7. సప్తమ పట్టమహిషీ
శ్రీ భద్రాదేవీ వివాహ వర్ణన ప్రసంగము
మేదినీశ్వర తమ మెనత్తయైన (6770)
శ్రుతకీర్తి తనయ విశ్రుతకీర్తి వినయ
(నతిదివ్యరూ)ప మోహనభద్రభద్రఁ
తకు గేకయ మహీధవుఁడు కల్యాణ
మొనరింపఁ గోరి కెయ్యునను బుత్తేత
నాననవిల్కాని యయ్య సొంపంది
యాన్నన చంద్ర సేవాసక్తి వచ్చు
నక్షత్రమాలిక నటనమైఁ దాల్చి
యిక్షు చాపుని తండ్రియింపు సొంపలర
చటుల నిజపాంగ చంద్రికా సార
ఘటికలో యన ముద్దుగులు కుచౌ కట్టు (6780)
ధరియించి జాతిప్రదళుకు వజ్రములఁ
గరమొప్ప రవిపదకంబు గీలించి
యరవిందమూల మత్తాళి చక్రముల
కరణిఁ జేతుల నీలకంతకంబు లలరఁ
ధవళాంశు రుచి ధాళధాళ్యమైనట్టి
నవదుకూలంబు వింతలుమీఱఁ గట్టి
పసనిడుపాగంబు పట్టుకుళ్లాయి
యెసపరిచందంబు లొలుకంగఁ దాల్చి
దేవకీ వసుదేవ దేవకుల్పలుఁడు
దేవేంద్రసుతుఁడునే తేరన్ల్గడల (6790)
నరి వీరప్రదరంబున రథంబునెక్కి
పరివారమును సర్వబంధువుల్గొలువ
ఘనతర పటహ ఢక్కాహు డుక్కాది
నినదముల్దిక్కుల నిండ ఘూర్ణిల్లఁగ
గరిమమైఁ గదలి కేకయపురంఉనకు
నరుగనప్పుడు కేకయాధీశ్వరుండు
తత శుభద్రవ్య సంతతులతో భూమి
పతులతో విప్రదంపతులతోఁ గూడఁ
గొమరు మీఱఁగ నెదుర్కొని వసుదేవు
కొమరు నవ్వేళఁ దోఁకొని యేగుదెంచి (6800)
యనుపమ హేమగేహమునందు నునిచె
జననాథ కేకయ జననాథ వరుఁడు
అప్పుడు శుభలగ్నమాసన్న మగుటఁ
జెప్పి పుత్తేర రాజీవలోచనుఁడు
రత్నకంబళ దివ్య రత్న పల్యాణ
నూత్న చామరజాలనుత పుష్పధామ
కాంచన ఘంట నానాశూంభ పట్ట
చంచదలంకార సహితమై మించి
హసిత దిశాదంతియగు దంతి నెక్కి
వసుమతీసురలు దీవనలు గావింప (6810)
బ్రచుర మార్తాండబింబ ప్రభల్దెగడు
రుచులఁ జూపట్టు కర్పూర దీపికలు
పుష్పబాణుని బ్రాణముల రీతిఁ బొల్చు
పుష్పబాణంబు లద్భుతములై తనర
సురలకు నీవార్త సూచింపనరుగు
కరణి శోభిల్లె నాకాశబాణములు
భ్రదంశు విజిత చంద్రజ్యోతులైన
రమణీయముగను సాంద్రజ్యోతలెసఁగఁ
నిక్షు కోదండుఁ డనేక రూపములఁ
బక్షివాహనుగెల్వఁ బఱతెంచెననాఁగ (6820)
దండిమై రాజనందనులోలి యిక్షు
కాండముల్గొని పెక్కుగతినే తేర
వడిమీట ఖణిఖణి వాగుచు గిరుల
బొడఁగుఁ గైకొను జిగిబిగిచున్నుఁ గవల
మెఱుఁగు దీవల నవ్వుమేనుల నొప్పు
మెఱుఁగుబోణులు సంభ్రమించి యంతంత
పరమ సంతోషాబ్ధిఁ బ్రబలించుమించు
నురువులోయన మించు నురువులగములు
తళుకు గుబ్బలతోడఁ దడబడి సిరులు
గలిగి ప్రకాశించు గజి నిమ్మపండ్లు (6830)
పొలుపైన పలుకునొప్పుల కుప్పలనఁగ
లలితంబులైన బెల్లంపుటచ్చులును
వరకపోలముల భావంబులఁ దెలుపు
వరుస నొప్పెడు నాగవల్లీ దళములుఁ
గరమొప్పుచును భాతికలయురోజముల
కరణిఁ జూపట్టు పూగముల జాలముల
జిగిమించుతమ నవ్వు చిఱుతవెన్నెలలు
నిగిడినరీతి మానికములౌవిరులు
కమ్మవిల్కాని చక్రములననొప్పు
కమ్మదోవులుఁ బెక్కుగతుల వస్తువులు (6840)
కనక పాత్రములందు ఘటియించిచెంతఁ
గనుపట్టుఁగా వింతగాఁగ్రంత నడువఁ
