Showing posts with label ద్విపదకావ్యం. Show all posts
Showing posts with label ద్విపదకావ్యం. Show all posts

Friday, February 19, 2016

అష్టమహిషీ కల్యాణము - 8

వరశీలయుతల సువ్రతల నాసతుల
సిరివరుఁడీవన సీమలో మీదు
కరము భక్తమునకై కరము వేడుకను
నున్నాఁడుతడవుగా నున్నాఁడువేఁడు
చున్నాడు మిమ్ము రమ్మన్నాఁడటన్న
ననలు తీరలనిండ ననిచినగరిమఁ
దనువునఁ బులకలు దట్టమైనిగుడ
లోలాక్షులామాటలో వెలిగాఁగ
మేలైన యన్నమర్మిలిఁ బొందుపఱచి
కొనివచ్చుచోఁ దేరకొని వారిపతులు              (1930)
కనలియడ్డము సెప్పఁగానీయ కొనక
హరిపరాఙ్ముఖమైన యజ్ఞాన పటలి
హరిభక్తిమీఱిన యట్ల నీరుచును
బతులమాటలకు లోపడక యావిమల
వతుల చయ్యనవచ్చి మాధవుఁగనిన
వనజాక్షుఁడా విప్రవనజలోచనల
గనుఁగొని యంతరంగముననుప్పొంగి
యన్నులు గొనివచ్చునయ్యుత్తమాన్న
మన్నయు సఖులుఁ దారట నారగించి
సేమంబులరసి వచ్చిన సతీమణుల             (1940)
నామోద జలనిధినోదార్చి మీపతుల
రారందురేమొ బోరననరుగుడనుడు
వారనిప్రేమమై వారనిరంత
వారిమాటలనెల్ల వారించి వచ్చు
వారిఁగైకొందురే వారువెండియును
బతిలైన నీదయా పదలేనియట్టి
గతిలైన నీవయో కమలాక్షయనిన
నిహపరంబులు మీరలిచ్చినఁగల్గు
మహినెవ్వతికినైన మానినులార
మామక పదభక్తి మతులైనమిమ్ము              (1950)
నేమియుననరు ప్రాణేశులు సుతులు
నని వీడుకొలుపఁ బాయని సంతసమున
జనిసతుల్ పతులకీ సరణిఁదెల్పినను
ముందెరుగని విప్రముఖ్యులవ్వేళ
నందనందను రమానాదుఁగా దెలిసి
పొక్కుచుఁదమడెందములలోన వేడ్క
మ్రొక్కుచు ఘనజపంబులఁ దపంబులను
గనియునుగానమీ కాంతలు సురలు
గనలేని తేజంబుఁగనిరెంతవారొ
యనుచు నీరీతుల ననుతాపమొందు               (1960)
చును గంసభయమెన్నుచునునుండిరంత
వ్రజములో వల్లవవ్రజముతో నపుడు
వ్రజపతిమనము దేవప్రభుఁ గూరి
యాగంబు గావింతమని సర్వపస్తు
యోగంబు కొఱకునుద్యుక్తుఁడైయున్న
దేవకీతనయుండే తెంచియానందు
భావంబు తనయాత్మభావించి పలికె
కాలాత్మకుడు హరిగానఁదదాజ్ఞఁ
గాలకాలమునఁ దత్కర్మధర్మములు
చేకూరు నింద్రుఁ చూజించినమీదఁ             (1970)
గాకతాళన్యాయ గరిమ వర్తించు
సురపతిఁ బతియంచుఁ జూతురుగాని
హరి జగత్పతి యనియరయరెవ్వరును
బరమాత్మ విలసన భవనంబులైన
సురభుల గిరుల భూసురులనర్చించు
యాగంబుమేలొ యాకాశాధినాధు
యాగంబుమేలొమీర రసికన్గొనుఁడు
ఇలవేల్పులింటిలో నెదురు చూడంగఁ
బలువేలుపులఁ గొల్వఁబాఱినఱీతి
నడవులఁదరుల మహాశైలవరులఁ             (1980)
గడుపులోపలి చల్లగ దలకయుండఁ
వ్రాపులైదాపులై పగలునురేయి
కాపులైయుండు గోగణములుండఁగను
సురరాజుఁ గొలుతురే జోకగావీని
నురుపుణ్యఁ పూజింప యోజింపఁదగును
నీయెడమీతోడనేఁ బల్కుతెఱఁగు
న్యామమో కాకయన్యాయమో యనుఁడు
తలలూఁచిరపుడు చెంతలనున్న గోప
కలవేద్ధులా దివ్యగుణవృద్ధుఁ జూచి
నందుండు మదినుబ్బనందను మాట                 (1990)
చందంబుగనియట్ల చాటంగఁ బనిచె
మగువలువ్రేలు నేమములు హోమములు
జగతీసురులచేత సరవి జేయించి
ముందఱ వృద్ధులా ముందటఁబసులు
సందడిదగిగట్టి చాలుగానడువ
జడలమువ్వలసన్న సంకులనిడుద
యొడిబాగుతో నొప్పుచుండు బాలకులు
కలువదండల చంద్రికలు చుట్టు పగిదిఁ
బొలుచు సంకులునురంబులు తేటపడఁగఁ
బ్రతిలేని గిరుల శంపలునటియించు              (2000)
గతిబొట్లపేర్లుచన్గ వలపై బెళుకు
అలికాంతరముల చాయలఁబిండిబొట్లు
కలితాబ్జములఁ గర్ణికలనవ్వుచుండ
వ్రేఁకంబులగుకంచువెడఁదమట్టియలు
తాఁకులకెడనెడఁ ద్రాఁకి మ్రోయంగ
నిలువేలు పులకుమున్నెక్కించు చాఱ
జిలుఁగుఁ బుట్టంబుతోఁ జెఱఁగులువడఁగఁ
గట్టి బాలకులఁ జంకలఁబెట్టి చిట్టి
గట్టి చుట్టలమీఁదఁ గంపలువెట్టి
వ్రేతలు నడువంగ వ్రేలువేవేలు                     (2010)
రీతుల తమజాతి రీతుల మెఱియ
వెడవెడగానేయి వెడలనికురులఁ
బెడతండ్లుసికలునూనఁగఁ దీర్చియున్న
యోసవరినామంబు లొకవింతచూపఁ
బట్టుక్రొంబసలఁ జూపట్టు పర్ణములఁ
బట్టిముంగలవేల్పు పసిఱొప్పుకొనుచు
వరపరమాన్నముల్వడలు మీఁగడలు
వెరుఁగు లాజ్యంబులు పిండికూరలును
గుడుములు పాలు నౌగులు పంచదార
కడియంపుటట్టులుఁ గమ్మబూరియలు                    (2020)
లనఁటిపండులును శాల్యన్నముల్ తేనె
లును జున్నులు వెన్నలును బాదిగాఁగ
గములుగా శకట సంఘములనమర్చి
గుములుగావాలి చక్కుల నడిపింప
తొలఁగద్రోయఁగరాక త్రోవగ్రిక్కిఱిసి
వెలిమీఱి శ్రీరామవెల్లముపోలె
సలలిత వాద్యఘోషమున ఘోషమునఁ
గలవారలెల్ల నొక్కటనేగుచుండ
రామ గోవిందుల గ్రమునఁబిఱుందఁ
గామునిల్ తనరెండు గడలబాంధవులు                (2030)
నొప్ప నందుఁడు నొక్కయొప్పులకుప్ప
గొప్పైన తేరెక్కి కొనియేగుదెంచి
గోవర్ధనముఁగనుఁ గొంచునావిప్ర
గోవర్ధనునితోడ గుంపుగావిడిని
వల్లవీ వల్లవవరులతోఁ గూడ
నుల్లంబులోఁ గడునుల్లసిల్లుచును
అగ్గిరిధేను విప్రాళిఁ బూజించి
కర్తభోక్తయుదానకానయా దైత్య
హర్త యింద్రుఁడు గుందనజఁడరుదంది           (2040)
యచలాచలాత్మకుండగుటఁ దత్పూజ
నచలంబులోనుండి యవధరించుచును
జోద్యమందుచుజనుల్ చూడమై నిలిచి
హృద్య నైవేద్యంబు లెల్లనొక్కటకు
గేలుసాఁపుచు నారగించె మోదించి
లాలించిపలికె వల్లపువెల్లవినఁగ
నగమూర్తినైన పన్నగమూర్తినేను
మిగుల నిష్టములఁగాముంపుఁడేనిత్తు
ననఁగనచ్చెరువంది యతిముదంబంది
ఘనశైలవర్తి మేఘశ్యామమూర్తి              (2050)
దామోదరుని మూర్తిఁదలఁచి యామూర్తి
యామూర్తియని గోపికాళిఁ గీర్తించి
దయ జూచికాచియిందఱదరి జేర్చి
పయిరులెస్సగఁ జేసి బ్రతికించి సామి
యనుడు శైలముమీఁది యావేల్పు వేల్పు
జనులార కోరునిష్టములెల్ల మీకుఁ
దలకూడుననుచు నంతర్ధానమయ్యె
నల గోపకులు సంభ్రమాకులులగుచుఁ
వసులతోనచటి తాపసులతోగూడఁ
వసుధేశ యగ్గిరి వలచుట్టివచ్చి              (2060)
భుజియించి తద్యాగ భాగశేషములు
భుజియించి మిగుల సొంపులఁ దేలితేలి
యొంటొంటి యాకుతోనొనగూడుచుండ
గొంటిపక్కలుచౌరు గొట్టుచునమలి
కసిగలసిగల సంగళ్ళఁ బూదండ
లొనపరిబాగులై మొనరంగఁ జుట్టి
పండారు గలపిన పసిమిక్రొమ్మసిమి
పిండిగంధములు ముప్పిరిగొనఁ బూసి
యోలోలయని పల్కి యొకగొల్ల చీరఁ
గోలమూఁపుననిడి కొని కేలుసాఁచి             (2070)

(ఈజాతివేలపదము)

