Showing posts with label ద్విపద. Show all posts
Showing posts with label ద్విపద. Show all posts

Sunday, June 26, 2016

అష్టమహిషీ కల్యాణము - 18

4. చతుర్థ పట్టమహిషీ
శ్రీకాళిందీదేవి వివాహవర్నన ప్రసంగము

యేను గాళిందిని యనున్ కన్యఁ గన్యఁ
గాను శ్రీపతి పతిగాఁ గోరి యిచట
నున్నతిఁ దపము సేయుచునుంటినన్న
మున్నంది కృష్ణుండు మెలత నీక్షించి
యాతపంబునఁ జేయు నాతపంబెల్ల
నాతినీకొనఁ గూడె ననుఁగూడుమిప్పు               (6390)
డనిశంబు భర్తగానాత్మనీవెన్ను
వనమాలినేనయో వనజాప్తపుత్రి
యనుచు నూదార్చి యొయ్యననెదఁణ్ జేర్చి
ఘనతర కుతుకాబ్ధిఁ గడునోల లార్చి
కమలాప్తుఁ డపుడు కమలాప్తు కూర్మి
కొమరితఁ దోకొని కొమరు దీపింప
మును వసించిన వనమునకేఁగుదెంచి
యనుపమ సకలసైన్యంబులు గొలువఁ
బౌరులునల నాకపౌరులుఁ బొగడ
ద్వారకాపురికిఁ దీవ్రనేగుదెంచి                (6400)
వరమణిమునులాది వస్తుసంతతులఁ
బురముకై సేయించి పురమెల్లఁ బొగడఁ
బాండవేయుల సర్వ బంధుజాలముల
వెండియుఁ బిలిపించి విభవంబుమెఱయ
వేదోక్తి వేధవిధు లాచరించి
యాదేవదేవుఁడ డత్యాదరంబొదువఁ
జారు ప్రసూన కాంచనచేల గంధ
భూరి భూషణగణ భూషితుండగుచు
శ్రుతులు ఘోషింప సంస్తుతులతో నాక
పతులు గంధర్వదంపదులుఁ బాడంగ                (6410)
హరిపిత దేవకి యాదవుల్దాము
హరిరాణిఁ గొనివచ్చి యర్థిఁ బూజింప
ఝుల్లరీ కాహళీ శంఖ మృదంగ
వల్లకీధ్వనులు దిగ్విలయంబుఁ బొదువ
దేవకీతనయు డెంతయు వేడ్కతోడ
వైవాహి కోత్సవావని నొప్పుచుండె
నహిశాయి తనయల్లుఁడయ్యె నటంచు
మిహిరుఁడప్పుడు కడుమిన్నంది పొంగి
గ్రహమండలముఁ దారకా మండలమును
బహు మౌనిపతులు సంభ్రమమునఁ గొలువ           (6420)
ఛాయానువృత్తి నిచ్చలుఁ గూడియుండు
ఛాయతోఁ గూడ నచ్చటి కేగుదెంచి
తరుణిఁ బుల్కడిగిన దర్పకాస్త్రంబు
కరణిఁగైసేసి చెంగటనొప్ప కన్యఁ
గనకాంబరుని పాద కమలముల్గడిగి
కనకధారా పూర్వకంబుగానిచ్చె
జలజాతమిత్ర సంజాత నీక్షించి
పలికిరి మునివరప్రముఖలు చెలఁగి
సతిబొమల్గన్ను లెంచఁగఁదగున్మీన
పతులౌటనో గురు భావంబు దాల్చి                     (6430)
తలపోయ నిత్యమూర్తంబైనక తనఁ
దనకౌను పరమాణు తనునెన్నఁదగును
నీలంబు విబువును నిత్యంబునగుట
బాలకీల్గొప్పు నభ్రంబనవచ్చు
నని వితర్కింపుచు నన్యోన్యమిట్టు
లనుమానమునుజెంద నంబుజాక్షుండు
వనజాప్తపుత్రి నుద్వాహమై బంధు
జలములఁ గనకభూషణములం దేల్చి
గ్రహములతోఁ గూడి గ్రహరాజముఖుల
మహితానురక్తి సన్మానంబు సేసి                      (6440)
గణుతింపరాని సౌఖ్యములతో నభ్ర
మణిపుత్రికా సతీమణితోడఁ గూడి
జగములు జయవెట్ట జగదేకనాధుఁ
దగణిత శ్రీయుక్తుఁడై యుండెనంత

5. పంచమ పట్టమహిషీ
శ్రీ మిత్రవిందాదేవి వివాహ వర్ణన ప్రసంగము.

రారాజుహితులుతో రంపుసంపదల
రారాజుఁ దెగడు ధరాధినాయకులు
విందానువిందులు వివరింపఁ గూర్మి
విందైనయట్టి గోవిందుఁడుండఁగను
గురునాయకుని కొఱకొఱ మాటలకును
హరిమేన బావనునాత్మఁ గైకొనక                 (6450)
కలకంఠి ముకురాస్య కంజాయతాక్షి
నలికులాలక బిసహస్త లతాంగి
హరిమధ్య గిరికుచ హరిచక్రజఘన
సరస రంభోరు కాంచనతూణ జంఘుఁ
గిసలయపద వల్లకీవాణి దంట
హసితకోమలకుందయగు మిత్రవింద
యనుపేర యనుజన్మ నాకామపాలు
ననుజన్మునకు నెంతయైన నీమనుచు
ధరమీఁదఁ గల్గునుదారభూనాధ
వరులు గూడఁగ స్వయంవరము చాటింప            (6460)
నావార్త విని కృష్ణుఁడా మిత్రవింద
భావార్థమెంతయు భావించి తెలిసి
మీటలై సోఁగలై మించులై మిగుల
తేటగానొంటి ముత్తియములు దాల్చి
యేణాంకుమై చాయనెక సక్కెమాడు
నాణియంబగు ధౌత నాధరియించి
మృగమద కర్పూర మిళిత చందనము
నిగనిగపుటమైన నెఱిపూఁత పూసి
తరణి శీతాంశుల ధళధళల్గుల్కు
ధరచక్రముల నొప్పు తాళిఁగీల్కొల్పి                   (6470)
బంగారు పువులఁ బచరించునట్టి
చెంగావి దట్టిగా సించి వింతగను
సొలపు గోణముచుంగు సొంపు జూపట్ట
వలివంపు దుప్పటి వలెవాటు వైచి
కళుకుల ముద్దుటుంగరము గీలించి
వలకేలముకులపై వంకిలొలిడించి
కనుపట్టునెఱకూడె కానితనంబు
తన సొమ్మెయనఁగ నెంతయు సొంపు మిగిలి
విహగేంద్రకేతన విలసితంబైన
మహనీయ నవరత్నమయ రథంబెక్కి                   (6480)
యమితబలాన్వితుండై భానుకోటి
రమణ నవంతీపురంబున కరిగి
బహురాజ కోటీరపటు రత్నకాంతి
వహియించునా స్వయంవర భూమినుండ
నురుణు రాకకుఁ బద్మమలరు చందమున
హరిరాక విని పొంగి యామిత్రవింద
జలజంబుతల క్రిందు సవరించినట్లు
జిలుగు దువ్వలువ పింజలు వాఱఁగట్టి
నలువంద నెలవంక నామంబు దీర్చి
కొలఁదిగా నడువఁ గుంకుమ రేఖఁ దీర్చి             (6490)
రవికాంతులొలుకు పురాణహారములు
బవి దీర్చిన కర్ణపత్రముల్దాల్చి
యరవిందశరుని మోహన పాశవితతి
సరవినొప్పెడు పంచసరములు పూని
సిరిమించు నెఱుల కుచ్చెలమీఁద జార
మురవైన మొఱపుల మొలనూలమర్చి
దివి శక్రధనువొప్పు తెఱఁగునుఁ గొప్పఁ
దవిలి చిత్రంపు పూదండ చెన్నొంద
లలితపుష్పిత కల్పలతిక చందమునఁ
గలితభూషణములుఁ గడుసొంపుమిగిలి                 (6500)
వాసుదేవునిఁ బోలువరుఁ గూడుమనుచు
సేనకొప్పున సతుల్సేసఁ బ్రాలిడఁగ
సతులింత నంత నెచ్చెరికలు సేయఁ
జతురంతయానంబు సరసమైనెక్కి
వాణి వాక్యప్రొఢి వరియించు కీర
వాణులప్పుడు ధరావరులఁ జూపంగ
నరుదేర నరుదార నాయింతిఁ జూచి
ధరణీశులును బౌరతరళ లోచనలు
నలిపంక్తి రంగొతొయ్యలి కప్పురంగొ
నెలవంక మురువొయా నెన్నొసల్మురువొ                  (6510)
కలువల మించొ యా కనుల మించొ
జలజంబుబాగొ యా సతిమోముబాగొ
శైలముల్దీరొ యీ చన్నులు తీరొ
నీలాహినలుపొ కన్నియయారునలుపొ
యనఁటులు మెఱుఁగొ యీయంకముల్మెఱుఁగొ
దొనలు వట్రువలొ లేఁదొదలు వట్రువలొ
తలిరుల సొబఁగొ పాదంబుల సొబగొ
తెలియ రాదనుచు నెంతేని జోద్యమంది
తూణంబు నెడలిన తొవయంప కాని
బానంబొ వాని కృపాణంబొయనఁగఁ                  (6520)
గరిసమూహము సొచ్చు కరివైరిపొల్కి
ధరణీశవరుల బృందంబు సొత్తెంచి
విందానువిందులు వెఱఁ గంద మిత్ర
విందకెంగే లరవింద లోచనుఁడు
పట్టి శతాంగంబు పైఁ బెట్టికొనుచుఁ
జుట్టి యున్నట్టి రాజులఁ బాఱబట్టి
పరమకీర్తి ప్రతాప ములతోనమర
వరులు మెచ్చఁగ ద్వారవతికే గుదెంచి
వేదవేత్తలు చతుర్వేదముల్జదువ
వాదిత్రములు పెక్కువ గలఘూర్ణిలఁగ                (6530)
నాగకామినులుఁ బున్నాగకామినులు
బాగుమీఱఁగను శోభనమువాడంగఁ
బటుతరాలంకార భరితుఁడై రత్న
పటల మండిత మంటపంబులోఁ జెలఁగి
సకల బంధువులు నిర్జరులుఁ గీర్తింప
నకలంక గుణబృందయగు మిత్రవింద
నిగమోక్త విధినిఁ బాణిగ్రహంబు
ఖగరాజవాహుండు గావించియంత
నాలేమతోఁగూడ యంగజకేళి
దేలియెంతయుఁ బ్రమోదింపుచునుండె                    (6540)
అవనీశ నగ్నజిత్తను పేరఁ బరఁగు
నవనీధవుఁడు కోసలాధినాయకుఁడు
సురుచిరాకార సంస్తుత గుణోద్ధార
నిరుపమాలంకార నిర్మలాచార

6. షష్ఠ పట్టమహిషీ
శ్రీసత్యకీర్తీదేవి వివాహవర్ణన ప్రసంగము

నిత్యకల్యాణి వర్ణితసత్యకీర్తి
సత్యనావిలసిల్లు చంద్రబింబాస్యఁ
దన తనూభవ వసుంధరఁగల్గి నట్టి
జననాధులడుగ నచ్చటి కేదుదేరఁ
గీలికీలాహ హాకృతుఁగ్రాలు
వాలుఁబోలెడునిడు వాలుఁగొమ్ములును                (6550)
నంభుదితుంగ భంగాలోలకాల
కంబళాయతగళ కంబళంబులును
బంధుర విద్యుత్ప్రభా భాసితోరు
కంధరంబుల బోలు కంధరంబులును
సమధిక శైలాగ్ర చటులశృంగముల
రమణఁ జూప్పడు మూపురములునుం గలిగి
బలిమి శంకరుగిబ్బఁ బడగిబ్బఁ జాలు
లలిమీఱనేడు మల్లరపుఁ గోడియల
నాజవరులకు నారాజు చూపి
యేరాజవరుడైన నీ వృషంబులను                (6560)
బట్టియొక్కటికినిఁ బైదామకమునఁ
గట్టియెంతయు భుజాగర్వంబు నెఱుపు
నట్టి విభుండు వోనరయనాకూర్మి
పట్టి విభుండని పల్కుఁగ భూవరులు
నాయెడ వానితో నరిమురిఁ బోరి
పోయిరి కొందఱప్పుడు జముపురికి
వేయైన నిదికాదు వీడుఁడంచుఁ జడిసి
పోయిరి కొందఱప్పుడు పురంబులకు
వారి శౌర్యములకై విని దాన
వారి యాపనియెంత యని నవ్వు కొనుచు                 (6570)
వాలారుచంద్రిక వన్నియచుంగు
డాలువాటిల్ల మూడానంబుఁ జుట్లి
తరుణారుణోద్దామ ధామసంతతులఁ
బురణింపఁ గెంపుల పోఁగులవెట్టి
యసమసాయకుని మోహన తురంగముల
పసమించు పచ్చకబ్బాయి ధరించి
చుట్టు వజ్రంబుల సొబగు దీపింప
గట్టాణి ముత్తెంపు కడియముల్దాల్చి
తెలిమించు క్రొత్తముత్తెముల గెంటెములు
పొలుచునాణెఁపు పట్టౄ పుట్టంబు గట్టి               (6580)
యచలాగ్రమున నొప్ప హరి కిషోరంబు
రచనజొప్పడ హేమరథవర్తియగుచు
బలములునరుఁడు సంభ్రమలీలఁ గొలువ
బలమును జలమును నేర్పడ శత్రుసమితి
భయమంద గోసలపట్టణంబునకు
రయమునఁ జనుదెంచి రాక్షసాంతకుఁడు
ఎదురేగి యావిభుఁ డిందిరావిభుని
బదివేల తెఱఁగులఁ బ్రణుతించి మ్రొక్కి
సకలోపచారముల్సవరించి భక్తి
నకలంక సింహాసనాసీనుఁ జేయ                        (6590)
నలఘ సౌధాగ్రంబునందు శోభిల్లు
జలజాతనేత్రి కోసలరాజపుత్రి
మరకతశ్యామ కోమలకల్పధాము
నరవిందదలనేత్రు హాటకనేత్రుం
గురువిందరదను నక్రూరాంశురదను
సరసమంజులహాసు చంపకనాసు
ఘనకిరీటోద్దారుఁ గౌస్తుభహారు
ననుపమాయతదేహు నాజానుబాహుఁ
జెలువొందఁ జూచియా శృంగారరసము
పొలుపారవాలుఁ జూపులనే క్రోలుచును                     (6600)
నీ రమేశ్వరుఁడు ప్రాణేశ్వరుండైన
ధారణి నేఁ జేయు తపమే తపంబు
భావింపనేవేల్చు భక్తమందార
మావేల్పు నాభర్తయైయుండుఁ గాక
యరయంగఁ దొలుత భావమున సత్యముగ
సిరివరునేఁ బూజ సేసితినేని
నీ మోహనాకారుఁడెన్ని బాగులను
గామించిననుఁ బత్నిఁగా నేలుఁగాక
యనుచు డెందమున నానవాలమున
ననురాగవల్లిక వలరింపుచుండె                       (6610)
నంతఁ గృషుండుఁ గోసలాధీశుఁ జూచి
సంతసంబునఁ బలుచని నవ్వుమోవిఁ
బెనఁగొన జలద గంభీర వాక్యమున
ననియె భూనాయకులన్యులు వేఁడఁ
దగవైన పూర్వబాంధవము చింతించి
యడిగెద నీ కూఁతుననియె మోదించి
పుడమిఱేడనియె నప్పుడు కృష్ణుతోడ
శ్రీవర భాగ్యంబు సేసితి నాకు
నీవంటి బంధులెన్నిన భూమిఁ గలరె                (6620)
ఐనమున్నొకటి మర్యాద సేసితిని
నీనగంబులఁ బోలు నేడుకోడియల
నుర్విపై నొక్కనాఁడొక త్రాటఁబెనుచు
నుర్వీశునకుగాని నొసఁగఁ గన్నియను
ననియుంటి నీచిత్తమనిన దైత్యారి
విని నవ్వి యట్లకామింతునే ననుచుఁ
దనరూపు పౌరకాంతలు ఱెప్పలిడఁగ
కనుఁ గొన నగరోపకంఠంబునందు
గర్జించి లయకాల కాలమేఘములఁ
దర్జించుఱంకెల దశదిశల్వడఁకఁ                     (6630)
బొదరి చిందకొట్టి భువితల్లడిల్లఁ
గదిసికయ్యమునకు గాలుదువ్వుచును
గొమ్ములు పాతాళ కుహర మేర్పడఁగఁ
జిమ్ముచు నేత్రముల్జేవురింపఁగను
గాలకూటార్చుల కరణిరోషాల
వాలంబులగు ఘనవాలముల్మెఱయ
భాసురోన్నత దిగిభములచందమున
భాసిలు మదవృషభముల నీక్షించి
గట్టిగాఁ దళుకు బంగారుకానె బిగ్గఁ
గట్టిచొల్పడు బాగుగాఁ జుట్టి యపుడు                      (6640)
దానవారాతి నందఱునాలకింప
భూనాధుఁ బచరించి భుజమప్పళించి
యిలబెల్ల గిలగిరులెల్లఁ బెల్లగిలఁ
జలమున నార్చి మచ్చరమునఁ బేర్చిఁ
చటుల మృగాళిపై శార్దూలముఱుకు
ఘననాదబోతులఁ గడిమి వేఁడించి
మల్లడిగొననొక్క మఱిమల్లరముల
వల్లవల్గొమ్ములుద్ధతి నొల్లగిల్లఁ
దల్లడిల్లఁగఁ బట్టి దట్టించి జగతి
ద్రెళ్లంగవైవ సందిచూచు జనులు                           (6650)
ఝల్లున నివిగ నిర్జరులెల్లఁ జెల్లు
జెల్లునీకనియుల్ల సిల్లంగ శౌరి
యుదుటునఁదన బాహుయుగముచేవాని
మెదిచి చాగతఁగొని మెడవల్లెవైచి
పెడవెట్టు కొండలు పెంపెల్లఁ బొలిసి
యడవెట్టుకొనుచు నోండ్రనుచు స్రుక్కఁగను
వడిఁగట్టివైవఁ గవ్వడిమనబావఁ
గడఁక నీక్షించి డిగ్గన నగ్నజిత్తు
ఇచ్చనెంతయు మెచ్చి యిందిరానాధుఁ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని సంతసించి                    (6660)
వరతూర్యజల నిస్వనములుఁ నెలఁగ
నరులు గిన్నరులు నెంతయు సంతసింప
లోకేశ భువుఁడు పులోమజా విభుఁడు
నాకమౌనులు దిశానాయకోత్తములుఁ
బరిణయాలోకన పరతఁజొన్నొంద
నలినలోచనలుతోయంబుగా ముద్దు
గిలుకొట్టు శోభన గీతంబువాడ
రమణీయతర నవరత్న వేదికను
గమలాక్షు మహిత శృంగారుఁ గావించి                     (6670)
శృంగార మొకకుప్ప సేసినట్లున్న
శృంగారవతి నాగ్నజితి యనుకన్య
సంకల్పమన్న కోసలరాజు సత్య
సంకల్పునకు నిచ్చె సంకల్పమలర
మురవైరివర వజ్రములు దోయిలించి
తరలాయతాక్షిపైఁ దలఁబ్రాలునించి
తమములో ఖద్యోతతతి ప్రకాశించు
రమణఁ గొప్పన సేసఁబ్రాలు శోభిలఁగ
ముకురాస్య నవరత్నములు దోయిలించి
మకరకుందల ధారి మైసేసనించె                       (6680)
నురువైభవమున వేదోక్తమార్గమున
హరి నాగ్నజితిఁ బెండ్లియాడె నవ్వేళ
రాజకాంతలు రతిరాజుఁ గన్నట్టి
రాజీవనేత్రు విరాజి విగ్రహముఁ
గని సంతసిలి యాత్మఁ గన్యకామణికి
ననుకూల వరుఁ డయ్యెనని పొంగిరంత
నందనందను మామ నవ్యవైఖరుల
విందులకెలమిమై విందుగావించి
యంబరాదులనోలలాడించి సమ్మ                           (6690)
దాంబురాశుల నోలలాడించి మెఱసె
హేమాంబరుండు నయ్యెడ బాంధవులకు
హేమాంబరాదుల నేకంబులొసఁగె
తనుజాత వనజాత దళనేత్రుతోడ
ననుప నుద్యోగించి యయుత ధేనువులు
నగణితాలంకృతులగు రెండు వేలు
మృగలోచనలును దొమ్మిది వేలు కరులు
నన్ని లక్షల తేరు లశ్వరత్నములు
నన్ని కోటులు శూరులై నట్టిభటులు
పరమసాహసులు తొంబది నూఱు కోట్లు
నరణంబుగానిచ్చి నవ్వధూ వరుల                       (6700)
నారూఢిఁ బూజించి యరథంబు మీఁద
నారూఢులుగఁ జేసి నారాజు కొలువ
మెఱుపుతో మొగులద్రి మెఱయుచందమున
దెరవలో శోఉరి యాతేరుపై జెలఁగి
నరునితో ద్వారకానగర మార్గమున
నరుగుచో నావార్తనరసి కోపించి
వెనుకొనిమున్ను దద్వృషభ నిర్భిన్న
తనులైన రాజనందనులెల్లఁ గూడి
పరమ లజ్జా రోష భరితులై వచ్చి
హరిఁ దాకి యిభములు హరిఁ జుట్టు పగిది       (6710)
నపుడు కృష్ణుఁ శాఙ్గమంది యారిపుల
కపుర మాపెదనని గమకించు విధము
భావించి యాయల బలములకెల్ల
నీవేళ నీవేల నేన చాలుదును
దేవ నన్నొక యింత దృష్టింప మనుచును
వేవేగ గాండీవి విల్లెక్కు వెట్టి
గుణ నినాదమున దిక్కులు పిక్కటిల్ల
గణుతింపరాని మార్గన పరంపరల
భూనభోంతరము లప్పుడు నిందనంప
వానలు గుఱియించి వానల మెఱసి                (6720)
రథములఁ దునిమి సారథలఁ గాఱించి
రథికులఁ దెగటార్చి రథ్యముల్గూల్చి
కేతువుల్నరికి పక్కెరలెల్ల వాల్చి
హేతులు సమయించి యేఁపు తూలించి
హరులఁ దుండించి భటాళి ఖండించి
కరుల నిర్జించి భీకరములైనట్టి
కాండముల్బఱపి నల్గడవచ్చు శత్రు
కాండముల్ధరవ్రాలఁ గామోది మోది
శరనిధి మంధరశైలంబు గలఁచు
కరణిఁ బిండిలి వండుగా సేనఁ గలఁపఁ              (6730)
బ్రళయ ప్రభంజన పారవేగమున
శరదాళి వీఁగిన సరవిఁ దద్బలము
బలభేది వజ్రబాణ ఘాతముల
కలికినల్గడలకే పఱివీఁగి పఱవ
దేవేంద్రసుతుఁడు నెంతే వేడ్క నగ్ని
దేవదత్తంబైన దేవదత్తంబు
పూరించెదెసలు నంబుధులు ఘూర్ణిలఁగ
శౌరి యప్పుడు ధనంజయ జయమ్మునకు
మెచ్చి వివ్వచ్చు నర్మిలిఁ బెచ్చుపెరుఁగ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని యాదరించి                   (6740)
కన్యతో జయరమా కన్యతో నబ్ధి
కన్యకాపతి ద్వారకాపురంబునకు
నరిగి యాపురవీధినరుఁదేరఁ బౌర
తరుణులు కోసలతనయు నీక్షించి
ముకురమో శశిబింబమో కాదు మోము
వెకరిమా గురుకందు వెలయదుగాన
కలువలొ మగమీలొ కాపు నేత్రంబు
లలవాడు వేడగంబులు లేవుగాన
సరసపూరమొ జలజమొ శ్యామగళము
హరికథావేద్యంబు లవిలేవు గాన                            (6750)
వలుకొందలొ జక్కవలొ కావు గుబ్బ
లలదంతురత ఱెక్కలవిలేవు గానఁ
బులినమో కరిశిరంబొలుకాదు జఘన
లలజారులును నేఱులవిలేవుగానఁ
గాళెలో శరధువో కావులేఁదొడలు
కామక కఠినతల్గలు గవువుగానఁ
రవికాబ్జములొ లత్తుకలొ కావొ పాద
ములు కంఠనకలత్వములు లేవుగాన
నని సన్నుతింప నందందని లింప
జనమవలోకింపఁ జలజలోచనుఁడు                       (6760)
చెలఁగి భూమిసురాశీర్వాదతతుల
విలసిల్లు సదన ప్రవేశంబు సేసి
ప్రణుతింప వసుదేవ బలదేవులకును
బ్రణమిల్లి కలిసి సౌభాగ్యంబు మెఱసి
సౌవర్నగాత్రి కోసలరాజపుత్రి
భావజకేలి శంబరరాశిఁ దేల్చి
యతుల శోభనవతి యమితసౌభాగ్య
వతియునునగు ద్వారవతియేలుచుండె
ఆదట మఱియును నయ్యంబుజోదరుఁడు