దఱుచుగా వాద్యనాదంబులు చెలఁగ
మెఱసి గోవిందుఁ డమ్మేదినీవిభని
నగరువాకిటను మాతంగంబుడిగ్గి
నగరకామినులు క్రన్నన సేసలిడఁగ
వరుసనేతెంచి వివాహమంతపము
సరసఁ జెన్నొందనా సమయమునందుఁ
జికిలి చేసినమారు చేవాలుబోలె
నకలంక శృంగార హారిణియైన (6850)
కేకయాధిపపుత్రి కిసలయగాత్రి
రాకేందువదనలు రమణఁదో తేర
నారాజువిమలతో యములనింపొదవ
మారాజు పాదపద్మములఁ గడిగి
యర్చించి మధుపర్కమర్పించి యాత్మఁ
జర్చించి హరిమానసంబున నిలిపి
తనుజన్మ వసుదేవతనుజన్మునకును
ఘనత ధారాపూర్వకంబుగా నొసఁగఁ
గందువాయుచుఁ బూర్ణకలలతోఁ బొదలి
యిందుండు నిందుండు నెదురించెననఁగ (6860)
నపుడు వధూవరు లాననాబ్జముల
నిపుణతతో నిక్కి నిక్కికన్గొనిరి
ఆగమవేద్యుఁ డిట్లాగమోక్తముగ
బాగుమీఱఁగ భద్రఁ బరిణయంబయ్యె
హరియు నాజనపాలుఁ డన్యోన్యమిట్లు
సరవిమై నుచితముర్సలిపి రంతటను
భద్రతో నాబలభద్రసోదరుఁడు
భద్ర శతాంగంబుపై నెక్కి మెఱసి
సురలు నప్సరలు భూసురలు దిర్తింప
వరభాగ్యవతి ద్వారవతి బ్రవేశించి (6870)
రాజమార్గమున దీరతనేగఁ బౌర
రాజపద్మాక్షులా రాజస్యఁ జూచి
పలుమాఱూరకమిట్టి పడిటింతె కాని
కలికి కన్నుల సరిరావు బేడెసలు
తముఁ జూడగాఁ గొంత తఱితిపకాని
బొమయీడగునెకం పొలయించు విండ్లు
కలఁగక యెంతమూఁకలు సేసెనేని
నలకంబులకు సాటియగునే యీయలులు
వెక్కసంబుగనెంత విదిరించికొన్న
జక్కవల్దామేలచనుఁ దోయి బోలు (6880)
మునుకొనిలోలోన మొరసిననేమి
యెన రావు గళమున కీయంబుజములు
వెలిమీఱిక్రంతులు వేయుటేకాక
పలుకుల సొగసేల పట్టుచిల్కలకు
నెలమిఁ గూర్చినవారి నెంతల్లుకొన్న
నల బాహులకుఁ బురుఁదగునె యీలతలు
మానుగా నెన్నిసూక్షములు బోయినను
కౌనుఁ దీగకుసాటిగా నేరవణులు
సుడిగొని తామెంత సొబగైననేమి
తొదలకు సరిరావు తుదఁ గదళికలు (6890)
తమవారిగూడి యెంతయునుబ్బెనేని
సమమౌనె తత్పదాబ్జముల కబ్జములు
అని కొని యాడంగ ననిమిషోత్తములు
వినుతింప సదనప్రవేశంబుఁ జేసి
యల రోహిణీయుక్తుఁడగు రోహిణీశు
చెలువున భద్రతోఁ జెలఁగి నిచ్చలును
నించువిల్తుని తండ్రి యెనలేక యాత్మ
నించు రాగమున నభీష్టభోగమున
ద్వారకాంచన ప్రవర్ణితమైన
ద్వారకానగరి నెంతయు వేడ్కనుండె (6900)
8. అష్టమ పట్టమహిషీ
శ్రీలక్షణాదేవీ వివాహవర్ణన ప్రసంగము
ధరణీశయట మద్రధరణీశ పుత్రి
మరుని సామ్రాజ్యపద్మా పద్మనేత్రి
ధరణి సంచారి నూతన చంద్రరేఖ
నిరుపమ భూషణాన్విత కల్పలతిక
తరళితాదూర సౌదామనీలతిక
గరమొప్ప సప్రాణ కాంచనప్రతిమ
యక్షిణ శుభమూర్తి యవిరళ భవ్య
లక్షణయగునట్టి లక్షణాకన్య
నారద మహతీ నినాద సంభూత
శౌరి కథామృతసారంబు గ్రోలి (6910)
యితరంబు మఱచి యా యిందిరాపతినిఁ
బతిగాఁగఁ గోరి తత్పరబుద్ధితోడ
సారసమ్ములకుఁ గన్నియచాలనులికి
ముడివడు విరులు క్రొమ్ముడి సఖీజనము
తడవదురారాము తమ్మునినోట
నుడువదు చింతతో నూల్కొన్నచింత
విడువదు ...............
