడు
భోగమంతయిఁ బొట్టుపొరలుగావింతు
దట్టించికినిసినతనతలగొట్టి (1600)
పుట్టపైఁ బెట్టింతు భువియెల్ల నెఱుఁగఁ
గాలూఁద కుండంగఁ గదియు కాళికిని
నాలుకల్ గ్రోయింతు ననుడాసెనేని
యేబొక్కసొచ్చిన నెందుడాఁగినేని
నాబలస్ఫూర్తినెంతయుగెల్ తుననుచు
హరి నీలనాళాగ్ర హైమ సంఫుల్ల
సరసిజంబున జటాసహితాస్యమమర
దట్టమైకెంగేల దట్టిబిగించి
గట్టిగాఁ గట్టియగ్గలికమీఱంగ
నలవిమీఱుచుఁ జెంతనలరు సత్కుసుమ (1610)
ఫలకదంబముఁ గదంబముఁ గాంచియెక్కి
వడినార్చి సప్తార్చి వడువునఁజేర్చి
మడువునెన్నడుమ సంభ్రమము దీపింప
నభమునకెగసి పంతముపచారించి
గుభులు గుభుల్లున గుప్పించి దుముకెఁ
గాలాహియల చుధాకలశంబుఁ జుట్టు
లీలనాచక్రిఁ గాళీయచక్రిపొదువ
గొబ్బుననిక్కి మార్కొని భుజద్వయము
నుబ్బించియార్చుచు నుబ్బియాగబ్బి
పటుతమః పటలంబుఁ బాపిన సూర్యు (1620)
ఘటనఁ దద్భోగిభోగమువిడఁ దన్ని
సరసతర విభవాంజన వేణివేణిఁ
గరమునఁబట్టిన గతివానిఁ బట్టి
ఫణిరాజుపైఁ గూర్మపతినిల్చెననఁగ
ఫణిశాయిపదము పత్ఫణవీధిమెట్టి
వాలంబు బాలశైవాలంబు దిగుచు
లీలఁగెంగేలఁ గీలించి తూలించి
చరణపద్మము పరసాధనంబైన
గరుడోరుపక్షంబు గరిమమైసోఁక
బక శుక చక్రశాబక పికధ్వనుల (1630)
ప్రకటనర్తక తాళపద్ధతుల్ గాఁగ
సంచదాసంచీర చంచరీకముల
యంచితరవముగా నాళియైపరఁగఁ
పటలిభవత్స్వేదపక్షిపక్షాగ్ర
రటనముల్పటుహ సంగ్రామముల్గాఁగ
విషపావకావృత విపులాంతరిక్ష
కషణఫణాళి రంగస్థలిగాఁగఁ
జందపద్ధతి భోగసత్వంబు చెదరఁ
జండమరీచి చంచత్కుండలములు
మండితనిజ గండమండలీ యుగళిఁ (1640)
దాండవం బాడంగఁ దాందవం బాడి
యుడిపంఙ్తి దివినుండి యొరఁగిన రీతిఁ
బడగలమణులెల్లఁ బండ్లూడిరాల
డిల్లసొంపరితల్లడిల్ల భోగంబు
గుల్లలతిత్తియై కుల్లబింకంబు
పెంచి గుప్పించి గుప్పించి నొప్పించి
డంచియడంచి వాటముగ గాటముగఁ
బట్టిగిట్టియుఁ జలపట్టిమైపట్టి
కొట్టివాలంబు మార్కొని చుట్టిపట్టి
దట్టించి గట్టించి దర్పంబు బలము (1650)
వట్టించి రక్తంబువాఁతఁ దొట్టించి
వికవికనవ్వెడు వేళనవ్వేళఁ
బికవాణులరుదంది భీతిచేగుంది
జిగిపయ్యెదలనెడసిన చన్నుఁగవ్వలు
మొగులుమూయని శైలముల పెంపుచూప
సంగపంగి క్రేగాలిఁ జలియించుతేఁటి
గుంపులగతిఁ గప్పక్రొమ్ముళ్ళువీడ
జలములఁదోఁచిన జలజపత్రముల
చెలువున భాష్పముల్ చిలుకు నేత్రముల
గనలెడు రాహువు గళము సొత్తెంచు (1660)
వనజారి గతినొప్పువాడుమోములను
స్రుక్కుచువచ్చి యశ్రువులులోలోనె