దండనేమముగాదు దయబొల్లి మేర
కొండవేలుపుకదే కోడెవో రాజ
గోలయైయలకంచి కొండపై మేయు
పాలమున్నీటిలోపలనీఁదులాడు
లావునఁ జొరఁబాఱి లంకదూరాడి
దీవులనెల్లను దిరుగినో రాజ
కల్లలవడదోయు గబ్బినాకోడె
కల్లరిమన్నీలఁ గడకాలనూఁకు
కలరాజునెన్నరిపుల నెంతయు గెల్చె రాజ       (2080)
సిరిగలనాకోడె సిరులిచ్చుననుచు
బిరుదులుపచరించి పెక్కులాగులను
కంచుకొమ్ములతాళ గతలకునూఁదఁ
జంచులచెలరేఁగి చప్పట్లుచఱువ
కోదండలిడివిర కొలచ్చళిన
నాదింపవైచెఁ జెంతల నొక్కఁడొకని
గేలుకేలునబిగ్గఁ గీలించి పట్టి
సోలికి మిలుచుండి సోలియాడుచును
ముంజ్జుగబ్బుల తుట్టముదుకవెండ్రుకలు
జుంజురింపఁగ విదుర్చుచుఁ జుఱ్ఱుమనుచుఁ       (2090)
జిందఱ కొట్టిమైఁ జమటలుం దొట్టి
కందామరిదిగంగారఁ గ్రేళ్ళుఱికి
యొకకాలుగుంచి వేఱొకకాలు భూమి
వకవకలె వేలవడి యెట్టి మెట్టి
చెలఁగివేలుపుఁ బెద్దసివ మాడువాౠ
పలుమాఱుఁ బొంగి వ్రేపతినాఁటివారు
వరద గోపికులవర్ధన దేవ
బిరుద యాదవరాజుఁ బేర్కొందమనుచు
నుడుకుచు సోదికినున్న పాయసము
తొడికిజుఱ్ఱుచుఁ గంపఁ దొడుపులెక్కుచును         (2100)
మ్రొగ్గకయరకాలములుఁ గాఁడకుండ
నెక్కియావేల్పుఁ బొడిమినెన్నువారు
కుతుకంబుతోఁ దోడి గొల్లలు వేల్పు
కతసెప్పవిని శిరఃకంపంబు సేసి
చెలగివీనులఁగేలు సేర్చి గొబ్బిళ్ళఁ
బలుతెఱంగులఁ గూడి పాడెడువారు
మొనవ్రేళ్ళు శ్రుతులు గ్రమ్ముచు వెన్నలార
యనుచుఁ బాడెడువారు నగుచునుండఁగను
బొంగెడు పొంగళ్ళ పొంగుచునుండ
సంగడి బసులు నిచ్చల మేయుచుండఁ         (2110)
గడుపు దప్పినయట్టి కోపంబుతోన
నుడికింప మేఘవాహుండు బిట్టుగెరలి
ప్రళయ ధారాధరపంఙ్తి నీక్షించి
పలికెఁ జూచితిరే భూభాగంబునందుఁ
గుల గోత్రపత్ర సంకులరక్తసిక్త
కులిశంబు ననిశంబుఁ గొనగేలఁ దాల్చు
ననుడించి నందనందనుకు వాదములు
విని పల్లవులు పనివిని యొంటిగట్టుఁ
గని పూజ నేసి యక్కడనన్నుఁ బేరు
కొనకగైకొనక పొంగుచునున్నవారు           (2120)
నెల మూఁడువానలునేఁ గురియింపఁ
బొలమునంబసులమేఁపుచుదలల్ గ్రొవ్వి
పోసరించినయట్టి పులివోతుగొల్ల
లీసడించిరితుదినిఁక నెద్ది మేలు
భూరి కర్షోపలా పూరిత వజ్ర
దారునతర వర్షధారలచేతఁ
బొదివిగొల్లలమూఁక పొదివిచ్చఁజేయుఁ
డిదెవత్తు మీవెంతనె నింతనంత
నని నిగళములూడ్చి యుంచినఁ బోయి
యనిఁ జూచికెరలు వీరాగ్రణులనఁగఁ           (2130)
బెంపుతెంపు నటింపఁ బెరిఁగి మేఘములు
గుంపులై నీరాళ గొందికై మొనసి
యొఱలూడ్చిచిమ్ము మహోగ్ర ఖడ్గములు
తెఱగున శంపలు దివినుప్పతిలఁగ
ఘనసింహరవముల కరణిఁద్రిలోక
జనముఁ భీతిలఁగ గర్జనము చేసి
శర్వకంఠముపట్టు చాలకనింగిఁ
బర్విన విషముల పటలియోయనఁగ
కారుక్రమ్ముచు సీరిగ్రక్కుచుఁబొదలి
ఘోరమ్ములగు పిడుగులతోడఁ గలిసి             (2140)
భయదమై వర్షంబు పట్టెఁ బట్టుటయు
బెడిదంపువానఁ గోపికలు గోపకులుఁ
దడియంగ గోవులెంతయు జడియంగఁ
గని భక్తలోక రక్షణ దక్షుఁడైన
దనుజారికెమ్మోవి దరహామొసఁగ
వ్రజమునకఖిల గోవ్రజమునచటి
ప్రజలకు నేకాతపత్రంబుగాఁగ
నల కొండనెత్తి బాహాదండమమరెఁ
నిలఁదలమోచు ఫణీంద్రుఁడోయనఁగ
లలితాచల శ్రీవిలాస హర్మ్యమున               (2150)
నలఘనీల స్తంభమనఁగ నవ్వేళ
శస్త దేవాగమ్య చరణనీరేజ
హస్తయోగము గల్గెనని పొంగి యద్రి
హరికిఁ బుష్పాంజలు లర్పించెననఁగఁ
దరులు గంపింప  నందలి విరుల్రాల
వడగండ్లుగిడిఁదాఁకి వ్రక్కలైమగిడి
యుడువీథి నడురేయి యుడుపంఙ్తి దెగడు
అంబరవర్ణు చేయంటుటవలన
సంబరచరభావ మందెనోయనఁగ
జడివట్టునాయల జడికోర్వలేక                  (2160)
వడఁకుచు వనమృగావలి మింటికుఱక
శరద నాదముల కిచ్చలఁబొంగిమాఱు
సరిలేనట్టి కేసరులు గర్జింపఁ
గడిది నాగముల వేగముల మేఘములఁ
దొడరు చందంబునఁ దొండముల్ సాఁచి
పనిమినెదుర్చు శంపలఁ బట్టెననఁగఁ
బసిడితీవెలఁ జుట్టి ప్రాపుగాఁ బట్టి
గురువ్రజహరులచేఁ గురువిందఖనులు
నెరయంగనంగార నికరంబులనుచు
నాతలనున్న విద్యాధరుల్ జడిసి                (2170)
శీతాపహరణ వాంఛితమతిఁ గదియ
నేడుగాడ్పులతోడ నేకమైవాస
యేడు రాత్రులఁ బగిళ్లీతీతిఁ గురియఁ
జలఁగియొక్కపఁ బొడిచెనో ప్రొద్దతనుచు
నెలకొని గిరిక్రింద నెమ్మదినుండు
గోగోప గోపికాకులముల బలము
జాగుమై గురియు నాజలదాళి బలముఁ
బటుతర హరి దివ్యబాహుబలంబుఁ
జటులాభ్రచారులౌ చారులచేత
విని వజ్రి యామేఘవితతి మర్ల్చి              (2180)
తన మనోవీధిఁ జింతన సేయుచుండెఁ
గమలాక్షుఁడపుడు చెంగటనున్నయట్టి
తమవారిఁగని దుష్ట తమవారియడఁగెఁ
గావిరి విరిసె దిక్తటులు రాజిల్లె
మీ వైభవంబుల మీరుండుఁడనుచు
నవిరళశైలంబు నాతొంటిచోట
ధ్రువ పదంబును బోలె ధ్రువముగానిల్చె
జిష్ణుండు తలపోతసేసి కృష్ణుండు
విష్ణుందయనుచు భావించి దిక్పతులు
సురధేను గూడి భాసురభానుకోటి                 (2190)
నిరసించు కాంతినిఁ బూనిన శౌరిఁ జేరి
గురుతర మణికోటి కోటీర రుచుల
హరిపదాంబుజముల కారతుల్ గాఁగ
మ్రొక్కి కరాబ్జముల్ మోడ్చిమదంబు
దక్కి యానందాశ్రుతతి గ్రుక్కొకొనుచు
దుర్మానినపరాధి ద్రోహి నిజడుఁద
గర్మబద్ధుండ జగన్నాధ నిన్నుఁ
బశుపాలుఁడనుచును బశుపాలబుద్ధి
వశుఁడనైతినిగావ వలయునన్ననినఁ
జిఱునవ్వుమోవిపైఁ జిలుకంగఁ గరుణ          (2200)
నెఱయ నింద్రునిఁ జూచి నీరజోదరుఁడు
నిన్నుఁగానని నీమనంబునఁబొదలు
కన్నుఁగానని రాజ్యగర్వంబుఁ దునుము
నింతసేసితినింతే యింకనావంకఁ
జింతమానక నిజస్థితి నుండుమనుచు
నాదరించినవేల్పుటావు శ్రీదేవు
పాదపద్మములకు బ్రణమిల్లె పలికె
సరలకు నఖిలభూసురులకు నిఖిల
సురభులకును నీవసుమ్ముదైమవవు
విందవు నీవు గోవింద పట్టంబు                  (2210)
నొందిన సౌక్యంబు నొందునాశ్రితులు
అని చెప్పియజుఁడు నన్నంచెనో దేవ
యని పయోదభరంబులలరంగఁ గురియు
క్షేరంబు స్వర్నదీక్షీరంబు జలధి
నీరమ్ములును నవనిధులుఁ బూరించి
భారతీపతి నిశాపతి దిశాపతులు
ధారుణి గౌరిదిగ్దంతులు మునులు
దివి నుతింపఁగఁదాను దేవమాతయును
నవిరళ శ్రీయుక్తు నభిషక్తుఁ జేయఁ
దోషించె మునిగణస్తోమంబు మింత                (2220)
ఘోషించె దుందుభుల్ ఘుమఘుమయనుచు
సురభర్త యప్పుడాసుర హర్త కెరఁగి
యరిగె నావేలుపు టావుతోనంత
కలగోపి కలకోరి కలరాకరాక
వెలయుఁ గాముక మృగవితతి సాధింప
వెడవిల్తుఁడను గంటవేఁటరిగూట
నిడిన దివియపోలెనినుఁ డస్తమించె
ఘన గోపికానురాగము శౌరిగప్పు
ననువునఁగెం జాయలడరె నభ్రమున
బిసరుహాక్షుని కీర్తి బీజసంతతుల          (2230)
నసులొత్తెననఁగ నక్షత్రంబులెసఁగె
నడపకమరుఁడు సౌమేఘవుల్పఱప
గుడివడు శితఖడ్గ కోదండమనఁగ
నలరువిల్తుని మామయగు చందమామ
కళలతోఁ బూర్వనగంబుమై నిలిచె
వెన్నెలచవి చూచి వెన్నెలపులుఁగు
లన్నులకొసఁగ వారదిమెచ్చి మెసఁగ
నుడురాజుఁ గాంచి పయోధిమిన్నంట
వడిఁబొంగెనోయని వఱపెఁ జంద్రికలు
పొదలఁ బూబొదల నింపుదలిర్పఁ జెలగి        (2240)
మొదలు తుమ్మెదలెల్ల మెఱసి నాదించెఁ
దమ్ములఁగలువ మొత్తమ్ముల షట్ప
దమ్ములవర మరందమ్ములందరుల
నమ్ముల వివిధ ఫేనమ్ములనొప్పు
యమునకూలమునఁ దియ్యమునఁ గోవిందుఁ
డమిత జగన్మోహనాకారుఁడగుచు
మోదించి కల్పకమూలేదుకాంత
వేదియైనత్కళా వేదియై నిలిచె
కనకంబునగుచాయ గనుపట్టుపట్టు
గొనబురంగుల చెఱంగులు మించఁగట్టి              (2250)
లలితసౌరభ రసాలంబ రోలంబ
తిలకమై వైజయంతీధామమమర
వెడవిల్తువింటి క్రొవ్విరికల్వ తూపు
దొడగినఠేవఁ గస్తూరి నామమలరఁ
దారపంఙ్తుల వియత్తల మొప్పు కరణి
హారజాలముల బాహామధ్యమమర
సిరిపదాబ్జములకై చేరు భృంగంబు
వరుస వత్సంబు శ్రీవత్సంబుచెలగ
గగణకోణాంగణ కంజాతమిత్రు
పగిదివక్షము కౌస్తుభముతేటపడాఁగ            (2260)
వరసోమమణిలో సువర్ణ ఖండంబు
కరమొప్పుగతియెదఁగల పద్మమెఱయఁ
గనకాద్రికూట సంకాశ కిరీట
ఘనకాంతి దశదిశాంగణములు వొదువఁ
దళుకొత్తునిక్షు కోదండంబు దండంబు
జలజకాండ బుకాండిమునంకుశమ్ముఁ పాశమ్ముఁ
దరచక్రందివ్యసుందర గదాసూన
శరములు బాహుపాశములఁ గీల్కొలిపి
చరణంబుపైనొక్క చరణంబు నిలిపి
మరునినల్వడు భంగిమలఁగిఁ త్రిభంగి          (2270)
నంగీకరించి మోహన భావమొదవు
గాంగేయమురళిఁ జిక్కగమోవిఁ జేర్చి
వివరంబుగా వేణువివరంబులందు
సవరగావర కరశాఖలల్లార్చి
ఘన రత్న కంకణాంగణ కాంతి వదన
వనజాతమునకునివాళియై పరఁగఁ
దళుకుఁగల్వలదండదండ సంవ్యాంస
తలములఁ గుండలాంతముఁ గొంతరాయ
శీతాంశుమైతేట చిలుకుచునుండ
వాతెఱవంచి భ్రూవల్లి నిక్కించి                  (2280)

(సర్వేశ్వరుఁడు డేణునాదము సేయుట)

కారుక్రమ్మెడు సోఁగకఱివంకబొమల
యోరబిత్తరిచూడ్కి యొరపు మీఱంగ
మాయురేయన మంద్ర మధ్య తారములురూపించీ
నాయుతంబొనరించి యణకువమీఱ
రంగురక్తియు మధురములుట్టిపడఁగఁ
బొంగెడి రసముల పొలుపు దీపింప
వివిధంబులగు నేకవింశతి శ్రుతుల
జవకట్టినట్టియా సప్తస్వరముల
కులమేర్పరించి తద్గోపికాశ్రవణ
ములకలంకృతులుగా మొగినలంకృతులు              (2290)
రూపించి గ్రామగారోహావరోహ
నైపుణ్య వివిధవర్ణములు చూపుచును
సమ శుద్ధ సాళగ సంకీర్ణ గతులు
క్రమముననెడుట రాగములు నర్తింప
నాణెమైమిగుల విన్నాణమై యొప్ప
వేణునాదంబు గావించెనవ్వేళ
గానంబు విమలంబు గానంబు సేయఁ
దానంబు లమృతసంతానంబులొసఁగ
జగతి బర్వినపూరి సగమేని మేసి
మొగి మృగంబులు మొగంబులు మీఁదికెత్తి          (2300)
యరగన్ను లిడిమేఁతలాత్మలో మఱచి
సురభులు మోదించి చూడంగఁదొడఁగె
సురగనాథుఁడు చొక్కుచుండె నీరసపుఁ
దరువులిగిర్చె శిలాతలములు గరఁగె
రాగ మోహన మంత్ర రాజంబు సకల
భోగికన్యల నాగభోగికన్నెకల
నరిదినాకర్షించి హర్షింపఁ జేసి
నరనాథభువన మంతయుఁ జొక్కఁ జేసి
భువనమోహన రసస్ఫూర్తిచే సకల
భువనముల్మఱపును బొందుటే మరుదు                 (2310)
హరియుఁ దన్మయుఁ డయ్యెనయ్యెడ నాధ
గరిమ యేమని చెప్పఁగా వచ్చునంత
నందనందను వేణునాదేందు కాంతి
నందితానంద బృంద మరంద హృదయ
కుముదలై సమదలై గోపికామణులు
రమణుల మించి శ్రీరమణుఁ గామించి
కుచములు గేటాడ గొనబులూటాడఁ
గచములల్లాడ ముంగఱలు మల్లాడ
నడవడి కడఁకనెన్నడుములు వడఁకఁ
గడుప్రేమ మొదవుల వేగనయముల్వదలఁ            (2320)
బయ్యెదల్ జాఱఁ బై పై ముద్దుగాఱ
నెయ్యముల్ బెఱయనెంతే సొంపుమెఱయఁ
జనుదెంచి జలజాస్త్ర జలజాస్త్రుఁడైన
వనజాక్షుఁ గదియ శ్రీవరుఁడువారలకు
సమధిక సుమజల క్షాళిత మదన
సుమబాణములవాఁడి సోఁకనిట్లనియె
తొడిఁ బడనిట్లు వత్తురెవనంబులకు
నడురేయి మీరలెన్నఁడు రేయివగలుఁ
బతులు మాటకుమాఱు పలుకనివారు
సుతుల నాయకుల వస్తులాడించి పొంచి              (2330)
పరునన్నుఁ గామింపఁ బాడియెయనుడుఁ
బరుఁడవేయల పరాత్పరుఁడ వేయనుచుఁ
దరుచుగా గోపికల్ తరువులు వెట్ట
నొఱపుఁ దొంగలిఱెప్ప లొకయింతవంచి
లలిత చంపక ముకుళములోను వాయు
వొలయు చందమున నిట్టూర్పులు నిగుడ
వరకూల్మపోతముల్వసుధ నటించు
సరవిఁబాదముల భూస్తలము వ్రాయుచును
హరినీలముల కాంతులలరుముత్యములు
గరిమఁదజ్జల భాస్పకణములు దొరుఁగ         (2340)
మిసిమి బింబఫలంబు మెసఁగు కీరములు
కసరుచందమున గద్గద నాదమెసఁగఁ
వేఁడివాడిఁయు నొల్కు వెడఁబల్కు మతులఁ
దాఁడి పాఱఁగనాడఁగా నీకుఁ దగునె
తలఁపులో నెపుడు మాధవుఁడు మాధవుఁడ
తలఁపమన్యులమని తలపోయుమమ్మ
చయ్యన మగుడంగఁ జనుమని పల్క
నయ్యయోయెట్లు నోరాడెరా నీకుఁ
బతులను మీఱఁ బాపంబంటి వఖిల
వతి నిన్నుఁ జేరుటే పరమధర్మంబు            (2350)
ముక్కుమో మెఱుఁగకమో మోటపడక
మొక్కవీఁడను చందమున విడనాడఁ
బాడియేలేకొక్క పదముపదంబు
లోడవుమగిడియే మరిగెదమన్న
నధరకోమల పల్లవాలోల శీత
మధురామృతంబుచే మదనార్చినార్చి
ప్రాణేశ దయఁ జూడు పదరితివేని
ప్రాణముల్నీకు నొప్పన సేతుమింక
నజుఁడు గాయజుఁడు రుద్రాదిదేవతల
భజియింపఁ గోరునపాంగ చంద్రికల          (2360)
సిరి తులసీదేవి చేరియెల్లపుడు
శరణొందు నీపదాబ్జములె కొల్చెదము
నెఱయంగఁ గామించెనే నెమ్మినమ్మి
మఱచితి మిదెనేఁడు మాయిండ్ల పనులు
వలపించి పిమ్మట వావిగాదనుట
పొలుచునే నీయట్టి పురుషోత్తమునకుఁ
దొలఁగ ద్రోచినఁ బోము తుదినింకతమడు
తలలకు నీడు పాదములకులంకె
యేలరా కృష్ణ మమ్మేలరాచలము
చాలురా నీకును జాలురా యిదియె                      (2370)
కలిమిపూఁబోణి చన్గవ గోరిమారు
యలుగుల పాలుసే యంగఁ జూచెదవొ
సతత శిలీముఖోజ్జ్వ లితంబులైన
యతను పాశములకు నప్పగించెదవొ
వలరాజు పట్టంపు వాజులనొప్పు
డెలయించు కెమ్మోవి నిచ్చెదొవేగ
చలమున నీరీవి సారెకుమమ్ము
నెలయించి మరుబారికిచ్చెదో చెపుమ
అకట నిన్నననేల హరియేము వచ్చు
సకిన పంతమున నిచ్చకు రాముగాక               (2380)
యెట్టైన నీకింత యెచ్చైన పనికి
మిట్టిమీనంబవై మెఱయుదువచట
వలసియెల్లమి గాక వలసియిండినను
దలకొని కొండైనఁ దలకెత్తుకొందు
పొరబొచ్చములుగాక పొసగునందులకు
దరమిడి పాతాళ దరియైనఁజొత్తు
ఇతవుగా మిదిగాక హితకృత్యములకు
నతులిత లోహంబునన భేదింతు
కపటంబుగాకిటఁ గాకుండెనేని
యిపుడ ఈ లోకంబులెల్లఁ జేకొందు                 (2390)
చిట్తకంబులుగాక చింతనించినను
బట్టబద్ధులనైనఁ బారవట్టెదవు
వేసాలుగాక నీవేనేయనున్న
నాసముద్రములైన నడ్డకట్టెదవు
తలఁగాకిట్టె తలఁచితివేని
గలయంగనేటి వంకలు దిద్దఁగలవు
బ్రమయించెదవుగాక పాటించితేని
కమలజాండములు ప్రక్కనెయడంచెదవు
వినరోరి వీనుల విందుగాఁ బెక్కు
లననేల యింక నీవగుటమేమగుట                 (2400)