లల మద్ర భూవరుం డంతనానాఁటఁ
జెలులచేఁ దనుజాత చెలువంబుఁ దెలిసి
తనయకు ననుకూల ధవుఁడెందుఁగల్గు (6920)
నని తానెయొక యుపాయంబు చింతించి
పుష్కరంబునఁ జూడఁ బొడగానరాక
పుష్కరాంతరమునఁ బొడకట్టుచుండ
మీనయంత్రంబు నిర్మించి యాదేవ
మానవులకు భరియింప రానట్టి
బాణాసనంబును బటువజ్ర నిసిత
బాణంబుఁ జూపించి ప్రార్థించి యునిచి
యీ విల్లుమోపెట్టి యీమార్గణంబు
ఠీవిమైఁ దొడివి దృష్టించి యిమ్మీను
ధరఁగూలవైచు నాధారుణీనాధ (6930)
వరుఁడు నాపట్టికి వరుఁడంచుఁ బలికి
పాటించి యఖిల భూపతులెల్ల వినఁగఁ
జాటించి యంతనా జననాధవరులు
పటుతర సైంధవ భద్రేభ వీర
భటపటాలంబు లుద్భటవృత్తిఁ గొలువ
రయమున వచ్చి మద్రపురంబు సొచ్చి
భయద భుజాగర్వ భరితులై యుండ
నది విని దనుజారి యా రాకుమారి
నిదే పోయి వేవేగ నేఁ దెత్తుననుచు
గురుకాంతిజిత రవికోటి కోటీర (6940)
మరకతమకుటంబు మస్తమందుంచి
ముకురకపోలాగ్ర ములుడాలు గులుక
మకరకుండలములు మహిమమైఁ దాల్చి
ఘనచంచలోదీర్ణ ఘనవైభవంబు
గనుపట్ట వనమాలి కాయుతుండగుచు
నాతతాంచలచంచ దంశుసందోహ
పీతాంబరంబైన పీతాంబరంబు
ధరియించి మ్ర్ఱుఁగు గాఁ దావి కస్తూరి
తిరునామమొకకొంత తీరుగా దీర్చి
రటధంఘ్రి కటక సారససుమాణిక్య (6950)
కటకాంగుళీయక గ్రైవేయ హార
సురుచిరుండై శైబ్య సుగ్రీవముఖ్య
హరిణవర్ణ సమిద్ధ హరి బద్ధవిష్ణు
రథకేతనోదీర్ణ రథమెక్కిమేటి
రథికులు భటులు వారణతురంగములు
చనుదేర మురజ జర్ఝరశంఖ ముఖ్య
ఘనవాద్యఘోషము ల్గగనంబు బొదువ
రాజసందోహ సంరాజిత మద్ర
రాజధానికిని దీవ్రత నేగుఁదేర
మద్రేశుడఁపుడు సంభ్రముతో వచ్చి (6960)
భద్రేశు గనుఁగొని ప్రణుతిగావించి
తోకొని పోయి సంతుష్టుఁడై భక్తిఁ
జేకొని శౌరిఁ బూజించె నవ్వేళ
గురుతర మాణిక్య కోటీరకోటి
నిరత ఘర్షణజాత నిబిడగాంగేయ
ఘనధూళి శబలిత గగనాంతరాళ
కనకమంచాంతర కలితులైనట్టి
భూనాధులా రమా భూనాధుఁ జూచి
భానుబింబ ప్రభాపటలంబు నెదుట
ఖద్యోతకాంతులు గనరానియట్లు (6670)
ఖద్యోతులయ్యు ముఖద్యోతమాన
కాంతులు దక్కి భూకాంతులారజని
కాంతునిఁ గనుఁగొని కైవాలుచున్న
తమ్ములు భాతి మోదమ్ములు సడలి
బిమ్మరిఁ గొనిలోన భీతిల్లిరంత
అంతరంగంబున నారాజకన్య
సంతసం బొదువఁ గజనకు సమ్మతిని
మరిమళమిళిత శుంభత్కమలముల
సరఁగున మంగళస్నానంబుఁ జేసి
నెఱయ గోధుమగింజ నెఱివట్టినట్టి (6980)
మెఱయు చెంగావొప్పు మీఱంగఁ గట్టి
నెలవంకతూఁపు పూనిన కంతుశాఙ్గన్
మలరికఁ బొమదోయి నలరు నామంబు
నడుమను మృగమద నవచిత్రకంబు