గ్రక్కుచుఁగరములు గూర్చిమ్రొక్కుచును
వసుదేదేవపుత్త్రయో వసుధాకళత్ర
వసురాజమిత్ర సర్వసురాధిపత్ర
పతిభిక్షయోసఁగు శ్రీపతి దుష్టభోగి
పతి నీకుఁ బ్రతియె యప్రతిమానమూర్తి
కరుణాసముద్రనికరమైన గరము
కరముపాములకవకల్పించి తనుచుఁ
బన్నిన దైన్యమేర్పడఁ జేయినట్టి (1670)
సన్నతుల్మెచ్చునాసన్నుతుల్ సేయ
భోగీంద్రవరభోగ భోగి యానాగ
నాగయానలఁ గరుణాదృష్టిఁ జూచి
దాలినగాళుతుఁ గాళిందిలోని
లోయంబు విషములతో యంబులయ్యె
నీయంబులిట మదీయేక్షణఘటన
నమృతరూపములయ్యెనరుగుమువేగ
రమణ నదీద్వీపవర్యమునకు నీవు
మస్తంబుమీఁద సమస్తంబునెఱుఁగ (1680)
శస్తంబులైన మచ్చరణచిహ్నంబు
లున్నవి నీవెండునున్న విరోధి
పన్నగాంతకుచేత భయమింతలేదు
అనునఁ గాళియభోగి యాభోగిశయను
వినుతించి వరవస్తు వితతిఁ బూజించి
చనియెనక్కొలను రాక్షసవైరి వెడలి
తనవారి తనమునఁదనవారిఁ జేసి
యానందితాత్ముఁడై యానందముఖ్యు
లానందమునుజెందనా మందకరిగె
మఱునాఁడు హరిబలల్ ల్మఱునాడుదెలుపు (1690)
నెఱయుసొంపులఁదాపనీనదిఁ జేరి
యుద్దించి గద్దించి యొడఁబడిపడుచు
లుద్దులైరాఁగఁ బెన్నుద్దులైతాము
నొక్కఁడొక్కని గెల్చి యొక్కనిపైనొకని
నెక్కించుకొని చలంచెక్కించికొనఁగ
దామోదరుఁడు హసోద్దాము శ్రీరాముఁ
దామ్రోవరాముఁడత్తఱిఁ దరిద్రొక్కి
బాలుఁడై కపటగోపాలుఁడై యున్న
లాలితోపాయుఁ బ్రలంబదైతేయు
పైపైచలంబెక్కి పైయెక్కికొన్న (1700)
కోపంబుతోడ నక్కుటిల దానవుఁడు
వనములఁ జటుల దావనములఁదిరిగి
ఘనవాయు వేగంబు గడచి పోవుచును
జండీరమణి జటాసమజ డిండీర
భండీరవట సమీపమునకేతెంచి
మానవరూపంబు మానివే వేగ
దానవరూపంబుఁ దాల్చిన బలుఁడు
తెగువమై దృష్టి సంధించివేవేగఁ
బగతుమస్తములై చెఁ బఱియలై పోవ
హారవంబుననీల్గి యదివ్రాలనమ్మ (1710)
హారవంబుననద్రులదరె నెంతయును
రాముండు లోకాభిరాముండు హేమ
దాముండు హరియుమందకునేగెనంత
కనలిదిక్పతులు రాక్షసులపై వెడలి
యనిఁజిమ్ముకిరు సులోయననటించుచును
నెఱివైనకలిత వర్ణింపనందెసఁగు
మెఱుపుల చందాన మెఱపులు పొదలె
నీలవర్ణుని మూర్తి నిఖిలంబుగప్పు
పొలికెదట్టమై మొదలె మేఘములు
సరసతల్ కలి మానసంబునజిందు (1720)
సరవినంచలు మానసంబునఁజిందు
సరవినంచలుమాన సంబునఁజిందు
సరవినంచలుమాన సంబునఁజేరె
బరపశ్చిమాంగన వరుణమైవైచు
వరుణమాలికఁబోలె వజ్రధర్మంబు
ఉడుపంఙ్తి కంసవధోత్పాతంబునకు
వడినట్లువడగండ్లు వడియెనల్గడలఁ
గడలిపైఁ బొరలెడుకరడులోయనఁగ