Friday, June 10, 2016

అష్టమహిషీ కల్యాణము - 17

3. తృతీయ పట్టమహిషీ
శ్రీ సత్యభామాదేవీ వివాహవర్ణన ప్రసంగము

ననుపమనుత ధామయగు సత్యభామ
యను కన్యకామణి నామణినపుడు
కొని శౌరిఁ జేరి నూల్కొను భీతితోడ
ధరసాగి మ్రొక్కి హస్తంబులు మోడ్చి
కరుణాకలాపాంగ కమలాంతరంగ
యనఘ శరణ్య నాయపరాధ మెడయ             (5890)
వనితాశిరోమణి వనజాప్తమణియుఁ
గానుకగా నీవు గైకొమ్మటన్న
నాననజితసోమయగు సత్యభామఁ
గొనకొన్న ప్రేమచేఁ గొని సంతసించి
దనుజేంద్రజిత్తు సత్రాజిత్తుఁ జూచి
యీ వేళమాణిక్యమే నొల్ల నాకు
నీ వధూమాణిక్యమే చాలుననుచుఁ
జతుర వాచామృత సారంబుచేత
నతని శోకాగ్ని చల్లార్చెనంతటను
బలుఁడు పురంబు దర్పణచామరాది               (5900)
లలితంబుగాఁగ నలంకరింపించె
బలరామునానతి బలసహోదరుఁడు
సలలిత మంగళస్నానంబుఁ జేసి
చుంగులై కాఱు మించులఁ గెరలించు
బంగారురెంటెంబు బాబుగాఁ గట్టి
యాతత మణిమయంబై సూర్యకోటి
తీతిఁ జూపట్టు కిరీటంబు దాల్చి
రత్నకరాత్మజా రత్నానుజన్మ
రత్నసంకలిత హారంబులు పూని
కడివోనిపూబాసికము సవరించి                    (5910)
వడి వివాహుండు వివాహ మంటపము
నడుమశోభిల్లెఁ గాంతాజనంబపుడు
తడయకెంతయు ధళధళలుట్టిపడుచు
నాణెంబులగుచు విన్నాణంపు వగల
రాణించు చీనాంబరబులు గట్టి
నామమున్ రాచ యందముగఁ జేలోజు
మామకోయనియను మానింపఁ దీర్చి
మెఱయు చక్కెరవింట మొదలు తుమ్మెదల
దరము క్రొన్నెఱులు బిత్తరముగా దువ్వి
సిరులఁ జూపట్టు బాసికములు గట్టి              (5920)
సరసరత్నముల సూసకములమర్చి
ససువత్తగలనగవుల సయ్యాటమాడు
నొసపరినెమ్మోము నొకకొంతవంచి
జిలుఁగుమేలతికల చెఱఁగు లల్లాడ
నలఘు శోభనవతియగు జాంబవతిని
హసితనిర్జిత భామయగు సత్యభామ
నసమానలగు చెలులటకుఁదో తేర
నపుడు సత్రాజిత్తుఁ డాజాంబవంతుఁ
డపరిమితానందులగుచుఁ బూజించి
పంకజాక్షుల మధుపర్క పూర్వముగఁ                (5930)
బంకజాక్షునకు శోభనవేళ నొసఁగ
నెలుఁగెత్తి నిజపురోహితుఁడు సువ్రతుఁడు
సలలిత మంగళాష్టకములు చదువఁ
దిరమగు ప్రేమనత్తెఱనిక్కి విప్ర
వరులు దీవెన విప్రవరుల చెలంగి
తళుకు చూపులకల్వ దండలొండొరుల
గళములఁ దగిలి ప్రకాశింపుచుండఁ
గదిసి ముఖావలోకనములు జేసి
అదనుతో విష్ణుఁడగు విషుఁడంతఁ
తొలి తొలి నాల్గువేతులు దోయిలించి                   (5940)
పొలుపొంద నవరత్నములు ముంచి మించి
కలహంసికా యుగ్మకము చెల్వమొదవు
తలిరుఁ బోడుల మీఁదఁ దలఁబ్రాలునించె
నపుడు దోయిళ్ల గన్యామణుల్మణులు
నిపుణతనించి శ్రీనిలయుపైఁ జెలఁగి
కచభరంబులు వెనుకకు వీఁగనచల
కచకుంభములు ముద్దు గునియంగనిక్క
తలఁబ్రాలు నించి రత్తఱిమరువాడి
చిలుకు చూపులు ముద్దుఁ జిలుకు భామినులు
చిలుపగాలికిని జెంజి గురులు బెళుకు                 (5950)
చెలువున మోవులు చీమంతకదల
శుకపిక నికరంబు బోడుగాఁ గూడి
సుకుమార గతిఁ బల్కు సొబగు దీపింప
బిసరుహాక్షుని కూర్మి పేర్మి వర్ణించి
పసమించ శోభనాల్పాడిరీ రీతిఁ
గన్యకామణుల నాగమవిధి నబ్ధి
కన్యకాధవుఁడు లోకములు గీర్తింప
పరియించె గీర్వాణవరులు భూవరులు
వరనుతుల్సేసిరి వసుమతీసురులు
అతిమోదమున వివాహంబును గోరి                     (5960)
సుతులకు శౌరిసంస్తుతలు నేర్పుచును
ప్రాకుపండ్లూడి వెల్వెడఁగ నేత్రములు
చీకిలింపుచుదిట్ట చేతులు సాచి
పనస చక్కకఁ జెప్ప పనసయటంచుఁ
దనయ శిష్యులకు వేదముఁ జెప్పికొనుచుఁ
జెవినెఱ్ఱ పోఁగు దాల్చిన వారినెల్లఁ
దవిలి వేఁడుచు నక్షతంబు లిచ్చుచిను
గ్రాసమిప్పింపుఁడు కాదేనియొక్క
కాసైనదానమీఁ గదరేయటంచు
బదుగురైదుగురొక్క పౌఁజుగాఁ గూడీ              (5970)
పదరి యందలములో పలివానినైన
లోఁగక పల్లకిలో వానినైన
వీఁగక తుంపురుల్వె డలంగఁ బెద్ద
యెలుఁగున నడిగి వారిచ్చినందులకు 
నలయపాళ్లకును దిట్లాడంగవారి
సతులంత పతులతో సహభోజనములు
మతులఁ గాంక్షించి సమ్మతుల నొండొరులు
అచ్చికూచక్క వోయకు మంచి మంచి
యచ్చావధానుల యక్కచ్చిలచ్చి
అచ్చిబూరెల బుచ్చి యందఱుమీరు                    (5980)
వచ్చెదరే మన వారందఱిప్పు
డాయెడ హరి వివాహంబును గోరి
పోయిరే మనమును బోవలెస్సగును
పప్పుఁనేతులు  పెర్వు బంతులు బట్టి
గుప్పుదు రట్టేని కూర్కొని త్రావ
సారంపు వాసన సగుడమైనట్టి
వారినెవ్వారి నెవ్వారికోనైన
చాఁపట్టులును బాయసము సొజ్జి బూరె
లోఁపినవారల కోఁపంత కొలది
కలలోన గంజియే కాని మాయత్త                (5990)
పిలిచి యొకింతైనఁ బెట్టదన్నంబు
నడివచ్చెననుచు వేసరియప్పి గాని
వడువువాహుఁడ యింత వంఠంబు వెట్టె
తడిలేని త్రావుడు త్రావంగఁ జంటఁ
దడీలేదు పాపఁడు ధరియింప నీఁడు
తడవేల కుడువఁబోదమురారె యొడలు
కడిగికోఁగదరె యోకైకలారనుచుఁ
దాలికల్గట్టి చెంతలఁగొంత జాఱ
పాలముల్పచ్చగాఁ బసుపులు పూసి
దళముగా నవ తైలధారతో మెదిచి              (6000)
వెలయఁ జెంద్రపు బొట్లు వింతగాఁ బెట్టి
పచ్చనక్షతములాపై నిగడిచ్చు
విచ్చుటాకులు వెడవెడఁ జుట్టి తాల్చి
కాటుక కన్నులఁ గలయంగ నలఁది
.......................
బలువిడి నెఱకల బారగాఁ దివిచి
నులిచిన పెనుబొగ్గు నూళులువైచి
పాడువారినయట్టి పల్ల వెంటుకలు
కూడ దువ్వుచునులి కొప్పులు వెట్టి
కడుముదుకగు చాయగల చీరలెల్ల                 (6010)
ముడూకులనొరయంగ ముఱియుచుఁ గట్టి
చతురాస్యుడాస్య రసంబుల నిట్లు
లతివలఁ గావించె ననిజనుల్వొగడఁ
గన్నబిడ్డలను జంకలఁ బెట్టిమున్ను
మున్నచెంతలఁ బెను మూకగా నడువఁ
గుసిగుంపు నడకల కోడెబాపెతలు
అసమాన గతివచ్చి నావిప్రవరులు
సతులతో సుతులతో జాడ్యంబు దేఱు
గతులతో రుక్మిణీకాంతుని జేరి
కరములు చూఁచి యాగమములు చదివి              (6020)
హరి నీకు వేదోక్తమాయుష్యమస్తు
కంటగించని నీదు కల్యాణ మహిమ
వింటిమి మునుపని వింటిమీ వేళ
కృష్ణయొడ్డుననుండి కృష్ణమాయాత్మ
తృష్ణ దీర్చె దవని తివిరివచ్చితిము
పూనిన కార్పణ్యముడుగు సువర్ణ
దానంబు పరమాన్న దానమిప్పింపు
వరదుఁడవీవయీ వలయును గాక
యరయనన్యుల కీయ నలవియే కృష్ణ
యన విని హరి నవ్వి యారీతి విప్ర                   (6030)
జనములకెల్ల భోజనము గావించి
భూరి రత్నాంబర భూషణావలులు
భూరిగా నొసఁగి యప్పుడు వీడుకొలిపి
నీల నీలాం బుదనిభ దేహుఁ డపుడు
బాలేందుసమ ఫాలబాలలతోడ
సమరభూపాలంబు చయ్యన నెక్కి
........................
ధరదివ్య భేరివాద్యములు వాద్యముల
యురుతర ఘోషంబు లుడువీధిఁ బొదువఁ
గమ్మవిల్కాని సృంగారంపు తరువు                      (6040)
కొమ్మలోయన నొప్పుకొమ్మలంతంత
నురుతరాయత నేత్రయుగళ భావంబు
అరవిందముల మూయ నారతులొసఁగఁ
బురవీధినేగ గోపురవరద్రాజ
తరుణు లాసతులా సౌందర్య మీక్షించి
ఘననీల ఘనమిరుఁ గడలఁ జూపట్టు
మినుకైన క్రొక్కాఱు మెఱుఁగులో కాక
లలితేంద్రనీల శైలముల పార్శ్వముల
దలకొత్తు కనకలతాయుగ్మకంబొ
గట్టిగా నడుమునఁ గాంచనాంబరుఁడు              (6050)
చుట్టు బంగారుదట్టి చుంగులోయనఁగ
నలినాయతాక్షులనలు వెన్ని మఱియు
మృగనేత్రనాతోడు మొలఁతుకకొప్పు
గగన నీలిమకన్నఁ గప్పౌనొకాదొ
యన మఱియును గొప్పులట నవ్విధమున
వెనుకకుమఱి విఱ్ఱవీఁ గంగవలదె
చెలియ నీగురునాన చెలువ నేత్రములు
కలువల కన్నఁ జొక్కలౌనొ కావొ
అవునే మఱియు గన్నులట నివ్వివిధమునఁ         (6060)
గవగూడి తళుకులఁ గనుపట్టవలదె
కుసుమాంగి నీయాన కొమ్మకెమ్మోవి
కిసలయంబున కన్నఁ గెంపౌనొ కాదొ
యడర మఱియు మోవులట నవ్విధమున
వడిఁదేనిఁ జాటజొట వడియంగవలదె
నీకనులాన యన్నెలఁత కర్ణములు
శ్రీకారములను మించినవౌనొ కావొ
యతివ మఱియు వీనులట నవ్విధమున
జితనవసంజ్ఞలై చెలువందవలదె
అని పెక్కుగతుల నయ్యంబుజాననలు              (6070)
కొనియాడ సౌందర్యగుణ హారి శౌరి
యలఘుశోభాకరంబగు పురంబెల్ల
వెలయంగ మెఱసి యవ్వెఁలదులతోడ
సుముకులై సుమన్నస్సుల్సుమవృష్టి గుఱియ
రమణీయ నిజమందిరమునఁ బ్రవేశించి
యతుల యౌవనసీమయగు సత్యభామ
కతిమోదమునఁ బ్రసేనాగ్రజుఁ డపుడు
సామజ తతులతో సతులతోఁ గూడ
నామణినర్పించె నరణంబుగాఁగ
దేవతల్ధారుణీ దేవతల్వొగడ                  (6080)
దేవకీతనయుఁడెంతేవేడ్కనుండె
చటుల నిందా సర్వ సర్పారియగుచుఁ
గుటిల పాతక దైత్యకుల చక్రవర్తి
ధరమించునిట్టి చిత్రపు చరిత్రంబు
వర చతురతర కావ్యము సేయువారి
కున్నతోన్నతమతి నొకమాఱు పేరు
కొన్నవారలనుమాఁ కొన్నవారలను
తాపంబు లఖిలనిందలు చెందవమిత
పాపముల్వాయు సంపదలెల్లడాయు
కమనీయ గుణహారి కమలావిహారి                   (6090)
యమరారికుల హారి యౌ శౌరియంతఁ
గెంపు మించిన తురంగీలాగి వెట్టి
సొంపుగానందుపైఁ జొక్కంబుచుట్టి
మెఱుఁగుఁ జుక్కల మిసమిస తేటలెల్ల
మఱపించు నవకుందమాలిక వైచి
యకలంకమై కెంపుటంచులు గల్గి
శుకవర్ణమైన యంశుకము ధరించి
కిసలయవాదనా కృతులైన శ్రుతులు
మిసిమి యందంబుతో మించుకందంబు
కడువెడఁ దైచెన్ను గలిగిన వెన్ను                (6100)
నుడురాజుపూర్ణ తనొందు పిఱుందు
నరుణాంశుధామంబులైన రోమములు
తరుణేందుమై మించుఁ దలపించుచుంచు
నలఘు తేజోజ్వాలమైన వాలమును
గలుగు నుత్తమ హయకంఠీరవమును
సంజోగ మొనరించి సాహిణియెదుట
రంజిలి నిలిపి పరాకంచుఁ బలుకఁ
దననిటు కేలిబిత్తర పల్లెవాటు
గనుఁగొని జనులు చొక్కఁగఁ బదాగ్రమున
నిరతుఁడై యంక వన్నియమెట్టి సర్ప               (6110)
హరతురంగుఁడు తురంగారూఢుఁ డగుచు
నిండిన నిజకీర్తి నికరంబులనఁగఁ
బుండరీక ద్వయంబునుఁ జెంతనలర
నెలమి భూనాధులు హేమకాండముల
విలసిల్లుచుండెడు వీఁచోపులిడఁగ
కుడినీరు బిందియ కుంచ కాళాంజి
యడపంబుగిండియు నందంపు సురటి
మొదలైన యూడిగములఁ దాల్చి కదిసి
పదరక చెదరక పరిజనంబరుగ
నతిభయావహ మహాహవభూ ఖురాగ్ర                 (6120)
హతి కంపితారి కరాళింగరాళి
నరిశంభ భీకరుఁడగు నరుండెక్కి
యురుతర గతుల రాహుతులతోనడువ
దేవ! హెచ్చరిక దైతేయారి! యనుచు
ఠీవిమైమున్న కటికవారునడువ
నలరు శంఖ ధ్వనులడరంగ దైత్య
కులవధూ గర్భార్భకులు రెంజితుంజి
యఱి ముఱిమరువేపనా వాద్యగతులఁ
గుఱుచల నిడుదలఁ గూడి వాయింప
సన్నయెఱింగి యాసన్న కాళియులు                   (6130)
సన్నలోనుగఁ గూడి జమళిఁ బూరింప
యరి భీషణాకారియగు భేరిరవము
ధరనభోంతరము పాతాళంబు బొదువ
ఢక్కాహు ఢుక్కాది ఢమ ఢమ ధ్వనులు
దిక్కులు నిండి యెంతే భోరుకలఁగ
కడిఁదీ హెగ్గళ్లు హెగ్గెడికత్తియలును
బడిబడివడి బరాబరి సేయుచుండ
వాలుఁ గన్నులు రాణి వాసముల్చాలు
కీలుచుమ్మల పల్లకీలెక్కియరుగఁ
గనకభూషల పటికలనంబువారి                  (6140)
ఘనతర వస్తుసంఘములచే మిగుల
నలరుచువెక్కసం బగు బొక్కసంబుఁ
బలువేసడంబులు భరియించినడువ
నమృతాన్నవర కాంక్షితాధరబింబ
రమణులనగు వారరమణులే తేర
రాజులు భటవీరరాజులుఁ గొలువ
వాజిదాఁటించి భావజగురుండపుడు
కేలవాగియ చక్కఁ గీలించి కుదిచి
తాళముల్ద్రొక్కించి దాఁటి యాడుచును
జోడనఁ గొనిపించి సొగసుగా జుట్టి            (6150)
వేడెంబు వడినడ్డ వేడెంబు ద్రోలి
నిగుడంగఁ గుఱుచల నిడుదలనూకి
మగిచివైచుచుఁగేల మస్తరించుచును
పొడకట్టి జనపదంబులు నదంబులును
కడతెంచి పోయి పంకజలోచనుండు
వృషభాజిద్వాది విస్ఫూర్తి గలిగి
విషధరోత్తంస నివేశంబు పోలె
వరుణ కౌశికముఖ్య వర్ణితంబగుచు
వరుసనెన్నఁగ దిశావలయంబు పోలె
ఘన పద్మపత్ర ప్రకాశత కలిగి             (6160)
గనుపట్టు గగన మార్గంబునుం బోలె
నందమై నిరతిశయానందమొసఁగు
బృందావనము గల్గి పెంపొందువనము
కనుఁగొని సొత్తెంచి కాంతలుఁ దాను
వనకేళిఁ దవిలి యవ్వసుదేవు చూలి     
కమ్మగా వాసనల్గ్రమ్మఁగా నొక్క
కొమ్మపూఁ గొమ్మగై కొమ్మనియొసఁగ
మంజీర కుచయోర్తు మంజుల కుంజ
మంజరులొసఁగ నమ్మాధవుండలరి
విరిమొల్లనొల్లను వెలఁది నీచన్ను              (6170)
విరిగుత్తులే నాకు వేడుకయనినఁ
గడివాని తీఁపులు గలుగు నెమ్మోవి
పడఁతి యొక్కతెదొండ పండుచేనొసఁగ
బింబమే నొల్లనో పికవాణి యధర
బింబమిమ్మని చేరఁ బిలిచెఁ గృష్ణుండు
మఱికొన్ని యెడలనే మఱియున్న చిఱుత
యుఱుతలఁ దఱుముచు నువిదలొండొరులు
ఇత్తమా శౌరికి నిత్తమాలములు
హత్తియా పికముల నందందబట్టి
నాగకేసరమేల నాగకేసరుగ                   (6180)
నీగు బాగులుమాని యీఁగదే యమ్మ
యతిసౌరభంబైన యతిసౌరభంబు
తతిపూచెఁ గంటిరే తరళాయతాక్షి
నాగేంద్రగమన పున్నాగంబు సుమము
లాగడంబులు మాని యందికోఁ గదరె
దవనంబు ఘనశారద వనంబు చూడ
దవళాక్షిమైఁ జల్లఁ దావిచల్లెడిని
నని యిట్లు చతురవాక్య ప్రౌఢి నెఱయ
వనకేళి సల్పి జీవనకేళి సల్పఁ
దలపోయ శౌరి వైదర్భియాదిగను                 (6190)
గలకలకంఠులు కదిసి వేనడువ
నాకీర్ణ కోకిలకానీక పుండఁ
రీకవర్గముఁ జంచరీక వర్గమును
నమల కారండవ హంస గాంగేయ
కమల విస్ఫూర్తియంగముల విస్ఫూర్తి
తావిజొంపములతో దరులఁ జానొందు
మావుల వెడవిల్తు మావులు గలిగి
వర కేకి పిక మధువర నినాదములఁ
గరమొప్పుడున్నట్టి కమలాప్త తనయఁ
జేరి బిత్తరివగ జిలుగు పుట్టముల               (6200)
సారసలోచనల్సవరింప హరియు
వాలారుచుంగు క్రేవలనాడ మడుపు
తాళిగోణంబు వింతలుమీఱఁ గట్టి
మంచు నీరును గుంకుమము మేళవించి
నించినయొక మంచి నేత్రంబు పూని
సుకుమారముగఁ గళ సోఁకంగనొక్క
సకియమెఱుంగారు చనుదోయిలైవ
నానలోనాన నానాగేంద్ర యాన
దానవారికిని హస్తము మాఁటుఁ జేసి
చొక్కపుతావులఁ జొక్కవేరొక్క                (6210)
లక్కకుప్పియవైచి లాఁగించి మఱియు
ఘనసార మృగమద ఘనసారజలము
కనక శృంగముల వేడ్కలనించి సతులు
జలజాక్షుమైఁ జల్లి చల్లించికొనుచు
నలరుగుత్తులవేఁటు లాడుచు మఱియు
నలినాక్షుతోఁగూడ నలినలోచనలు
కలయ వసంతమీగలి నాడియాడి
కుంకుమపంక సంకుమద మృగాంగ
సంకులాంబువుల నచ్చటఁ దొప్పఁదోఁగి
యలపెల్లఁదీర నాఊమున నాయమున            (6220)
జలకేళి మనమింక సవరింతమనుచుఁ
గిసలయాధరలుకే కిసలనాదరులు
నసమానగతుల రాయంచలఁ బట్టి
సారసంబులఁ బట్టి సరసజానొందు
సారసంబులఁ బోఁపి సరసమాడఁగను
నహు కరేణిలతోడ భద్రకుంజరము
విహరించుగతి శౌరి విహరింపఁ దొణఁగె
కమనీయగతిఁ దరంగంబులు సాఁచి
రమణీయ రమణుల రాసిపోనీక
యొఱపులఁ దిట్టుచు నోలఁ బెట్టుచును               (6230)
దఱుమఁ బెట్టుచు వడిఁదరులు మెట్టుచును
నరలి నారాయణ శబ్దార్థమనిన
నరులకుఁ దెలుపు చందముగ శోభిలఁగ
నొకలేమఁ గని యొకానొక మోహనాంగి
చికిరి నవ్వులఁ జేరి చేయి బట్టినను
జేలఁ గట్టఁగ నన్ను సెలసి పట్టెదవు
మోలమో యిదిమంద మేలమోయనుచు
మెండుతుమ్మెదలతో మేకులు జేయు
పుందరీకములన పూఁ బోణివైవఁ
దరుణులు మెచ్చ నాతరళాక్షి వెనుక                (6240)
మరలఁ దామరలఁ దామరలవైచినను
వెండియు నీలాహి వేణులుద్దండ
నొండొరుల్దమలోన నుద్దించికొనుచు
జడియ కుంచలను గొంచలను గిట్టుచును
నడిచి మీనముల ఫేనములఁ బట్టుచును
దొడరి చెందొవల కందువుల వైచుచును
గడిఁగి చక్రముల చక్రములఁ బోఁపుచును
అలమోముదమ్ముల కచటితమ్ములకు
నెలకొన్ననగవు వెన్నెల వింతలనఁగఁ
నలకభృంగములకు నచటిభృంగమ్మ                   (6250)
లలవిమీరిన మ్రోఁత లవియెవింతనఁగఁ
జనుజక్కవలకు నచ్చటి జక్కవలకు
ననయంబుతాయని యదియెవింతనఁగ
నొప్పునంగములతో నొప్పు లతాంగ
లప్పంకజాక్షులా యమునలో వెడలి
చుట్టు బవంతులఁ జూపట్టు పట్టు
పుట్తముల్గట్టి యొప్పుగనుఁగైసేయఁ
గనకాంబరుండు గనకాంబరాది
ఘనతర శృంగార కలితుఁడై యపుడు
కందలామంజక కుటజ పున్నాగ                         (6260)
నందదిందిందిర నలిన గుచ్ఛముల
ఆవేళకాలాంత రాంతరంబునకు
కుంతీతనూజు దోడ్కొని శౌరియరిగి
.......................
పసిఁడి కుందలమాఱు పఱచు పాలిండ్లు
కుసుమాంగి యీర్తు చెక్కులడాలు మెఱయ
సలలితరేఖఁ గంచము పట్లు చేసి
వలిపె దుప్పటి నిజావదమీఁదఁ బఱచి                 (6270)
నిగనిగమనెడు వన్నియల గిన్నియలఁ
దగఁ గ్రమం బెఱిఁగి చెంతలఁ బాదుపఱచి
యంబళ విరళంబులకు నూత్నరత్న
కంబళములఁ బొందుగానంద పఱచి
యాయెడ హరిఁ జేరి యారగింపంగ
నాయత్తమనుఁడుఁ గంజాయతాక్షుండు
ఉరుతరంబైన వేఱొక్క పాత్రమున
సరస మారుతజన్ము సహజన్మునునిచి
తన పట్టమహిషులుఁ దాను నచ్చోట
నొనర నాసీనుఁడై యుండె నుండుటయుఁ                  (6280)
దెలిఱెక్కపులుఁగులఁ దెగడెడునడల
గల సతులాత్రముల్గరములఁ దాల్చి
కంకణ ఝణఝణత్కారముల్వివిధ
కింకిణి కిణకిణత్కృతులతో బొఱయ
పొడవడిరాలుచుఁ బొదలిన రుచులు
గడుఁ బ్రకాశముగల కలవంతకములు
ముప్పిరి సంభారముల మించినేఁతఁ
జొప్పిల వగ్గళించిన తాళిదములు
పరిపక్వమై దోరబాఱికన్నులకు
నురుదైన తురుఁగులు నప్పడంబులును             (6290)
నటులైన బేడల పగిదినేయొప్పు
పటుతర మృదు రూపముల సూపములుఁ
గ్రమము తప్పక పచ్చగందకతెచ్చి
యమృతోపమానంబులైన రాజాన్నములను
నంబుజ మోదంబులై నవకుంకు
మాంబుధారల రీతులైన నేతులును
మరిచ జీరక కొత్తుమరి మిరియముల
మెఱయుచు రుచులచేమించు చేరులును               (6300)
దిరమైన యొప్పలఁ దేరుచు దేవ
పరమాన్నముల సజ్జ పరమాన్నములును
జలలగాబూపు వాసనగట్టి తెచ్చి
వల్లగట్టిన రసావళ్లు నంబళ్లు
నిరవైన చవినోట నిడినంతతోన
కరుఁగునో యననొప్పు కజ్జాయములును
గడలేని రుచుల మీఁగడ పెరుంగులను
........................
రవరవ గానుప్పు రవగూటి సొంటి
లవయుక్తమైన చల్లని మజ్జిగయును             (6310)
నెడనీరు నెడనెడ నింపుసొంపైన
కుడినీరు వేరుసఁజేకొనుచు వడ్డింప
సరసిజాక్షులుఁ దాను సరసిజాక్షుండు
సరసభావముల నీసరణి భుజింప
నంబుజ శశివాసితాంబుల జీవ
నంబుచేఁజే మజ్జనంబు గావించి
గారవంబున సారకర్పూర పూర
చారు వీటికలెల్ల జనులకు నొసఁగి
యొకకొంత తడవందునురు సౌఖ్యకేళి
వికచాబ్జముఖులతో విహరించియంత              (6320)
కమలారి బింబరాగంబుమై పసలు
తెమలించు నిండు చంద్రిక దట్టిగట్టి
శ్రీరామచంద్రుని చెలువు దీపింప
నారూఢ కోదండుఁడై ప్రకాశించి
సకలసైన్యంబు నచ్చటనుంచి పార్థుఁ
డొక్కఁడు దానొక్కఁడు వేఱొకచోటి కరిగి
(భ్రమకము)
వరకు తాల నవనవ నీలతాకురవ
కరక సారస కనక సరసాకరక
కలదర వీరక కరవీర దలక
కలకద వాసి కకసి వాసిదలక              (6330)
తరుముక్య వివిధ లతావితానములఁ
గరమొప్పు నొక మహాగహనంబు సొచ్చి
కరిణుల హరిణులఁ గరుల సూకరుల
శరభ శార్ధూల పుంజములఁ జెండుచును
లీలవైఁ గన్నియలేళ్లఁ బూరెళ్లఁ
దోలిపోనీయకయే దులను గైదులను
వడిసూడి పట్టి యవ్వలను గవ్వలను
గడపుచువేఁట నీ క్రియఁ జల్పు వేళఁ
దఱచైన పికిలి పూదందలనొప్పు
నొఱయు గుబ్బలలోడ నొఱయుచునుండ         (6340)
నొఱపులు చిల్కు బిట్టుల్కు కన్గొనలఁ
జిఱుత వెన్నల తేట చిందఁ గన్గొనుచు
పుప్పొడిపొడల యోపుల చన్నుఁగవలు
గప్పనేరక శౌరిఁ గన్గొను వేడ్క
సమరంద గణగణ సంశోభితాధ
రములపై దంతగౌరత తేజరిలఁగఁ
గోకిలములు కేరిగొణఁగు చందమునఁ
బికము చందముమాట బిల్చుచెంచెతలు
కందర్పునకు నాది కందర్పుఁ డగుచు
ముందరనున్న యమ్మురవైరిఁ జూచి                   (6350)
మదకరి మద సంకుమద మృగమదము
లుదుటైన డేగలనోరణంబులును
గానుకలొనరింపఁ గైకొని వేడ్క
లానవేపిన్నపాయమున నాయమున
దరులనాపూరి నెత్తముల మొత్తముల
గరిమ గోగణములఁ గాచుచందములఁ
గ్రీడికిఁ దెల్పుడు గ్రీడింప శంప
జాడల నన్నదీ జలమధ్యమునను
శశికాంత శిలమీఁద శశికాంతమించి
శశిబింబ ముఖియోర్తు సరసభావముల            (6360)
హరిమూల ములనప్వునవి పంక్తి నెఱియు
నరిపదాధిక్యంబు నలరెడుతురుము
జలజంబు తెగబేడ సలబెళుకులును
గలువల సోఁగయుఁ గలకన్నుఁ దోయి
యమరెడువట్రువ యందంబు మెఱుఁగు
కమలంబు తావియుఁ గలుగకమ్మోము
తలిరుమై జిగికి పంచదారలో మేలు
కలిత బింబము కెంపుఁ గలిగినమోది
పూఁ గొమ్మబిగి బిసముల జిగితేఁత
తీగెల సొబగు వర్తిల్లు బాహులును                (6370)
గొందల పొడవు పూగుత్తుల మురువు
మిండ జక్కవ నీటు మెఱయు పాలిండ్లు
సైకతముల నవ్వు చక్రంబు బటువు
నాకేభ మస్తకోన్నతిగల పిఱుఁదు
కరితుండముల తీరు కరభంబు బాగువి
సరస రంభలనిగ్గు సవరించుతొడలు
కమలకోమలతాలాక్షారక్తిమంబు
విమల కూర్మాకృతివెలయు పాదములుఁ
గలిగి యాకలశాబ్ధికన్య చందమున
విలసిల్లుచుండునా వికసాబ్జనేత్రఁ              (6380)
గని శౌరి గోరిచొక్కక్కఁగ భావభావ
మనువొందఁ దెలిసి యయ్యమరేంద్ర సుతుఁడు
కమ్మవిల్తుని తల్లిగతినున్న కొమ్మ
యమ్మ నీవెవ్వతెవనిన నాచెలువ