కడుఁ జిత్రరీతులఁ గనుపట్టఁ దీర్చి
కొఱనెల నఱమ్రింగు కుముదాప్తవైరి
నెఱఁ గేతకీ దళాన్వితవేణి యలర
రవిచక్కఁ దనమసారసమిత్రఠేవ
ఠవణించు రత్నతాటంకముల్దాల్చి
హరికథామృతము కర్ణాంతరాళములఁ (6990)
బరిపూర్ణమగుచుఁ బైపైనుబ్బెననఁగఁ
బ్రవిమలచ్ఛాయల పండుముత్యముల
బవరులఁ గనుపట్టు బవెరలు వెట్టి
నిగిడి శైలములపై నిర్ఝరుల్వొలుచు
పగిఁది హారములు గుబ్బలమీఁద గసర
మలయు వెన్నెల సోఁగమైఱాలుగులుకు
మలుకు సొమ్ములను దీమంబుగాఁ బూని
మరకత వైడూర్య మణులు సొంపొందు
సరిలేని దొకబన్నసరము గీలించి
జిగిమించు కెంపులు జేర్చి సోయగపు (7000)
మొగపు తీవబిటారముగ సవరించి
రమణీయ దూర్వాంకురములమై చాయఁ
గనిపించు పచ్చల కడుయముల్దాల్చి
కొందలవలెనున్న కుచములనాను
చుండులేఁ గౌనునకురు సత్త్వమొదవ
నలువవైచినకట్టు నానొప్పు మీఱి
తలుకొత్తు నుదరబంధంబు చొప్పడఁగ
నాహరి కనుఁ దోయి యక్కఱ దీర్చు
మోహనంబగు నొక్కమక్కరవెట్టి
తళుకు గుబ్బలమీఁది ధగధగల్మించు (7010)
జిలుఁగు దువ్వలువ కుచ్చెలమీఁది కురుక
బహువిధ శృంగార భాసితయగుచు
గురుతరంబుగ వాద్యఘోషంబు లడర
నరుదేరఁ జూచి పౌరాంగనామణులు
చేరుకొలంది నూర్చిన నెడలేక
నూరకుండినమేలె యువిదకెమ్మోవి
యురిదిచేకొలఁ దినినూదినఁ బెచ్చు
పెఱుఁగుచుండెను లేమ బిగిచన్నుఁదోయి
యొఱుపులై యొక్కటికొక్కటి మిన్నేల
మెఱవ కుండినఁ జూడ మెలఁత నేత్రములు (7020)
అండఁ జొప్పడ నిల్పి యలమనందిటను
నిండ కుండినఁ గాంతనెఱిఁ గప్పుకొప్పు
అని యిట్లుకొని యాడి యలరి వెండియును
గనుఁగొని పల్కి రుత్కంఠ దీపింపఁ
గనక కూటములనుఁ గావిందు మఱియు
వనకాక్షి పాలిండ్ల వలనుండఁ బోలు
గరివైరి నడుమనఁ గావిందు మదియుఁ
దరుణిమధ్యంబు చందంబుగానోపు
కంతువిల్లదియనఁ గావిందు మదియుఁ
గాంతనూగారు సంగతినుండఁ బోలుఁ (7030)
గలహంస గతియనఁ గావింతుమదియు
వలనొప్పు గతినడవడ్డంబు బోలు
నని మెచ్చి పొగడ స్వయంవరాయాత
జననాధులెల్లను జలజాక్షిఁ జూచి
నగుమొ గంబమరెఁబో నగుమొగంబునకుఁ
దగిన యీ విపులనేత్రములెట్లు గల్గెఁ
గనుదోయిఁ గలిగెఁబో కన్నుందములకుఁ
నొనరిన యాకర్ణయుగమెట్ల కల్గె
వీనులుగల్గెఁబో వీనులచెంత
నానీల ధమిల్ల మదియెట్లుకల్గెఁ (7040)
దురుముచెన్నొందెఁబో తురుముమై గౌను
మెఱుఁగు సంకునదల్చు మెడయెట్లు గల్గె
గళము శోభిల్లెఁబో గళము చెంగటను
దళుకొత్తు కుచపర్వతము లెట్లుగల్గె
పాలిండ్లు గల్గెఁబో పాలిండ్ల బరువు
దాళులేఁ గౌఁదీవతానెట్లు కల్గె
నడుము శోభిల్లెఁబో నడుమనకొక్క
బెడఁగు సంపాదించు పిఱుఁదెట్లుగల్గె