నుడువీధి బకపంఙ్తులురుగతి నడచెఁ
గలిగిన పక్షిసంఘములతోనెల్లఁ
దలయెత్తిచూచె చాతకనికాయంబు (1730)
తిరుపు గట్టెడు సురస్త్రీలకాశియల
మురువున సితికంఠములుపురుల్విచ్చె
నలసస్యగర్భయౌనచలపాలిండ్ల
చెలువున నీలాగ్ర శిఖరులు వెలసెఁ
గాలాభ్ర భూతముల్ కళపెళనార్చు
పోలికె గర్జితంబులుమింటఁ బొదలెఁ
బొలుపునవెల్లువల్ పొదలెనంతటను
ఒలసి కుంభద్రోణ పాతంబుగాఁగఁ
గారుక్రమ్ముచు నేర్లు కాలువల్బెఱయ
ధారాధరోధార ధారలు నిగిడె (1740)
నిలకునుమింటికి నేకసూత్రములు
గలిగినట్టుండెఁ దద్ఘనధారలపుడు
జలజాస్త్రహత కామిజన మాంసఖండ
కులములోయననింద్రగోపంబులమరె
ధారుణీ కుచహార తతులీఁ యనంగఁ
జారుశైలాగ్ర నిర్ఘురములింపొందెఁ
బచ్చ సూర్యపుటంబు పగిదినల్దెసలఁ
బచ్చికల్మొలచి చూపట్టెనంతటను
గాలతోయములోని కరపుమీలకును
గాలంబుగతి శరత్కాలమేతేరఁ (1750)
గమలాకరంబులు కడుతేటలయ్యెఁ
గమలాకరశ్రీలు కడువిస్తరించె
రసములవింత సారసపునారనము
పొసగించి విరహులఁ బొంచె మన్మథుఁడు
విరిసె దిక్తటులకావిరివిరివొదలె
సరస వాసనలతోఁ జల్లనైయలరెఁ
గాముల హృత్సంగములరాదిగిచె
వామాక్షి వాగురువ్రాతంబులంత
మురవైరి హరి జగన్మోహనాకారు
సిరికూర్మిమగని వీక్షించి యాదేవు (1760)
వికసిత నయనారవిందంబులకును
జగచకల్గల చూపుచందమ్ములకును
దిలకంబుమైనెఱితేఁటి మూఁకలకు
మొలక నవ్వులతేనెముసురుజోకలకు
మకరకుండల కాంతి మలయుచెక్కులకు
సుకుమారలోలల సొలయుటక్కులకుఁ
దనరెడుకొప్పుపూదండ చుట్టులకు
గొనబులు పేటాడు కొసరుతిట్టులకు
సంపంగి భంగింపఁ జాలునాసకును
సొంపులుమీఱంగఁ జూపునాసకును (1770)
బలుచనియధర బింబఫలంబునకునుఁ
బొలుపైనసోయ గంబుగళంబునకును
జొక్కి గోపికలెల్ల సూనాస్త్రుబారిఁ
జిక్కి కృష్ణుని వలఁజిక్కిమైమఱచి
యేనోమునోమంగనితనిఁ జూచితిమి
మేనోమునోమినామితని కూటమికి
ననుచుదెందంవుల నంతనంతకుఁ బ్రేమ
నినుపులైదైవాఱి నీరధుల్గాఁగఁ
గిరుసువంకలయొప్పు గిరికొన్నకప్పు
నెరుల సోగలజడల్ నిగనిగమెరువ (1780)
బిగువఁ జన్నులజిగిబిగి శౌరిఁ జూచి
తెగడిపయ్యెదలింత తెల్లగిల్లంగ
బదపడిచాఁచిన బాహుమూలముల
నుదిరి బంగారుపొడియురిదిమైరాలఁ
గుంగుమ మర్జునాంకురములయడవి
సంకుమందంబు పచ్చని యక్షతములు
పట్టిచూపట్టిడాఁ పలికేలమడుఁగు
పుట్టమువ్విన్నాణముగఁ గీలుకొలిపి
సమధూపరాగ కింజల్క గంధాక్ష
తములు మాధవునకీఁ దలపోయుదాని (1790)
నిండి జక్కలతోడి నింగియుఁబోలెఁ