(తరువాయి భాగము "చతుర్థ  పట్టమహిషీ - శ్రీకాళిందీదేవి వివాహ వర్ణనము")

Wednesday, June 1, 2016

అష్టమహిషీ కల్యాణము - 16

పంచమాశ్వాసము
(శ్రీదేవి మహిమవర్ణన)
(ద్విపద)

అసమానలావణ్య యసమశరణ్య
బిసకాండసమబాహ బిసరుహగేహ
నిరుపమాలంకార నిత్యశృంగార                   (5580)
హరిభుజాంతరసంగ యనమేలుమంగ
యవధరింపుము దేవి యఖిలభూనాధ
కువలయసందోహ కువలయాహితుఁడు
చిన్మయాత్ముఁడ పరీక్షన్నరనాధుఁ
డున్నతోన్నత శుకయోగికిట్లనియె

2. ద్వితీయ పట్టమహిషీ
శ్రీ జాంబవతీదేవి వివాహ వర్ణన ప్రసంగము
------

వరరూపవతి జాంబవతి మొదలైన
తరుణుల నుత్పలదళవిలోచనల
నేరీతి వరియించె నిందిరానాధుఁ
డారీతి రీతిగా నానతిమ్మనుఁడు
మిత్రగోరూపాయ మిత్రుఁడైనట్టి                  (5590)
సత్రజితాఖ్యుండు శత్రుసూదనుఁడు
తపసు గుఱిఁచి ఘోరతపమొనరించి
తపన స్యమంతక తపముఁ గైకొనుచు
ధరణికేతెంచెను దరణినేఁడనుచుఁ
బురజనులెల్ల నబ్బురమంది చూడ
ద్వారకసొచ్చి మోదంబుతోఁ జక్ర
ధారియౌ యదుకులోద్ధారి నీక్షించి
ప్రణతులొనర్ప గోపాలపాలకుఁడు
మణిపీఠియందు సన్మానితుఁ జేసి
గుణివర్య యెచటఁ గైకొంతివీ దివ్య             (5600)
మణిచూడఁగ నభోమణికాంతి గలది
యిమ్మనుజులకెల్ల నిదియేలదక్కు
నిమ్మని యదుభర్తకిమ్మనియనినఁ
బకబక నవ్వి తప్పక చూచి శౌరి
నొకమాట మోమోట యుడిగి యిట్లనియె
నగములకేగి వానలఁ దొప్పఁ దోఁగి
చిగురుల నమలి మించిన యెండఁ గమరి
భానుచేఁ గొనియటు పటురత్నమొరుల
కీను బంగరుకుప్ప లీనునాయింట
నని దీనినీఁ గూడదని యింటికతడు                 (5610)
చనియె నమ్మణి విలాసమున నొక్కెడను
భూనాధ యతనితోఁ బుట్టు జితారి
సైనుఁడైనట్టి ప్రసేనుండు దాల్చి
సమకట్ల జల్లులస యోగమొనర
సమకట్టినట్టి యశ్వము నెక్కినిక్కి
రాజులు భటవీరరాజులుఁ గొలువ
వాజి దాఁటించి తీవ్రత వేఁటవెడలి
బాగైన యపరంజి పట్టేడల్నిగుడ
సాగి గుఱ్ఱనుగాఁగ జాగిలంబులును
గిరిగొన్నకైదు కక్కెరలఁ గొక్కరల              (5620)
జరగనీ యకపతఁ జాలుడేగలును
కాఁచిపుటంబిడి కనకంబు వెట్టి
తూఁచి కైకొన్నట్టి తోచిగాడులును
మువ్వల గిలగిల మొఱయ జాడించి
క్రొవ్వుననుప్పొంగు కొమరు సాళ్వములు
కనినంతనే కురంగముల సంఘముల
పెనుపడి చెండాడు పెనుబండిపులులు
సెలకట్టియలు గొప్ప జేవడంబులును
సిలకట్టియలు పెక్కు చిక్కులవలలు
పెనువిండ్లు సగము జాబిల్లియమ్ములును                  (5630)
ఘనములౌ కత్తులు కడిఁది తిత్తులును
బూని వేటరులు గబ్బులుమీఱి కదల
నెనాదులకుమున్నె యేగ నారాజు
కోల గాలవజాల కుంద ముకుంద
సాల బాలాంకోల జంబు కదంబ
తుంగ నారంగ బంధూక మధూక
తుంగ రంగత్తాళ ధూప నీపాట
తరులఁ బాఱెడు నేర్లదరుల శైలభ
కరులచే నొప్పారు కానసొత్తెంచి
మేఁటి రౌతులఁ జుట్టి మీటుగా నిలిపి               (5640)
వేటరులును దాను వేఁటాడఁ దెణఁగె
సారెకుఁ గోఱలు చప్పఱించుచును
దోరంబులైన పందులరోసి యేసి
పట్టెడ లెడలించి పచరించిచాయఁ
బట్టఁ గుక్కలదాని పైనుసకొలుపఁ
గవిసి యాయంబులు గఱచి విదిర్చి
తవిలి గొంతుల నల్లఁ ద్రావుచునుండఁ
బొదలఁ గ్రక్కదలఁ జోఁపుడు కొలచోప
నుదురి బిట్టెగసిన యుదిరికైదులును
లావులుగా సోఁగ లావులు నివిరి                      (5650)
కైవాలకుండుడే గలఁ బూఁచి లైవఁ
గ్రక్కున బాఱి ఱెక్కలమీఁద నెక్కి
యక్క పక్కియ చెక్కు నడియనొక్కుచును
గువ్వల వడిబట్టి గువ్వలైన
నవ్వుల కుందేళ్ల నాడేళ్ల లేళ్ల
చాయకమును మింటఁ జను సాళువములు
నాయెడ బోయని నార్చి పిల్చుటయు
భోరునదూరి తెప్పుననెత్తి దొత్తి
క్రూరత మెదడు ముక్కుల గ్రుచ్చిమింగ
గవులలోఁ బులులఁజే కత్తుల కడిమి               (5660)
నవలీలఁ బొడిచి సాహసములు నెఱపఁ
బొదలైన యొడలు నబ్బురమైననడలు
జిగిగొన్న పొడలికెం జాయలేఁ దొడలు
కలిగి మిక్కిలి చూడఁ గలిగిన దుప్పి
చెలుప మీక్షించి ప్రసేనుఁ డంకించి
పరివారమీదుప్పిఁ బరిమార్నవలదు
పరికింపుఁ డిదెదానిఁ బట్టిదెచ్చుటను
నని వారి వారించి యచ్చోటనునిచి
ఘనతర తనవారిఁ గైకొన్న మేగము
వలనెల్ల నివ్వలవ్వలగాఁగ నఱికి             (5670)
స్వ్లవింటి కోలయేసిన రీతిఁ గదలఁ
గ్రమ్మి యామృగ తీవ్రగతితోడఁ గూడ
సమ్మెట నటన పంచార మంటించి
యదరంటధేయని యార్వనావాజి
పద రవోద్ధుతరాజి బలువాజిఁ దోలి
చొచ్చిన చోట్లను జొచ్చిపోనీక
విచ్చల విడివడి వెన్నాడి పోయి
కరిఘటా నిటల సంఘటిత నఖాగ్ర
హరి కహకహ విరావాకులంబైన
కానలో నాదుప్పిఁ గానకతప్పి                    (5680)
నూని నీళ్లుల టెంకియున్న యత్తఱిని
నీరంధ్ర తరు లతా నికర మధ్యమున
నీరెండగాయుచు నీమణిఁ జూచి
గంహ్వారి ధరగుహ కడతెంచియొక్క
సింహ్వంబు నరనాధసింహుపై కెగసి
హరితోడఁ గూడంగ హరియించి మణియు
హరియించి యొకత్రోవ నరుగుచు నుండ
నాతత బలవంతుఁడగు జాంబవంతుఁ
డాతఱి సింహంబు నవనిపైఁ గెడపి
యామణిఁ గైసొని యలరి వేఁడుకల              (5690)
యామనితోయాడ నాత్మీయ గుహకుఁ
జనిరత్నమపుడు పచ్చనిత్రాట గ్రుచ్చి
తనపట్టి తోట్టిమీఁదటఁ గట్టెనంత
గగనేశుఁ డరిది దిక్కన్యక యఱుతఁ
దగిలించు రత్నంబు తాళిబొట్టనఁగఁ
జదురైన యఱసంజ జవ్వని చంటఁ
బొదవిన సిబ్బంపు పొడయో యనంగఁ
గొంచక దినయాంత్రికుండు సురల్మెచ్చఁ
బొంచివైచినగచ్చు బొమ్మరంబనఁగఁ
బచ్చమావుల రెండు పసగల కెంపు               (5700)
పచ్చనిచాయ లంబరమున నిగడఁ
గ్రుంకుడుకొండఁ ద్రొక్కుచు నపరాబ్ధిఁ
గ్రుంకి చీకట్లు ద్రిక్కులవేగుఁ జూడఁ
దుద భానుభాను విద్రుమ లతల్ లిష్ఠ
పదమును రెంటింట బలసెనోయనఁగ
సురిచిరంబేక కౌసుంభాంబరంబు
కరణి దిక్తటులు చూపట్టి నభ్రమునఁ
గడిఁది మున్నమృతంబు గరుడుండుగొనుచుఁ
గడువడిఁ జనఁగఁ దత్కలశంబు తొలఁకై
చెదరియాకసమునఁ జింది చూపట్టు                     (5710)
తుదలేని యమృతంపు తుంపురులనఁగ
వికసించు చేమంతి విరులచందమునఁ
బ్రకటంబులై కనుపట్టెఁ దారకలు
తేరిచి విరహి వీధినిగామరుండు
కోరి కట్టిన రసఘటికయోయనఁగఁ
గలువలుచెలఁగఁ జక్రంబులు దొలఁగ
వలరాజుకొసర జీవనజముల్గసరఁ
బొడలైన మించుల పొడపు గుబ్బలినిఁ
బొడసూపెనంత వేల్పుల మేఁతకుప్ప
కలికిరే రాఝు నక్షత్ర మాలికకుఁ                   (5720)
గొలికిపూసనఁగ వేగురుచుక్క పొడిచెఁ
గఱక చీఁకట్లను కరులమాయింపఁ
బఱతెంచు సింగంబు పగిదిఁ జూపట్టు
భానుండు సారుణభానుఁడై పొడిచె
సేనలారే యిప్రసేనుని వెదకి
కాకకేయిరవును గానకేతెంచి
తోన సత్రాజిత్తు విన్నవింపఁ
బొక్కి సొంపులు దక్కి పొదలు దుఃఖమునఁ
జిక్కితా నవివేకచిత్తుఁడై పలికె
బరమ మాయావి శ్రీపతి ప్రతిలేని                       (5730)
వరమణి యాదవవరుని కిమ్మన్నఁ
దమ్ముఁ గైకొనకున్నఁ దమ్మునిఁజంపింప
యమ్మణి శ్రీమణి హరియింపఁ బోలు
నన విని రోషించి యాదానవారి
తనవారిజనుల సత్రాజిత్తువారి
జొప్పున రమ్మని సోమకాసురుని
చొప్పెత్తు తలవరిచూడఁ జోద్యముగ
మునువాఁడుచను మార్గమును జూపికొనుచుఁ
జని వన మంజుకుంజముల పుంజముల
సరసఁ బ్రాణములు తేజము దక్కి స్రుక్కి              (5740)
ధరఁ ద్రెళ్ళియున్న సత్రాజిత్తు తమ్ముఁ
గనుఁ గొని యత్తురంగమును సింగమును
జనులకుఁ జూపఁ గేసరి నేలఁ గూల్చి
యెలుఁ గులఱేఁడు వోయిన తోవఁ బోవ
నలరు చీకటి రథంబగు బిలంబొకటి
నాలోనగనిఁ జాడ లరయంగఁ జూడ
లోలోనఁ గనువట్టె నివిచూడుఁ డనుచు
నల బలంబవునని యల బలంబులను
బిలము వాకిటఁ బెట్టి పీతాంబరుండు
నా మహాగుహ సొచ్చి నట నొక్క హేమ              (5750)
ధామ ధామంబురోధామ సద్మమున
నుదుటు మారునివాడి నొకముద్దులాడి
ముదురు గోయిల గ్రొల్చు మోహనంబలర
బంగారు గొలుసులు గట్టిపాలిండ్ల
ముంగిళ్ళుఁ గదలఁ దమ్ముఁడతంచు నూచి
జోలఁ బాడఁగఁ దొట్లఁ జొక్కుచు నవ్వు
బాలుచే పడుడుచు నూఁపఁగ మిట్టిపడుచుఁ
జక చక ద్యుతుల భాస్కర కరావళికిఁ
దుకతుక లొసఁగు బంధుర రత్నమపుడు
కొని వేడ్కనొడిఁ బెట్టుకొనినంతఁ జెంత          (5760)
వనితహాయని జాంబవంతుని బిలువ
పదవడి యా ఋక్షపతి రమాపతిని
గదిసి కోపాటోపకంఠుఁడై నిక్కి
శూలికిఁ గేలికి సురలకసురల
కౌలోను జొఱఁగరాదెట్లు జొచ్చితివి
అనుచు దర్పించి మిన్నగల గర్జించి
ఘనవృక్షమునవై వఁ గంసారి దాని
దనిమె భుజమును బంధురతరాహతిని
గనలి మేఘములీల గర్జించి పొంచి
పాణినాతఁడు చక్రపాణిమైవైవ                (5770)
జాణూరమర్ధి కంసధ్వంసి ముష్టి
నా ఋక్షపతి వక్షమపుడు తాటించె
నారూఢ జయధరుండగు ఋక్షవరుఁడు
హరిఁ ఘొట్టెనతను శ్రీహరిఱవ్వె నతఁడు
ధరణీశువైచె నాతని శౌరి యొడిసె
బహుగుగాగహన సంభరితోగ్ర సహజ
మహితారవంబులు మహిఁ బిక్కటిలఁగఁ
గరియును గరియు సాగరము సాగరము
హరియును హరియుఁ బూర్వాపరాగములు
పొదివిన కరణినేర్పునఁ బోరుసరణిఁ         (5780)
గదియు చందమున డగ్గఱిన యందమున
మల్లయుద్ధముననే మఱకయయ్యచ్ఛ
భల్లభర్తయుఁ బంచభల్ల కర్తయును
నిరువది యొకదినం బీరీతిఁ బోర
హరి ధృతతరకరాహతులకు జడిసి
వక్రారి వనశుక్ర వంచిత శుశ్ర
విక్రమధామ త్రివిక్రమ స్వామి
ప్రతిలేని గతి నిరువదియొక్కమాఱు
క్షితిప్రదక్షిణము సేసితినింతయలయఁ
గందువు వంక్తికంధరునితో మున్ను                        (5790)
బంధురగతి నెదుర్పడియునే జడియఁ
బరుఁడు గాఁడితఁడజ భవముఖులకును
బరుఁడై నయల పరాత్పరుఁడుగా నోపు
నని తలపోసి పద్మాక్షుని డాసి
వినతుఁడై భల్లూకవిభుఁడు కేల్మొగిచి

(గోమూత్రికాబంధము)

