Friday, April 1, 2016

అష్టమహిషీ కల్యాణము - 12

నీయెడ గోవిందు హేమాంబరముల
మైయున్న నతనిబాయకయుండ వచ్చు
నగపడిహరి వేణులై యున్నఁ దిన్న
నగుమోవితేని యలానంగ వచ్చుఁ
బంకజోదరు కౌస్తుభంబులమైన
నంకెల నతనిబాయక యుండవచ్చు
నిట్టు పుట్టించువాఁ డిందేలమమ్ముఁ
బుట్టించె వ్రేపల్లఁ బుట్టింపకజుఁడు
దొరసి యాగోవిందుతోఁ గూడి యాడి
తిరుగుచు సుఖకేళిఁ దేలియామూర్తిఁ         (3710)
జెలువుమైనొంద వీక్షించు నాగొల్ల
చెలువలే పుణ్యంబు చేసినవారొ
యనువారి యాత్మల యనుతాప మెడల
దనుజారి మల్లయుద్ధము చేత జడిసి
దగఁ దొట్టి జెట్టి మైడఱుచుగాఁ జెమట
దిగఁగాఱ మిగులవేఁడిమి దానవారి
కమలసంభవముఖల్గనవేని పాద
కమలమున్మల్ల వక్షము బిట్టి సోఁకఁ
దన్నిన వడివేచి దర్పించి వాఁడు
లెన్నుని యంసంబు వ్రేసి డాసినను             (3720)
వలపులపూఁ బందిలైనఁ గుంజరము
తలఁ కనిగతి నింత తలలకపొంగి
కరిఫాల మగివించు కరివైరిపోలె
హరివానితలచిప్పలైపోవఁ బొడిచి
కురియు నెత్తుటను జేగురుగొండవోలె
ధరసోలువాని పాదమ్ముల నొడిసి
నూఱునునిండెఁ జాణూరు నకనుచు
మీఱి దేవతలెల్ల మెచ్చి నుతింప
బిఱబిఱ్ ద్రిప్పి కుంభిని మీఁదలైన
నఱిముఱిఁ బరలోక మరిగెవాడంత               (3730)
మలుఁడు ముష్టికు ముష్టిఁ బలు విడిఁ బొడిచి
పొలియించెఁ జాణూరుఁ బొలియించు పగిది
కనలిమీటు గనిటు గలకూటఁ డనెకి
పెనుజట్టి బలుడిట్టె పెనఁగి వెండియును
ఛలతోసలాంబులు జగజెట్టి శౌరి
చలమునఁజేసి నిశ్చలముగ నిలువ
బలుఁడు కృష్ణుఁడు వారిబలమెల్లఁ దక్క
బలుపిడిపిల్ల దెబ్బలఁ జాలనొంచి
తొలుతఁ బోయినవారి త్రోవనే పనుప
నులికి చిక్కిన మల్లులుల్లముల్గలుఁగఁ            (3740)
దొఁలగి సందులును గొందులు దూరిపాఱ
నలిగి కంసుడు భటాళి నీక్షించి
యిట్టె యీగొల్లల నీ వీడువెడలఁ
గొట్టుఁడానందుని గొట్టుఁ డాలోన
దేవకి వసుదేవు దేవకుఁ జంపి
జీవముల్గొనుఁ డుగ్రసేనుని ననినఁ
గరివైరి పర్వతాగ్రమునకై యురుకు
సరణి గృష్ణుండు మంచము మీదకెగిరి
వాలిమీఱగ వాఁడి వాలిచర్మంబు
గీలించి సిమ్హంబు ప్రియఁ గంసుఁ డెదుర           (3750)
హరియును మానవ హరి హేమకశిపు
కరముగ్రముగఁ బట్టుగతి వానిబట్టి
తల్లడిల్లఁగఁ దన్నితల కిరీటంబు
డొల్లఁ బెల్లార్చి తిట్టుచు నేలగెడపి
తోనకుప్పించి నందుని పట్టిపూని
వానిబోనీక జీవంబులఁ బాసి
పులివేటి గఁబళించి పొరలించు పగిది
నల కంసు మేను రంగావని నీడ్చె
నరబుద్ధినైన శ్రీహరినెంచెఁగాన