ఘన కటికలిగెఁబో కటిచక్రమునకు
బెబసిననును దోవలే రీతిఁ గల్గె (7050)
నల యూరులమరెఁబో యాయూరువులకు
నెలమిఁ జూపెడి జంఘలేరీతిఁ గల్గెఁ
జిఱుతొడల్మించెఁబో జిగిఁజిఱు దొడలు
కొఱపుఁ గొప్పడు పాదయుగ మెట్లుగల్గె
ననుచు శ్రీదేవి రెండవ మూర్తియనుచుఁ
గనుఁ గొన రాజమార్గమున కేతెంచె
తలకొన్నకడిమి నత్తఱివచ్చి కొంద
ఱలఘుబితోద్ధతులైన పార్థివులు
హరువిల్లనఁగఁ జెల్లు నావిలుఁ జేరి
ధరయంటువాయ యనెత్తఁగలేక చనిరి (7060)
లయ కాలదండంబులాగు దీపించి
భయదమైఁ యెదుట జూపట్టు నమ్మేటి
విలువంచలేక భూవిభులలో నెల్లఁ
దలవంపులైనఁ గొందఱు విన్ననైరి
చేనంటి యెక్కు ద్రోచియు ద్రోవలేక
హీనతనొంది రయ్యెడఁ గొందఱంత
భీమ విక్రములైన భీమ రాధేయు
లామహాధనువు సజ్యంబుఁ గావించి
శరము సంధించి ఖేచర సీమమీన
చరముపైఁ బూని తజ్జలముల దాని (7070)
తిరుగుడువడిఁ గాంచి తెలియంగ లేక
తిరుగుఁడు వడిరంత దేవేంద్రతనయుఁ
డేయుబాగెఱిఁగి తానేయఁగాఁ బోవ
నేయునుపాయముఁ గన కేటిది తొలఁగ
కని దానవారి యక్కడనున్న వారిఁ
గనుఁగొని చెలఁగి క్రేఁగంట నవ్వుచును
నలవోకడాకేల నలధనువంటి
వలకేల మౌర్వి చువ్వన నెక్కువెట్టి
యంబకంబరి వోసి యంబరమధ్య
శంబరచర వరచ్ఛ్యాయభూ భూగ (7080)
శంబరంబునఁ గాంచి సరఁగున మీను
శంబరాంతకు తండ్రి చక్కఁగా నిగిడి
ధరఁగూలనే సెనత్తఱిఁ బుష్పవృష్టి
గురుసె దుందుభులు గ్రక్కునమింటమెఱసె
నారాజనందన యానందమంది
యారూఢ మణి కంకణారవంబెసఁగఁ
నడుము జవ్వాడ నాననమింత యెత్తి
బెడఁగు గుబ్బలు జిగిచిగి రాయుచుండఁ
గేలి సౌరభారసాకీర్ణ గాంగేయ
మాలిక నవ్వన మాలికంఠమున (7090)
వైచవైచుటయు శ్రీవరుఁడు నమ్మేటి
రాచకూతును దన రథమువై వేగ
మెక్కించుకొని చలంచేచనంతంత
కెక్కించుకొని సైన్యమిరుమేలఁ గొలువఁ
దేరు దారకుఁ డతి తీవ్రతఁ బఱప
ద్వారకాపురము త్రోవన యేగుచుండె
దుర్వార గర్వ బంధురులైన యట్టి
యుర్వీశులప్పుడు చూపోపకేతెంచి
భటులతో నిరుపమార్భటులతో నాగ
ఘటలతో సకలదిక్తటముల శార్ఙ్గి (7100)
రాము తమ్ముని జుట్టి రాక్షసుల్వోలె
శరవృష్టి గురిసి మార్జనములు సేయ
నాదట గోపించి హసితామరేంద్ర
కోదండమగు శార్ఙ్గకోదండమంది
మలునారి మ్రోయించి బలునారి మఱఁది
బలునార సములఁ దద్బాణముల్దునిమి
ప్రలయ ధరాధర పటలంబు కెరలి
కలిశ బృందంబుల గురియుచందమున
దారుణ బాణసంతతుల భూపతుల
ఘోర సైన్యములపైఁ గురిసి వెండియును (7110)
బగరకు నుత్పాతభావంబు దోపఁ
బగలు చుక్కలు గనుపట్టెనోయనఁగ
శరజాల దారుణ చటుల ఘటనలఁ .....