కమలేశ నరహరి ఖగరాజగమన
...........................
కరుణాకటాక్ష శ్రీకలితోరువక్ష
పరమయోగీశ హృత్పద్మ దినేశ
యపరాధి నపరాధి నని ప్రొక్కి స్రుక్కి                 (5800)
కృపణుఁడై శౌరికిఁ గృపబుట్టఁ బలికె
తమ్ములై మ్ర్ఱుఁగు ముత్యమ్ములై శోభి
తమ్ములై బెళికెడు తళుకుఁ గన్నులును
దామరై కళాలకా దామరై శీత
ధామరై శాంతి మెంతయునొప్పుమోము
గొప్పలై యొప్పుల కుప్పలపై పసిఁడి
తిప్పలై నిగ్గులు దేఱు పాలిండ్లు
సన్నమై మేఖలాసన్నమై గగన
మున్నమై నొప్పుచునున్న నెన్నడుము
చక్రమై సౌందర్యచక్రమై విసల                   (5810)
వక్రమై చెన్నొందు వలుద పిఱుందు
రంభలై మోహనారంభలై కాంతి
కుంభలై యొఱుపులు గుల్కునూరువులు
మించులై పవడంపు మించుతలిరుల
వంచులై యొప్పెడు చరణముల్గలిగి
మరుమోహనాస్త్రంబు మాడ్కిఁజెన్నొందు
తరళ తోయజనేత్రి తనదు సత్పుత్రి
వరరూపవతి జాంబవతి యనుకన్య
సిరికూర్మి మగనికిచ్చిన సంతసించి
మామనొప్పులు దీర్చి మన్నించి చంద                  (5820)
మామయర్మిలి బావ మహనీయ బిలము
యత్నంబు సమకూరెనని వేడ్క వెడలి
రత్నంబుఁ గామినీరత్నంబుఁ గొనుచు
ద్వారక సౌధాగ్ర తారకసొచ్చె
నా రమాపతిఁ జేరి యాదవోత్తములు
రవిదేరఁ గొన్న సారసరాజి రీతి
ధవళాంశుఁగన్న యుత్పలముల రీతి
గంటిమె కృష్ణులోఁగలఁ కలువీడఁ
గంటిమనుచు వేడుకలఁ జిక్కు చుండి
రరసి తద్వాసనలవియ చెప్పెడిని                  (5830)
సారసాంగి నడుమాక సంబౌటనట్టు
లరుదు మించిన సొమ్ములవియ చెప్పెడిని
............................
కామిని పిరుఁదు చక్రంబౌట నట్టు
లాముద్దు వట్రువు లలియె చెప్పెడిని
అని కొని యాడంగ యాదవువ్విప్ర
జనమును గీర్వాణజనము గీర్తింప
రామతో జయరమారామతోఁ గూడి                     (5840)
రామానుజుఁడు నగరము ప్రవేశించి
తనదు మాతకును దాతకును బ్రాతకును
వినతుఁడై సభలోన విభుదులు గొల్వ
నన్న సంగడినుండి హరి యింతచేసె
నన్న సత్రజిత్తు నటకురప్పించి
యకలంకుఁడగు శౌరియందఱు వినఁగ
సకలంకుడైన యజ్జనపాలు ననియె
బంధుడై కొండంత బలఁగంబులోన
నిందించి తేటికి నిర్నిమిత్తముగ
హరినాదు రత్నంబు హరియించె ననుచు                (5850)
సరిచుట్టములకెల్లఁ జాటి చెప్పితివి
అడుగు మివ్విధము నీయర్మిలి యనుజు
నడుగు ముందరిచొప్పు లరయుమీవారిఁ
గారులాడెడువారు కారుమీవార
లూరకమమునాడ నుచితమే నీకు
ననిమాని కొమ్ముకొమ్మని మీఁదవైచెఁ
బెనగొన్న సిగ్గుతో బెగడొంది యతఁడు
యోగివంద్యుని నీతి యుడిఁగి మిధ్యాభి
యోగిఁ జేసిన పాపయుక్తుండ నేను
నీపాటియని పారమెన్నంగ రాని                   (5860)
యీపాప మిఁకఁ బాపనెవ్వరు గలరు
అని వంతచింతయు నంతంతఁ బొదల
తన యింటికేగి నెంతయు నూహసేసి
యరయ సర్వ ద్రోహినైన వాక్రుచ్చి
శరణన్నఁగాఁచు నబ్జదళాక్షుఁ డనుచు
నీలంపు రంగులో నికరంపు కప్పు
బాలేందులోపల పసపట్టునొసలు
వలరాజువిండ్ల జీవాళముల్బొమలు
కలువలలోని చొక్కములు నేత్రములు
మెఱుఁగు కెంపులలోని మిసిమి పల్వరుస                 (5870)
చిఱుత వెన్నెలలోని చిక్కని నవ్వు
పసిఁడి సంపంగిలో పలిత్రాణనాస
రసముల చిగురు సారసము కెమ్మోవి
శ్రీకారములలోని చెల్వును వీను
లాకంజసమితి మోహనము నెమ్మోము
ఒసపరిసంకున యుసురుకంఠంబు
పసిఁడి తీవలమేలు పట్టు బాహువులు
మేఁటి జక్కవలలో మీటుచన్దోయి
తేఁటి దాఁటులమీఁది తేటనూగారు
గగనంబులోపలఁ గలమేనునడుము                      (5880)
జిగిమీఱు పులినంబు చెలువంబు పిఱుఁదు
మించు రంభలలోని మెఱుపులు తొడలు
మంచి తామరల మర్మములు పాదములు
నని మెచ్చఁదగు నవయువములనొప్పు

(తరువాతి భాగము "తృతీయ పట్టమహిషీ శ్రీ సత్యభామాదేవీ వివాహవర్ణన) ప్రసంగము"