బుండరీకములచేఁ బొలుపొందువాని
సంగీత పంచమ షడ్జముల్మూర్తు
లంగీకరించెనోయనఁ జెంతఁబల్కు
కలకంఠముల భుజంగగ్రాస నిరత
కలకంటములతోడఁ గడునొప్పుదాని
గమలభూషణపేటి కలలక్షముద్ర
లమరించెననఁ గోరకాళులదాని
గడకాటుకలతోడి ఖచరకన్యకల
బెడఁగుఁగన్నులు ప్రతిబింబించెననఁగ (1800)
జలములతో వికాసమునొందిమిగుల
వలనొప్పునల్లగల్వల నొప్పుదాని
నురుతర వనరాశి యుప్పనిరోసి
వరతోయ మాననీ వలికేగుదెంచు
కాలాభ్రములఁబోలెఁ గమలమంజరులఁ
గ్రోలెడు భృంగ చక్రంబులదానిఁ
గాషాయ జపమాలికలు దాల్చి విగత
రోషులౌ సంయమీంద్రులు నాఁగనొప్పు
బిసముల నూలితోఁ బెడఁ బాయకుండఁ
గసికాటుకాటుల ఖండించుకొనుచు (1810)
వికచారుణాజ్జాత వీధులనున్న
ఒకములు హంసశాబకములు గలిగి
యానందనందను నాత్మలోఁదలఁప
నానందభాష్పంబు లలరి నేత్రములఁ
గ్రమ్మెనోయనఁగాలిఁ గదలింపఁదొలఁకు
తమ్ముల వరమరందమ్ములదాని
దమ్మురేయెడనిన తమకంబుతోడ
నమ్మునిపతులకు నమికల్వుట్ట
వనదేవతలు మెచ్చ వనములఁ గ్రుంకి
కనలిమడ్డులు నారికలనెత్తెననఁగఁ (1820)
దుండాంతరములఁ జెఁదివల బిట్టగల
ఖండించు వరచక్రకాంతులదాని
ఘనమౌనివర్య హృత్కమలంబులందు
ఘననీలవర్ణుండు గనుపట్టుపగిడిఁ
దేనెద్రావిన జొక్కుదేరకతావు
లానెడు కమలభృంగాళులదాని
యమున శ్రీహరిసహాయమున నాభార
కుముదలోచనలు వేకువజాము చేరి
హరిభక్తియుక్తులై యనిశంబునిట్లు
హరిభర్తయగుఁగాక యనుచునోముచున (1830)
గొలకులనీరాడఁ గోరిపుట్టములు
కొలఁకులనిడి జలక్రీడఁ గావింప
సలలాత్మమానససంచారి శౌరి
యొకనాఁడు తనుఁ గోరియున్నట్టివారి
నతులితభక్తినింతంతని యాత్మ
మితియెన్నరాక కామితఫలప్రదుఁడు
వారిచెంగటనుండువారి పుట్టములు
చేరి జేకొని చేర్వఁ జలఁగు నీపంబు
కొమ్మలపైనెక్కి కొనియాడు గొల్ల
కొమ్మలఁదనువేగఁ గూడరమ్మనిన (1840)
నాడబోయిన తీర్థమదియెదురైన
జాడఁగృష్ణునిగని సంతసించుచును
గౌనులువంచి యంగములెల్లముంచి
నానవాటించిలే నగవులతోడ
నుడురాజు మరలిన యుదయాస్తగిరుల
నడుమఁ జీకటి పర్వునటన సిగ్గులను
బెడమరలఁగఁ జడల్ బిగిజన్నుఁగవల
నడుమఁ జూపట్ట నంద~ౠనూరకుండ
వారిలోదళు కొత్తువారిలో నొక్క
వారిజగంధియో వారిజనాభ (1850)
యోదకమగవారికి విదలుజలము
లాడంగ సరసంబు లాడంగఁ దగునె
మానమేరికి సమానంబు తమదు
మానంబుగాచి మామణుఁ గుఁబుట్టము
సాధింప కింకఁ బ్రసాదింపుమయ్య
కాదన్ననిను మీఱఁ గలమెయేమనిన
చిఱునవ్వుకెంజాయ చిలుకిఁకెమ్మోవి
నెఱయంగఁ గృష్ణుడా నెలతఁ జూచి
మీరలు నామాట మీఱకవచ్చి