(ఇంకా ఉంది ......)

Friday, January 15, 2016

అష్టమహిషీ కల్యాణము-5

యాలపాలకు నేరియై వట్టివాలి
కలిగియుండును బసిగలవారు ప్రజలు
కలవారునటుయుండగా నోపునండ్రు
మనమునెమ్మనమున మందలతోడ
నునికిఁ జేసిన నొప్పునొప్పమి లేదు
అనవల్లవీవల్ల వాదులుం బండ్లు
గొనకొనకుందెనల్ గొమ్మకుందెనలు
చిట్టులు నుట్టులు చిక్కముల్వెన్న
చిట్టులుఁదొట్టుల చల్దిజాడియలు
తరిత్రాళ్ళు వల్లియత్రాళ్ళు జల్లెడలు     (1080)
నురిత్రాళ్ళు పగ్గంబు లుగ్గంబులురులు
సెలకట్టియలు బిల్పుచేపుమందులును
దలకోలలును విండ్లు తరికటంబులును
పంపరకవ్వముపల్పుడామొనలు
గంపలునొడిసెండ్లు గండగొడ్డండ్లు
పాటిమాడలు చిట్లపై వెన్నమూటి
కూటికుండలలోనఁ గుదురుగానునిచి
చలపమంచములు గంచములు కుంచములు
ములువాడికత్తులు మొదలుగావించి
గుజ్జులు గాకుండ గుజ్జులు గట్టి         (1090)
మజ్జారెపడఁ బలుమాఱు రొప్పుచును
మందయానములన మంమోదములఁ
గలకంఠ వంచితలకంఠనందు
పొలతుకహరిరాము బుజ్జగింపుచును
బయనంబుతఱిరండు పాలును బువ్వ
యన యంబునందొప్పుడందునో తండ్రి
పేరిన నెయి బువ్వ పెట్టెదఁ పసిఁడి
కోరదెకోరకై కోర నామాట
యనిభుజింపఁగఁ బెట్టియంచులుగట్టి
తనరుచుండెడి చిత్తితుడుపులు గట్టి       (1100)
కైసేసివేడ్కఁ జింకలఁ నిడివారి
కైసేసియున్నట్టి యప్పంబులొసఁగి
సకలసన్నాహంబు చనుదేర నికట
శకటంబు రోహిణీసహితయై యెక్కి
యుబ్బిపగ్గములంత నుబ్బినందుఁడును
గబ్బిగిబ్బలను వేగమెరొప్పికొనుచు
ననుచుకందముల కందముల కుందముల
ఘనలవలంగముల లుంగములఁ దుంగములఁ
దరులకేలిశల దరులనిర్ఘరుల
సరసకుంజములఁ గంజముల పుంజముల     (1110)
లలితసాలములఁ గోలములసు మాధ
వులనుమోవులను రావులను దావులను
గాళిభృంగాళితో గ్రాళిసూనాళి
దూళిమైఁబోలి మేధూళిమైఁదేవి
మించియెంతయు సంభ్రమించి రమించి
పంచబాణుని వెన్నుబలమై చలింపఁ
గమ్మవిల్తుఁడు దాడిగదలంగనెగయు
దుమ్ములోయనఁబు వుదుమ్ములు నెఱయ
వెడవిల్తు కత్తుల విరహిరక్తములు
వడియుజాడఁ జిగుళ్ళ వడిదేనెలురుల          (1120)
హరికృపాదృష్టిరేనగులింద్రువింటి
సరణిబికశ్రేణి చదలఁ జూపట్ట
బాలమారుత చలత్పర్ణరంభౌఘ
మాలోలభోగగాళిఁ గేళింప
గగనంబునొఱయ శాఖలు మోగగుత్తు
లగణింపఁ దాతల సురికింపుచుండఁ
గనకపునదిపిల్లకాలువనఁగ
ఘనచూతరములుద్కటములైనిగుడ
సతులమోవులఁ గ్రోలుసరసులుబోవె
లతలబింబములు చిల్కలు గ్రోలుచుండ         (1130)
తరులక్ష్మిహలికక్షుతములిచ్చెననఁగఁ
గరకబీజములు శాఖలనొప్ప నొప్పు
సందీప్తసవనింబు సకలయోగీంద్ర
బృందైకభవనంబు బృందావనంబు
పరమాత్మగతిసర్వ ఫలదమైసిరులఁ
బెరసిచూపట్ట నాభీరనాయకుఁడు
చేరిమందలవారిఁ జేరికాళింది
వారిపొంతనె యెల్లవారిని నిలపె
వనియనునిండు జవ్వనిదాల్చునామ
మనబండ్లు లర్థచంద్రాకృతివిడియ         (1140)
అదననందఱకిండ్లు లమరించికసపు
పొదలలే పొదలపైఁ బొదలఁగా గప్పి
పట్టులతోలి దుంబట్టులగాగ
మట్టెన్నరాక నెమ్మదినుండువారు
వెలుగలుచొరకుండ వెలుగులువైచి
మలయునావులఁ జేల మరపెడువారు
పెనలఁ గోడియల గుంపెనలదామెనల
పెనదీర్చిగూటముల్బిగి యించువారు             (1150)
దరులఁ జూపట్టెడు తరులబండించి
సరగునగుడిసెలు సవరిండువారు
కడుజిడ్డుదేలెడు కతలు గొల్లెతలు
నుడువ నాలించి వీనులవేల్పువారు
తఱచువెన్న మెఱుంగు దాఁకికన్నులకు
జిఱుతలువారించు జిగిచన్నులదర
అరగవిసెనయూడ్చు నద్దంబుపోలె
పురిచుట్టుచెఱఁగు కపోలాగ్రమొరయఁ
జనుదోయివ్రేగున చాడెవేగునను
జినుగుకౌనొక యింత జివ్వాడుచుండఁ       (1160)
జల్లచల్లాయని చల్లఁగాఁ బలుకు
వెల్లవారలువిన నెలుఁగెత్తిచీరి
వెలగపండులతావి వెదచల్లచల్ల
కలికిగుబ్బెతలమ్మగాఁ బిల్చువారు
అరిదిచేరువనొప్పు యమునతోఁయమున
కరిగెడువారునై యామందవారు
తలవరుల్ నెలవరుల్ తామెయైయచట
చెలఁగుచుండిరి రాజశేఖయంత
గోపబాలురతోడఁ గూడి యానంద
గోపబాలురుచిన్ని కుఱ్ఱెలఁ గావ        (1170)
నెలవంకనాడు వన్నియ సందితాయా
తలదండగురిగింజ దండలింపొంద
గిరుకుజెప్పులను బర్గిడఁ బిల్లదొరలు
నెరుకుగాసియలు గ్రొన్నెలలవంకబొట్లు
చిక్కముల్ కాసుల చిక్కముల్ చలిది
చిక్కముల్ లిక్కులు జిక్కులుం దాల్చి
యలవి మీఱినయట్టి యమునచెంగటను
గలపచ్చికలముచ్చికల నిల్పి నిల్పి
క్రేపులమేఁపుచోఁ గ్రేపురక్కసుఁడు
క్రేపురూపమున నాక్రేపులఁగూడి                 (1180)
చరియించుచును దముశఠ మతిఁజూడఁ
దరిమిడికినిసియాతఱివేల్పు పగతు
మన్మథజనకుఁడే మఱజూచిపట్టి
మన్మథతరుపుతో మడియంగవైవ
కీలల్లయని క్రేరిక్రేపుగాపరులు
కోలలు జీరలు గొంగళ్ళు ద్రిప్పి
తెగడుచుఁబొగడుచు దివికిలంఘించి
యగరివైచియుఁ గృష్ణునెగుఱవైచియును
భజియింపశౌరియు బలునితో సురలు
వ్రజముమెచ్చఁగ నిజవ్రజముకరిగె          (1190)
పాలితాంబుజభవభవుఁడైన శౌరి
బాలుఁడైయొక్క గోపాలుఁడైయుండె
నతనిసౌలభ్యమేమని చెప్పవచ్చు
క్షితినాధకొంతయెంచితిమితిలేక
మఱునాఁడు సఖులువేమఱునాఁడు చనిన
తెఱగునఁ బోవనే తెమ్మురమ్మనిన
పిరిగొన్నపూసల పేరులొక్కింత
నెరుకుగోసియలమైనిగ నిగమనఁగ
వేణులు పాణుల వెలయంగఁదమదు
వేణులఁగనిభృంగవేణులుంజొక్క            (1200)
నొరపుగాముంగేల నొనరించినట్టి
చిఱుతవల్లియత్రాళ్ళు చేసగ్గిడలును
రాణింపఁ చిత్రచామరములనాసీర
పాణియు నాచక్రపాణియుఁ గూడి
తోడనాడెడువారి తోడఁదోడ్తోడ
దూడలతోఁగూడ దూరంబు వోయి
బంతులాలంకి యప్పలములుపారి
గంతులుద్దులు గ్రచ్చకాయ లాటలును
ఆడుచుఁబంతంబు లాడుచుఁబసుల
నీడఁ గాళిందిని నీరుద్రావింప       (1210)
నొకచక్కిఁ గంసని యుక్తదానవుఁడు
బకము రూపమునడంబకము చూపుచును
జంచువాడించి పక్షములు జాడించి
పంచిగోడించి తీవ్రతదువాడించి
జలజాక్షుఁ గబళింప శాలియైయసుర
గళమునెన్నడుమ వెగ్గలముగాఁ బెరిఁగి
స్ఫురదగ్నికోటి స్ఫురణవహించి
హరికుత్తుక కుదిగండని వెడసిచ్చి
శాతతుండముసా ప్రజాతరోషమున
శాతకుంభాంబరోజ్జ్వలుఁడాబకంబు         (1220)
తలువులాపాద తలములుగాఁగఁ
జీల్చియార్చు జయశీలియై మరవి
శేషాంశుతోగోపశిశువులు విజయ
ఘోషంబుగావింప ఘోషంబుసొచ్చె
నుడురాజుపెన్నుద్ది యుగ్రభానుండు
పొడుపుగుబ్బలిమీఁదఁ బొడకట్టు వేళ
హరిశృంగఫూత్కారమడరింప వెడలి
పరువడివంశదీపకులు గోపకులు
తమతమ యిండ్లనుత్తమతమాన్నంబు
నమరించుకొనుచుఁ బెయ్యలతోడనరుగ     (1230)
పెరుఁగునేలకిసొంటిబిల్లలల్లంబు
మిరియంపురవల సమ్మేళమౌచవిది
గొఱుకఁజిల్లున నేయి గురియుచువేఁగి
గరగరమనుచుండు గారవేల్లములు
మొల్లమిసంభారముల మించురుచుల
బళ్ళువట్టించి పచ్చళ్ళతోఁగూడ
గట్టిపావడలతోఁ గట్టిచిక్కముల
బెట్టికొల్కులుపురి వెట్టిచేపట్టి
ఫణఫణంతర బాలపద్మారికరణి
గుణుతికెక్కిన కరాగ్రము శృంగమమర      (1240)
సుకుమారపవనంబు సొలపులమొరయ
సకలసంగీతసూచకము నీచకము
దట్టిమైచెక్కిగుత్తంబు చిత్తంబు
కట్టులజిగిమించఁగాఁ జంకనిఱికి
తమమునఁబెనగొన్న ధవళాంశుకకళల
కొమరునందిన బాఱగొంగళ్లిదాల్చి
జలజభవాండముల్సంచిలోనణఁచు
నలరిక కచ్చకాయల తిత్తినొప్ప
గణముమీఱిన వత్సగణముతో గగన
మణిపుత్రికానదీ మణితీరమునకు            (1250)