Tuesday, May 17, 2016

అష్టమహిషీకల్యాణము - 15


అనుచుఁ గర్ణాట దేశాగతానేక
ఘన వీరభటులు చెంగటఁ జేరికొలువ
ఆయిత్తమాఘ వందలిమున్నిబన్ని
ఆయుధం గొండు నియంగెవా యనుచు
వివిధ వాక్యములచే వేర్వేఱఁ బిలిచి
ద్రవిడ సద్భటులు చెంతలఁ జేరికొలువ
ఆసొ ఆడె ఆగె హరి జగన్నాధ
దాసు హేబలు ఖండదారురే యటంచు
నంతంతదాఁటి సాహసము చూపుచును
వింతగాఁ గాళింగ వీరులే తేర                      (5010)
వెండియు దేశాధివిభులు శ్రీవిభుని
దండిమైనిట్టు నుద్దండతఁ గొలువ
ఘనమదోత్కట కుంభి కట భూరిదాన
వనములు బహుళ జీవనములుగాఁగఁ
గ్రమ్మెడి తళుకుల కైదువుల్మార్గ
ణమ్ములు వివిధమీనమ్ములుగాఁగఁ
దమ్మి మార్తుని మార్పఁదగు శిరోవేష్ట
నమ్ములు చారు ఫేనమ్ములుగాఁగఁ
శైలోపమాన కుంజరపుంజ వాహ
జాలముల్నకాద్రి జాలముల్గాగ                      (5020)
రోష సాహస బలారూఢ వీరాళి
ఘోషంబుతరఁ గలఘోషంబుగాఁగ
సకల సన్నాహ భాస్వర శతాంగముల
నికరముల్విపులినా నికరముల్గాఁగ
గడుఁ బొడవగు తురంగములమై సుడులు
సుడులుగా బహువిధ స్ఫురణ చూపుచును
వాహినీపతివలె వాహినీ సమితి
వాహిని దశదిశల్ వడఁకనేతేర
వాహినీవిభుఁడు భూవరయొప్పు మిగిలి
యాతత చైద్య శౌర్యచ్చేదహేతు                    (5030)
కేతువుగతి తాక్ష్యన్ కేతులింపొంద
మాగధోత్పాత భూమహిత గర్జనము
బాగున రధ సముద్భట నాదమడర
హరి రుక్మితేజంబు నణఁగించుననెడు
సరవిబెన్థూళి కంజారాప్తుఁ బొదువఁ
బ్రతిలేని కడకమై బలములుఁ దాను
నతి ప్రమదముతోడ నరుగు నత్తఱిని
దమ్మునిమై కూర్మిఁ దమ్ము నిచ్చలును
గ్రమ్మి పోరఁగఁ జూచు కపట శాత్రవుల
రాకయుఁ దలపోసి రాకానిశాక                       (5040)
రాకార శోభితుండగు సీరపాణి
తాల హాలాంకితోత్తాల ధ్వజాంశు
జాల సంవృత దిశా సంఘమైనట్టి
తేరెక్కి సైన్య సందీప్తుఁడై వేగ
సారసాక్షుని గూడఁ జనుదెంచెనంత
కరమవేఁడుక భీష్మక రమావరుండు
పరిణయోత్సవ లీలఁ బడవాళ్లబనిచి
పురము సంకలితగోపురము శృంగార
కరమును శోభనాకరమునై యొప్పఁ
జేయించి పుత్రి విశేష దానములు                 (5050)
సేయించి భూసురాశీర్వాదమంద
దమఘోష సుతుఁడు దుర్దమఘోష వాద్య
సమధిక బలబంధు సహితిఁడై యపుడు
విక్రమాద్భుత మహావీరుండు దంత
వక్త్రుండు మగధభూవరుఁడు సాల్వుండు
మొదలైన రాజులిమ్ములగొల్వఁ జల్వ
మదటుమీఱఁగ వచ్చెనంత రుక్మియును
నెనసిన వేడ్కతో నెదురేగి కౌఁగి
టనుగ్రుచ్చి మిగుల వేడ్కల హెచ్చి చైద్యు
వివిధార్చనముల గావించి యాభూమి               (5060)
ధవునిఁ జైద్యుని విడిదలలందునునిచె
యంతనే కాంత కాంతాకిర్ణమగుచుఁ
జింతమై హరిరాకఁ జింతించి నొగులు
ఘనమైన వైదర్భి గర్భీకరించి
కొని తాపమెసఁగఁ జెక్కునఁ జేయి చేర్చి
యేమొకోరాఁడయ్యె నిందిరావిభుఁడు
భూమి ...................
అక్రూరుఁడట నాలుగైదు బాణముల
వక్త్రవర్తను దంతవక్త్రు గుఱ్ఱములఁ
దఱిగి కేతనము గోదంద సారథులు              (5070)
నఱికి రథంబెల్ల నజ్జు గావింప
నప్పుడు వాఁడొక్క యరదంబు కడకుఁ
గుప్పించి మఱియు మార్కొని పోరఁ దొడఁగె
ప్రతిలేకచనుదెంచు పౌండ్రకనామ
కృతవర్మవరుఁడైన కృతవర్మకినిసి
తరణి కాంటులు ధగద్ధగితంబులైన
శరములు నిగిడింప జడియకారాజు
నిప్పులు గ్రక్కిడి నిశితాంబకములు
కప్పినఁ గృతవర్మ కడఁకతోవాని
ఫాలభాగమున నంబకములు మూడు                (5080)
కీలించి లయకాల కీలియై వాని
శరముల ముంచి తచ్చరములఁ ద్రుంచి
తురగాళి నొంచి సూతుని విదారించి
విలుద్రుంచియంత నిర్విణ్ణుఁ గావించె
చలము ముప్పిరిగొన సాల్వుఁ డవ్వేళ
ననల సన్నిభుని సాత్యకిఁ దార్చి యార్చి
కనక పుంఖోజ్వల కాండముల్బఱపఁ
దోడనే యతఁ డొక్క తోఁపునవాని
జోడును ధనువును చూర్ణంబు జేసి
మూఁడు తూఁపులు ఫాలమునఁ గీలుకొలుపఁ            (5090)
వేడి యాతనికంటె వీరుచందమున
వీరరసావేశ వివశుఁడై వాఁడు
క్రూరత నాలుకల్గోయు బాణంబు
తమ్మి పొక్కిలివాణి తమ్ముపైఁజొనుప
నమహాశరమునా గారిబాణమునఁ
దెగటార్చి యార్చి సందీప్త బాణంబు
తెగనిండవింట సంధించి యాపగతు
చను మ్రోలనాటింప జడిసి యారాజు
చనియె నాహవ రసాస్థలినుండి వెఱచి
అపుఁడు జరాసంధుఁ డంగభూవిభుఁడు             (5100)
కుపితుఁడై సేనడీకొలుప బలుండు
తడయకుత్తుంగ మాతంగంబు నెక్కి
వడిఁ బోరు కాళింగ వసుధాతలెసు
గణుతికెక్కిన హలాగ్రంబు చేనవుడు
రణముతో గూల్చె వారణముతోఁ గూఁడ
నాని విదూరధుఁ డాదంతవక్త్రు .....
నేను తూఁపుల బలహీనుఁ గావించె
రణచిత్రకుండు చిత్రకుఁడు సత్యకుఁడు
మణిపుంఖ శరదంబకముల చేగ్రుచ్చి
వంగాధిపతి రథ వాహినీతతుల                 (5110)
బంగంబు నొందింప బలుఁడేగుదెంచి
బలువిలు గొని వంగపతి కేలి పసిఁడి
విలు ద్రుంచి విరధుఁ గావించి తద్బలము
చెండాడి పసిఁడి పింజయ తూఁపుఁ దొడిఁగి
చెండాడినట్లు తచ్చిరముత్తరించి
కౌశలంబేర్పడఁ గాహలాగ్రమునఁ
గాశికాధిపులఁ బెక్కెండ్రనుక్కడఁచి
ధీరోషశీలులుఁ దెగియరవదఱ
గారువర్ణాదుల ఖండించి వైచి
వరవంకపక్ష సంవళితంబులైన               (5120)
శరముల సింహక శతముఁ గీటణఁచి
కల్పాంత భైరవాకారుఁడై పేర్చి
యల్పమానసు మగధాధీశుఁ బొదువ
నలిగి యమ్మగధుండు హలపాణిఁ గదిసి
బలముఁ జూపుచు మూఁడు భల్లముల్జొనుప
బలదేవుఁడామూఁడు బాణముల్దునిమి
యలఘ చిత్రముగ బాణాష్టాకం జేసి
యలిగి సూతుని విల్లు నరదంబు సిడము
తిల సమానములుగాఁ దెగటార్చి యార్చి
యెదగదగొని వ్రేయనిల వ్రాలితేలి                   (5130)
వదజెందినవా డాహవక్షోణి వీర
వీరంబు విరదంబు విబుఁడు నచ్చిభుఁడు
...........................
హరిహరియరదంబు నరదంబు చలము
విడువకపోరద్రీ విక్రమాగ్రజుఁడు
కడురెసి వైరిచక్రంబు పై నుఱికి
పటుతర కరిఘటాభట నిటులములు
చటులాశుగములచేఁ జక్కుసేయుచును
రంగదుత్తుంగ తరంగ సంఘముల
న్రుంగుడు సేయుచు భూపాలవరుల                     (5140)
శిరములు వక్షముల్చెక్కులుఁ దొడలు
కరవాల శరచక్ర గదలఁ జిత్రముగఁ
దరిగి నాటించి విదారించికాఁటి
యఱి ముఱి దశదిశలందు నింపుచును
స్ఫుట హలంబును బలంబును జలంబలరఁ
జటుల మౌసలపుఁ గౌశలము చూపుచును
బ్రథన సంభృత విజృంభణ భీషణాంక
రథుల రథాళి సారథులఁ జెండుచును
భట కదంబము కదంబములు కంబువులు
తొటతొట ధరరాలం దునియ నేయుచును                 (5150)
రణభూతసమితి పారణలు సేయించి
గణుతింపరాని విక్రమ శక్తి మెఱసి
మార్గణములు మూఁత మాగధుండారు
నిర్గణముల నణఁగించి పెల్లార్చి
పాశంబు చేఁబట్టి పౌండ్రకనాముఁ
గీశంబు కైవడిఁ గిచకొట్ట జేసి
గ్రావంబు గతివచ్చు ఘనునంగనాధు
గ్రీవంబు ద్రెంచి తక్కిన రాజవరుల
వేమరునహి రెండువేల నాలుకల
పాము గీమునకేఁగఁ బటఘూట సేయుఁ              (5160)
దిరిగె శాలుఁడు యోగఁ దిరిగెను మగధు
డరిగెఁ గోసలుఁడు పౌండ్రాధీశుఁ డేగె
విఱిగె సంవీరుండు వీగెఁ ద్రిగర్త
జఱిగె గ్రాధుండునుజని యెగుహుండు
నగధరాగ్రజుని బాణములకు జడిసి
పగతురీతి నేర్పడ లజ్జదించి
యచ్చుగామును మున్నె యాకుండినంబు
జొచ్చినవాఁడెపో శూరుఁ డటంచు
పురుడుల తముపారి పోవు చందమున
బరువిడి కుండిన ప్రాంతంబు చేరి                   (5170)
చెదరవైచినయొడి నెలవాటులకును
బెదరి వచ్చినయట్టి పెడచలకరణిఁ
గుత్తుకల్దడుపుచు గుములుగాఁ గూడి
రాకయా శాశపురంబులోఁ జింతఁ
జీకాకు పడియున్న శిశుపాలుఁ జేరి
మేలు నీవును రాక మేలు చేసితివి
పాలు గల్గిన బలభద్రుండు కొంత
చాయవాటుగఁ జేయఁ జరిగి వచ్చితిమి
పోయిన చేకావె భువిని భ్రాణములు                   (5180)
ఆలేమ పట్టు దయ్యమెఱుంగుఁ గాని
చాలు మాదెస జన్మజన్మంబులకును
జెలఁగి యేనుఁగుచేతి చెఱకుఁ గైకొనఁగ
నలవియే యెవ్వరికైన నాకరణి
నాదానవారికి నగపడినట్టి
వైదర్భిఁ గైకొన వశమె యివ్వేళ
యుద్ధంబని నెడుమాట యుడిఁగి మామంచి
బుద్ధి చేకొని నీదు పురమునకరుగు
దీమ సంభేది చింత్తింపంగఁ దలఁప
నేమి సేయంగ వచ్చునిది దైవకృతము             (5190)
పోయెదమనిచెప్పి భూపాలురెల్లఁ
బోయిరి తమ పురంబులకు నవ్వేళ
యాదవాధీశు సాహసమెల్లఁ దెలిసి
చేఁదీసి కొనిపోయెఁ జేదీశుఁ డంత
కనలి రుక్మియు దురాగ్రహ వృత్తిఁబొదలి
కనుఁగవ విస్ఫులింగము లుత్పతిలఁ గఁ
బసులకాఁ పరినని పరికింపకెట్లు
కుసుమ కోమలినెట్టుకొని పోయె వీఁడు
చుట్టంబుగతి వచ్చి సూడుబంటయ్యె
................................                (5200)
దొరతనం బెఱుఁగక తుదిఁ బాఱి పోయె
దొరకూళాయైన చేతులఁ బట్టరాదు
తనమాయఁ గడుఁబిన్న తనమయ్యెననఁగ
ననిలోన గెల్చి సాహస వృత్తిమగుడ
వైదర్భిఁ దెచ్చిన వత్తునిచ్చటికిఁ
గాదేని నాపెకు గ్రతఁ బ్రాణమిత్తు
నని తండ్రితోఁ బల్కి యాహవోదగ్ర
ఘన రథారూఢుఁడై క్రథకైశికాది
జననాధులును సర్వసైన్యంబు గొలువ
నెనలేని కినుకమై నేతేరబలము                (5210)
దుర్మద రంహౌఘ దూరమౌనింద్ర
నర్మదయైనట్టి నర్మదచెంత
మునుమున్న యరిగెడి మురదైత్యమర్దిఁ
గను@ గొనిపోకు మెక్కడ పోయదనుచు
గణములుగాఁగ మార్గణములు పఱుప
ఫణివైరి కేతుండు బలువిడి విఱిఁగి
కోపించి శార్ఙ్గఁబుగొని పారపాటు
తూపులనాని దుత్తుమురులుగాఁ చేసి
మును శిరంబులును రంబులు కరంబులును
పెనునరంబులు విజృంభించి మోదుచును             (5220)
దొనల సూతులను గేతులను రౌతులను
ఘనహేతులను బిండిగాఁ గఁజదుపుచును
మొగిఁ జర్మములు వర్మములు మర్మములు
దెగి ధర్మములతోడఁ ద్రెళ్లఁ గొట్టుచును
సురలెల్లఁ బొగడన సురలెల్ల బెగడ
ధరణీశ శౌరి యుద్ధము సేయునపుడు
వ్రాలు గాత్రములు పత్రములు ఛత్రములుఁ
గూలునక్కులును ముక్కులును జెక్కులును
గ్రుంగు నూరులును శూరులును నారులును
న్రుంగు మూఁపులును గోపులును దూపులును                 (5230)
నయ్యుండు శౌరి నాహవ చిత్రకేళి
నయ్యెడ్శఁ జరుపుచో నరిగి యారుక్మి
వెన్నతోఁ బెట్టెనో వివరింపననుచు
...........................
విలినారిదీడివే వేగంబోవాఁడి
బలునార సంబులఁ బద్మాక్షుఁ బొదవ
నరుణ పత్రోజ్జ్వలాయత మార్గణముల
మురవైరి వాని నిర్మూలంబు సేసి
విలుద్రుంచి రెండవ విలుద్రుంచి మరియు
విలుగొని నిలువ గోవిందుండు వాని                    (5240)
సూతుని ధనువు కంచుకము గుఱ్ఱములఁ
గేతువున రథంబు గెడప నారుక్మి
హరిమీఁద నడిదంబు హరిగేయపూని
సరభస గతి వచ్చు సమయంబునందు
పలుకయుడాలు నంబకముల మూఁట
.......................
శైలోపమాన కుంజరపుంజ వాహ
జాలంబు నక్రాది జలములుల్గాఁగ
నలినలి గావించినలు దైత్యమఱియు
యాశార్ఙ న్ వెనకకేల నమరించి కేలఁ                (5250)
బాశంబు గతినొప్పు పాశంబు పూని
.........................
మల్లరి పెద్దు ద్రిమ్మరి తనముడుగ
వల్లెవైచిన క్రియవడి వాని బట్టి
తగఁ దొట్టి యురమెల్లఁ దటదటనదర
మొగము మీఁదకి నెత్తి మూల్గుచునలయఁ
బుడమిపై మకుటంబు బుడిబుడి దొర్ల
విడిముడి వెన్నుపై సికవిడిజాఱఁ
దదబాటుతోడ దంతములిలకఱవఁ
బెడమలరఁగఁ బట్టి బిగియించి కట్టి ......         (5260)
ధళధళమనుడాలు ధరియించి వాని
తలవ్రేయఁ బూన వైదర్భియత్తఱిని
నన్నచందముఁ గృష్ణుఁ డడిదంబుకేలఁ
గొన్నచందముఁ గనుఁగొని యాత్మలోనఁ
గనికరింపుచుఁ గరకమలముల్మోడ్చి
పెనగొన్న సిగ్గును బ్రియము రెట్టింపఁ
ముంగురు లల్లాడ మోమింతయెత్తి
తొంగలి ఱెప్పల తుదఁబాఱఁ జూచి
చనుదోయిడాయు వాసననించు కదిమి                  (5270)
నునుపు కస్తురి పూఁత నూఁగుగారాలఁ
గుచ్ఛులు మెఱయంగఁ గొనకొన్న సరులు
తచ్చరలాడ బిత్తరముట్టి పడఁగ
బాలేందు రేఖకుఁ బ్రతివచ్చునట్టి
ఫాలేందురేఖ శ్రీపాదంబు నొఱయ
జొట జొట తేనియ ల్సొనగాఁగ గుఱియఁ
గుటిల కుంతలవల్కె గోవిందుతోద
ప్రాణేశ నామాట పాటించి వీని
ప్రాణముల్గొనకింకఁ బాలింపుమనిన
గదమున నాబాల కరమర్థిఁ గ్రుచ్చి             (5280)
యురమున నునుగుబ్బ లొఱయంగఁ జేర్చి
యగపడిజిగి హళాహళిగాఁగ బిగిసి
తగడు గొన్నట్టి రత్నపుఠేవనలరి
తోయజేక్షణ మాట తోయజాక్షుండు