ధరణిఁ గంసుండు నత్తఱి ముక్తుఁడయ్యె          (3760)
హరియని యారీతిననిన వారలుకుఁ
గరతలామకరంబుగాదె మోక్షంబు
క్రోధంబుతోనన్య క్రోధకంకాది
భూధవావరజు లప్పుడు చుట్టుముట్ట
నెంతయు బలకృష్ణులెదిరించి దంతి
దంతముల్పూనిత దంతముల్గొట్టి
దము చూసి నిముషంబు ధరియింపలేని
తమయన్నయున్న చెంతకువచ్చి రంత
వాసుదేవుల జగద్వాసుల నుతులు
సేసి మ్రోక్కిరి మునిశేఖరుల్సురలు                (3770)
ఆడిరి రంభాదు లంతంత మెచ్చి
యాడిరి బ్రహ్మాదు లలరి కిన్నెరులు
పాడిరి మిగులఁ జొప్పడి సరివారి
బాడిరి శత్రు భూపతులెల్ల జెదరి
యంతఁ గంసుఁడు మెదలగు వీరవరుల
కాంతలు ఘనశుగా క్రాంతలై వచ్చి
కదసిన దుఃఖాంధకారమ్ము తమ్ము
బొదవినిరీతి కొప్పులు వీడిపొరల
బెన్నీట నఱగ్రుంకు బేడసల్పోలె
గన్నీటఁ బెనగొన్న కన్నులింపొదవఁ             (3780)
తగుదమ్మి మొగ్గలు తరగలఁ బొరలు
పగిదిగుబ్బలుమీఁడి పయ్యెదజాఱ
హానాధ! హనాధ! యనుచుఁ బల్మాఱు
దీనలై విలపించు ధృతిఁ జాలివారి
యుల్లంబులందులనున్న శోకాగ్నిఁ
జల్లార్చివారికి సంస్కార విధులు
కావింపఁ బనిచిదిగ్గన శౌరి హరియు
దేవకి వసుదేవ దేవసన్నిభుల
మొనసిన భవబంధములు వాపుకరణిఁ
బెనుసంకెలలతోడఁ బెడఁబాయఁ జేశి           (3790)
రావించి చెరణసారసముల వ్రాల
దీవించి వసుదేవ దేవకులప్పుడు
డానంద భాష్పంబు లడరికాయముల
నానంద నూజుల నలమి ముద్దాడి
యోయన్న మీరలీయుర్విఁ దెగడుచును
నాయచ్యుతుని మూర్తులని సన్నుతింప
వినతులై యారామ విభుఁడును విధుఁడు
మున్నుకొనితము బాల్యమున నెడయుటకు
వగచి వారలలోని వగపెల్లఁ దీర్చి
జగతి మాతాపితృ చరణాబ్జ పూజ                (3800)
గావించు పుత్రుఁడు గాంచు ధర్మములఁ
గావింప కుండినఁ గనున ధర్మముల
నెనలేని దైవాజ్ఞ యిట్లున్న దయ్య
జననిమా నేరముల్ క్షమియింపుఁ డనుచు
నరసి మాతామహుండగు మహా మహుని
జిరవైభవుని నుగ్రసేనురాలించి
మధురకుఱేనిఁగా మన్నించి సకల
బుధులును విబుధులు పొగడనల్గడల
వివిధభూముల నన్యవేషముల్దాల్చి
చెవిరి కంసుని భీతిఁ జెందియున్నట్టి             (3810)
యాదవోత్తముల దయార్ద్ర వాక్యముల
నాదటరప్పించి యవ్చోత నునిచి
యాపూర్ణ సదనాంబరాదులతోడ
దీపించు సిరులఁదెం దేఁపగా నొసఁగి
కన్నవారలతోడ గరిమమైఁ బెంచు
కొన్నవారలతోడఁ గూడియావీట
నెన్నుచు లోకంబు లెల్లరంజిల్ల
మన్నింపుచుండె భూమందలాధీశ
నందనందనులు సనం సన్నుతులు
నందగోపునకుఁ బ్రణామంబు లొసఁగి              (3820)
పొత్తుల ...................
