శతకాల గురించి తెలియని తెలుగువాడు ఈ తెలుగుగడ్డ మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన చిన్నప్పటినుంచి అన్నిటితో పాటు తెలుగువాచకంలో మనకి నేర్పిన వాటిలో ఇవి ఇప్పటికి మన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. వేమన శతకం (ఉప్పుకప్పూరంబు నొక్కపోలికనుండు), సుమతీ శతకం (శ్రీరాముని దయచేతను), కృష్ణ శతకము (నీవే తల్లియు తండ్రియు), దాశరధీ శతకము, కాళహస్తీశ్వర శతకము, లోని పద్యాలు మన చిన్నప్పుడు అర్ధం తెలిసినా తెలియకపోయినా బట్టియం వేసినవాళ్ళమే. తరవాత కాలేజీలలో అంత పెద్దగా చదువక పోయినా చిన్నప్పటి పద్యాలు గుర్తుకొచ్చినప్పుడు అహా ఎంత బాగుంది, ఎంత అర్థం ఉంది అనుకోవటము చాలమందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. నాకు సరిగా ఇలాగే జరిగింది. ఎలాగంటే ......
ఒకరోజు అంతర్జాలంలో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి పుస్తకం ఒకటి దొరికింది. పంతులుగారు ఆ పుస్తకంలో ఒక పూర్త్తి చాప్టర్ శతక సాహిత్యానికి కేటాయించటమే కాకుండా వారికి దొర్కిన చాలా శతకాలను ఆ పుస్తకంలో పొందు పరిచారు. ఆ పుస్తకం చదివిన తరువాత నాకు అసలు ఎన్ని శతకాలున్నాయి అన్న ప్రశ్న మొదలయింది. అందుకోసం అంతర్జాలంలో వెదుకులాట ప్రారంభించాను. ఆ వెదుకులాట నాకు దాదాపు 450 శతకాలను సంపాదించి పెట్టింది. వాటి వివరాలన్ని ఒక పట్టిక తయారు చెయ్యటం దాదాపు పుర్తి అయ్యింది. ఐతే ఈమధ్యనే పండిత వంగూరి సుబ్బారావు గారు రచించిన "శతక కవుల చరిత్రము" (1950) చదవటం జరిగింది. అందులో ఆ మహానుభావుడు దాదాపు 1200 శతకాలు 900 మంది శతక రచయితలను పరిచయం చేసారు. ఈ సంఖ్య దాదాపు 60 ఏళ్ళ క్రితం వరకు జరిగిన శతకాలాను సూచిస్తుంది. ఆ తరువాత అంటే 1950 నుండి ఇప్పటివరకు ఎన్ని శతకాలు వచ్చాయో ఆ వివరాలను కలిపితే ఈ సంఖ్య 3000 నుంచి 5000 వరకు వెళ్ళవచ్చును అనేది ఒక వాదన. మన తెలుగు సాహిత్యంలో ఎంతో అమూల్యమైన ఈ శతక సాహిత్యం లో దొరికిన మణులతో పోలిస్తే దొరకని ఆణిముత్యాలు ఎన్నెన్నో అనిపించింది. అంతర్జాలంలో కూడా ఏ సహిత్య సంభందిత సైటులో చూసినా 10 నుండి 15 శతకాల కంటే ఎక్కువ కనపడవు. తెలుగు వికిలో కూడా దాదాపు ఇదే సంఖ్య ఉన్నట్లు గుర్తు. మిగిలిన శతకాలు వాటి వివరాలు వాటి అతీగతి ఎవ్వరికి పట్టినట్లు కనిపించటం లేదు. తెలుగు సాహిత్యాభిమానులకు గర్వకారణమైన ఈ శతక సాహిత్యాన్ని కాలగర్భంలో కలిసిపోక ముందే రక్షించుకొనే అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వం ఇటు పండితులు, సాహిత్యాభిమానులు కలిసి ఈ సంపదను పరిరక్షించుకోకపొతే అపూర్వసాహితీ సంపదని కోల్పోయిన వారవుతాము. ఇంత అద్భుతమైన మన సాహిత్య సంపదను కాపాడుకోకపోతే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ ఆలోచనతోనే నాకు ఇంతవరకు లభించిన శతకాల వివరాలను ఒకచోట పొందుపరిచి తెలుగు భాషాభిమానులతో పంచుకుందామనే ఉద్దేశ్యాన్ని నా ముఖచిత్రం (facebook) మిత్రులతో పంచుకోవటం జరిగినది. ఈ విషయంలో వారి ప్రోత్సాహం నాకు ఎంతో ఉపకరించింది. ప్రోత్సాహమే కాక వారు వారిదగ్గర ఉన్న శతక వివరాలను కూడా నాతో పంచుకొన్నారు. వారిలో శ్రీ గంటి లక్ష్మీనారాయణ మూర్తి గారు వారి వద్ద నున్న దాదాపు 40 శతకాల వివరాలను దయతో నాకు పంపించారు. ఆలాగే శ్రీ అనంత కృష్ణ గారు వారి స్వీయరచనలయిన రెండు శతకాలను నాకు పంపించారు. బొమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు ఒక శతకం పంపించారు. ఇలా చెప్పుకొంటుపోతే ప్రతివక్కరు ప్రత్య్క్షంగా లేక పరోక్షంగా సహాయం చేసారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
ఈ సందర్భంగా అంతర్జాల మిత్రులకు నా మనవి: మీదగ్గర ఉన్న శతకాల వివరాలు (శతకం పేరు, రచయిత, ప్రకటించిన/రచించిన సంవత్సరం, మకుటం) లాంటి వివరాలు నాకు పంపితే బ్లాగులో పొందుపరుస్తాను. ఇందుకోసమై అన్ని వివారాలు ఒకేచోట పొందు పరచటానికి వీలుగావిడిగా ఒక బ్లాగు "శతకసాహిత్యం" అనే పేరున తెరుస్తున్నాను.

మీ కృషి చాలా బాగుంది సుబ్రహ్మణ్యంగారు.
ReplyDeleteమీ కృషి అమోఘం...శ్లాఘనీయం.. సుబ్రహ్మణ్యంగారు
ReplyDelete’మిత్రనీతి ’ మన తెలుగు భాషలో మరుగున పడిపోయిన మరొక మంచి పద్యశతకము. "మిత్ర..!" అనే మకుటంతో ప్రఖ్యాత సినీ గీత రచయిత శ్రీ కొసరాజు (కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, అప్పికట్ల, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా)వ్రాసిన ఈ శతకాన్ని కాక్స్టన్ ప్రెస్, మద్రాసువారు 1934 లో ముద్రించారు. శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు (BA, Lit., మచిలీపట్నం) గారు పరిచయ వాక్యాలు వ్రాశారు. ప్రతీ పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీతి వాక్యాలూ, సామెతలూ పెనవేసి పద్యాలను వ్రాశారు శతక కర్త. ఇంకొన్ని వివరాల కోసం:
ReplyDeletehttp://radhemadhavi.blogspot.in/2012/11/1934.html
ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ చూడండి:
http://radhemadhavi.blogspot.in/2012/11/1934_5.html
Let positive,strong,helpful thought enter into their brains from very child hood
ReplyDeletePlease listen "Bhagavat geetha, sundarakaanda "