త్రోయఁ జాలక రుక్మి దుష్టమానసుని
తల నాల్గు దెసలకుఁ దనప్రతాపంబు
వెలయంగఁ జూచిన విధము దీపింపఁ
బలుచని నిడువాలు పదను తూపునను
గొలచిన రీతి డొంగులువాఱ గొఱిఁగి
పాలుమాలిచి లజ్జబండని జేసి                    (5290)
గేలిఁ బెట్టుచుఁ గేరిగేరి నవ్వుచును
బలభద్రుఁడప్పుడు పగర నిర్జించి
దళములుఁ దానును దనుజారిఁ జేరి
వనజాక్ష విడువిడు వలదిది రుక్మి
మన సరియనుఁ గాడు మనసరిగాఁడు
అనుచుఁ గిత్లూడ్చి పొమ్మనికన్నుఁ గీట
తనవారి మొగమెట్లు తాఁజాతుననుచు
సిగ్గుతో నరిగె వచ్చిన త్రోవఁ బట్టి
యగ్గలంబగువేడ్క హరియుఁ గృష్ణుండు
బేలమై పడియున్న వీర నృపాల                   (5300)
జాలంబు మహనీయ సాలంబు మిగుల
దట్టంబులైన నభోంతరమున నాఁడు
నట్టలతెట్టుప లట్టూల కలముల
నరదముల్మేడల నరదముల్పఱచు
........................
తేరులు వీరులుఁ దెగిరాలియున్న
......................
రత్నముల్విపణి మార్గముల నమ్ము
రత్నముల్ రత్నాకరములు దీర్ఘికలు
శాకినీ ఢాకినీ చయములుదార                    (5310)
లోకంబుగాఁగ నాలోకించి చూడ
వర వీరలక్ష్మీ నివాస పట్టనము
సరవినొప్పెడు రణస్థలి వేగవెడలి
బృందారకులు పుష్పబృందముల్గుఱియ
వందిమాగధులు కైవారముల్సేయ
నానంద సుతరాము లానందమంది......
భూనాధు లిరుమేలఁ బొగడుచుఁ గొలువ
ద్వారకకేతెంచి తత్సమీపమున
భోరన విజయకంబువులు పూరింప
ధరనాదమప్పుడందఱు నాలకించి               (5320)
పురజనుల్యదువృష్టి భోజవంశజులు
కెదురేగి కానుకలిచ్చి మ్రొక్కినను
బొదలి తాలాంకుఁ దంభోజసంభవుఁడు
పురము చొత్తెంచి తత్పురవీధినరుగఁ
బురసతుల్ రుక్మిణి భువనైకమాతఁ
గనుఁ గొని యంతరంగముల నంగముల
ఘనమదంబును బులకలునాఱుకొనఁగ
మగవారి వలపించు మగువలు కలరు
మగువల వలపించు మగువలుఁ గలరె
గగనమో భృంగసంగమో కలాపంబొ                (5330)
మొగమొ యీ లలితాంగిమురులైన తురుము
కులగిరులో దీని గుబ్బపాలిండ్లొ .........
హరిమధ్యమొ సందియమొ బట్తబయలొ
పరమాణివొ దీని పసనిగ్గు నడుము ......
అనఁటులో యుగములో హస్తిహస్తములో
ఘనశరభములో యీకాంత యూరువులు
తలిరులో తమ్ములో ..........
................ మొఱయకయుండు
పడఁతుక బొమదోయి భావంబు జూడఁ
బొడిఁ బడకెట్లుండుఁ బూవుల విళ్లు             (5340)
కలకంఠి నిడుసోగ కన్నుల చూచి
తలవంప కెట్లుండు ధవళాంబుజములు
............. వఱపులు చూచు
వనరక యెట్లుండూ వరకీర సమితి
యల్లలనామణి యధరంబు చూచి
కుల్లుకో కెట్లుండు గురుబింబఫలము
జలజాక్షి నెమ్మోము సైకంబు జూచి
వెలవెలబోకెట్లుఁ విధుబింబముండు
ముద్దియ చన్నులు మురిపెంబు చూచి
గ్రుద్దుకో కెట్లుండుఁ గోడెజక్కవలు               (5350)
దిట్త గుబ్బెతయారు త్ర్ఱుఁగెల్లఁ జూచి
నిట్టుర్పు విడకెట్లు నిలుచుఁ గాలాహి
కన్నియనడుముఁదాఁ గన్నారఁ జూచి
చిన్నపో కెట్లుండు సింగంబు నడుము
మగువ యూరులమీఁది మహిములు చూచి
గిగఁగాఱ కెట్లుండు ధృతిఁ గదళికలు
తలిరాకుబోఁడి పాదంబులఁ జూచి
..............................
అని రాజవరులెల్ల నచ్చెరువంది
కొనియాడ రుక్మిణీ కువలయనేత్రి                 (5360)
ఫాలబాలేందుని పైఁ జిత్తరించు
రోలంబ గురుదాళి రుచిరాలకములు
..........................
సమకొని కెంగేలఁ జక్క నెత్తుచును
జిఱుతేఁటి ఱెక్కలే జిగిదువాడించు
మెఱుఁ గారునూనూఁగు మీసలవాని
గ్రమ్మి వీనులతోడఁ గదియచువాని
పంచాస్త్రుకోటికిఁ బంచాస్త్రుఁ డగుచుఁ
బంచాయుధములఁ జొప్పడియున్నవాని
బొగడొందు నుల్లాసమునఁ దేఱు పసిఁడి           (5370)
తగడుచాయ .............
............ ళగించు దర్పణాననము
గలవాని దనపాలి గలవాని గాంచి
తొలుకాఱు వెఱుపుతోఁ దులదూగు చూపు
జలదవర్ణునిమీఁదఁ జక్కగా నిలిపె
సరసిజాక్షుండు నాసఖిని వీక్షించి
............ రనటకుఁబోనిచ్చి
సురలెల్ల నరుదంద సురుచిర గతుల
గరుడుండుమును సుధాకలశము గొనిన
కరణి రాజులు చూడఁగాఁ బ్రతాపించి              (5380)
కరమర్థి రుక్మిణి కావ్యలలామ
........... రథము
వైలీలనిడుకొని బలసహోదరుఁడు
పిలువక వచ్చిన పేరంతమునకుఁ ....
బొలయక చెప్పక పోవుటేలెస్స
ననుచందములనేగ నపుడు డెందముల
......................
తప్పెఁగార్యంబు వైదర్భిఁ గైకొనియె
నిప్పుడే హరిఁ బోవ నీనెట్లు వచ్చు
రాజుల వరవీర రాజుల దార్చి                    (5390)
భోజసంభవఁ గొనిపోయె నివ్వేళ
నెవ్విధముననైన నీపశుపాల
........................
తమ సాహసంబులుఁ దమ బాహుబలము
తమ విక్రమములు నిత్తఱిమంటనిడక
తెచ్చుట వైదర్భిందెగి శౌరిచేతఁ
జచ్చుటగాక ..................
.........ముల్ సైన్యములతోఁ గూడ
గనలుచులయ కాలుకాలుఁడై కడఁకఁ
గనుపట్టి సాల్వ మాగధ ముఖ్యులెల్ల              (5400)
వనజాక్షు వెనువెంట వడినంతఁ బాఱి
..........................
బలువుడీ శరపరంపరలపైఁ బఱుప
దవిలి నీరతృణతతిమీఁద నిగుడూ
దవము చందమున యాదవసేన విఱిగి
ధనువులు నిక్కించి దఱిగొన్న వేడ్క
............... తతులఁ జొక్కించి
కయ్యంబు గావింపఁ గంససంహారి ...
నెయ్యంబుతో రుక్మిణీదేవిఁ జూచి
పగర నీక్షణములో పలఁగూల్చి దివ్య                   (5410)
నగర నాయకులన .............
.....ప్రలాంబాంతకు నక్రూరముఖుల
నని సేయ సమకట్టి యటు చూచుచుండె
బలభద్రుఁ డప్పుడు బలభద్ర చైద్య
బలభద్రుఁడై యదుప్రవరులతోడఁగు
గురు .............. మున
నురగాళిఁ గన్న తాక్ష్యని విధంబునను
నభ్రాళిఁ దోలు జంఝూనిలు పగిది
నభంబు దిక్కులునవియఁ బెల్లార్చి
చలము రెట్టింప నిచ్చలమును హలము                     (5420)
బలమున ముసలము .....
అనుపమ సకలాయుధాన్వితంబైన
కనక శతాంగంబు గడువేగఁ బఱప
బలిమి మాగధు నెదుర్పడి పోకవానిఁ
బలుఁ దూపులఱువదిఁ బఱపి స్రుక్కించె
.......................
కృష్ణుండు పెండ్లి పందిటి క్రిందనిలువఁ
బసు పుటంబులు వలిపెము గట్టిమిగులఁ
బసగల గిరుతు గుబ్బలనానవైచి
చిఱుఁగురలొసపరి చెలువుగా దువ్వి              (5430)
నెఱిఁగప్పు గలగొప్ప నెఱిగొప్పు దురిమి
కుఱువేరు విరిదండ కూడంగఁ బెనఁచి
తుఱుమున కొకయమ్మె దొరయ గీలించి
కన్నులంచులఁ దేటగాఁజెన్ను మిగుల
సన్నంబుగాఁగఁ గజ్జలరేఖఁ దీర్చి
నెలవంకకొకవంక నెఱసులు వెదకు
చెలువంపు నొసల బాసికము గీలించి
త్రిబువన తిలకినీ తిలకమైనట్టి
యిభయాన రుక్మిణి హేమాంగిఁ జెలులు
కడువేడ్కతోఁ దేరఁగా సంభ్రమమునఁ            (5440)
దడయక రేవతీధవుఁడు నుద్ధవుఁడు
తెరవట్టి రంత శ్రీదేవుండుతలఁప
సురనదీముఖ నదీశోభితుఁడగుచు
నెలమి రత్నాకరుండేతెంచి రత్న
కలశోదకము ధారగాఱంగ నొసఁగ
జలజాక్షు పాదమజ్జనము గావించి
బలు తమ్మునకు మధుపర్క మర్పించి
జిగితమ్మికవవ్రాలు సితపక్ష యుగము
పగిది బంగారు మెట్టు బాలపుష్టికల
జకదవర్ణుండు నాజలదవేణియును                    (5450)
నిలిచి శోభిల్లి పూనిన వేడ్కనంత
వాణి యింద్రాణి శర్వాణి శీతాంశు
రాణియు సకలగీర్వాణ కన్యకలు
గవగూడి సంగీత గరిమ దీపింప
ధవలాక్షుమీదటి ధవళంబు పాడఁ
జతురతమై మహాసంకల్ప మతఁడు
హితవృత్తి నిజపురోహితుఁడు నర్చింపఁ
దలకొని మునులు మంత్రములుచ్చరింపఁ
గలశాబ్ది కలశాబ్ది కన్యకా మూర్తి
రమణయై దానధారా పూర్వకముగఁ                (5460)
కమలాక్షునకు నిచ్చె గర్గ్యుఁ డవ్వేళ
నాయితంబుగ గడియారంబు జూచి
యాయత్త మనగురుఁ డామయత్తమనిన
బహువేదవిధుల శ్రీపతి రమాదేవి
మహియని గుర్వంతు మంగళంబనుచు
ఖంగునవైచేఁ జేగంట నాదంట
నంగజ గురుఁడును నఖిలైమమాత
యిరువులొండొరు మోము లీక్షింపఁ జూపు
లరవిందముల వ్రాలునలులెన నమర
మొలఁతుక తబచేయి మీదుగాకనొసఁగె         (5470)
జలజాక్షుఁ దంతట సగుడజీరకము
సీమంతినీమణి సీమంత సీమ
దామోదరుఁడు శుభద్రవ్యంబునించె
గురుతర సమవృష్టి కుఱిస్వ్ నవ్వేళ
సరసాత్మలై వియచ్చరలు నచ్చరలు
పాడిరాడిరి నభోభాగంబునందుఁ
దోడనే పొడమె దుందుభి నినాదంబు
నగవు వెన్నెలలు చిందఁగఁ బట్టినట్లు
జిగి ముత్తియములు మచ్చికదోయిలించి
భాసిల్లఁ గృష్ణుండు పద్మాయతాక్షి            (5480)
సేన కొప్పున నొప్ప సేనఁ బ్రాలిడిన
తెలిమించు చుక్కల తెలిఁగాని పించి
చెలువున గొప్పమై సేసఁబ్రాలమరఁ
గౌనసి యాడఁ జన్గవముద్దు గునియ
నానఱెప్పలవాన నలినాయతాక్షి
ఘనకల్పలతల చొక్కపు విరుల్దాల్చి
యనువునఁ దలఁబ్రాలు హరిమీఁద నుంచె
బలరాము తమ్ముఁడా పరమకల్యాణి
గళమునఁ జేర్చె మంగళసూత్ర మపుడు
వైదర్భి కృష్ణ సౌవర్ణ కల్యాణ                   (5490)
వేదిపై వేదాంతవేది గర్గ్యుండు
భాసిల్ల మణిమయ భద్రపీఠమున
నాసీనులుగఁ జేసి నాగమోక్తమున
మేలిమి మును లెల్ల మెచ్చఁ దాలిమిని
వ్రేలిమి మొదలైన విధులఁ గర్మములు
సేయించి బహువిధాశీర్వాద మెలమిఁ
జేయించి మణిదీప చిత్రపాత్రికల
నీరాజనము లవనీరాజకాంత
లారాజవదనకు నంబుజాక్షునకు
నొసఁగ నక్షతముల నుర్వీసురేంద్రు                (5500)
లొసఁగ డెందముల నుత్సాహ మెసఁగ
హరుఁడు వాణీమనోహరుఁడు దిగ్భూమి
వరులు కిన్నరులు భూవరులు కట్నములు
సవరింప శౌరియాసరవిఁ గల్యాణ
మవధరించెను జగంబానందమందఁ
గమలజాదులకును గర్గ్య ముఖ్యులకు
నమలలోచనుఁ డుడుగరలఁ బాలించి
పార్థివేశ్వరుల సంభావించి పొగడ
నర్థిబృందముల కిష్టార్థంబు లిచ్చి
ఘనతర బంధువర్గములకు వివిధ            (5510)
కనకాంబరాది వర్గముచేఁద నిలిపి
జలరాశి కన్యకా సహితుఁడై యపుడు
జలరాశి మధ్యవాస మొనర్చుకరణి
నీలవర్ణుఁడు రుక్మిణీదేవిఁ గూడి
చాల నొప్పుచు మౌని జాలమెన్నఁగను
జనులను సౌఖ్యముల్సమకూరఁ జెసి
జననాథ యాభీష్మ జననాథ తనయ
నెనసి రమానాథుఁ డిష్టభోగముల
మొనసి యెంతయును బ్రమోదించుచుండె
వనజాస్త్రుఁ డపుడు జీవనజాక్షుఁడైన         (5520)
తనుగన్నతండ్రి యాదవ నాధుఁడైన
నతనికిఁ దనుజుండ నగుదునేననుచు
మతినెన్ని శౌరిసమ్మతి సంతసించి
రమణ వైదేహిగర్భము బ్రవేశింపఁ
గ్రమమున రుక్మిణీ కామినీమణికి
నవరసి యపరంజి నలరుమై దీగ
నవచంద్ర రేఖ చందమునఁ జూపట్టె
ధవళాక్షుఁ డధరామృతముఁ గ్రోలుకతనఁ
జవిగొన నలినంబు చౌకమైతోఁచె
నతనుని విలునారి యమలమధ్యమునఁ                (5530)
బ్రతిబింబమొనరిన పగిదినారమరెఁ
గంతు యాత్రిక చిప్పకవమీఁద నిలిచి
బంతులోయనఁ గప్పు బలనెఁ జన్మొనలు
వలరాజు మణిమయా వరణంబు ఠేవ
దళుకొత్తునుదర వంధము బిగువయ్యె
నెలలు తొమ్మిదియును నిండెనిండుటయు
సలలిత గ్రహము లుత్తమములందుండ
నారుక్మిణీకాంత యతుల లగ్నమున
మారు నీరజ సుకుమారు కుమారుఁ
గాంచెఁ గాంచుటయును గాంచనాంబరుఁడు                (5540)
నించిన వేడ్కతో హేమాదికముల
నుర్వీసురేంద్రుల కొసఁగి విధ్యుక్త
సర్వ శుభక్రియల్సవరించి మించి
కవులును వీరపుంగవులును భూమి
ధవులును సకలయాదవులును గొలువ
ధారణి సజ్జనాధారకయైన
ద్వారకనుండె నంతయువేడ్కతోడ
నని యోగిజనపాలుఁ డాజనపాలుఁ
డను మోదమంద యిట్లని యానతిచ్చె
నని సుధావాణికి నబ్జపాణికిని               (5550)
వనజాస్త్రు మాతకు వనధిజాతకును
ననుఁగన్నతల్లి కనమ్రభల్లికిని
గనకగాత్రికిని సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుహాసకును
సారలావణ్యకు సకలగణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమ ధామకును             (5560)
హైమసంవ్యావకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానతకుఁ బన్నగతల్పయుతకు
మృగమదాంగకు నలమేలుమంగకును
నంకింతంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశూంభ
దనుపమ శ్రీవేంకటాధీశ దత్త
మకరకుండలయుగ్మ మండితకర్ణ                    (5570)
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాధ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధా మస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్ట మహిషీ వివాహ
మనుకావ్యమునఁ జతుర్థశ్వాసమయ్యె