నెత్తురు కందుల నీవు నీ దేవి
కన్నబిడ్డలకంటెఁ గడువిషేషముగఁ
జెన్నుగానెత్తి పెంచితిరియో తండ్రి
వెన్నులు గావు దేవకి శౌరిమమ్ముఁ
గన్నవారను మాటగాక మీజోఁకఁ
జన్నిచ్చి యుగ్గిడి సకలసౌఖ్యములఁ
బిన్ననాటను గోలెపెంచిరే యెలమి
నోతండ్రి వేయన నేలను నీవె
తాతవు నయ్యశోదయుఁ గన్నతల్లి               (3830)
యనియుండు మముం జక్కనఱయు మీజనని
జనకు సంతసమంద జనకయోజనక
వచ్చిన పనులెల్ల వరుసతోఁ దీర్చి
వచ్చెదమొక కొన్ని వాసరంబులకుఁ
దడవును జేయు మందఱి వేఱు వేఱ
నడిగె రాముడు కృష్ణుఁడని చెప్పి పిదపఁ
గుమతి కంసునిఁ బట్టి కూలిచిరనుచు
మమునెన్ను తమదు సేమము నెన్నుమను
హరులునుంగరులు భూషాంబరావళులు
వరుపుళ్లు నూళ్లును వలయునట్లెసఁగ            (3840)
బడియున్నయట్టి గోపాలశేఖరుల
కడిగినయట్ల యిష్టార్థంబు లిచ్చి
పనుప నందుఁడు కూర్మి బాష్పముల్గ్రుక్కి
కొనుచు వస్తువులు గైకొనుచుఁడా లాంకు
హరిఁ బాసి పోవఁ గాళ్లాడక మఱలి
మఱలి చూచుచునేగె మందకునంత
దేవకీవిభుఁడును దేవకి సతియు
రావించి బంధువర్గముల రప్పించి
కడుసంభ్రమంబున గర్గాదులైన
పుడమి వేలుపులనప్పుడ పిలిపించి             (3850)
వడుగుల కెలమిమై వడుగులు సేసి
యుడుగని వేడ్కతో నుబ్బియందఱును
కనకముల్పుట్ట ముల్గరులు ధేనువులు
తనియంగనిచ్చి యెంతయు వేడ్కమున్ను
దానంబు లోకనిదానంబు గూర్చి
యానీలవర్ణుఁ గన్నప్పు డిచ్చుటకుఁ
దలపోసి యావస్తుతతుల సమ్మతులఁ
బిలిచి ప్రార్థించి యర్పింప నంతటను
అమిత విద్యావేత్తలయ్య సత్కృతులఁ
గ్రమమున సలుపు సంగతి కనిడాసి            (3860)
దేవాఢ్యయగు నవంతీపురివాసు
దేవుండు నాబలదేవుండు జేరి
యచ్చట సాందీపనియను విప్రుచేత
బ్రచుర విద్యావిచారతనించి తాము
విలసచ్చతుర్దశ విద్యలు నేర్చి
విలసిల్లు గురుఁ జూచి వేఁడుమిష్టంబు
చేకూర్తుమన విని చెలఁగి యవ్విబుధుఁ
డాకూర్చు శిష్యులకనియె నంబోధి
బహుపుణ్యవాస ప్రభాసతీర్థమున
విహరింపుచుండెడి వేళనక్కడలి                   (3870)
కొడుకుఁ డెక్కోలుగాఁ గొని పోయెవాని
బడయుట సలంబు వడయుటయనిన
స్ఫురిత తుంగాంశుగా శుగనేనధములఁ
గరమొప్పు తేరు డిగ్గననెక్కి కదలి
కడలి చెంగటికేగఁ గడలేనివేడ్కఁ
గడలియేతెంచి చక్కఁగ సాగిమ్రొక్కి
రామపాలిత రమారామ విచ్చేయ
నేమికారణము నాకెఱిఁగింపుమనిన
గురుతనూభవు నేలకొంటి తెమ్మనిన
గురుతర భయముచే కూరునిట్లనియె                (3880)
తనకేమి పని దేవతనలోని పంచ
జననాముఁదగు పంచజన భోజనుండు
హరియించెనన విని హరిమింతునుక
శరధిలోఁ జొచ్చియచ్చటవాని పొట్ట
చించి నిర్జించి యాశిశువును గనక
పంచాస్త్రుమాతులు పగిదిఁ జూపట్టు
పాంచజన్యంబునాఁ బరగు శంఖంబుఁ
గాంచి యంచితముగాఁ గరశాఖనుంచి
యన్నతో జముఁడున్న యటకేగి శంఖ
మున్నతోగ్రారవ మొదవఁ బూరింపఁ                (3890)