చీరలు గొనుఁడు నాచేతివియనుడుఁ (1860)
జలిక్జొప్పులను గప్పుచన్నులతోడ
మొలబి సములబాగు మురిపెంబుదొలఁక
జలజాస్త్రుడలుగులు జళిపించుకరణి
వలికిమేనులొ కింతవణఁకుచునుండ
స్మరగేహ పల్లవాచత్తోరణముల
కరణి సిగ్గులపట్ల కరములింపొంద
మొగులువాసినమించు మొలకలో జోలు
దిగిచిన సూనాస్త్రుతేజులోయనఁగఁ
గవిసెన వెడలించు కన్నాళ్ళొయనఁగఁ
గవగూడియమున దిగ్గనవెలువడుచు (1870)
వడిఁదెనెగురియు కల్వలదండలనఁగ
వడియుతోయములతో వలనొప్పు జడలు
చూడఁ జొప్పడఁగవా సులతోఁడఁ గూడ
నాడిరిచీర లిమ్మనుచు నావేళ
నాపాదపముదిగి హరియు గోపికల
యాపాసమస్తంబు లోసి నవ్వుచును
గరము కాంతాంబరాకరము తచ్ఛాఖ
కరమువేడుకఁ బట్టి క్రమ్మఱఁబల్కెఁ
జేలలు సడలించి చిరతరపుణ్య
శీలలు జలకేళి సేయంగఁదగునె (1880)
ప్రణతులొనర్పుఁడు పద్మకళత్ర
మణికి యాదవశిరోమణికి మీకిట్టి
యనుపమ దోషంబులడఁగుఁదమంబు
నినుఁగాంచి తొలఁగి పోయినమాడ్కిననిన
శైల నిర్ఝరనీర సంగతాఖండ
బాలశైలవలలతా పంక్తులయొప్పు
దొలఁకంగుబ్బలొకింత దొలఁకఁదన్మధ్య
జలసిక్తరోమాళి సరణులేర్పడఁగ
బొటవ్రేళ్ళు నిక్కనొప్పగనొంటికేలు
నిటలంబునందుఁ బూనికఁ జేర్చి మ్రొక్కె (1890)
గేలికైననునొంటి కేలి యీమ్రొక్కు
లేల నియ్యవిశాస్త్ర హితములేతలఁపఁ
గరయుగంబుల మ్రొక్కఁగా నొప్పునిప్పు
డరవిందలోచనుఁడనిన గోపికలు
మ్రొక్కఁబోయినవేల్పు ముందఱనిల్వఁ
జిక్కినియీవట్టి చింతవేలనుచు
ఫాలభాగంబులఁ బాణిపద్మములు
గీలించితను నాత్మగీలింప శోఉరి
చుఱునగవి గురించి చిగురాకుమోవి
నెఱయఁబుట్టంబులా నెలఁతలకొసఁగి (1900)
కంటిఁజొప్పడని మీఘసమైన కోర్కి
గంటిఁ జేకొంటి ముంగలి రాత్రియట్లు
భావింతుననుచునప్పుడఁ తులఁబనిచె
బృందారకార్చిత పూజుండు నగుచు
నందనందనుఁడు మందలవారితోడ
యముననయ్యమున నొయ్యనఁ జేర్చియచట
నమలసైకతముల నాటలాడంగఁ
బటుతరాతపమున బడలి గోపికలు
కటకటాకృష్ణ్యాఁ కటనిట నొవ్వఁ
గనుఁగొని మాకొక్క గతిచెప్ప మిప్పు (1910)
డనవిని శౌరి చయ్యనవారిఁ బిలిచి
కులశీలయుత విప్రకుల జాతలగుచు
మెలఁగు మద్భక్తి గామినులుఁ గామినుల
రాగంబులోనాంగి రసమను నొక్క
యాగంబు ప్రాణేశులాచరింపంగ
నున్నారు బలకృష్ణులున్నారటాన్న
నన్నంబు వెట్టెదరని పంపనరిగి
జన్నంబు గావించు జనుల వీక్షించి
యన్నంబు వేఁడిన నగ్నులైవారు
పరిహరించిన శౌరి పలుకులుదలఁచి (1920)
(ఇంకాఉంది )
http://vocaroo.com/i/s0wM4ermEK3D
ReplyDelete