చతుర్థాశ్వాసము సమాప్తం
(తరువాయి భాగం
రెండవ పట్టమహిషి "జాంబవతీ కల్యాణము")

Wednesday, May 11, 2016

అష్టమహిషీకల్యాణము - 14

చతుర్థాశ్వాసము
(శ్రీదేవీ మహిమ వర్ణన)
(ద్విపద)

భూమిసపత్ని యంబోరుహాక్షు పత్ని
కాముని తల్లి చక్కని కల్పవల్లి
కలకంఠవాణి సకతనిభశ్రోణి
యలఘు గుణోత్తుంగ యలమేలుమంగ
యవధరింపుము దేవి యమ్మహామౌని
కువలయేశుఁడు వల్కె గువలయేశ్వరుని
వసుదేవ దేవకల్ వసుదేవముఖ్యు
లసమానగతిఁ బొల్చు నాత్మజాతులకు          (4480)
రామ కృష్ణుల కభిరామ మూర్తులకుఁ
బ్రేమఁ బెండ్లిండ్లొనరింపఁ దలంప

(శ్రీమలరామ రేవతీ పరిణయ వర్ణనము)

వసుమతి నిక్ష్వాకు వంశసంభవుఁడు
వసుధేశ్వరుండు రైవత నామకుండు
నెలను వెన్నెలను బన్నేలను గేలించు
లలితాక్షి గళారోమలత లబ్ధపూగ
ముల పూగముల పూగముల నవ్వుచుండుఁ
కలిత వళుల్నాభి కౌనుతరంగ
ముల తుంగముల సింగములనణకింప
మిక్కిలి చెలువొందు మీనాయతాక్షి             (4490)
చక్కని గుమ్మ వాసనపువురెమ్మ
సతత శోభనవతిఁ జతుర శృంగార
వతియన నొప్పు రేవతియను కన్య
బ్రహ్మపన్పునఁ బరబ్రహ్మాగ్రజునకు
బ్రహ్మోగ్నులలర శోభనవేళనొసఁగె
నీలాంబరుండు నానీలాభ్రవేణి
కైలీలఁబట్టె నాగమ ధర్మసరణి
వరవైభవముల వివాహమై దేవ
వరముఖ్యులెన్న నద్ద్వారకయందు
రేవతీందులఁ బోలె రేవతి సతియు           (4500)
రేవతీవిభుడుఁ గూరిమిఁ బెచ్చు పెరుగు
నిలయెల్ల జయలిడ నిష్టాభోగముల
సలుపుచుండిరి మహోత్సాహంబులెసఁగ
అంత విదర్భదేశావని విభుఁడు
సంతత జయశాలి సద్ధర్మశీలి
జలధిగంభీరుండు శత్రుసంహారుఁ
డల్ఘు గుణోద్దారుఁడగు భీష్మకుండు
రుక్మమయాద్రిధీరులను మువ్వురను
రుక్మి యాదిగఁ గుమారులఁ గాంచెనంత
నరవిందవాసిని హరిరాముఁడైన              (4210)