గడగడవఁ డకుచుఁ గాలుఁడేతెంచి
తడయక యాసీరధరుని శ్రీధరుని
గనిమొక్కి పూజించి గర్వంబు దక్కి
చనుదెంచుటేమియో సామిమీరటకు
ననుఁడు సాందీపనియనెడు మద్గురుని
తనుజుఁ దెచ్చితివి తత్తనుజుని నిమ్ము
అన సమవర్తి మహాప్రసాదంబు
కొనుఁడు వీఁడనివాని గొనివచ్చి యిసఁగఁ
బరమ సాహసులైన బల బలానుజులు
గురుపుత్రుఁ గొనివచ్చి గురునకునిచ్చి               (3900)
నిలువ సాందీపని నిగమవేద్యులను
బలకేశవుల సర్వఫలదాయకులను
దీవించి తనపాలి దేవతల్గాఁగ
భావించి పొగడనబ్బలుఁడు మాధవుఁడు
గురువుచే ననిపించికొని సమ్మతమునఁ
బురసతుల్దమ్ముఁ జూపులచేతగ్రోల
మధుర గీతవ్రాత మధురయైనట్టి
మధురకేతెంచి నమ్మదినుండిరంత
పద్మాకళత్రుండు భక్తవత్సలుఁడు
పద్మాక్షుఁడా యదుపతి యొక్కనాడు              (3910)
తతన యాగమచయోద్ధవుని నుద్దవుని
గుతుకంబుతోఁ బిల్చి గోపికల్దమదు
తలపులు తనువు లర్థంబులు ప్రాణ
ములు భ్రతుకభిమానములు నేడుగడయు
దనుదాన తలపోసి తనుదాన పిదప
తనులేన రీతుల ధరియించి నారొ
యఱలేక నన్నాత్మ ననిశంబుదలఁచి
మఱువని వానినే మఱవలెఁ గాన
వ్రేఁపల్లె కరిగి యాఁవ్రేంత విరహ
తాపంబులును ననుతాపంబులెడమ                 (3920)
మొదలి కూటములెన్ని ముదమందమంద
కిదెవత్తుమని చెప్పు మేకతంబునను
నంద యశోదలానందంబు నొంద
ముఁదుగా జెప్పుమీ మొదలి పల్కనుచు
జడిగొనవారికా సఖులకు నాత్మ
నుడుగనితమితోడ నుడుగరలొసఁగ
నతఁడు గోకులమున కరిగెఁ దేరెక్కి
యతని గన్గొనినందుఁ డతిమోదమంది
యందికాఁగిటఁ జేర్చి యాతనిగూర్చి
విందుగాఁదలఁచి గోవిందుగాఁ జూచి               (3930)
రాజిల్ల గోపాలరాజితోఁ గూడఁ
బూజించి యిష్టాన్నములఁ దృప్తుఁ జేసి
బలబలానుజులకు భద్రమేమమ్ముఁ
దలఁతిరే పెంచిన తలిదండ్రులనుచుఁ
దనతోడి గోపాలతనయుల గోప
వనితల బసులనివ్వనము లెన్నుదురె
చిన్నారి మాకృష్ణు చెనొక్కనాఁడు
జన్నులు చల్లఁగా గనుగొందు మొక్కొ
బకుని ధేనుకుఁ బ్రలంబకుఁ బరిమార్చి
యకలంకమముగాఁచి హరియించు మఱియు             (3940)
నలవిమీఱినయట్టి యతని కృత్యములు
తలపోసి తలపోసి తనలోనడొచ్చి
కన్నీరుఁదొఱుఁగ గద్గదకంఠుఁడగుచు
నన్నందుఁ డేమియు నననేరకున్నఁ
గనుదోయి భాష్ఫముల్గ్రమ్మంగఁ బాలు
చనుదోయినుప్పొంగి చాలువాఱంగఁ
గొడుకు నామము పేరు కొని కొని యాడి
నిడుద నెయ్యములోన నిగుడ యశోద
యన్నలినోదరుం డన్నతోఁ గూడ
నన్నయెన్నఁడు వచ్చునన్న యద్ధవుఁడు         (3950)
తడవునెన్నఁడు మమ్ముఁ దడవుమార్తురను
బుడమిపైఁ గెడపియిప్పుడ యరుదెంచుఁ
దనువులు సడలించుతఱి హరియన్న
జనులకు వైకుంఠ సామ్రాజ్యమబ్బు
నాదివిష్ణుని మూర్తులగు సీరి శౌరి
నే దిన మీయాత్మ నిలిచిరిగాన
నేమని నీ భాగ్యమెన్నుదుఁ దండ్రి
యేమని నీపుణ్యమెన్నుదుఁ దల్లి
యని యింధన జ్యోతియనువున సకల