నరుగుచో బకదైత్యుననుజన్ముసఖుఁడు
కరదేహమగునదీగరదేహమంది
నురుతరాస్యమ్మున నుత్తాలబలము
సరణిగాన్పడ జిహ్వ సరణిగాఁబఱచి
పగదీర్తుననుచునా పగచెంతమదిని
బగచాటుచుండ గోపకులేగుదెంచి
దరిగానమిది మహోత్పాతంబు శైల
దరియంచుఁ గంససోదరిపుత్త్రుఁదలఁచి
హరియుండభయములేదనుచు తద్భుదిత
భరులౌచుఁ బరమప్రసన్నులు పోలె           (1260)
నగ్గళంబగుదాని యుగ్గళంబపుడు
దిగ్గనఁజొరఁగఁ నత్తెఱఁగెల్ల నెఱిఁగి
భక్తసంరక్షణ బద్ధకంకణుఁడు
భక్తశిక్యౌదార భక్తలోకంబు
వెనుచనిబలిమర్దివింశమై పెరిఁగి
ఘనదైత్యకంఠోపకంఠ ముత్కంఠ
వ్రచ్చి గోపాలక వెరులతో వెడలి
వచ్చియగ్గిరినిచ్చ వచ్చినట్టుండ
నావ్యాళముననుండి యావేళనొక్క
దివ్యతేజంబు దైతేయారిఁగలసె            (1270)
గోపాలసుతులతోఁ గూడియానంద
గోపాలసుతుఁడును గజములెక్కుచును
గోకిలశుకభృంగ ఘూకమండూక
సూకరరవముల సూఁటిగుయ్యంచు
వేలుగొమ్మల మీఁద వ్రేలు కపీశ
వాలముల్ భూజశైవాలముల్ ముడిగి
సేతుబంధించి సేతురమ్మనుచు
నాతతవాహినులడ్డుకటుచును
కలితప్రవాళరాగములఁ బ్రవాళ
ములవింతగాదాము ములుగట్టి తాల్చి         (1280)
సురపొన్నమొగ్గలు బోడుగాఁ జేర్చి
కరమొప్పఁ జౌకట్లు గాధరించుచును
సురపొన్నణీడ భాసుర సరోవరము
సరసనుసరసుఁడై సరసిజాక్షుండు
నెలచట్టురాతిపై నిలిచి గోపకులఁ
బిలిచి వత్సముల నొబ్బిడిగాఁగవెలిచి
కొలఁదియైవెండి నిగ్గులుదేఱు చిలుప
చిలుపగొజ్జఁగ నీరుచిలికించితులఁచి
చెవిమిమైఁ గొందఱు చేర్వనామీఁద
నలరుచిరాన్నంబు నలరుచునిడఁగ              (1290)
పల్లంబులఁ బాణిపల్లవస్థలులఁ
బల్లవించుచుఁ జేర్చి భక్తముల్ నింప
దళములై పొలుపొందు దళములలోనఁ
బలుమఱుచలుదులు పరిఢవింపఁగను
జలిది చిక్కమునొయ్య సడలించినగుచుఁ
బలికియాగోపాల పాలబాలకుఁడు
సురభూజశాఖాగ్ర సుమగుఛ్చమనఁగఁ
గరతలదధ్యన్న కబళమింబొంద
శతపత్రదళముల సందులయళుల
గతివళ్లయెడనూర గాయలు చెలఁగఁ          (1300)
గొమరుగొల్లలు చుట్టుఁ గొలువుందదాను
నారగింపఁగఁ జిందునన్నంబు మింటి
యూరివారలకునోరూరించుచుండఁ
గబలంబు చేత నిక్కబలంబు
కబళించునొకనిచే కబళమొక్కరుఁడు
చిక్కము చెలిమితోఁ జిక్కమువెనుక
త్రొక్కమురమ్ము మాతోడ నీవనుచు
నొక్కఁడొక్కని చిక్క మొక్కమికొసఁగ
నొక్కడొక్కని చద్దియొక్కఁడు మెసఁగు
వల్లవీవల్లవరుఁడు నాబాల                 (1310)
వల్లవుల్ దాను నీవరుస భుజింప
నేపుమీఱిన క్రేపులెంతయు మేఁపు
దాపుననరిళకొందల దండనుండ
మరకతాంకూర సమానంబులగుచు
కరమొప్పుచుందెడు గరికెఁక్రేళ్ళుఱికి
గుఱిమీఱఁదినివెలంకులఁ గొలంకులను
మెఱయుచునీరీతి మెఱయఁ గోపకులు
ఏవంకనున్నవో యిపుడూ వత్సములు
యేవంక నీరాన నెగెనొదెసల
వేవేగవెదకుఁడే వేగనో కృష్ణ           (1320)
నీవంక యీ వంకనిలిచితిమఁడు
వత్సకుల్మెచ్చ శ్రీవత్సలాంఛనుఁడు
వత్సముల్ ప్రోవుత్రోవనె పోవునపుడు
ధాతమనోజాత తాతబలంబు
చూతుగాకని ముందు చూడకేతెంచి
పరమభోజన విజృంభకులడింభకుల
సరగునడాఁచె వత్సములతోడఁగూడ
జనవర్యయాయోగిజన వంద్యుఁడపుడు
వనములటెంకి జీవనములటెంకి
కానకతొల్లింటి కానకుమరలి            (1330)
యానెలవున బాలకాళిలేకున్న
గమలసంభవ కోటిగన్నయాతండ్రి
కమసంభవు మాయగాఁ చూచి నవ్వి
యాయొప్పుచున్న వత్సాళిప్రాయములు
కాయముల్వర్ణ నికాయములట్లు
బాగుగాఁ దద్గోప బాలవత్సముల
బాగుగాఁదనదివ్య భవ్య సత్త్వమునఁ
జతురాస్యు క్రియలెల్లఁ జవుకవుట్టింపఁ
బ్రతిసృష్టిఁ జేసి యప్రతిసృష్టియనుచు
సురలెన్నిభాసుర సురభిసూనములు          (1340)
కరములశోభనాకరముగఁజల్లి
రాభీరశిశుయుక్తఁడై తొంటిరీతి
నాభీరవసతికి నరుదెంచియంత
కలగోప గోపికల్ కలయందు పొందు
సలుపుచుఁదొల్లింటి సరణినాడుచును
ఒకయేఁడుగడపి వేరొకనాఁడు మెరసి
ఒకవైరిగోపాల బాలఫాలమున
వనభూమిఁజేయు జీవనభూభవుండు
వనజాయతాక్షు క్రేవల నాడుచుండ
ధరచక్రధరుల మంధర ధరాకృతుల     (1350)
గురువేణుశరచాపకుల గోపకులను
గనిడెందమునఁగుంది కడుచెఱగంది
ఘనభీతినొంది దిగ్గనభూమిఁ జెంది
బ్రమయించి వత్సగోపకులనేదాఁచి
సమమయ్యతనచేత సమమయ్యనేల
కనుఁగొన నీవత్సకములు వత్సములు
తనసృష్టి లేదు నూతనసృష్టిగాని
తనతండియైన పూతనవైరికృత్య
మనిమనికిత మందియాకంపమొంది
ధరఁజాఁగి మొక్కి శ్రీధరపద్మరాగ      (1360)
చరణముల్ జగదేక శరణముల్ చేరి
యపరాదినపరాధి నాగమగణ్య
కృపఁ జూడు కృపఁ జూడు కృపణశరణ్య
కడుపులోపలిబిడ్డ కాలఁదన్నినను
జిడిముడితల్లికిఁ జెల్లునే తంట్రి
తరగలతనకు ముందరగలజనవి
సరముల నఖిలవాసరములనెన్న
గణనసమీఱవు మౌనిగణనుత నీదు
గుణములు గణనకుఁ గొలఁదులేకావు
తాతనీముందఱఁ దగఁదన్నయినుని      (1370)
ద్యోతంబుఁ మీఁద ఖద్యోతంబుకాంతి
కొలుపునే మధ్యమగుణమునాయందు
నిలువనేరమివచ్చెనే తండ్రియనుచుఁ
గలికిలాగులఁ గన్నుఁ గాచదోయిజోడు
జలము శ్రీపాదమజ్జనముగాలింప
మ్రొక్కుచునాశ్చర్యమును బొందిపొంది
నిక్కుచుసారెకు నిలిచి చొక్కుచును
నాఁడుచేకొన్న చిహ్నంబులతోడఁ
గూడనాగోప గోపకులకులంబెల్ల
దర్పంబుడించి కందర్పుని తండ్రి         (1380)
కర్పించి ప్రణుతి సమర్పించియరిగె
తనమాయఁ బొడమిచెంతనెయొప్పు గోప
తనయులఁ గ్రేపులఁదనయందె యడఁచి
మున్ను తామున్న సమ్మున్నతస్థలికి
వెన్నుఁడాబాలక వితతితోనరిగె
హరిమాయచే మోహితాత్ములైగోప
వరులు శ్రీపరుని నెవ్వరుఁ గనుఁగొనరె
దరులని యేరుల దరులని తరుల
గిరులఁ బల్లంబుల క్రేపుల జూడఁ
జయ్యననరిగె నీచవిదియుఁ గుడువఁ       (1390)
డయ్యెజాగాయెరాఁడయ్యె నటంచు
వామహస్తముల నవామనాకృతుల
వామాన్నకబళముల్వలఁ నొప్పుఁబులువఁ
గపటనాటక హాతకపటసంకలితుఁ
డపుడేగుదెంచిపెయ్యలఁ గంటిననుచు
వారిజహితపుత్రి వారిలోఁగేలి
వారితో వేడ్కన వారణసలిపి
పించెంబుగల నెమ్మి పించంబు గాంచి
మించి గోపికలు కామించి వీకింప
నందగోపానంద నదినాద్బిందు            (1400)
మంధరధరుఁడంత మందకునేగెఁ
బరమేష్టిదాఁపగోపకుల నయ్యెడను
హరిమాయచే క్షణమయ్యె నాయెడను
అరిదితల్లులఁజేరి యాగోపవరులు
కరమునఁ గరముగా కరముగాఁగురియు
పెనుబామువధియించి పెనుబాముగడపి
చనుదెంచెమాతతోడ శౌరి నేఁడనిన
నేఁడిదేయిదిపోయి నేడిదే తాము
నేడిదేయనుచునెన్నెదరు బాలకులు
అనుచునాశ్చర్య చర్యలకు నాశ్చర్య     (1410)
మునుబొందుచుండిరి మురవైరియంత
డాసినగొల్లమిండతల డెందముల
కాసలుఁరేచు ప్రాయమునగప్పారు
చికురముల్ నెమ్మిపించపుదండ దండ
నొకవింతయొసపరియొరపుగాఁజెఱివి
నాణెమౌశిలకుఁ బ్రాణముదెచ్చినట్టి
గాణవేణువు సందిగదియంగఁజేర్చి
యుదయేదునురము నీలోపలాంతరము
గదియకై వడితావికాసెచెన్నొంద
నున్నతో వత్సవత్సాళితోనున్న          (1420)
యున్నతోన్నతధేను యూధంబుతోడ
నరుగుచు నొకయుపాయమున నాయమున
దరుల దానవ జయార్ధంబై చరింప
శ్రీదామయుతగళ శ్రీధామనామ
మాదిగాఁగలిగిన యాభీరవరులు
రామయోకమ ... రామాభిరామ
సీమయొక్కటిమన చెంతఁ జెన్నొందె
యేలునవ్వని ధేనుకేంద్రారియచట
తాలముల్ ఫలరసోత్తాలముల్గలవు
భాగవతరామాయణము                 (1430)

Friday, January 1, 2016

అష్టమహిషీ కల్యాణము -3

(కంసవిచార కథనాది)