1. ప్రథమపట్టమహిషీ

శ్రీరుక్మిణీదేవి వివాహ వర్ణన ప్రసంగము

ధరణిజ యను పేర ధరణి జన్మించి
యారాముఁడీ రామునను జన్ముఁడైన
నారామ రుక్మిణి యను పేరఁ బరఁగి
జనకసమాన భీష్మక మహీపతికిఁ
దనుభవాభావంబు దాల్చిననాఁట
నిండు గాలాముల నిజపోషణముల
రెండవ తరుణేందు రేఖయో యనఁగ
నొకనాఁటఁ బెరుగుట యొకపూటఁ బెరిఁగి
............................
బాలయై యలకాప్తఁఫాలయై బద్ధ                (4520)
చేలయై శుభగుణ శీలయై పొదలి
బాలయయ్యునుగుణ ప్రబలతఁబ్రోడ
బోలి యౌవ్వనకళాస్ఫూర్తిఁ బెంపారి
యాకంజుబాణు మోహన పుష్పశాఖ
లాకయో హేమశలాకయో యనఁగఁ
బసిడి జక్కవ కవబటువు పాలిండ్ల
మిసమిసఁ బయ్యెద మీఁదఁగ్రేళ్ళుఱుకఁ
గొసరి సిగ్గులఁబెన గొని బిత్తరించు
నొసరరిచూపుతో నొయ్యారమొలుకఁ
బరమ లావణ్యాబ్ధిఁ బ్రభవించు సుడియుఁ          (4530)
దరఁగలు నానాభిఁ దరలుఁ జూపట్ట
భ్రాజిత మధ్య భూభాగ శృంగార
బీజాంకురాళి దీప్తినినారుమునుప
రుక్మ భూషణవతి రుయ్క్మ వర్ణాంగి
రుక్మి సహోదరి రుక్మిణీదేవి
యారూఢ యవ్వనయై సంచరించు
సారసాస్త్రుని మంత్రశక్తియో యనఁగఁ
బ్రతిలేని యారమాపతి పతికాఁగఁ
గుతుకంబుతో నాత్మఁ గోరినిచ్చలును
గురుభక్తితో మరుగురుఁ గూర్చి యాత్మ              (4540)
గురుతర వ్రతము గైకొని సేయుచుండె
ద్వారకాపురినుండి వచ్చినవారి
వారిజోదరునెన్ను వారినల్గడల
నారసివారితో హరిచందమెఱిఁగి
వారిజాననలైన వారిరప్పించి
యొకనేర్పుమైఁ బ్రసంగోచితంబుగను
సకల యాదవులనచ్చటి మహీధవుల
బలభద్ర కృష్ణుల బలభద్రరూప
ముల విని పుష్పకార్ముకు తండ్రిఁ దలఁచి
యతని సద్గుణకీర్తులనెడి చంద్రికల                  (4550)
శ్రుతి చకోరములచే జూరలాడుచును
బరులకునసమీక పంకజోదరుని
నిరుపమ లావణ్యనిధి మూర్తిఁ దలఁచి
యతిదూరముననుండి హరిఁ గూడియుండు
గతినుండె ధ్యానసంగతి నంతమఱియు
మఱియు నానాఁట నమ్మానినీమణికి
నెఱిజవ్వనంపుమున్నీరు పొంగారఁ
దలిదండ్రులికఁ గాంతతలఁ పొండుతలఁపఁ
దలకూడ వబ్జాక్షుఁ దగిలెనా తలఁపు
యతఁడె నేనోయంచునతనినే కోరి                       (4560)
యతనిఢకకు నోడి యతివయుండఁగను
బూరుష పరమనంబునకు మనంబె
తారకాణ నెడు చందమునఁ గృష్ణునకు
వైదర్భి నింతగా వరియించు తలఁపు
మోదంబు ననురాగమునఁ దేలువాఱఁ
గనుకలికన్ననంగనలకుఁ బ్రేమ
విను కలిచే నెచ్చు విధమునఁ జేసె
కమలాస్త్రజనక సంగత చిత్తయగుచుఁ
గమలాస్త్ర కమలాస్త్ర కంపితయగుచుఁ
గొనకొన్న కోర్కె సిగ్గునఁ గప్పిమేను            (4570)
ఘనతాపమేమిటఁ గప్పంగలేక
చిలుకలలోనిరాఁ జిలుక చందమునఁ
జెలులతోఁగూడిలోఁ జిగురించుకూర్మి
మానంబు పెనఁగ భీష్మకపుత్రి శౌరి
ధ్యానంబుతోడ నుద్యానంబు చేరి
యందునే కాంతంబు నందులోలోన
దందడి గొనువెండిఁ దలఁ నవ్వేళ
నన్ను మీఱుట యెట్లు నాదువింటికిని
గన్నులు గలవని గర్వించిమరుఁడు
తీపువింటను బూవు దేనెతోనలరు                  (4580)
తూపు సంధించి కందువచూపు నిలిపి
చెవిసోఁకఁ దిగిచి యేసినలోను వెలిగ
నవలీల బాల బాహామధ్యసీమ
వడిఁదాఁకి యీవలావల దూరిపాఱఁ
బడఁతుక పరవశ భావంబుచెందఁ
దలపోత సఖులు వైదర్భి తాపంబు
తలపోఁత సేయుచుఁ దమలోనఁ దాము
ధవళాయతాక్షి కిత్తఱి బల్కు కీర
రవము కైరవము భైరవములైతోఁచెఁ
గ్రొవ్వెలకావరె కోమలిమనము                   (4590)
నవ్వి నట్లనెయుండు నాలివెన్నెలలు
తుంటవిల్లెందుండి దొరకెనో దీని
గుంటఁ గూలఁ గమన కొమ్మనెంచఁగను
నడరెడు సతినేఁప నందుమై మఱియు
పొడివోసుకొన్న యాపూదెట్లు గలిగె
వాడిన మలలక్రేవల చల్లగాలి
నేఁడేల వచ్చె దీనిని బాముతినను
వడినోటఁగోయని వగమీఱివనరు
చెడుగుచిల్కలు వీని జట్టులఁ గట్ట
గట్టిగాఁ దనునోచి కన్నతల్లికిని          (4600)
పట్టియై మరుఁడేల పగదాయి యయ్యె
జాతియంతీయుఁ గీడు జాతియే జాతి
నీతి గల్గినదిపో నీ యింకనైన
నొంతని మరువింట నొనగూడకుండ
నంటువాయఁగఁదివుఁడమ్మ సేమంతి
మరునివేఁగూడి యుమ్మడిఁ గురువేరు
పెరిగెనేవ్రేళ్లతోఁ బెకలింతమనుచు
జలజాతనేత్రి భిష్మకపుత్రినపుడు
చలువగొజ్జఁగి సెజ్జ సవరించియునిచి
పొగులుచుఁగదిసి కర్పూరఖండముల             (4610)
నొగులంగఁ గొఱికి వీనులఁ బారనూంది
కన్నీరు పయ్యెద కడలనొత్తుచును
బన్నీటిచేత రెప్పలమీఁదఁ దుడిచి
సరసగంధంబుమైఁ జల్లఁగానలఁది
విరిదమ్మి సురటిచే విసరియొండొరుల
కప్పరె చెంగావి కమ్మపూఁదేనెఁ
గ్రుమ్మరేయడుగుల గోవ కస్తూరి
దిప్పరే బలిమి యీతెరవ పాటెల్ల
జెప్పతృ మరుఁడు రంజిలికావఁ డనుచు
భారంబులగునును పాలిండ్లకాక                   (4620)
హారంబుచే బరిహారంబు చేసి
చిలుక పల్కులు ముద్దుల చిక్కుమాతోడఁ
బలికవే యొకమాఱు బంగార కొంద
నగవువెన్నెలల విన్నాణించు మించు
మొగమెత్తి చూడవే మోహనవాణి
చేడియముద్దురాఁ జిలుకతో మాట
లాడవేమము గూడి యాడవే తల్లి
నెఱతావి దిక్కుల నెఱపు క్రొవ్విరులఁ
దుఱుమవే నీకొప్పు తుఱుమవేకోరు
కొమ్మ విపంచిఁ గైకొనవేయోముద్దు                 (4630)
గుమ్మడాఁపకు నీదు కోర్కెమాతోడ
ముకురంబు చేడవే ముకుర బింబాస్య
పికములఁ బిలువవే పికవాణి నీవు
జడియకు మింకనో సాంకవీగంథి
సుడియఁగ వెఱచునీ శుకముల యెదుట
నుడుగవే తహతహ నోరాహువేణి
యుడురాజు నీవన్న నెలయఁగ వెఱచుఁ
బెలుచైన మావినీ పెంపుడుగున్న
వలరాజు నీ పట్టి వామాయతాక్షి
యెలనాగ యింతేల యెదుటఁ జూడంగ                (4640)
కలువల గమిబంతి కట్టితిప్పుదుమె
యిట్టె యీమరుతూఁ లెల్లను విఱిచి
కట్టితెత్తుమె నీదుకడకు రాకుండ
గోరఁ బోవుటకల్ల గొడ్డలియేల
యూఱకేయని యెన్ని యుండితిమింతె
పగసాటుగావిని పని యంతనేము
తెగువఁ బుప్పొళ్లనూఁదినఁ బాఱవలెను
నెలఁత గిన్నెరకుఁ గిన్నెరకు నోడకుము
యిలమెల్లగిల్ల నీ కెదురుగాఁ గలదె
కెరలు నీ చిలుకలఁ గిలకల విరుల          (4650)
గిరుల వీక్షించు మీక్షింపకు మబల
కోకిలముల బెచ్చు గొణఙ్గిన కేకి
కాకులకొత్తమో కంజాయతాక్షి
యురులైనయట్టి యాయునఁటి మొత్తముల
శిరము నలఁచివైచెదము తన్వంగి
యని యిట్లు చతుర వాక్యప్రౌఢి నెఱపి
జననాధ సుదయెద చల్లఁగాఁ జేసి
యంతరంగముగ దదంతరంగంబు
నెంతయుఁ దెలిసిన యింతునిట్లనిరి
దానవారాతి నీ తలఁపులోవాఁడె               (4660)
కాని యన్యుఁడు గాఁడు కలకంఠకంఠి
నమ్మినీ సేయు దానమ్ము ఫలమ్ము
నమ్మాధవుని నీకు నాత్మేశుఁ జేయు
నని యిట్లు తనయాత్మ ననురాగవల్లి
ననలొత్తఁ జేయు క్రొన్నన బోండ్లతోడ
నంచల నడుమరా యంచయుఁ బోలె
నంచిత నైజగేహమునకే తెంచి
యలఘు భావములఁ బద్మారాగలీలఁ
జెలువొందు రుక్మిణీ శీతాంశువదన
విభుని గానాత్మ శ్రీవిభుని గోరుచును          (4670)
శుభగుణ యౌవ్వన స్ఫురితయైయుండె
మఱి భీష్మకుఁడు సతీమణికి రుక్మిణికి
నెఱ జవ్వనము మేనమెఱయ నీక్షించి
యీ చంద్రబింబాస్య నెవ్వరికిత్తు
వనజాస్త్ర కోటి లావణ్యుఁడైనట్టి
వనజోదరునకె యీ వామాక్షి దగును
అని యిట్లు తలపోసి యతఁ డొక్కనాఁడు
తనయులఁ బిలిచి యెంయయు నూహ సేయఁ
దనుమున్ను మగధయుక్తముగ భజింతి         (4680)
దనుజారి యైకచిత్తంబులో నిగుడఁ
నాకాక్షు తమ్ముని కరణి నారుక్మి
వనజాక్షుఁ డనినంతవడిఁ గోపగించి
యవివేక చిత్తుఁడై యాతండ్రికనియె
అపునౌనే యేమంటివయ్య యోయయ్య
యతఁ డెవ్వఁ డెందుందుండు నతనికి మనకు
క్షితి నెంత దూరంబు క్షితినాధవాఁడు
నెట్టన నీ కన్య నృపవంశజాత
పుట్టు గొల్లలలోనఁ బుట్టినవాఁడు
కులమెన్న వీవు డధికులనెన్న విట్టి                 (4690)
తలఁ పెట్టు తలఁ చేదు తగునె యీతలఁపు
నీమదిఁ గలిగెనా నిఖిలంబులోన
భూమీశ చైద్యుఁ డిప్పుడు గలవాఁడు
అతనితోడనె వియ్య మదుదుగాని
యితరుల కొసఁగనే నీను నీయాన
యనవుఁడు తనపట్టియను మాటఁ ఒట్టి
యనుమానపడి తెగనాడలేఁ డయ్యె
వనమాలిచే మున్ను వధియింపఁ బడిన
కనకాక్ష గాంగేయకసిపి లిద్దఱును
బరమ దుర్జనులు ద్వాపర మధ్యమునను              (4700)
ధర శిశుపాలుండు దంతవక్త్రుండు
ననఁ జేదివంశజులై రందులోనఁ
జనటు జుగద్ద్రోహి శిశుపాలుఁ బిలిచి
చెలియలి పెండ్లి నేఁ జేసెదననుచు
బలము మీఱఁగఁ దనబలగంబు గూర్చి
యొనరనాయిత పడుచున్న యాసన్న
వనితలచేనంత వైదర్భి తెలిసి
హరిమీఁద ననురక్తి యన్నపైఁ గినుక
యురుతర కోపంబు నూర్పులు నిగుడఁ
గుటిలాత్ము రుక్మి నాకును నన్నగాగఁ                  (4710)
గటకటనే రీతిఁ గావించెనజుఁడు
శౌరి నొల్లనివారు జగతిఁ గల్గినను
వారినేనొల్ల మావారైననేమి
యీమేని దీనతలెల్లను మాన్ప
నేమందుకలదింక నేమందుననుచు
వదలని తహతహ వంచింపలేక
తుదిలేని చింతఁగుందుచు నున్నఁ జెలులు
చెలువ యున్నట్టియా చెలువంబు దెలిసి
పలికిరి యేకాంత భవనమధ్యమున
బొందులువేఱుంతె పొలఁతుక మనకు                (4720)
నిందఱకును బ్రానమేకమేతలఁప
వింతవారమె మేము వెలఁది నీవింత
వింత సేయఁగఁ దగవేదమ్ము ననిన
హితమతిఁ దనకోర్కె యెఱిగించి మిగుల
హితుఁడైన కులపురోహిత సూతుఁ బిలిచి
యంతరంగంబున నతనికిట్లనిరి
వింతవాఁడవుకావు విను మొక్కమాట
పరమ నిశ్చయముగా భావించి యేను
హరికిఁ గట్టిఁతిమున్ను నాత్మకంకనము
రేఁపె లగ్నము సిఁరిరేఁడు రంజిలఁగ             (4730)
నీపని యెఱిగింపు మీప్రొద్దుపోయి
దిక్కెవ్వరును లేరు దేవరే కాని
దిక్కు రుక్మిణికని తెలియంగననుము
తలి దండ్రి నాయన్న దమ్ములు నాదు
తలఁ పెరుంగరు శౌరి తానేగుదెంచి
తనుగన్నవారలఁ దనునిమ్మటన్నఁ
దనకన్న వారలెంతటి వారుకినియఁ
గాదేని ననుఁ బల్మిగైకొని యచటి
చేదీశుఁ బట్టి నిర్జించి పొమ్మనుచు
వాని దార్చుటకు భవానినోమనుచు                    (4740)
వేయి లాగులనాధు విధమెల్లఁ జెప్పి
తోయజాక్షుని వేగఁ దోడితెమ్మనుచు
నే నిల్లు వెలువడి యే తెంతుననుచు
..........................
విన్నవింపుము యదువీరుతో నొరుల
కన్న నీమాట యేమన్నఁ జెప్పకుము
పన్నగశయనుఁ డాపన్న శరణ్యుఁ
డన్న నీమాట సత్యము సేయుమనుచు
వేయి బాగుల నాదువిధమెల్లఁ జెప్పి
తోయజాక్షుని వేగఁ దోడితెమ్మనుచు               (4750)
ముద్దుల తన కుచంబులనాను హరిని
దిద్దిన హోమముద్రిక యేకతమున
హరికి నిమ్మని సీత హనుమంతు నకల
సిరము మానికమంపు చెలువున నొసఁగఁ
దల్లినీ పనుపున దానవారాతి
నెల్లి యెల్లుండిలోనే తోడితెత్తు
నీ పని శీఘ్రంబె యీడేర్తు నేని
మా పురోహితుఁడని మఱినమ్ము మమ్మ
యింక నీ సౌందర్యమెన్ని చొక్కించి
పంకజోదరు నీదు బంటుగావింతు                  (4760)
ననుచు రుక్మిణిచేత నాధరాదేవుఁ
దనిపించు కొనికొని యాడుచుఁ గదలి
యురుతరా యుతమైన యుపవీతజాల
మురముపైఁ బెనగొని యుఱ్ఱూతఁలూఁగ
వెడజాఱఁ జుట్టుచెర్విన శిఖాశాఖ
మెడలపై నొకయింత మిటిమిటి పదఁగ
మిగులు నీర్కావితో మించుపింజయలు
జగజంపు దోవతి చరణంబు లొరయ
నొఱపుఁగా బెట్టిన యూర్ద్వ పుండ్రంబు
చిఱు చెమటలతోఁడ జిప్పిలి జాఱఁ          (4770)
పొడవుగా నిక్కి యుప్పొంగి నర్తించి
యడుగడుగునకు శ్రీహరి హరి యనుచు
సార కస్తూరికా సహిత నీహార
నీర కర్పూర వర్ణిత కాంతిజాల
హార కల్పిత గృహానేకాంశ విజిత
తారక వేష్టతో దార సముద్ర
హారక కమలా కరాంచిత హంస
కీర కదంబ సంకీర్ణ సౌధాగ్ర
చారక గగనాధ్వచారక వ్యూహ
దార కనమ్మహాద్వారకఁ గాంచి                 (4780)
యా పురాంతరమున కరుదెంచియచట
దీపించు నాదేవదేవు మందిరము
పాటించ కాంచి లోపల రత్నరుచిర
కూటంబు హరికొల్వు కూటంబు చేరి
ద్వారపాలకులచేఁ దనరాక తెఱఁగు
శౌరికిఁ దెలిపి తత్సమ్మతమ్మునను
హితులు మంత్రులు పురోహితులు బాంధవులు
యతులును దండనాయకులు మల్లులును
దివిజులు కిన్నరుల్దివిజేంద్రముఖులు
కవులు గాయకపాఠక వ్రాతములును              (4790)
గనుపట్టు పేరోలగంబు గన్గొనుచు
మునుదెచ్చు వైదర్భి ముద్రికఁ గొనుచు
సంతత వాసనాంచద్ధూప ధూపి
తాంతరాళంబు లత్యంతసంకులము
మాంజిష్ట పట్ట చామర హిమకంజ
మంజీర పుంజ నిర్మల వితానంబు
చారుత వలికాగ్ర సోత్ప్రాణ రత్న
కీర కపోత కోకిల శోభితంబు
ఘనపుష్ప మాలికా కలితంబులైన
యనుపమ మణిమంటపాంతర సీమ                (4800)
కమఠ నాగేంద్ర దిగ్గజరూప విలస
దమలమాణిక్య సింహాసనాసీమ
లోలనేత్రీక రాలోల విశాల
తాలవృంతానిల తరళితాలకుని
కంకణ ఝుణఝుణత్కార సంకీర్ణ
సంకుల పద్మ హస్తాహస్త వళిత
వర శుభ్ర చామరావళి జాతశైత్య
కరపోతవారిత ఘర్మ శీకరుని
గనక చేలాంగద గ్రైవేయ హార
వనమాలికా బాహువలయ శోభితుని            (4810)
నంపోవ వితత వజ్రాంక చూడావ
తంస నానావిధోత్తంస మండితుని
మలయు కుండలముల మాణిక్యరుచులు
ధళధళుక్కున గండ తలములు నిండ
వెలిదమ్మి రేకులవెడద కన్గొనల
నెలకొన్న చూపు వెన్నెల చల్లువాని
కొమ్మయొక్కతె కేరుగుళిగెకప్రంపు
కమ్మఁబాగాలుకై కరణిగానిచ్చి
వలనారు నపరంజి వన్నియడాలు
తెలనాకు మడిచి చేతికినందియొసఁగ          (4820)
జిలుగు నవ్వులతోడఁ జెనకంగనొక్క
సెలవినెమ్మెలు నిక్కఁ జేరినవాని
నెడయ నొక్కబిటారి యెలమిఁ గటారి
హడపంబు గీలించి యందందగొబ్బ
కలువ చూపులదండి గలయోర్తుగిండి
వలిపె చెంగావి పావడ పట్టి నిలువ
సోలికి వైరిరాజులఁ జెక్కియున్న
కాళాంజియొక పద్మగంధి గావింప
వలరాజుకైదువ వలఠేవఁ దొలఁకు
కలికిముద్దియవిరుఁ గడల సేవింపఁ             (4830)
జతుర సీమంతినీ సంగీత సరస
చతుర వాణులలోన సమకొన్నవాని
దారలలో మించు తారేశు పగిది
నారీమణులలోన నలువందువాని
మురవైరి హరి జగన్మోహనాకారు
సిరికూర్మి మగని నీక్షించి యుప్పొంగి
యల్లనల్లన వచ్చి యందంద నిలచి
యల్లలనామణి యంగుళీయకము
హరికుపాయనముగా నర్పించు భూమి
సురవర్యుఁ గని సర్వసురవర్యుఁ డప్పు          (4840)
డర్ఘ్యపాద్యాదుల నిర్చించి లసద
నర్ఘ్యపీఠంబుపై నాసీనుఁ జేసి
యాదేవుఁ డంత నిశాంతంబునకును
భూదేవుఁ దోకొని పోయి లాలించి
చుట్టును మున్నీరు చుట్టినయట్టి
యిట్టి పట్టనమునకే తెంచుటేమి
యానతిమ్మన్న ధరామరేంద్రుండు
దీన శరణ్యయో దివిజారి వైరి
హరి నీవెఱుంగని యదియుండుగలదె
ధరలోన మముమాయ ద్రవ్వింపనేల                (4850)
వినుము కుండినపురవిభుఁడు భీష్మకుఁడు
తన తనూజాత వైదర్భి దేవరకు
నిచ్చెదనన్న నయ్యెలనాగయన్న
కుచ్చితంబనఁ తండ్రిఁ గోపించి పలికి
శిశుపాలునకు నియ్యజెల్లుఁ గాదనిన
ఆచెలి మీచెల్వ మరయుచునిన్ను
నీచెల్వుగాఁ గోరి నీచాత్ము రుక్మి
పలుకులకాత్మలోఁ బలుమారునులికి
యల కీర పికముల కందందయులికి
యిట వచ్చి యీకార్య మెఱిగించి మిమ్ము              (4860)
నట వేగఁదోడి తెమ్మని నన్ను బనిచె
నేఁటి మాటలుగావు నిఖిలేశ నిన్ను
నాఁటఁ గోలెను బిన్న నాటనుండియును
జెలువ రూపగుణంబు శీలంబు సొంపు
వెలయ నేర్చిన పాటి విన్నవించెదను
యీ రాజబింబమ్ము నీఁడెన్నుటెట్లు
శ్రీరామరామ యచ్చెల్వమోమునకు
సరసిజ పత్రముల్సరిపోల్చు టెట్లు
హరి హరి జగతిలో నతివకన్నులకు
భూధరంబులనెన పురుణించుటెట్లు                  (4870)
మాధవ మాధవ మగువ గుబ్బలకు
పంకజనేత్ర యప్ప డఁతిలావణ్య
మింకొక్క తెఱఁగున నెఱిఁగింతు వినుము
మాటలా చిలుకల మఱపించుమోవి
తేటలా సోనగాఁ దేనియల్గురియు
వదన మాకమ్మని వాసనల్గ్రమ్ము
రదనంబు లాసు వజ్రములఁ గీలించు
వేనలి యావిఱ్ఱ వీఁగుచునుండు
లేనవ్వులావెన్న లేపి సాళించు
చూపులా పఱపులే చూపుఁ గంఠంబు                (4880)
ప్రాపులాశంబంబు భావంబుఁ దెగడు
పిరుదా రథాంగంబు బెగడించుచుండుఁ
జిఱుదొడలా సొంపుఁ జిల్కుచునుండు
నడుగులా తమ్ముల నణగింపుచుండు
పడఁతి రూపేమని పచరింతుఁ దండ్రి
నీవె శ్రీహరివి యానీలాహివేణి
భావింప నాదిమా పద్మ వధూటి
యని యాత్మనుండు యథార్థంబుగాఁగ
ననయంబు మాకు నీయాన గోవింద
కామధేనువు పాలు ఘనుఁడైన యట్టి                (4890)
సోమయాజికిఁ గాఁక శునకార్హమగునె
నిగమ గోచర రుక్మిణీదేవి నీకె
తగుఁ గాని యెంతైనఁ దగదు చైద్యునకు
నది కాక యొక యుపాయంబును గలదు
పదిలంబుగా విన్నపము సేయుమనియె
జనకుని యింటిలో జలజాక్షినెట్లు
కొనివత్తుననుచు సంకోచింప వలదు
అల పెండ్లి తొలినాఁడె యన్న పెంపునకు
వలగొనముత్తైదువులతోడఁ గూడి
ధరణీశ్వరులు గొల్వతన యంతిపురము               (4900)
పురము వెల్వడియేను బొత్తు కత్తియలుఁ
గడువేడ్కతో నోము గదలను గౌరి
గుడికేఁగి మఱలి గ్రక్కుననేగుదెంచు
సమయంబు నీకును సమయంబటంచు
సమకట్టిపనిచె నిశ్చయము నన్ననుపు
మింతియె కానినే నింతియెకాని
వింతవారెఱుఁగ రవ్విధమన్ననపుడు
అంబుజాక్షుఁడు దరహాస చంద్రికలు
బింబాధరంబు మై బెఱసి సొంపరయఁ
గరమున నావిప్రు కరము గీలించి                  (4910)
కరము సంతసమాత్మఁ గడలొత్తఁ బలికె
నా రుక్మిణీకన్య యాకారమహిమ
నారామచే విన్ననాఁత నుండియును
నాయింతి నాయెడ ననిశంబు నిలిచి
పాయదగానరేవగలు కంటికిని
నిదురచెందరు రుక్మి నిరసించి పోరి
యెదురించు రాజుల నెదిరించి తఱిమి
జలజాతనేత్రి భీష్మకపుత్రి ధాత్రి
వెలయంగఁ దెత్తునే విధినైన ననుచు
ధవలాక్షి యవతారకరణ మెఱిఁగి             (4920)
యువిదకు నాకునునొకరాశియనుచుఁ
బ్రతిభటజన విదారకుని దారకుని
గుతుకంబుతోఁ గనుఁగొని దానవారి
రథము వేగమె కొని రమ్మన్న విష్ణు
రథసమబలమైన రథము దెచ్చుటయు
మించుల నదలించు మించులమణుల
మించులొయ్యారముల్మించఁ గీలించి
లోకేశుఁ దని సర్వలోకంబులెన్నఁ
డాకాలగండ పెండారంబు పూని
మెరసి కల్పకము విద్రుమవల్లి పొదవు              (4930)
కరణిఁ చంద్రిక దట్టి గట్టిచూప
నటన మీఱఁగ గీరు నామంబుఁ దీర్చి
నవరత్నమయ కంకణముల లంకించి
నవరంగడాకాల సరిపెణుల్జుట్టి
నీల భూధరముపై నిర్ఝరుల్పొలుచు
పోలికమై హారములు నిండవైచి
రవికోటి కోటి కైరవమిత్రరుచుల
ఠవణించు మకరకుండలములు దాల్చి
గురురత్నకాంతి దిక్కును బల్మాఱు
పురణించునొక బాహుపురిఁ గీలుకొలిపి               (4940)
మును భీష్మసుత పంపుముద్దుటుంగరము
కని పట్టఁగాఁ జిటికెన వ్రేలఁ దాల్చి
శరదభ్ర శారదచంద్ర చంద్రికల
నిరసించు వలిపె పేరణియొప్పఁ దొడిఁగి
ఠీవిమై బిందిచుట్టిన యట్టిమరుని
మావుచాయల చక్క మావుకుళ్లాయి
ధరియించి యెదుట నిద్దంపుటద్దమునఁ
గరమొప్పఁ దన యలంకార మీక్షించి
మలయరింగులు వారమడిచి బంగారు
వలువ చిత్తరముగా వలెవాటు వైచి                (4950)
వేదవేదాంత సంవేద్య చిత్తములఁ
బాదుగల్గిన యట్టి పాదులల్మెట్టి
వలుద చక్కని పిండు వలపించునిండు
వలపుల విరిచెండు వలకేలఁ బూని
దండయుద్ధవునిగై దండగాఁబట్టి
దండిమై సకలయాదవులు సేవింపఁ
బుడమి వేలుపులు సొంపులు మీఱరెండు
గడల గోవిందాష్టకంబులు చదువ
హైమకాండోజ్వలాయుత పూర్ణ శీత
ధామ సమాతపత్ర ద్వంద్వమెసఁగ                (4960)
నొరపైన మిన్నేటి యూర్ములచాల
మఱపించు నుభయచామరములు వీవ
మాధవ శౌరి భూమానమెచ్చరిక
భూధవ యని రాజపుంగవుల్పొగడ
భోజేంద్ర మదహర్త భువనైకకర్త
రాజీవనేత్ర శ్రీరమణీకళత్ర
యదుకులాంబుధిరాజ యఖిలైకరాజ
సదమలాంబుజధామ సన్నుతధామ
హతబకాసుర వీర యసహాయ శూర
జితపూర్వదేవ రక్షితవసుదేవ                        (4970)
యవన రాజీవనకాననానల మగధ
కువలయాధిప సైన్యఁకుధర దంభోళి
యని వంది మాగధులను మోదమొంది
వినుతింప గని లింపవితతి సేవింపఁ
జిలుగదపారంబు చింగులింగీలు
బెళక కట్టుకవారు పెనుమ్రోతలడర
జతనము దేవ యెచ్చరిక పరాకు
జితనిశాచరవీర చిత్తేశ కృష్ణ
యనుచు నెచ్చరిక లంతంతఁ జేయుచును
ఘన వ్రేత్రహస్తులై కడలనేతేర                   (4980)
ధవళలోచను బిరుదములుగ్గడింప
ధవళ శంఖములు ముందర భోరుకలఁగ
మునుకొని యూడి గంబుల వారునడువఁ
గనక తప్పెట చిత్రగతులు వాయింపఁ
గాళెలు మించుపాగ్గాళెలు సన్న
గాళెలు రౌతులగ్గలముగా మొఱయఁ
బహట భేరీ తూర్య పణవాది వాద్య
చటుల ఘోషంబులు జగమెల్లనిండ
బహుదేవతా సార్వభౌమ చిహ్నములు
వహికెక్కి హరి విప్రవరులతోఁ గూడి                (4990)
హరిహయ హరిదశ్వ హరిహరి వేగ
హరమహాజవ వలాహక ముఖ్య తురగ
దర చక్ర శాఙ్గన్ నందజ గదా శస్త్ర
వరకింకిణీ పక్షివరకేతు రుచిర
చక్రారి చక్రస్త సమచక్రచక్ర
శక్రారి భీకరస్యదనం బెక్కి
దళముగా నిరుమేల దళము గన్పింప
బలిమిమై యాదవ ప్రముక్జులు గొల్వ
బారై యలో తమ్మబందను కృష్ణ
తారొయా హరిగె సాధనమాడబేకు                     (5000)