నగలనందలి ముత్తియంబులు మింటి
కెగసి చూపట్ట నియ్యెడ శార్ఙ్గపాణి
తఱచుగా రిపులనుద్ధతి పింజ పింజ
గఱవనేయుచుఁ బూరిఁ గఱవఁ జేయుచును
నందంద శరముల నలిగి కొందఱును
జిందర వందరల్ సేసి నల్గడలఁ
బాఱఁజేయుచు విజృంభణ వృత్తి మెఱసి .... (7120)
బానముల్దునిమి కృపానముల్విఱిచి
ప్రానముల్గొనుచు శౌర్యంబు చూపుచును
రథుల ఖండించి సారథులఁ దుండించి
పృథుల రథ్యంబుల పిండి సేయుచును
రదనముల్వదనముల్రాలఁ గొట్టుచును
బదములు మదములు వాయమోదుచును
గాత్రముల్నేత్రముల్గత్తిరింపుచును
ఛత్రముల్పత్రముజుక్కు సేయుచును
దొడవిన తూప్రునుఁ దోడ్తోడ వింట
వెడలిన తూపును వివరింపకుండ (7130)
శరజాలముల రిపుసైన్యంబుఁ బొదివి
పరివేష యుక్త ప్రభాకరుండనఁగఁ
గుడివడువిలుతోఁడ గూడి శాత్రవులు
సుడివడ వడినంప సోననింపుచును
సోలి లోకములొక్క జూఱగాఁ గొనెడి
కాల సంకర్షణుగతి నుగ్రుఁ డగుచు
నఱిముఱి సమయింప నలవేఁడివెఱచి
పఱచిరి హతశేష పార్థివులంత
భగ్నారి జన్యంబు పాంచజన్యంబు
నగ్నజితీసుఁ డున్నతగతి నొత్తి (7140)
సంగతి నాగరాజ స్ఫూర్తి గలిగి
నింగియు భువిబలి నిలయంబు పోలెఁ
ఘన కబంధావాస కలితమై ఘోర
వనమును నగరంబు వనధియుఁ బోలె
నారూఢ వర్ధిత హరిమహాస్ఫురణ
నారయ హరి నిలయంబులు వోలె
గణుతికి నెక్కి భీకరమైనయట్టి
రణముఁ గన్గొనుచు వారణముఖ్య తురఁగ
యదు వృష్టి భోజాంధకాదులు గొలువఁ
గదియుచు వంది మాగధులు గీర్తింప (7150)
నక్షీణబలుఁడు పద్మాక్షుండు భవ్య
లక్షణయగునట్టి లక్షణతోడ
సురలు సన్నుతి సేయ సురుచిర గతుల
వరకీర్తి ద్వారకావతిఁ బ్రవేశించి
యారాజమార్గంబు నందేగుదేర
నారాజవదనఁ బౌరాంగనల్జూచి
పొలఁతి కన్నులుదాఁకఁ బోలునే దీని
చలితకాంతియఁ జాలు సంపంగిఁ గెలువ
భూలతికలదాఁకఁ బోలునే దీని
వాలుఁ జేతులు చాలు వల్లికల్లెలువఁ (7160)
బొదలు చేతులుదాఁక బోలునే దీని
పదములె చాలుసజ్జంబులు గెలుప
నని కొని యాడ మహావైభవమునఁ
దన రాజనగరమత్తఱిఁ బ్రవేశించె
నల శౌరితనయక్కుఁ డగుటకు వేడ్కఁ
దొలుక మద్రుఁడు సముద్రుఁడు వోలెఁ జొంగి
వాహినీయుక్తుఁడై వరమణి వస్తు
వాహనాదులతోడ వచ్చెనవ్వేళ
మామఁ బూజించి యమ్మా మనో హరుఁడు
హైమ విశాల గేహమునందు నునిచి (7170)
చేలమ్ములు ననుప చిత్రితకేతు
జాలమ్ములును ఘనచామర పుష్ప
వారమ్ములును జంద్రవాసిత గంధ
సారమ్ములును భవ్యసౌరభ మిళిత
ధూపంబులును భానుతోతాయు రత్న
సీపంబులును సర్వదివ్యవస్తువుల
బాగుగా నిర్జరపతి రాజధాని
లాగుగా నగరు నలంకరింపించి
నందాదులును శతానందాది భూమి
బృందారకులు బంధుబృందంబునపుడు (7180)
రావించి తత్కాల రమ్యకృత్యములఁ
గావించి యంతరంగమున భావించి
పసిఁడి ఱెక్కలడాలుభానుభానువుల
పసలకు మించనొప్పము వెట్టుచుండ
మండిత ముఖచంద్ర మండలద్యుతులు
నిండుచందురులోని నెఱకందు దీర్ప
మానిత ఘనదేవమణి రోచమాన
మాన పక్షీంద్రవాహన మేగుదేర
నానందనందనుఁడా వైనతేయ
నానందమును గంధమప్పళించుచును (7190)
నారుఢుఁడై యనంతాది నిత్యులను
నారద సనక సనందనాదులను
భవుఁ డబ్జభవుఁడగి భవుఁడును నదితి
భవుఁ డబ్ధిభవుఁడు దిక్పతులును గొలువ
నాపూర్ణకలలతో నఖిలతారకలు
దీపిత మూర్తులై తేజరిల్లఁ గను
నతను శోభనురేఖ యాచిత్రరేఖ
యతుల మంజుల భాషయగు చిత్రఘోష