నావార్తయెఱిఁగి భోజావనివిభుఁడు
పావకసఖుగూడుపాపకుఁ బోలెఁ
గనలుచు సూతికాగారంబు సొచ్చి
తనయను సంభూతతనయను బట్టి
భువివైవనడుమనే పుటముగానెగసి
దివిఁబాదుకొని నిల్చి దివిజులుమెచ్చ   (510)
గరవాలశూలముద్గర ముఖ్యరుచిర
కరసరోజతాష్టకంబుతో మెఱసి
నీచేతనొత్తునే నీచాత్మ నేను
జీచీతలంపక చేసితి విట్లు
నినుజంపజనియించె నీరదవర్ణుఁ
డని చెప్పుచును మాయమైపోయె మాయ
ఆదటఁగంసుఁడత్యాదరంబొదువ
సోదరిప్రాణేశూ సోదరిఁజూచి
ననుఁజూచి మరువుండునా కల్లయెల్ల
అనిపల్కిగళితబద్ధంగులఁ జేసి    (520)
మంతుకెక్కిన బుద్ధిమంతుల బిల్చి
యంతరంగమున సొంపారి తనునింక
హరియింపనుదయించు హరి విచారించి
హరియింపుఁడేయుపాయంబుననైన
ననుచుగ్రక్కునఁ బంచెనట యశోదకును
దనయుఁడయ్యె నటంచుఁదనయుల్లమంతె
యానందమును బొంద నానందుఁడపుడు
ధేనుసహస్త్రముల్ ద్విజులకునిచ్చి
రమణీయ చీనాంబరముల చేవ్రజము
కమనీయముగనలంకరణమొనర్చెఁ    (530)
దమలోన గోపసంతమసవేణులును
గొమరుచెక్కిళ్లఁ గుంకుమము జల్లుచును
బాలునేతుచిరువాలు వెన్నలును
గాలువలై పారఁ గాఁజల్లులాడి
నీరాడి ముదుకవన్నియ మూరకుఱుచ
చీరలు వెడఁగు కుచ్చెలు వెట్టికట్టి
తోరంపుకొలుకులతొ వింతవింత
పేరులుగలబొట్లు పేరులు వైచి
పలుచనై పసపుతోఁ బదనైనపిండి
తిలకముల్ గోపికాతిలకముల్ దీర్చి       (540)
పొంతలనీళ్లు పేర్పులదోడి పసపు
పొంతలనిడి శిరంబులనెత్తి కొనుచు
నరిగి యశోద నీరార్చినూరార్చి
రరవిరిబాగుల యతివయొకర్తు
కొలని చెంగటిపువ్వు గొమ్మచందమునఁ
గొలని చక్కటిఁ బాదుకొని గద్దెపీఁట
నాసీనయై చరణాబ్జముల్ సాఁచి
పొసరించిన కుచంబులుముదుగునియ
నరలూడ్చుననఁటి వోయననొప్పునూరు
లరగానుపడఁ జేల యమరంగఁ జెక్కి  (550)
కావుకావు మటంచుఖచరులువేఁడఁ
గావుకావనువానిఁ గరములఁ బూని
వారితోఁ బెరయ శైవాలాంకురముల
గారవంబుననలకలు నూనె నెరయ
నివురుఁబోలెడి కేలనెత్తినడ్నెత్తి
నివురంగనంటిమై నింపుగానివిరి
పెసలుఁ గుంకుమ నల్లిబిల్లిహామెదిచి
పసిమిదేఱెడు సూనపసనలంగిడుచుఁ
దేనె తమ్ములముంచితేఁటిమైఁ బోయ
పూనికహరిఁగరంబుల జలంబార్చి   (560)
తావి నేరెడుపండు తలిరులఁ బొదవు
కైవడిఁబయ్యెదకడలినీరొత్తి
కరమొప్ప మణిపేటిఁ గప్రంబునించు
కరణినుంగాయను గదిసి యుగ్గిడుచు
దెలిదమ్మిలోపలతేఁటి చెన్నొదవ
దెలిదమ్మిలోపలతేఁటి చెన్నొదవ
వలిపె పొత్తులలోన వసియింపఁ జేసి
పురుడులేనట్టి యీ పురుషోత్తమునకు
బరుడులేఁడనురీతిఁ బురుడెల్లఁగడపి
పరివేషమధ్య విభాషితుండైన
తరణియోయనఁ దొట్లఁదనరారనుపస       (570)
జీవరత్నము చలించిన మాడ్కిఁతుంటి
క్రేవలెత్తుచు నిరుగేల సామచును
నలయిలాభామకు నభిముఖుండైన
చెలువునఁ బొరలి గొజ్జిగి బోరగిలుచు
జలజాలినడుకప్పు చాయఁగెంగేలఁ
బులుముకాటుక మొగంబునదిట్టవడగఁ
బంకజాకరములో పలియంచకొడమ
క్రేంకారమొనరించు క్రియఁగేరి శౌరి
పెరుఁగవ్రేపల్లె నభీష్టవస్తువులుఁ
బెరుఁగశోభనములుఁ బెరుఁగనందుండు      (580)
పన్నగావలియేటి పన్నగావలి
మునుగానిడఁగోప ముఖ్యులతోడ
గుమికూడి భోజేంద్రుకడకేగివంద
నములు సేయుచునప్పనములు చెల్లించి
కూటమి నొకజోడుకోడలై యున్న
నాఁటి సఖ్యము మదినాటిప్రేరేప
గడగడ నీపుణ్యగరిమనొక్కరుని
గంటిగాయనిమ్రొక్కి కౌగిటఁజేర్చి
చుల్లరవెట్టు కంసుఁడు కోపగాఁడు      (590)
పల్లెనేడొకటికిఁ బడుచులున్నారు
అని వీడు కొలిపిన నరుగుచోనట
జననాథ కంస దుర్జననాధుఁడనుప
శాతనఖాగ్రసంజాతనరీన

(పూతనావృత్తాంతప్రసంగ)

చేతనయగుచు హెచ్చినపూతనాఖ్య
పలవలనగు నూనె పసపునిగ్గులను
దవలుకొత్తువలువనుందల కొంగుగట్టి
తలఁపుకల్మషత నేత్రములకు దొట్టి
చెలువున నిగుడదీర్చిన కాటుకమర
వలుదలై చనుకట్టు వదలఁబాలిండ్లు  (600)
తొలకెఁడుపాలతోఁ దుంపిళ్లుగురియ
మిసిమిమైతనగబ్బు మెఱయించుమసటు
వసతాయెత్తులు సంధివలనొప్పఁగట్టి
పసిడీరేకుబ్బెత్తు పగిదివీడెమును
బొసఁగినిగ్గంలుదేరు పుక్కిటితోడ
నువిగాయవెడనుగాను గుగింజమోవి
నులిచిన పేరు చన్నులమీఁద బెళకఁ
గప్పు మీఱిన పులుకప్పుకెమ్మోవి
గప్పుచుండఁగ నూర్పుగములు నింపుచును
బొమలునిక్కఁగఁ గరమునఫాలరేఖ    (610)
జెమటయూర్చుటుఁగేలఁ జెదరఁ జిమ్ముచును
జడియుచును వచ్చిని జాలబాలెంత
వడువుననందుని వడువునీక్షించి
నివురుగప్పినయట్టి నిప్పుకపోల్కిఁ
బవడించియున్న యబ్బాలుఁ జేకొనుచుఁ
దొడలపైనిడుకొని యొడయంత చఱచి
బిడిబుడి జోలసొంపుగ బాడిబాడి
కొనవేళ్ళదాపలి కుచముగీలించి
ఘనమైన విషమొలుకఁగ వాతనిడిన
నమృతాంశుకులభవుండగు శౌరిరాత్రి     (620)
కమలాగ్రతలము భృంగంబునుబోలి
జెలఁగితీయ్యనినోటఁ జేఁదుమేయంగఁ
బొలుచునేయని పాలబుగ్గలుబ్బించి
కలగితీపైన యక్కరటి ప్రాణములు
జలధిఁ గ్రోవెడుకలశజురీతిఁ గ్రోల
యాతనఁ బూతనయవని పై విగత
చేతనయైఁ రాక్షసీరూపఁ మడరఁ
గూలినదానిపై గుంజరిమధ్య
బాలసింహము మాడ్కి బాలుఁడాడఁగను
గనికనికరమంది గమలాక్షునెత్తి    (630)
కొని కొని వచ్చి మక్కువతోడఁదల్లి
గోపుచ్ఛ గోమూత్రఁ గోరోచనముల
తూపొడిచియుమీఁ దఁదుడిచి బొట్టిడుచుఁ
గమలజహరముఖుల్ గరిమనీపాడ
కమలముఖ్యాంగముల్గాతురటంచు
రక్షగావింప గోరక్షకాధిపుఁడు
నాక్షణంబున వచ్చి యరుదందిదాని
యవిరళకాయంబు నస్త్రశస్త్రముల
లవములు చేసి పల్లవజనుల్ దాను
కడుదవ్వుగావైచికం పలుదుంప        (640)
లడరించియనలుని నడరింప దాని
పొగలెడుకారుక్రొంబొగలు చందమునఁ
బొగసె@ బూతనమోక్షమును బొందెనంత
ఇలదేవతల తలలెత్తింతుననెడు
చెలువున హరిచిన్ని శిరమెత్తియాడె
దనుజాళినీతలా తలయొనరింతు
ననుచందమున నీవలావలఁ బొరలి
యాడెడి చిన్నప్రాయమునందు నందు
ప్రోడయు సంభ్రమమున జలజాక్షు
నవతారతారనీరాచ్చితొట్టులను       (650)
బవళింపఁ జేసి రేపడబండిక్రింద
నొడికంబుగానీడను నిచియాచెంత
బడిబండి పనులవెంబడియుండునపుడు

(శకటాసుర వృత్తాంతము)

సకలకంటకుఁడు కంసఖలాప్తవరుఁడు
శకటనామకుఁడు తచ్ఛకటఁబునందుఁ
గపటవర్తననున్నఁ గపటబాలకుఁడు
కపటపుటాఁ కటంగావుకావునను
జయకాముఁదలుగులు జళిపించిచిమ్ము
క్రియాఁగరచరణముల్ గింజి యాడుచును
లాలాసుధారసోల్లసితమై చంద్రు         (660)
పోలికముఖబింబమును దేజరిలఁగ
దొల్లిబండియు దైత్యును స్రుక్కినేల
డొల్లంఁదన్నివేడుకఁ గేరుచుండి
ప్రియనాదవంచితపికలు గోపికలు
భయపడి బాలుపై బడియెత్తుకొనుచు
జననికిచ్చినలోకజననీసమేతు
మనమునదలపోసిమైకేవ్ల నిమిరి
వెండియునొకనాఁడు వేమాఱుమారు
తండ్రిక్రిందొనరించుతనయు ముద్దాడి
తొడలపై నిడికొన్నఁ దుహినాద్రికన్నఁ  (670)
గడుబరువై యున్న కడనుంచియున్న

(తృణావర్త వృత్తాంతము)

యాసమయమునఁ దృణావర్తుఁడనెడి
యాసురసురగాలియై భోజుఁడనుపఁ
జనుదెంచెచనుఁ బ్రాలుచవిగ్రోలు బాలుఁ
గొనిపోవఁ గానకా కొమరునితల్లి
యడలనయ్యెడమింటనడరునచ్చేగుఁ
బుడమిపై గెడపియప్పుడు దేవసమితి
కొనియాడఁగుత్తు కగుడిచిప్రాణముల్
గొనియాడఁశౌరిఁ జేకొనిచెలుల్ నందు
ప్రోయాలికొసఁగు సొంపునఁజునర్జన్మ    (680)
మయన్నకయ్యె నోమగువలారనుచు
నతిమోదముననున్నపుడు సన్మార్గ
హితుఁడు యాదవపురోహితుఁడు గర్గుండు
వసుదేవు పనుపున వచ్చిననెఱిఁగి
పసులకాపరిఱేడు భక్తి బూజించి
యతఁడు వచ్చినరాక నంతయుఁదెలిసి

(రామకృష్ణాఖ్యనామ కరణప్రస్తావము)

సుతులకు యోగిసంసృతులకిద్దరకు
గరిమఁజేయుఁడూ నామకరణములనిన
గురుసమానీతమార్గుండు గర్గుండు
బలభేదిమారుత ప్రముఖసంత్యుత్య     (690)
పలుఁడై నకతమున బలుఁడనుపేర
గామ జయంతులకంటె లోకాబి
రాముఁడౌకతమున రామనామమున
రుచిరసుధాగాత్రు రోహిణీ పుత్రుఁ
బ్రచురతంబిల్వుఁ డీపట్టునమీరు
హరిణపీతారుణాస్యాంగుండుగాక
హరినీలనిభమూర్తి యగుటఁ గృష్ణాఖ్య
యలవడు శౌరికి ననితెల్పియరిగె
బలుఁడు మర్దితదైత్యబలుఁడును నంత
రవిబింబమధ్య నారాయణాకృతుల        (700)
కవకుందెనలనుండఁగా నేర్చిరంత
హీనుఁ గంసుని జంపియే వీలనుగ్ర
నేనునిల్పుదమన్న శిరులగూర్చుందె
నడుచుధర్మము భూమినాల్గు పాదముల
నడవింతమనుభావనలఁ దొంగెయాడె
మనుజేతరమార్గములు మూమార్గముల్నడక
అనుజూపుగతిఁ దప్పుటదుగులు వెట్టి
మఁదఁటఁగంసు దున్నెదరు వీరనఁగ
మీఁవిపండ్లు మిసమిసగానుపడఁగ
మనుయంత్రాదిపద్మాది మండితాక్షరము    (710)
లనఁబాదముల గజ్జియలు పొందుపడఁగ
అందులమైవలయంబులోయనఁగ
నందియలందమైనను వొందియండ
మెరుపులు చుట్టిన మేఘపోతముల
మురువునగటిసూత్రములు దేజరిలుచు
సురగిరివళిత భాసురతారకాళి
సవిరమైమొలలఁ బూసలపేరులమర
నాగబాలకులు చందనశాఖలందు
బాగొప్పుగతిఁ గీరఫణిభూషలమరఁ
దనయందు నుదయించుధవళాంశుతునుక      (720)
లనఁబులిగోరువింపారంగఁ దాల్చి
హరిదశ్వుఁడద్దంబులందు బింబించు
గరిమతోరావిరేకలు తేటపడఁగ
ఖరుఁగంసుఁ జంపనేక తమాడుశీత
కదభామలనమద్ది కాయలు చెలఁగ
మౌవులతేనెకుముసురుతుమ్మెదల
కైవడినలకలఁ గప్పుమోములు
పూరినానాటి కుబ్బినముద్దుముద్దు
గాఱెనోయనఁ జొల్లుగారనోరెత్తి
కేరపోతముగొణగిన రీతిసొంపు        (730)
దేరఁదేనియలూరఁదెగడిపల్కుచును
గనకాద్రివిహరణ కరిపోతయుగ్మ
మనధూళియుతమూర్తులై పుణ్యములకు
నాలవాలములైన యాలవాలములు
కేలగీలించి జంకించితోలుచును
జోడింతవాయక జోడుకోడియల
జాడనిద్దరునొక్క జాడనాడఁగను
అప్పలప్పలు రమ్మటన్న నాయప్ప
యప్పులుకుటలె సందాయెఁబొమ్మనుచు
గబ్బిగుబ్బెతలలోఁ గౌఁగిళ్ళకురికి     (740)
యుబ్బరంబోడుము లంటియునంటి
కంటెన్నతాణియాగముల యోగములఁ
జెందనిసౌఖ్యంబ్య్ఁ జెందఁ జేయుచును
యిందుశేఖర రవియింద్రాదిసురలు
నొందనిసౌఖ్యంబుఁ నందఁ జేయుచును
గలుషవల్లులద్రెంచు ఘనల విత్రముల
యలపునఁ జింతకాయలు తూలియాడ
గుంపులై చీకటి గుమురుల మూల
దుంపలోయన జడల్ తుంపెసలాడఁ
గొదమవెన్నెలపులుగులు గూఁటనిడిన      (750)
చందురునఁగేల లోచనములుమూసె
యంబుజోదరకేసరాగ్రంబులనగ
నంబుజోదరుఁడు దంతాళిగాన్పించెఁ
కిలకిలనగుచుఁ జక్కిలిగింతచెంత
చెలులొనర్చినగోర జీఱితిట్టుచును
ఘనయోగిమతులఁ జిక్కనివాఁడుగోప
వనితలఁకౌగిల్ల వశమయ్యెనపుడు
పొగడొందుతమదురూపులను జూపులను
బొగడనివారును బొగడుచుండఁగను
దమవిలాసములకుఁ దమముద్దులకును      (760)
బ్రమయనివారును బ్రమసిచొక్కఁగను
అంతవై యింతవై యరిదికూఁకటులు
వింతవై ముడిగూడి వెలయు ప్రాయమున
తనకదిదంటలై తనరు బాలకులు