జనులందు నిచ్చనిచ్చలునుండు హరికి              (3960)
జననముల్జనకులు జననులుఁ గలుఁగ
రనఘలత్రోవ మీరటనుండుఁడనుచు
హరివారి కొసఁగు భూషాదికం బిచ్చి
హరివర్ణనలు సేయ నారాత్రివేగఁ
జలదంబర స్తన జఘన తాటంక
ములఁ గుంకుమాననముల గోపసతుల
నలకించి యంకించి హరిఁ బాడి పాడి
పొక్కించి దధిదర్చఁ బొడముచునున్న
ఘుమఘుమ ధ్వనులు దిక్కులు నాకసమ్ము
గమకమైపొడవ మేల్కాంచి యుద్దపుఁడు            (3970)
అనువొంద సాంధ్య కృత్యము లాచరించి
మునువిన్న సంకేతముననున్న యపుడు
రాజీవ నేత్రముల్ రత్నకుండలము
లాజానుబాహువు లంబుజాననము
తామరపూదండ దరహాస లీల
హేమాంబరంబు వహించి యచ్చోటఁ
బొడమనద్భుత వేష భూషణుండితని
బెడగాంతమని గొల్లపూఁబోణులెల్ల
నగవుజూపులతొన నానలోనావ
నగధరు చెలికాఁడవగుటెఱిగితిమి            (3980)
తలిదండ్రు లింపొందఁ దనదు సేమంబు
తెలుపనిన్నపనె తెంచితొయిటకు
నూరివారలతలఁ పొల్లకుండినను
వారినైనను మఱువఁడుమేలె శౌరి
యని తూఱఁ దూఱంగ నందులో నొక్క
వనితచెంగటి మధువ్రతము నీక్షించి
యతనికిఁ దెలిపె నన్యాపదేశమున
నతనుని నెంచియు ననియె నేర్పునను
మధుపయోకితవాప్త మాయంఘ్రులంటు
విధమెట్లుతొల గు నీ విధమెఱుంగుదుము            (3990)
నగరకామినుల చన్గవకుంకుమముల
జిగిమించు విభుఁడు దాల్చిన తమ్మిదండఁ
దొఱుఁగుప్పాడిఁ దొప్ప దోగిననిను
బరమాత్ముఁ గానమ్ముఁ బతిచంచరీక
దానవబల భేది తానవ పౌర
మానినీసక్స్తుఁడై మమ్ము నవ్వుచును
మకరందమానిన మాడ్కిమామోవి
యిగురువిల్తుని నలయించినవింత
నగరకామినిఁ గూడ నగరెకామినులు                (4000)
ఇంతగొంతడసిననేరీతిఁ జిక్కు
నంతయు పోతానెయని కోరి ప్రేమఁ
జిక్కుచు వలసివచ్చినవారిఁ బట్టి
ముక్కును జెవులునుమోఁడు గావించె
దనుదానెదలఁచని తరుఁ జెరెనొరుని
గనుమూసి చంపు నిక్కంబుగానెపుడు
బాలకుఁడని నమ్మ బలిగావెంట
నేలబ్రామిన యతనికి మేలుగలదె
యొరులు సంసారంబు లుడిగించునాతఁ
డరయ మాకాపురంబది యేలసేయు                 (4010)
వేటరి పాదరుల్వినినమ్మిఱేఁడు
గాటంపు త్రోపులఁ గందుచందమున
బయలు వందిరివెట్టు పంకజోదరుని
నయమున నట్లు మన్నననెమ్మి నమ్మి
మారునమ్ములు మీఱి మారమ్ములగుచుఁ
గూరంగ నాటంగఁ గుందితిమనుచు
మామాఱుగా మ్రొక్కు మామారు వేఁడి
మేమోర్వలేము మమ్మెడయంగఁ దగునె
యని భృంగయొనరంగ హరియంతరంగ
మునకు నింపగు చందమునఁ జెప్పుమనిన         (4020)
విని యుద్ధవుఁడు గోప వికచాబ్జముఖులఁ
గని మెచ్చి పలికెనో కమలాక్షులార
పుట్టుగాననముల బ్రుంగుఁడై పొరలు
పొట్టయ్యు జపతపంబుల గానలేని
యట్టి శ్రీకృష్ణుని ననిశంబుదలఁచి
నట్టి మీపుణ్యమేమనియెద మనుచుఁ
బద్మాక్షు సఖుఁడు హృత్పద్మముల్బెలఁగఁ
బద్మాక్షు మారుగాఁ బలికె వెండియును
గడుఁ జేర్వనున్నటి కాంతుఁడొక్కింత
యెడసినప్పుడు కూర్మిహెచ్చుగావునను              (4030)