చారూరు విజిత కాంచన రంభ రంభ
తారుణ్యయుత వధూత్తమ తిలోత్తమయు (7200)
మొదలైన యప్సరో ముకురాస్యవెదుట
ముదమంది నర్తనములు సేయుచుండ
ఠీవిమై మడ్డు డిండిమ ఝర్ఝరాది
రావముల్భూమి నభ్రమున ఘూర్ణిలఁగ
నురగులు సిద్ధసాధ్యులును యక్షులును
సురలు గంధర్వులు సొరిది సేవింప
చందంబులా శోఉరిచందంబులెన్ని
వందిమాగధులు భావంబులు దాల్చి
మంగళం బరవింద మందిరాపతికి
మంగళం బహివైరి మహితకేతునకు (7210)
మంగళం బమృతాబ్ధి మధ్యగేహునకు
మంగళం బనువరు మధుసూధనునకు
నని సన్నుతింప గానమహోత్సవముఁ
గని వాసుదేవుండు కామపాలుండు
దక్కిన యాదవోత్తములు వాహనము
లెక్కి సంభ్రమముననేతేరఁ బురము
నేగి తార్క్ష్యునిడిగ్గి యేణలోచనలు
భద్ర నీరాజనల్పలుమాఱు నొసఁగ
భద్రవిభుండు సుభద్రావిభుండు (7220)
కైదండ గావింపఁగా మద్రసుతులు
పాదమజ్జనమొ నర్పఁగ నేగుదెంచి
కాంత రత్నోజ్జ్వన కల్యాణమంట
పాంతరంబుననిల్చెనంత నారాజు
హరిని గాంచనపీఠి నాసీనుఁ జేసి
చరణపంకజములు జలజంబులార్చి
మధుర మంత్ర స్వర మంత్రస్వరముగ
మధుపర్క మొసఁగి ప్రేమంబుతోమున్ను
కైసేసియున్న లక్షణను లక్షణసు
భానుర సంఫుల్ల పంకజేక్షణను (7230)
జెలువలుదోతేరఁ జెలువమేపారఁ
గలహంసగతుల నక్కన్యయేతేర
నా సమయంబున యజుఁడుఁ గాయజుఁడు
భాసిల్లఁగాఁ దెర వట్టిరవ్విభుఁడు
వొనరంగ నాగమప్రోక్త మార్గమునఁ
దనయను వసుదేవతనయున కొసఁగె
దేవకామినులు భూదేవకామినులు
భావజగురుపెండ్లి సౌవర్ణపాత్రికలఁ
గనుపట్టునెడకుడు కలుసేసఁబ్రాలు (7240)
సవరింప మంగళాష్టకములు చదివి
రవళిమీఱఁగ మూహూర్తంబనిచెంత
గురుఁడు వచింపనిక్కుచుఁ బంచబాణ
గురుఁడు లక్షణయును గుడజీరకముల
నొండొరు శిరముల నునిచినెమ్మోము
లొండొరు వీక్షించి యురుతరప్రేమఁ
దనదు కటాక్ష సుధాబిందుజాల
మననొప్పు తెలిముత్తియముల దోయిటను
బలసోదరుఁడు ముంచి పట్టిచేముంచి
తలబ్రాలునింప దాత్పర్యంబు మెఱసి (7250)
కంకనములదండ గలియనొండొరులు
కంకణంబులు పొందుగాఁ గట్టిరంతఁ
కల్యాణ చేలుండు కల్యాణిఁ గూడి
కల్యాణ వేదిపై ఘనరత్నపీఠి
నాసీనుఁ డగుచు హోమాది కృత్యములు
సేసి యాశీర్వాద శ్రీలఁ బెంపొందఁ
దళుకుఁ జూపులుబేడసలు జాడసలుపు
తళుకుఁగన్ను విరిదమ్మిమోములును
వీగిననెఱికప్పు వేనలురెదురు
గాఁ గీలుకొనినకర్కశఁపు పాలిండ్లు (7260)
గలకలకంఠులు కలధౌతపాత్ర
ములను నీరాజనమును సమర్పింప
హరి యిట్లు లక్షణ నతివైభవమునఁ
బరిణ్యంబై యాత్మఁ పరిణామమొదవఁ
దదనంతరమున శాస్త్రప్రకారమునఁ
దుదలేని యర్థి చతుర్థికావించి
వీడువఁగల బంధువితతి సంతనము
వీడుఁజోడారంగ వీడులువెట్టి
మతినుబ్బియల పితామహ మహాదేవ
దివిజారి నాధారి దేవతావరుల (7270)
సురుచిరాంశుక ఘనాంశుకములతోడఁ
గరమర్థివేర్వేఱ కట్న ముల్జదువ
హరియుదానందఱ కన్నిలాగులను
వర భూషణాదుల వరుసతోనొసఁగి
భూసురాశీర్వాదములఁ జెందివారి
భాసుర కాంచనవ్రతతులఁ దనిపి
వందిత జనులకు వంది మాగధుల
కందందవేడ్క నిష్టార్థంబు లొసఁగి
యలరుచువీరు వారనక సంపదలు
వలసినవారికి వలసినట్లిచ్చి (7280)
లక్షణతో భవ్యలక్షణ వేళ
లక్షణానాధుఁ డుల్లమున సొంపొదవ
విబుధులతో ధరావిబుధులతోడ
సబలులైనట్టి రాజన్యులతోడ
నగధరుండర్ధేశుఁ డనుపంగ నాత్మ