(ఇంకాఉంది)
(వచ్చేభాగంలో "నవనీతచౌర్యాది లీలావర్ణన)

Sunday, December 25, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం - 33


బాలచంద్రుఁడు నరసింహుని తలయనుకొని వేరొకని తలగోసి తండ్రియొద్దకుఁ గొంపోవుట

ఘనముగనొకవెల్ల గజముపనెక్కి
నేర్పుమైయొకడుండ నిర్భయుడగుచు
అనుజులనందర నటబుచ్చివచ్చి
కొదమసింహముమాడ్కి కుంభిపైదుమికి
వక్షముంబాకున వడితోడపొడువ
వాలంబునకువెళ్ళి వచ్చెనుతిరిగి
కదగిగుంజగ నెత్రుకాలువలయ్యె
ఖండించిమదగజ ఘనమస్తకంబు
కూల్చెనుభూమిపై కొండచందమున
పైనరుడెవ్వడో భావింపలేక
నరసింగుడనినమ్మి చిత్తమున
తమకంబుచేవాని తలతెగగొసి
తనచేతబట్టుక తమతండ్రికదకు
బాలుడువిచ్చేసె ప్రజ్వరిల్లుచును
సమరరంగముచూడ చక్కగనుండె
ఘనమైననెత్తురు కాల్వలైనిలిచె
తెగిపడ్డగజములు దీవిలైయొప్పె
నరికినతురగముల్ నక్రంబులాయె
పొర్లాడుశిరములు బుద్భుధపటలి
ట్Yఎక్కెముల్ గొడుగులు డిండీరవితతి
కలిగినపుచ్చముల్ కచ్చపరాజి
మేతినేత్రంబులు మీనవారంబు
దీర్ఘశిరోజముల్ తీరైననాచు
మెదడునుమాంసంబు మించినబురద
తరచైనయీటెలు దర్వీకరాళి
పొడియైనభూషణ పుంజములెల్ల
సైకతనిచయంబు సరవివర్ణింప
ఇటువంతిరణరంగ మీక్షించికొనుచు
చనుదెంచిసోపాన సంయుక్తమైన
మేడమీదకినెక్కి మేటివిక్రముడు
బాలుడాశిరమును బ్రహ్మకర్పించె
నాయకావలిజూచి నాయుడిట్లనియె
చెలువైననరసింగు శిరమిదికాదు
రహివెంకుశిరమౌట గ్రహియింపలేక
చనుదెంచెనేమయ్య జగదీశుతమ్ము
డైనట్టినరసింహు డన్నదగ్గరకు
తరలెనుబలముల తాదెత్తునంచు
తెలియలేవైతివి ధీరాగ్రగణ్య
అనిపల్కగాబాలు డాగ్రహమంది
వీరులకెల్లను వినతిగావించి
కడువేగమునవచ్చి కలిసెతమ్ములను

ఇరుపక్షములవారు సంకుల సమరంబొనర్చుట

అటమున్నెనరసింహు డధికబలమ్ము
తెచ్చుకమొనచేసె ధీరతనెదుట
మదగజంబులపైకి మత్తసింహంబు
లరుదెంచువిధమున ఆశ్చర్యలీల
పౌజుపైనడచిరి బాలురార్వురును
వసుధేశుతమ్ముడు వారలజూచి
తనవారికెల్లను తాసైగజేసె
క్రమ్మిరివిలుకాండ్రు ఘనులపైనపుడు
బాలుడుమొదలైన బాలవీరులును
నారులవిండ్లను నలినలిచేసి
తొనలునుబాణముల్ తునుకలుచేసి
వెరువకయుండిరి వీరులపైకి
కదిసిమూకలువచ్చి కదనమధ్యమున
సాంద్రవంశాటవి చందముదోప
క్రమ్మిరిసాధ్వస కరముగనపుడు
తలకకవారలు ధైర్యంబునొంది
చేగదల్ త్రిప్పుచు చెలగిఆర్చుచును
కొక్కెరగుంపుపై కుప్పించియురికి
సాల్వంబుఢీకొన్న చందంబుగాగ
కరులపైసింహంబు కదిసినరీతి
వ్యాఘ్రంబుగోవుల వడిదాకినట్లు
సేనలపైకేగి చెండాడిమరియు
చెక్కులముక్కుల చేతులమెడల
కన్నులవెన్నుల గడ్డాలతలల
ఘనమైనకత్తుల ఖండించిమించి
కుంతములంబోడ్చి కూలంగత్రోసి
చక్రసంఘముచేత చక్కుగాచేసి
రెదురెవ్వరునులేక యీతీరుసల్ప
చాపకట్టుగగూలె సకలబలంబు
అంతకంతకుయుద్ధ మగ్గలంబాయె
అప్పుడుబాలుడా యనుజులకనియె
దళముపైబోకుడి దట్టించిమీరు
కామేశుతమ్ముని కనుగొనివత్తు
అనుచునాతడుబోయె నడుగుచురిపుల

బాలచంద్ర నరసింహభూపతుల ద్వంద్వయుద్ధము

అనుగుభూపతిపుత్రుడా నరసింహు
డెక్కడనున్నవా డేడిరావాడు
బాలచంద్రుడువచ్చు పటిమవీక్షించి
ఢాకకుభయపడి డాగెనోలేక
పందతనంబున పారెనోచెప్పు
డనివిచారించుచు అపుడుబాలుండు
గజముపైసింగంబు గమకించురీతి
పర్వతమ్ముననబిడ్గు పడ్డట్లుగాను
తగగొంతుగొనెకాము తమ్మునిమీద
చుట్టువారలు శూరతనపుడు
ఘనపరాక్రమముచే కదియంగజూచి
గరిమబ్రహ్మన్నపట్టి ఘనకుంతమునకు
ప్రతివచ్చు సామంతరాగోలపట్టి
కటియందుగట్టిగా కాసెబిగించి
ఆంజనేయునిభంగి అటచౌకళించి
కిలకిలనార్చుచు కేరళవిభుని
పొడిచిత్రోసెనువేగ భూమిపైబడగ
కర్ణాటభూమిశు కలనిలోజంపె
మాలవమహినేలు మనుజేశుశిరము
చిదిమినట్టుగద్రుంచె చిత్రంబుగాగ
బర్బరధరణీశు బాహులనరికి
సమవర్తికడకంపె శౌర్యంబువెలయ
కరిపైనినుండిన ఘననరసింగు
పైబడెసాహస పాటవమొప్ప
దంతినికవియించె ధరణీశ్వరుండు
బాలచంద్రుడు కోపభారముతొ పిదప
తండ్రినిబోలిన తనయుడుగాన
కడు ఉన్నతంబైన కరిపైకివడిగ
కుప్పించిదుమికి ఆకువలయేశ్వరుని
బుజమునపొడిచెను భూమీశుడలిగి
ఐతాంబపుత్రుని అసిధారగొట్టె
తప్పించుకొనియంత ధరణీశునేసె
నరసింగరాజును నాయునిసుతుడు
కర్ణుండువిజయుండు కలహించినట్లు
వృత్రుడునింద్రుండు పెనగినభంగి
రామరావణులు పోరాడినరితి
హెచ్చియుద్ధముచేసి రిరువురుజాము
విక్రమస్పూర్తిమై వెలయబాలుండు
కామునితమ్ముడు కదిసియావేళ
అంకుశంబునపొడ్చె అదిబాలచంద్రు
భేదింపబైటికి ప్రేవులువెడలె
బాలచంద్రుడురోష పాటవమెసగ
సామంతరాగోల చక్కగబట్టి
వక్షఃస్థలంబున వడితోడగ్రుచ్చె
గాడివీపునవెళ్ళె గ్రక్కునాలుగు
మొగలిపూభంగిని మొనచందమమర
అప్పుడునరసింహు డాత్మనిశ్చలత
మాచర్లచెన్నుని మదిలోనదలచి
అనుగుభూతలనాథు నాత్మలోనెంచి
శీలమ్మనాయుని చింతించిపొగడె
ఊర్ధ్వమార్గంబుల నొయ్యననెక్కి
బ్రహ్మరంధ్రంబున ప్రాణంబులేగె
కుంభికుంభముమీద కూలెనారాజు

బాలచంద్రుఁడు నరసింహభూపతి తలగోసికొని తండ్రియొద్దకేగుట

కనిబాలచంద్రుడు కడుదుఃఖమొంది
వలగొనిముమ్మారు భక్తితోమ్రొక్కి
అనుగుభూవరపుత్ర అంగజగాత్ర
ఉర్వీశతనయ అయోధ్యనివాస
మానదుర్యోధన మైలమ్మసుతుడ
ఓతండ్రినరసింహ ఓరాజవిభుడ
అపరాధిగానునే నపకారిగాను
పాపమించుకలేదు పట్టపురాజ
మిమ్ముగట్టంద్రాళ్ళు మీరెతెచ్చితిరి
మీపాలిమృత్యువు మెలతనాగమ్మ
అలరాజుజంపిన ఆపగదీర్ప
పట్టిచంపితిగాని పాపంబెరుంగ
అనిఖేదమొందుచు ఆయుత్తపడుచు
కత్తితోతలగోసి కరములబట్టి
అనుజులతోనిట్టు లపుడువచించె
నరసింగుతలనిత్తు నరనాథునెదుట
ఇచ్చోటనిల్వుడి యెచటికిపోక
అనిచెప్పితమ్ముల నచ్చటనిలిపి
ఒకచేతప్రేవుల నొయ్యననెత్తి
సామంతరాగోల చంకనబెట్టి
తనతండ్రితావుకు తలగొనిపోయి

నరసింహుని శిరస్సునుకనుఁగొని నాయకులు విలపించుట

సోపానములమేడ చులకగనెక్కె
నాయుడుగనిలేచి నయముకంపట్ట
నరసింగువచ్చెను నాయకులార
యెదురుకొందమటంచు నేతెంచిభక్తి
నరసింగుశిరమును నమ్రతగొనియె
తపనీయపీఠిపై తలయుంచిమంచి
గంధముకస్తూరి కలయంగనలది
తగటుపచ్చడముపై తలయుంచిపిదప
కొలువెల్లమ్రొక్కిరి కోపంబులణచి
బ్రహ్మన్నయునుమ్రొక్కి వాక్రుచ్చెనిట్లు
బావలజూచితే ప్రాణంబువిడిచి
మరదులజూచితే మరణంబునొంది
తమ్ములజూచితే దైవముగలసి
ఘనదేహభవనముల్ కట్టించినట్టి
ధర్మసేనుండు మీతండ్రిపాదముల
కడకేగమీకిట్లు కారణమాయె
అనుచుశోకమునొందె అనఘుడుబ్రహ్మ
విలపించూతని విధమువీక్షించి
తనమదిఖేదంబు తాబట్టలేక
నరసింగుశిరమును నయముగబట్టి
కన్నుల ఆశ్ర్య్వుల్ గడ్డానజార
ప్రబలశోకముపొందె బాదన్నరౌతు
తండ్రిచచ్చినవెన్క దంటయేకూర్మి
ఉండమికొన్నినా ళ్ళుర్వీశతనయ
వెగటుమృత్య్వుమన వెంబడిబడియె
చెన్నుడుకులమును చెల్లించెనేటి
కనిబాదరాహుత్తు డడలెచింతించి
కొమ్మరాజువగచె కొలువెల్లనడలె
సుంకర్లువగచిరి శూరులేడిచిరి
గండువారలవంత ఘనమయియుండె
కమ్మవారందరు కడుచింతపడిరి

బ్రహ్మనాయుఁడు బాలచంద్రుని కృత్యములఁ దెగడుట

నాయుడాతరికూర్మి నందనుజూచి
రమ్మనినినుపిల్వ రాజింపలేదు
వచ్చియూరకయున్న వాదవుకావు
చూరగొంతివిసేన శూరుడవగుచు
చెల్లెబోనీవిట్లు చేసినక్రమము
విభునకుసేనకు విధివైతివకట

బాలచంద్రుఁడు బ్రహ్మనాయుని కపటకార్యంబుల నెన్నుట

అనిపల్కవినిబాలు డతులరౌద్రమున
పలికెనందరువిన బ్రహ్మన్నతోడ
వెడవెడయేడ్పులు వేగచాలింపు
కొల్వులోమామామ కొమ్మభూపతికి
అలరాజుపగకయి అప్పగించితివి
నీస్వభావంబింక నేవివరింతు
పోగొట్టితివికోడి పోరునభూమి
నినునమ్మివచ్చిన నీమేనమరిది
ప్రాణంబుకొన్నట్టి పాపాత్మకుడవు
చెలువుచూడగబంప చెవులరాయనను
చండకర్ముడవయి చంపించితీవు
ఘనువేంకజోదును కలనికిబంపి
మందలోచంపితి మాయయొనర్చి
యింటువంటినీచేష్టలెన్నివర్ణింతు
అనినమాటలుబ్రహ్మ కలుగులైతోచి
బాలచంద్రునికనె ప్రకతముగాగ
వెన్నిచ్చివచ్చితి నిమతులకీవి
వెన్నిచ్చివచ్చెడు వీరుడగాను
సుమ్మనిపల్కిన శూరవాక్యములు
విదితమైతోచెను వీరులకిప్పు