నెడపక ననుమీఱలెప్పుడు భక్తి
నడుగకతల పోయుచుండంగవలసి
తొలఁగితినింతె తోడ్తోడ నామీఁద
తలఁ పింపబాయక తనుజేరఁ గలరు
అన వినియోయన్న హరి యెన్నఁడిటకుఁ
జనుదెంచుఁ గుశలమే జలజోదరునకుఁ
గనుగవల్ పండువగావింప నతని
గనుగొను భాగ్యంబు గలుగునే మాకుఁ
జెలిమిమై శౌరి వచ్చెదనన్ననచటి
యెలనాగలతని రానిత్తురే యిటకుఁ             (4040)
దడవునేమమ్ముఁ గూర్మిఁదలఁచునే పేర్లు
నుడువునే పొందులెన్నునె నిన్ను గూడి
నలినాక్షునిఁకనొకనాడు కౌఁగిళ్ళ
నలమి భోగించు భాగ్యము గల్గునొక్కొ
మాధవునిఁక నొక్క మావిచే యధర
మాధుర్యములు గ్రోలమాకబ్బు నొక్కొ
కమలాక్షునిఁకనొక్క కాలంబునందు
దమీఁ గూడియుండు చందమునొందునొక్క
యని శౌరి సౌందర్య మందంద తలఁచి
తనువులు తాపముల్తనువులై సడల                 (4050)
దేవకీసుతుమిత్రు దేవకీపుత్రు
ఠేవడెందములఁ జాటించి పూజించి
వసుదేవసుతుఁడిచ్చు వసుదేవ యోగ్య
వసన భూషలవారి వారికినొసఁగె
సదనంబులకు మంచి సరమిమై మదన
మదన సంగతచిత్త మదవతీమణుల
వివిధ భక్తికి నాకు వెలఁదుల ప్రేమ
...........................
మదినెన్నఁగా నవాఙ్మనస గోచరము
..........................                       (4060)
అని విరిపదరేణువంటి విపునము
మననులతోఁ ..... బ్రదుకుచును
అని గోపికాతతి నాత్మ భావించి
చన నిత్యబుద్ధియై సరవి వేర్వేఱ
క్షితి నమస్తే నమస్తే యని మొక్కి
ప్రతిలేని యానందపాథోధిఁ దేలి
దినదినంబును గృష్ణుఁ దెలుపుచుఁ గొన్ని
దినములచ్చోట వర్తించి యామీఁద
నందు వీడ్కొని నందనందన సఖుఁడు
నందనందనుగాంచి నందాదులొసఁగు                  (4070)
కానుకళరి తదగ్రజ శూరజోగ్ర
సేబులకిచ్చి మచ్చిక మ్రొక్కెనంతఁ
గలపమిచ్చిన యట్టికాంత మన్నించి
తలఁచి మాధవుఁడు తత్పరవిద్ధవుండు
కొలువంగఁ బనుపట్టు కుచ్చులతోడఁ
దళుకొత్తు గిరుకుటద్దంబులు మెట్టి
సవరని దంతవస్త్రంబులుకవర
కవరఁగా వీడెంబు గావించి మించి
ఘననాట్యతర నీలకంఠ కలాప
మనమూపుపై తురుమల్లాడ ముడిచి                 (4080)
కలికిచొప్పులు బొమకవచంపనొప్ప
భుగభుగమను గందపొడి మేననలఁది
ధగధగయను పచ్చతాళి గీల్కొలిపి
జాతి సంపఁగి పూవుచాయ జవ్వాది
నూతన ప్రేమ వీనులనిండ యెత్తి
తెలిమించు సన్నంపు తిరుమణిమీఁదఁ
దులనించు జాతికస్తూరి బొట్టు వెట్టి
యనులైన కస్తూరి యంటులచెంతఁ
గొనబుకప్రంపు పోగుల పొందుపఱచి             (4090)
తిలకించునిండు చంద్రికదట్టిఁ గట్టి
వలిపంపు గెంటెముల్వలె వాటులైచి
వన్నెలు సవరించు వారెల్లఁదనదు
వన్నెలుగనివేఱ వలఁయుఁబొమ్మనఁగ
నరిది మించులమించు లలరించునడల
విరులబొందియ కోల విసరియాడుచును
నడపంబు పిడియంబు నందులాగించి
యడపకత్తియ వింతనంతనే తేర
కరపికములు చందకర కరస్ఫురణఁ
బరఁగి రాత్రిని బట్టపగలు గావింప           (4100)

(ఇంకా ఉంది)