నగరప్రవేశమున్నతిఁ జేసియపుడు
దేవకీవిభునకు దేవకీసతికి
దేవతీసవతికెంతే వేడ్కమ్రొక్కి
రేవతీవిభునకు రేవతీదేవి
నావలవరుసతో నభినుతుండయ్యు (7290)
నాముద్రసుతయుఁ దానత్తమామలకు
రామునకా బలరాము దేవికిని
సవతులైనట్టి యాసవతులకెలమి
నవిరళభక్తిమై నభినుతుల్సేసె
నప్పుడు పద్మ పద్మాయతనేత్రుఁ
డప్పద్మభవు శివు నమరేంద్రముఖుల
గారవంబున శుభాగతులైన యట్టి
వారిఁ గృపామృతా వారినోలార్చి
మదవతీకుల శిరోమణి రుక్మిణికిని
వదనేందు సౌభాగ్యవతి జాంబవతిని (7300)
నమిత గుణస్థేమయగు సత్యభామఁ
గమల శోభనగాత్రి కమలాప్తుపుత్రి
నమితశోభనవిందయగు మిత్రవింద
నమరజాలస్తుత్యయైనట్టి సత్యఁ
బ్రకట లావణ్యసంపద్భద్ర భద్ర
సకలకల్యాణ లక్షణను లక్షణను
గనుఁగొని యంతరంగమునఁ బ్రేమంబు
ననలొత్తఁ దన్మోహనతఁ జూచి పలికె
నిప్పడంతులకొప్పులింద్రనీలముల
కుప్పలో యొప్పుల కుప్పలో యనుచుఁ (7310)
గొమ్మల నేత్రముల్కోమల జలచ
రమ్ములో వరచకోరమ్ములోయనుచుఁ
వ్రవిమలాంగుల యధరములంబరాగ
లవములో బాల పల్లవములో యనుచు
పొలతులమాట లబ్బురమైన చిలుక
పలుకులోకప్రంపుఁ బలుకులోయనుచు
నంబుజాననల సొంపారుగళములు
కంబులో తజ్జన కంబులోయనుచుఁ
గువలయాక్షులగుచన్ను గుబ్బలు గిరుల
కవలో క్రొమ్మెఱుఁగు జక్కవలొయటాంచు (7320)
ఉరుపయోధరులూరు లున్నతకుంభి
కరములో మోహనాకరములో యనుచు
నమ్మానినుల మించులైన పాదములు
తమ్ములోకూర్మ మొత్తమ్ములోయనుచు
నీరీతిఁ గొనియాడి యిందిరావిభుఁడు
వారితోవేడ్క గైవారనందంద
వారితపంచాస్త్ర వరకేళిఁ దేలి
వారిజాసన దేవవరముఖుల్గొలువ
నిచ్చకల్యాణముల్నెరయంగనింటఁ
బచ్చతోరణములు భాసిల్లుచుండ (7330)
నారూఢి లోకారాధ్యుఁ డగుచు
ద్వారకానగరి నెంతయువేడ్కనుండె
ఈకృష్ణచరితంబు నెవ్వరు విన్న
వాక్రుచ్చి తలఁచినవారి కెల్లపుడు
చిరతరాయువులును జింతితార్థములు
సిరియుఁ గృష్ణుని కృప జెందుదురనఘ
అని యోగిజనపాలుఁ డాజనపాలుఁ
డనుమోదమంద నిట్లనియానతిచ్చె
అని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రుమాతకు వనధిజాతకును (7340)
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని
కనకగాత్రికిని ప్రకామ దాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుబాహుకును
సారలావణ్యకు సకలగణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమధామకును
హైమసంవ్యానకు హంసయానకును (7330)
(నిజకావ్యసమర్పణము. కవివంశకావ్యప్రశంస. గ్రంథనిగమనము)
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునానకును
నగసుతానుతకుఁ బన్నగతల్బయుతకు
మృగమదాంగకు నలయేలుమంగకను
నంకితంబుగాను శ్రీహరిభక్త నికర
పంకజార్యమ తాళ్ళపాకాన్నమార్య
తనయ తిమ్మార్య నందిత రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుండల యుగ్మ మండితకర్ణ
సుకవి జీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ (7360)
విదితమానస తిరువేంగళనాథ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధ మస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్ట మహిషీవివాహ
మనుకావ్యమునఁ బంచమాశ్వాసమయ్యె
అష్టమహిషీకల్యాణ ద్విపద కావ్యము సంపూర్ణము
No comments:
Post a Comment