బాలచంద్రుఁడుమగిడి రణమునకేగి అనుజులతోఁ గలనిలో నొరగుట

దనబాలచంద్రుడ హంకారగరిమ
తెంపుచేకలనికి తిరిగిధైర్యమున
రయముగనేతెంచి రణములోనిలిచె
అప్పటిరణకర్మ మలవియేపొగడ
వాణీశుడైనను వర్ణింపలేడు
కమ్మరకాచన్న కడుశౌర్యఘనుడు
కాంక్షించితనపాలి కామాక్షిగలచి
పరదళంబులమీద వ్రాలిఖండించి
కడసారిమృతినొంది కలనిలోగూలె
శత్రుసైన్యమునకు సమవర్తియైన
మంగలకులమల్లు మహితవిక్రముడు
తురగసంఘంబును తునుకలుచేసి
కదనంబులోబడి కాలునిజేరె
కోరాడుచుండిన కుమ్మరపట్టి
విశ్రుతంబుగజాత వెదునిబోలి
పరదళవిపినంబు భస్మంబుచేసి
గురుదేవతలమది గూర్చిప్రార్థించి
హతశేషభటులచే అనిలోనమ్రొగ్గె
చాకలచందన్న సాహసాఢ్యుండు
పాతాళగంగను భావమందుంచి
ప్రకటధైర్యవిలయ పవనునిచేత
దుష్టశత్రువులను తూలికలత్లు
ఆకాశపథమున కరుగంగజెసి
బవరంబులోవ్రాలి ప్రాణముల్ విడిచె
సమరంబులోజొచ్చి చలనంబులేక
బాలునీనుజుడ బాహుబలుండ
అనిచెప్పికొంచు బిట్టడరోషమున
పేరైనదళముల పెల్లుగబొడిచి
గడలమూకలజొచ్చి ఖండముల్ చేసి
బల్లెపువారిని భంగంబొనర్చి
తురగాలిపైకేగి తుమురుగాగొట్టి
మదదంతిచయముల మరణమొందించి
తరచుగాయంబుల తాళగలేక
మాచర్లచెన్నుని మదిలోదలంచి
వెలమలదోర్నీడు విడిచెప్రాణంబు
తమ్ములపాటంత తప్పకచూచి
బాలుండురోషంబు పట్టగలేక
చండవిక్రమమున సాహసంబెసగ
వ్రేలాడుప్రేవులు వేగమెపెరికి
గంగాధారంగల్పి కలనికివచ్చి
తమ్ములదలచుక తావిలపించి
మిముబాసియుండుట మేరయెనాకు
నాదురాకడమది నమ్ముడిమీర
లనిచాటిచెప్పుచు ఆయుద్దభూమి
నిర్భయవృత్తిచే నిలిచెబాలుండు
కనిగొనిపరసేన కడుభీతినొంది
మృత్యువుతౌముక మీదికివచ్చె
ఎట్లుజీవించెద మీతనియెదుట
అనిపారిపోయెడు నాసేనజూచి
పోవద్దుభటులార పుణ్యకాలంబు
చనుదెంచెదేవేంద్ర సభకెగవలెను
మీరెల్లనిలువుడి మేలిమిగనుడి
అనిపల్కవారిలో నధికవిక్రములు
చొక్కచువ్వలవారు శూరులైమించి
వచ్చుటగనుగొని వడిమీరనెదిరి
ప్రబలయుద్ధముచేసి బాలచంద్రుండు
చాపకట్టుగగూల్చె సకలసైన్యంబు
ఆసమయంబున అతులసాహసులు
కుంతంబులంబూని కోయనియార్చి
గదలువంచుకవచ్చి కదిసిరిబాలు
వెనుకడ్గువేయక విక్రమాధికత
అలుగులపైవ్రాలె ఐతాంబసుతుడు
గ్రుచ్చిపట్టిరియెత్తి గురుశౌర్యఘనుని
వేంచేసిదివియందు వీరులగలసె
అంతటభాస్కరు డస్తాద్రికేగె
సాంద్రమైచీకట్లు జగమునగ్రమ్మె
జంగమస్థావర సకలవస్తువులు
కాటుకపట్టిన కైవడినొప్పె
సత్యంబుగా చరాచరమైనజగము
విష్ణుమయంబన్న వేదవాక్యంబు
నిశ్చయంబాయెను నీలిమనంది
శివుడేడి కైలాసశిఖరంబునెది
సోముడువృషభంబు సురనదియేడ
యెక్కడికెగెనో యెరుగంగరాదు
సంశయస్వాంతయై శైలజవెదకె
ఇభమునుగానక యింద్రుడువెదకె
వానినివెదకెను వనజాసనుండు
తెలియకఈరీతి దేవతలెల్ల
చెలగిరి విభ్రాంతచిత్తుల అపుడూ
అతులముదంబున ఆసమయమున

యుద్ధరంగమున పిశాచగణములు స్వేచ్చావిహారములు సల్పుట

ఘనభూతభేతాళ గణములుగూడి
సమరరంగముచూచి సంభ్రమమంది
తగవిచారించిరి తమమానసముల
ఎక్కడియుద్ధంబిదేమిచోద్యంబొ
యింతకాలంబయ్యె నెరుగమెయహహ
అనివెరగందుచు నాశ్చర్యపడుచు
కలనుగాచుకయున్న కాళినిజూచి
మీదయచేతనే మేముతనియగ
అధికభోజనమాంస మబ్బెనుమాకు
అనిమ్రొక్కితేంపుచు ఔత్సుక్యమడర
బాలుడుమనపాలి పరమేశ్వరుండు
చేయంగ అతడిట్లు సిద్ధించెమనకు
అనికొందరాదినా రానందగరిమ
నాయకురాలైన నాగమ్మనుండి
మనకాంక్షతీరెను మాటలకేమి
అనికొందరాడిరి హర్షంబుమీర
నిబ్భంగిమెచ్చుచు నింతులుతమరు
చల్లులాడుచురక్త సాగరమందు
మునుగుచునీదుచు మూకలుగట్టి
జలకమాడిచెదరి చౌకలింపుచును
కుప్పించిదుముకుచు గొబ్బునమునిగి
దూరానదేలుచు దూగివచ్చుచును
మదమెక్కిసోలుచు మరిస్రుక్కిపడుచు
ఎవ్వరురామూద నెక్కినవారు
దిగిరారతులువ మర్ధించెద నిన్ను
అనివెక్కిరించుచు హాస్యమొనర్చి
భటకళేబరములు పట్టుకవచ్చి
చచ్చినగజముల సంధించినిల్పి
కదనమాడుమటంచు కత్తులబొడిచి
పడియున్నగజముల పైనిగూర్చుండి
అంకుశంబులతోడ నదలించువారు
వాజిశవంబుల వడిమీరనెక్కి
చబుకులగొట్టుచు చనుమనువారు
గజములవాజుల కాలిమానుసుల
పట్టుకవచ్చి ఆపాథోధియందు
ఘనమైనసేతువు కట్టుదమంచు
సంతోషమొందెడు శాకినీగణము
గుండెలునమలుచు గుంపులుగూడి
పెల్లుగపాడెడు పెద్దఢాకినులు
ఎదురుమాకెవ్వారలీయుద్ధభూమి
మిగ్లినదళముల మీరిమర్ధింప
క్రొత్తునెత్తురుమాకు గూడునటంచు
బొబ్బలువెట్టుచు బొండుగల్ దినుచ
హంకారమండెడూ హాకినీచయము
దిక్కులనంతట తేజంబుహెచ్చ
మిణుగురుల్ రాల్చుచుమింతికిజనుచు
కూడిపర్వులుపెట్టు కొరివిదెయ్యములు
పొరిపొరి ఆయుద్ధభూతలమందు
విహరించియీగతి వేడుకకొలది
తమనెలవులుచేర తామేగిరపుడు
సకలజనంబులు సంతసమంద
భానుండుపూర్వాద్రి పైకేగుదెంచె
ఘనుడైనశ్రీనాథ కవిరాజరాజు
చెన్నునికృపచేత చిత్తముప్పొంగి
బాలునివిక్రమప్రావీణ్యమెల్ల
జనులకువివరించె సక్తితోదీని
పాటించి చదివిన వ్రాసినవినిన
బంధులు పుత్రులు పౌత్రులు హెచ్చ 
సకలశుభంబులు సమకూరుచుండు
శ్రీయు ఆయుస్సును స్థిరముగాగలుగు



............................
శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " 
అను
బాలచంద్రయుద్దము 
సమాప్తము

Thursday, December 22, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం - 32


బాలచంద్రుఁడు యుద్ధమునకుఁ బోవుటకు సమ్మతించి బ్రహ్మనాయుఁడతనికి రణధర్మంబుల నుపదేశించుట

వినుబాలచంద్రుడ విశదముగాగ
ధరలోననాపేరు దశదిశలందు
ప్రఖ్యాతినొందెను బ్రహ్మనాయుండ
మండలేశులకెల్ల మదితల్లడమయి
చెల్లినమనపేరు చెడిపోవనీకు
పృథ్విబిరుదముల పెంపునొందింపు
ఘనమైననాపేరు కల్లచేయకుము
మల్లుచూశౌర్యంబు మొక్కపోనీకు
మిలలోనమనలావు నెన్నలేరెవ్వ
రాజియనంగ నేమనితలంచెదవు

యుద్ధరంగ తత్వము

శౌర్యంబునకు బాదుస్వర్గంపుద్రోవ
యెల్లసుఖంబుల కిదిపట్టుగొమ్మ
యిదిముక్తిసోపాన మిదిమూలధనము
ఆగర్భుశురుల కాటప్రదేశ
మిదిదేవవితతుల నెన్ననౌమేలు
హెచ్చైనవీరుల కిదిపుట్టినిల్లు
ధర్మసంరక్షణార్థంబయి బుధులు
కదలకరక్తంబు కార్చెడుచోటు
పటుకీర్తినొందించు బ్రహ్మండమందు
ఇదిసమరావని యిదిపుణ్యభూమి
శ్రీకంఠుశిరసంటి చెప్పెదనీకు

బ్రహ్మనాయుఁడు కుమారునకు రణనీతి నుపదేశించుట

కామనృపాలుండు కల్మిపెంపొంద
సకలభూమీశుల సంగ్రామమునకు
పిలిపింపవచ్చిరి పేర్మినిజూప
భండనపటిమచే ప్రబలినవారు
చతురంగబలములు చాలుపచ్చోట
పూర్వంబుమనతోడ పోరాడలేక
చిక్కిచెప్పినయట్లు చేయుచునుండి
పగవారిలోచేరి పరతెంచినారు
జడియకనిల్తురు సమరంబునందు
కన్నెకయ్యంబిది కనిపెట్టిపోరు
సలుపంగవలయును సత్కీర్తివచ్చు
తలపడునప్పుడు తలకకుమన్న
అలుగులుదీప్తికి అలుకకుమన్న
వారణధ్వనివిని వడకకుమన్న
శరములదీప్తికి జడియకుమన్న
సమరకాలంబున జంకకుమన్న
మెనచెడరణములో మురియకుమన్న
బిరుదులుజారిన బెదరకుమన్న
ఘనఖడ్గహతులకు గతిమాలవలదు
బలములుముట్టిన భంగంబుగాకు
సందడిరణమున శంకనొందకుము
పైకొనినైపుణ్య పటిమచెలంగ
పరదళంబులనొంచి బవరంబుచేయ
కాముడురణమున కంపంబునొంద
నరసింగుపైకేగు నాకూర్మిసుతుడ
జయముచేకొనదగు సాహసస్ఫూర్తి
అనినీతిగాజెప్పి అపుడుబ్రహ్మన్న
తగినట్టికర్పూర తాంబూలమిచ్చి
శంఖతీర్థమొసంగి జయమొందుమంచు
పంపింపతనతండ్రి బ్రహ్మనాయునికి

బాలుఁడు యుద్ధరంగమున కేగుట

దండనమస్కృతుల్ తాజేసివెడలె
ఆవేళరణభేరు లధికమైమ్రోసె
ఢక్కాఢమామికల్ డంగురంబులును
పటహశంఖంబుల పటుతరధ్వనులు
బహుళమైమిన్నంద బాలచంద్రుండు
సమరభూస్థలినుండి సంతోషమలర
సూర్యభైరవులాది సురలకుమ్రొక్కి
దిక్పాతులార ఓ దేవతలార
కనుగొనుచుండుడి కదనరంగంబు
చేసెదసమరంబు చిత్తముప్పొంగ
అనివిన్నపముచేసి ఆయుధమంది
ఒరతీసిజళిపించి ఉగ్రుడైనిల్చె
తరువాతనరసింగ ధరణీశ్వరుండు

నరసింహభూపతి రణమునకు వచ్చుట

ఘనమైనగజముపై గ్రక్కుననెక్కి
సమరరంగమునకు చనుదెంచువేళ
చొక్కచువ్వలవారు సూరెలవారు
నిల్చిరిపదివేలు నిండుశౌర్యమున
బల్లెముల్ పట్టుక బలువైనబంట్లు
గజముముందేగిరి గాఢధైర్యమున
విలికాండ్రు నాలుగువేలసాహసులు
బానతూణీరముల్ పరగధరించి
వడితోడరణరంగ వసుధదార్కొనిరి
అశ్వమ్ములైదువే లరుదెంచెధాటి
భూరిమాతంగముల్ భూధ్రంబులట్లు
బృంహితధ్వనులతో పెల్లుగనడిచె
శూలశరోద్వృష్టిశోభిల్లుచుండు
వీరులువచ్చిరి విచ్చలవిడిని
కడమబలంబులు కాదులెక్కింప
పటువిక్రమస్ఫూర్తి బలమిట్లువెడలె
ధ్వజములుపడిగెలు దట్టమైకదల
బిరుదుచత్రంబులు పెద్దటెక్కెములు
సాంద్రమైయుండెను జగదీశునెదుట
ప్రబలమైవాద్యంపు పటలిమ్రోయంగ
పిక్కటిల్లెదిశల భేరీరవంబు
కాహళల్ బూరలుకనకతప్పెటలు
ధ్వనులచేజనతతి దల్లడపరచ
భయదమై చెలగిన పరిపంధిసేన
బాలచంద్రుండుచూచి భ్రాతలుతాను
శుష్కటవులనగ్ని సుడిసినయట్లు
కోయనియార్చుచు కుప్పించియురికి
బలముపైవ్రాలెను పొరుషాధికత
కుంతముల్ చేనంది గుదులుగాబొడిచి
కత్తులచే తలల్ ఖండించివైచి

బాలచంద్రుఁడు భీమంబగు సంగ్రామం బొనర్చుట

మణికట్లదునుమాడి మస్తకవితతి
ధరమీదనొరగంగ దట్టించినరకి
మోచేతులెడచేసి ముక్కులుచెక్కి
ఫాలంబులంజింపి ప్రక్కలగోసి
దౌడలూడగనూకి దండముల్ ద్రుంచి
కనుగ్రుడ్లుపగులంగ కర్ణముల్ వ్రాల
బలువైనరొమ్ములు పరియలుగాగ
తొడలెల్లతునుకలై తూగాడుచుండ
జానువులూడంగ జంఘలువిరుగ
చీలలుపట్టేది చీకాకునొంద
ఈరీతిగొంతసే పీప్సితమదర
అనుజులతోగూడ ననిచేసిపిదప
దంతావళంబుల దట్టంబుచూచి
బాలుడుకోపంబు ప్రకటంబుగాగ
కొదమసింహముభంగి కుప్పించియెగిరి
బలిమిమై కుంభముల్ పగులగమోది
తొందముల్ తోకలు తునియలుసేసి
మావంతులనుగొట్టి మరణమొందించి
పైనున్నదొరలను పడిపోవపొడిచి
దంతముల్ ముక్కలై ధరవ్రాలజిదిమి
చెవులనుకత్తితో చీలికల్ చేసి
పిల్లదంతంబుల బెకలిచివైచి
ఘనపదంబుల దున్మికంఠముల్ నరికి
కొంతనేపిమాడ్కి గురుశౌర్యమలర
సమరంబుగావించి జవనాశ్వవితతి
చుక్కాడపైబడి సాహసగరిమ
ఖడ్గకుంతంబులు కరములబట్టి
పైనున్నరాహుత్తపటలిని చంపి
తొడగినజోడంగి తుక్కుగాజెసి
సింగణివిండ్లను చిదుకలొనర్చి
బాణతూణీరముల్ భగ్నముచేసి
ఖడ్గఖేటకములు ఖండించిమించి
మెడలురెండుగజేసి మేనులుచించి
యెదురురొమ్ములలెస్స యీటెలగ్రుచ్చి
కొంకులుతెగగొట్టి ఖురములుచెక్కి
చాలసేపీగతి సమరంబొనర్చె
బలమెల్లనీలాగు భంగంబునొంది
కంఠముల్ దెగిపడ గ్రక్కుననురికి

నలగామరాజు సైన్యము కలఁతనొందుట

పడితన్నికొనిచచ్చు బలసమూహంబు
మస్తకంబులుపోయి మహిమీదమడిసి 
కన్నులుతెరచుచు గంతులువైచి
ప్రాణముల్విడిచెడు వారునుమరియు
పాదముల్ విరుగగ బవరంబుచేయ
పండ్లుగీటుచు నేలపైగూలువారు
కరములుతునిసిన గత్తులువదలి
బాలునిగనివచ్చు భయదోగ్రభటులు
ప్రేవులువెడలిన పెడచేతనెత్తి
కడీమిచేబల్లెంబు గట్టిగాబట్టి
అహమహమికతోడ అరుదెంచగడగి
సంచలింపనిదీర్ఘ సాహసఘనులు
మూల్గుచుచచ్చెడు ముదియోధవరులు
బాలునికనుగొని భయమందిబెగడి
పారిపోయెడుపంద భటసమూహంబు
పారిపోవగలేక బ్రతుకుపైనాశ
బ్రతిమాలిచుండెడు బలనిచయంబు
లిటువంటిజగడంబు లెన్నడెరుంగ
మేలాగుపోదు మనేడ్చెడువారు
ఆలుబుడ్డలబాసి అన్నంబుకొరకు
వచ్చితిమీనేల వ్రాసెనుమృత్యు
వనిదుఃఖమొందుచు నసురసురంచు
వేగమేప్రాణముల్ విడిచెడువారు
బహుదినంబులు మేము పాలేరుచేసి
మునికొల్లలేల్లను ముంజూర్లదోపి
పణతులుదిట్టిన పడలేకవచ్చి
చచ్చుచుంటిమీ సమరరంగమున
పారిపోనిచ్చిన బ్రతుకుదుమయ్య
అనిమ్రొక్కుచుండెడు అతిదీనభటులు
బోయవారముమేము పూర్వమునందు
బుజములకాయలు పూనికంగొనుడి
పగవారుమముగని పారిపోవుదురు
మీకేమిభయమని మెలతనాగమ్మ
బాగుగానమ్మించి పంపవచ్చితిమి
జీవముల్ దక్కిన చిన్నలగలిసి
బలుసాకుదినియైన బ్రతుకగగలము
మీరుపిల్చినవేళ మేమరుదెంతు
మనియంజలియొనర్చి యవమానమొంది
మగసిరివిదచిన మానహీనులును
వీలుచిక్కినరణ వీరులవదలి
పోయెడునట్టి దుర్భుద్ధియుక్తులును
చచ్చినవిధమున సమరోర్వియందు
పలుకకయూరక వ్రాలెడువారు
చనలేకభయమున చచ్చినవారి
మీదద్రోసుకయుండి మెదలనివారు
చచ్చినగజముల చాటునడాగి
పందతనంబున పడియుండువారు
పెండ్లాలదలచుక బిట్టేడ్చువారు
వాల్మీకములమీద వసియించువారు
గడ్డిలోజొరబడి కదలనివారు
వ్రేళ్ళుచీకెడివారు వెన్నిచ్చువారు
వెండ్రుకల్ విప్పుక విదలించువారు
నీవారమనిపల్కి నిల్చుండువారు
ఆయుధాల్ పడవైచి యలికెడువారు
పడలేకచతికిలబడి యుండువారు
బవరంబులోగూలి ప్రాణజాలంబు
విడిచిఖడ్గముల్ విడువనివారు
భయదమైయిబ్భంగి పరికింపరాక
సమరరంగము భయజనకమైయుండె

బాలచంద్రుఁడు శాత్రవబలంబులఁ జక్కాడుట

కొందరువిలుకాండ్రు గుంపులుగూడి
బాహుబాణములుమీద బరపెడువేళ
తమ్ములనందర తగనిల్వజేసి
పరిఘమొక్కటిచేత పట్టుకతూరి
తనువునబాణముల్ దాకకుండంగ
భ్రమణనైపుణ్యంబు బల్విడిజూపి
పరతెంచువిశిఖముల్ పాయగొట్టుచును
ఖడ్గమాడించుచు గర్జలొనర్చి
అట్టహాసమున నావిలుకాండ్ర
పైకేగిధనువుల భంగముచేసి
శింజనులెల్లను జిదురుపల్ చేసి
తూనముల్ శరములు తుమురుగాగొట్టి
చుట్టుపేరమువారి శూరతమెరయ
వండతరిగినట్లు వడిమేనులెల్ల
ఖండించియముజేర గ్రక్కుననంపె
చొక్కచువ్వలవారు శూరతహెచ్చ
వంచుకపైకుర్కి వచ్చుటసుచి
బాలుడువెసనార్చి పకపకనవ్వి
తమ్ములుతోడు రాదంటయైతొడరి
కుప్పించిపైబడి గొడ్డండ్లతోడ
చెరకులునరికిన చెలువుఘటిల్ల
అలుగులనీటెల నన్నింటిదునిమి
శూలంబులంబొడ్చి సురియలగ్రుమ్మి
గండ్రగొడ్డండ్లతో గనెలుగాగొట్టి
బాకులరొమ్ముల పరియలుచేసి
గదలచేశిరముల గడునుగ్గొనర్చి
భాదించిపొట్టల పటిమచేజించి
కత్తిలమేనుల కండలుడుల్చి
పంపించెజముజూడ బలములనెల్ల
సంగ్రామమీరీతి జరిగినవేళ 
పారిరిమిగిలిన బంటులుగూడి
ఆవేళనరసింగు డధికకోపమున

పారిపోవుచున్న సైన్యమునకు నరసింహభూపతి ధైర్యవాక్యములు చెప్పుట

పారెడువారికి బలుకంగసాగె
విరిగిపోవుట యిట్లవీరధర్మంబె
బాలురకనుగొని పరువిడనేల
మిమ్ముగాచినవారి మేలెత్యజింప
బలిమిమీనరముల బారురక్తంబు
రాజాన్నవర్ధిత రక్తంబుగాదె
ధూర్తులైనృపునకు ద్రోహంబొనర్చి
నమ్మినరాజును నట్టేటముంచి
పోవుటయేనీతి పుణ్యాత్ములార
తనువులస్ఠిరములు ధనములుకల్ల
కీర్తియొక్కటి భువిఖిలముగాకుండు
ధైర్యహీన వీరధర్మంబుమాని
భంగురమై మలభాండమైనట్టి
దేహంబుకొరకు సత్కీర్తిపోనాడి
విరిగిపోయెడునట్టి వెఱ్ఱులుగలరె
వీరసింహములకు వినుతినిగాంచు
సమరరంగములే సంచారవనులు
చచ్చినబ్రతికిన సౌఖ్యమచ్చటనె
బుద్ధులుచెడి పాఱిపోవుదెరేని
భుక్తిముక్తులు రెండుపోవునుదొలగి
బబుబాసిపోవుట న్యాయంబుగాదు
తప్పునామరణంబు తలచెడిపార
మృత్యుదేవతవచ్చి మేనులనిల్చి
బంటుపంతంబులే పారిపోవుటలు
పరికింపపెండ్లికి వచ్చుటలేదు
సమరకార్యమునకై చనుదెంచినాము
వచ్చినకార్యంబు వరదలోగలిపి
బంధులుమిత్రులు పగవారునవ్వ
పోవుటనీచత పుట్టదన్నంబు
పోవద్దురాజాన పోయితిరేని
అనియిట్లుపల్కిన ఆబలంబెల్ల
పారిపోవకరోష భరితమైనిల్చె
బాలచంద్రుడంత భ్రాతలగూడి

నలగామరాజు సైన్యంబు బాలచంద్రుఁనిపై గవయుట

అట్టహాసముచేసె అరిసేనలపుడు
జడిసిగుండెలు వ్రీలచలనంబునొంది
ధైర్యంబువహియించి దర్పముల్ మీర
కదలుచక్రంబులు గండ్రగొడ్డండ్లు
పెద్దవిసురియలు భిండివాలములు
బల్లెముల్ కుంతముల్ పరుశూలచయము
కొనికరంబుల తీవ్రకోపులైవచ్చి
మిడుతలుమంటపై మిడిసిపడ్డట్లు
బాలునిదాకిరి భయదూరులగుచు
విక్రమాటోపత వెలసిబాలుండు
జలధిలోమందర శైలంబుతిరిగి
కలకనొందించిన కైవడిమీరి
కాలాగ్నిలోకముల్ కాలిచినట్లు
దవవహ్ని విపినంబు దార్కొన్నభంగి
మనుజులలోమారి మరిగినరీతి
శత్రుసైన్యంబుపై చయ్యనగదిసి
వారుప్రయోగించు వరశస్త్రవితతి
బహువిధంబులద్రుంచె భంగముగాగ
ఒకబంటునొకకాలు నొయ్యనబట్టి
యొకబంటుతొడవట్టి హుంకరించుచును
ఇద్దరముగ్గుర నేకకాలమున
కుంతంబులంజిమ్మి కూలజేయుచును
బాణంబులంగ్రుచ్చి పట్టిఎత్తుచును
కత్తులతోతలల్ గట్టిగానరకి
వ్రయ్యలైతనువులు వసుధపైబడగ
కటిదేశములయందు కత్తులువేయ
తునకలైభూస్ఠలి దొరగుచునుండె
కుంతంబులెడ గ్రుమ్మికూల్చెడువేళ
నెత్తురుభూమిపై నిండుగపారె
ఎదురులేక సమరమీగతిచెల్ల
కనుగొనినరసింగు కంపంబుగదుర
తలయూచిశ్రీహరి దలచినెమ్మదిని
వ్రేలిడిముక్కుపై వెరగందికుంది

బాలుఁడు శత్రుసైన్యంబులఁ జాపకట్టుగఁ గూల్చుట

ఇతడుబాలుండని యేలాగుపలుక
శూరతదళముల సుడివడగొట్టె
ఇతనితోపోరుట కేదినాబలము
గ్రక్కునమాయన్న కడకేగుదెంతు
అనిభయముననేగె అవనీశ్వరుండు
తరువాతబాలుడు తనరోషవహ్ని
అధికమైజ్వలింప ఆపగలేక
చిత్రంబుగాగూల్చె సేనలనెల్ల
కొందరఖండించి కొందరదరిమి
గుదిగ్రుచ్చెగొందరగూల్చె కొందరను
సంగరమీరీతి జరుగుటకతన
భందనరంగంబు బయలగుచుండె
మదగజవ్యూహంబు మావంతులపుడు
తివిరిధీరతతోడ దీకొల్పియార్చి
దట్టంపుశరవర్షధారలుగురియ
బాలచంద్రుడుకోపభారముతొ అపుడు
అనుజులతోగూడి అధికవేగమున
కదిసిఖండించెను గజసమూహమును
తునుమాడిదంతముల్ తుండెముల్ చేసి
శూలంబులంగ్రుమ్మి సురియలబొడిచి
పట్టిసంబులగొట్టి బాకులమొత్తి
గదలచేకుంభముల్ ఘాతలుచేసి
చరణముల్ తెగిపడ శాతఖడ్గముల
కొట్టినకూలెను కొండలరీతి
వినువీథిదేవతల్ వేడుకచేచి
ఆశ్చర్యమొందిరి హర్షంబులెసగ